Tuesday 6 July 2021

అజరామర సూక్తి – 294 अजरामर सूक्ति – 294 Eternal Quote – 294

 అజరామర సూక్తి  294

अजरामर सूक्ति  294

Eternal Quote  294

https://cherukuramamohan.blogspot.com/2021/07/294-294-eternal-quote-294.html

दृष्टोपि शैलः  मुहुर्मुरारे रपूर्ववत् विस्मयमाततान l

क्षणेक्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः (शिशुपालवधम -4.17 कवि माघ द्वारा)

దృష్టోపి శైలః స ముహుర్మురారేరపూర్వవత్ విస్మయమాతతాన l

క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః ll (శిశుపాలవధమ్ -4.17)

శ్రీ కృష్ణుడు తన చతురంగ బలములతో రేవతకపర్వతపు దారిలో వెళుతూ దాని 

రామణీయకతకు విస్తుపోయి పై శ్లోకమున తన భావమును వ్యక్తము చేస్తూ వున్నాడు 

 చూడ్డానికి పర్వతమే, కానీ శ్రీకృష్టునకు తిరిగి చూడగా అపూర్వమైన విస్మయము పొడమింది. అద్భుతమైన ఆ అచల సౌందర్యమునకు అప్రతిభుడైనాడు శ్రికృష్ణ పరమాత్మ. క్షణక్షణమునకు నవ్యత్త్వమును పొందుటయే గదా రామణీయత! క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః’ క్షణక్షణానికి నవ్యంగా పరిణమించే రూపమే రామణీయత అని అనుకున్నాడట.

ఇక్కడ విస్మయము వాచ్యము. రసము లేదా స్థాయీభావం వాచ్యం చేయడం 

రసప్రతీతికి కాస్త అడ్డంకి అని అలంకారికులు. అయినా ఈ శ్లోకము అద్భుతమైన పాదం చేత మరువలేని విధముగా తీర్చినాడు. రమణీయమైన యే పదార్థమును చూసినా ఈ శ్లోకము గుర్తుకు వస్తుంది. రమణీయతకు ఇంతకన్నా చక్కని నిర్వచనము దొరుకదు.

సహజమగు రామణీయకతను తన్మయతతో చూస్తాము. ఆ ఆనందము అనిర్వచనీయము. అది స్త్రీ సౌందర్యము వలె నశించునది కాదు. స్త్రీ సొందర్యము వయసు తో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనము ఆతురుతగా చూచేవి క్షణికమైన అందాలు పొందేది క్షణికమైన ఆనందాలు. అదే సర్వస్వమనుకొనేవారికి శంకరులవారు ఎన్నడో చురకనంటించినారు.

'నారీ స్తనభర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం

ఏతన్మాంసావసాది వికారం మనసివి చింతయ వారం వారం'

అని చెప్పినారు. ఇక్కడ ‘వారం’ అన్నమాటకు రోజు అని అర్థము. అన్నమయ్య కూడా 'మరువను ఆహారమ్మును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీమాయ'అన్నారు. ఏది నిత్యమో, ఏ వర్చస్సు నిత్యనూతనమోఏది శాశ్వతమో,దానిని చిన్న వయసులోనే పట్టుకొంటే ఇక ఆ వ్యక్తికి తిరుగేమున్నది . ‘అనగననగ రాగామతిశయిల్లుచునుండు’ అనికదా ఆర్య వాక్కు. అట్లని ఆ శాశ్వతత్వమును పొందుటకు సన్యాసము తీసుకొనవలసిన అవసరము లేదు . ప్రహ్లాదుని ఆదర్శముగా నెంచి భగవంతుని సాధించిన వ్యక్తికి అంతకు మించిన సంతృప్తి వెరెమున్నధి. 'అహములేని 'ఇహముఅనుభవించుతూ ఆ పరమాత్ముని ఆకర్షణకు లోనైతే అంతకన్నా కావలసినది ఏమున్నది.

दृष्टोपि शैलः  मुहुर्मुरारे रपूर्ववत् विस्मयमाततान l

क्षणेक्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः (शिशुपालवधम -4.17 कवि माघ द्वारा)

श्री कृष्ण अपनी चतुरंगिणी सेना के साथ मार्ग में चलते हुए आध्यात्मिकता से भरा रेवतक पर्वत

को देखा उस सिलसिलेमे उनके मनोभावना इस ऊर्ध्व श्लोक रूप से स्पष्ट किए l

श्रीकृष्ण पर्वत को पीछे मुडकर देखने पर अभूतपूर्व विस्मय का अनुभव हुआ। श्री कृष्ण परमात्मा उस 

अमर सौंदर्य और एक सनसनीखेज सौंदर्य के बदलते शाश्वत दृष्टिकोण से चकित हुए

हम प्रकृति के प्राकृतिक आकर्षण को बड़ेआकर्षण और ईमानदारी से देखते हैं। वह खुशी अवर्णनीय 

है। यह स्त्री सौंदर्य की तरह नाशवान नहीं है। नारी की सुंदरता उम्र के साथ जुडी हुई है। तो हम जिस 

चीज की जल्दी में तलाश कर रहे हैं वह है कामुक सुख जो क्षणभंगुर हैं। इसके बारे में आदि 

शंकराचार्य ने चेतावनी दी थी और उन्होंने इस तरह के घटिया और गंदे गुण का

तिरस्कार किया था। वे कहते है:

'नारी स्तानभर नाभी दशं दृष्ट्वा माग मोहावेशम् l

एतन् मांस वसादि विकारम मनसिवि चिन्तय वारं वारं ll

यहाँ 'वरमशब्द का अर्थ ‘दिन’ है। एक महिला की छाती जो आंखों को मोहित करती हैउसके पेट 

का आकारकेवल छल के द्वार हैंऔर जो आनंद दिया जाता हैवह केवल मांस और वसा से होता है। 

इस बारे में दिन-प्रतिदिन सोचना छोड़ें और ईश्वर पर विश्वास विकसित करें जो शाश्वत है और जिसकी 

सुंदरता शाश्वत है, तो हम परमपद प्राप्त करसकते हैं

आन्ध्र देश के महाभाक्त अन्नमय्याजी कहते हैं, "मैं इस सांसारिक सुखोंजैसे भोजनपरिवार के प्रति 

लगावयौन इच्छाओं आदि से बेखबर नहीं हूं।  नुझे उन आकर्षणों से दूर करो हे बालाजी बोलके पुकार रहे 

हैं उनके गाने में l कमल के पत्ते पर पानी की एक बूंद की तरहअगर कोई हमेशा आकर्षक इकाई पर 

ध्यान केंद्रित करने में सक्षम हो सकता है तो कितना आनंद प्राप्त कर

सकताहै, इस का अंदाजा नहीं लगा सकते। धरा में धन नहीं साधना ही हमें भगवान् के निकट ला 

सकता है

यदि यह प्रह्लाद की तरह छोटी उम्र में महसूस किया जाता है और उनके रास्ता अपनाते हैं तो  

संतोष और शाश्वत सुख के लिए और क्या चाहिए

अन्नामय्या ने यह भी कहा, 'खाना भूल जाओसुख भूल जाओऔर इंद्रियों का सुख भी भूलजाओ क्यों 

कि इ सब माधवकी माया है जो कुछ भी शाश्वत हैजो भी करिश्मा शाश्वत हैअगर वह कम उम्र में 

पकड़ लिया जाता है तो उस व्यक्ति निर्भरता से भगवान को प्राप्त करसकता है। राग पर महारत 

हासिल करने के लिए आपको अभ्यास करते रहना चाहिए जब तक कि आप पूर्णता प्राप्त

नहीं कर लेते। संतुष्टि या संतोष आपको अनंत काल या शाश्वत आनंद तक पहुँचाता है। प्रह्लाद इसके 

लिए आदर्शप्राय है। आइए हम शाश्वत सौंदर्य और शाश्वत आनंद की ओर मुढें। ईश्वर का नाम 'गूंज

उठा तो  'अहंकारअपने आप भाग्जाती है l

Dr̥ṣṭō̕pi śaila sa muhurmurārērapūrvavat vismayamātatāna|

Kaṇē kaṇē yannavatāmupaiti tadēva rūpa amaṇīyatāyāḥll (śiśupālavadham -4.17 By Kavi Magha)

It was Revatak Mountain seen by Srikrishna on his way with his army. But 

looking back at the mountain Sri Krishna, experienced the unprecedented 

awe. Sri Krishna Paramatma is stunned by that immortal beauty and the 

changing eternal outlook of a sensational beauty.

We look at natural charm of the nature with great fascination and sincerity. 

That happiness is indescribable. It is not as perishable as feminine beauty. 

Feminine beauty is associated with age. So what we are looking for in a hurry 

is sensuous pleasures that are fleeting. It was cautioned by Adi Shankara and 

he scorned such poor and dirty quality. He says:

'Nārī stanabhara nābhī dēśa dr̥ṣṭvā māgā mōhāvēśa

ētanmānsāvasādi vikāra manasivi cintaya vāra vāra '

The word 'vaaram' here means day. A lady’s busts that fascinate the eyes, her belly’s shape, are but gates of deceit, and the joy that is given out, Is by flesh and fat alone. Think of this, Day in and day out and develop trust on God who is eternal and whose beauty is eternal.

Annamayya says" I am not oblivious to this mundane pleasures like food, attachment to the family, sexual desires etc”. Like a drop of water on a lotus leaf, if one could be able to concentrate on the ever enchanting entity viz. GOD howmuch bliss we can gain. Saadhana gives Samvruddhi.

If this is realised at a young age like Prahlaada what else is required for contentment and eternal pleasure.

Annamayya also said, 'Forget the food, forget the happiness, and forget the 

senses, Madhava. It is all your maya.' Whatever is eternal, whatever charisma 

is eternal, if it is caught at a young age then it is up to the person to turn 

around. To gain mastery over a raga you should go on practicing it till you 

attain perfection.. There is no need to take asceticism to get that eternity. 

Satisfaction or contentment make you reach eternity or the eternal bliss. 

Prahlada is the ideal role model for that. Let us turn towards eternal beauty 

and eternal bliss. What more could one want than to be attracted to the 

God and his name as ‘echo’ and not ‘ego’.

స్వస్తి.

No comments:

Post a Comment