Thursday 8 July 2021

అజరామర సూక్తి – 296 अजरामर सूक्ति – 296 Eternal Quote – 296

  అజరామర సూక్తి  296

अजरामर सूक्ति  296

Eternal Quote  296

https://cherukuramamohan.blogspot.com/2021/07/296-296-eternal-quote-296.html

एकः प्रसूयते जन्तुः एक एव प्रलीयते ।

एकोऽनुभुङ्क्ते सुकृतम् एक एव च दुष्कृतम् ॥ - भागवतम्

ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవం ప్రలీయతే l

ఏకోను భుఙ్తే సుకృతం ఏక ఏవచ దుష్కృతం ll

ఇదే శ్లోకము ఒక అతిచిన్న మార్పుతో మనుస్మృతిలో మనకు కనిపించుతుంది. ఆ 

శ్లోకము దిగువన ఇవ్వబడినది.

ఏకః ప్రజాయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే l

ఏకోను భుఙ్తే సుకృతం ఏక ఏవచ దుష్కృతం ll

పై రెండు శ్లోకముల సారాంశము ఒకటే కాబట్టి టిప్పణి రెంటికీ కలిపి ఇవ్వటము 

జరిగింది.

మూడు విషయాలు మనము ఈ లోకములో  అడుగు పెట్టుట మొదలు  ఈ లోకమును 

వదలువరకు 3 విషయములకు మనమే జవాబుదారీ అంటే ఒంటరితనమే మన తోడు.

1. ఈ ప్రపంచములోనికి వచ్చుట.

2. ఈ ప్రపంచంలో మన ము చేసే కర్మలు వాని పరిణామములు.

3. ఈ లోకమును విడిచి వెళ్ళుట.

మనము ఈ ప్రపంచంలోనికి ఒంటరిగా వస్తాము. మనము పుడుతూనే మనకు 

మిత్రువులూ లేరు, శత్రువులూ లేరు. మనము ఎవరికీ తెలియదు, మనకూ ఎవరూ 

తెలియదు.

మనము ఒంటరిగానే శరీరమును విడిచి పోతాము. మనము ఇక్కడ సాధించినది సంపాదించినది ఇక్కడే వదిలిపెట్టవలసినదే! ఈ సాధన అన్నది సంపాదన అన్నది మంచి మార్గమున కావచ్చు చెడ్డమార్గమున కావచ్చు. మంచి కర్మలు చేస్తే ముక్తి దొరుకుతుంది అను మాట కాస్త ప్రక్కనుంచి ఐహికముగానే కాస్త ఆలోచించుదాము. మనము చాలా ఎక్కువగా ఇష్టపడే ఒక వస్తువు ఉన్నదనుకొందాము. దానిని సాధించుట రెందువిధాలు. భగవంతునిపై భారము వేసి పగలనక రేయనక కష్టపడి సంపాదించి దానిని సాధించుట ఒక పధ్ధతి. రెండవది ఆ వస్తువునే దొంగిలించాతమో లేక త్వరత్వరగా మోసపూరితమైన రీతిలో డబ్బు సంపాదించి ఆవస్తువును స్వంతము చేసుకొనుట రెండవ పధ్ధతి. మొదటిది మనస్సును నిర్మలముగా ఉంచి సద్భావనలను నింపుతుంది. రెండవది దుర్నీతి దురాచారముల పయనింపజేస్తుంది. ఆలోచన, భయము, ఆందోళన మున్నగువానితో సతమతమౌతూ అతి సులభముగా అనారోగ్యముపాలవుతాడు. ఆతరువాత బ్రతికినంత కాలమూ నరకమే! అందుకే శంకరాచార్యులవారు 
‘భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతేl 
  సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే ॥’ అన్నారు. పైపాదము పరమాత్మను తలవమని చెబితే రెండవపాదము స్థూలముగా వ్యాకరనకార్యములు చదువుట వల్ల రాదు అని పండితులు చెబుతారు. బ్ర.శ్రీ.రేమెళ్ళ అవధాన్ల వారు ‘డు,కృఙ్’ అన్నరెండు ధాతువులు చేయు పనిని తెలుప్తాయి. (ఈ ‘డు’ ఆంగ్లమున ‘Do’అయినది.) వ్యర్థమగు పనుల జోలికి పోక భగవంతుని తలచుకొమ్మని తెలియజేస్తున్నారు. ఆ  ఒక్క పని చేస్తే మనసు మంచిమార్గాన నడుస్తూ, ఆయురారోగ్యముల కాపాడుకొంటూ, మాధవుని వద్దకు చేర్చుతుంది. 

మన జీవన గమనములోఅసలు బాధ మరియు ఆనందము మనము చేయు 

కర్మలవలన  మనకు మాత్రమే అనుభూతి అవగతమౌతుంది. ఎవరి గాయము వారిదే! 

ఎవరి బాధా వారిదే! ఎదుటి వారు బాధపడినా అది మౌఖికమే. అదేవిధముగా మనము 

తినే లడ్డుయోక్క తీయని అనుభూతి  మనదే! దానిని ఇతరులు పొందలేరు. భారతీయ 

సంప్రదాయములోపునర్జన్మను మనము గట్టిగా నమ్ముతాము, అందుకే మనువు 

అంటాడుమనకు కాలము తీరిన తరువాత, మనము చేసిన కర్మ ఫలమే మనవెంట 

వచ్చేది.

 అట్లని సంఘజీవనము పనికిరాదనికాదు. సంఘములో ఉన్నా మనవంతు పనికి మనదే 

బాధ్యత. మంచికి మంచిఫలితము మంచి గుర్తింపు సత్కర్మ ఫలము మనకు 

లభ్యమౌతాయి.

 మనము చనిపోయినప్పుడుబంధువులు కొంతకాలం ఏడుస్తారు, తరువాత వారు 

మరచిపోతారు. మనిషి మరణించినతరువాత శరీరము దూలము లాగా కాలిపోతుంది 

లేదా  ఖననం చేస్తే మట్టిలో కలిసిపోతుంది. భౌతిక శరీరం అంతే, పనికిరాని 

పదార్థమది. కానీ ఈ ప్రపంచంలో మనము ఏమి చేస్తామో దాని మంచి మరియు చెడు 

ఫలితం అలాగే ఉంటుంది.

మంచిగా ఉంది మనుగడ సాగించితే, మనసు నిర్మలమై సత్కర్మలు చేయుచూ 

సత్వస్వరూపులు కాగలరు.

एकः प्रसूयते जन्तुः एक एव प्रलीयते ।

एकोऽनुभुङ्क्ते सुकृतम् एक एव च दुष्कृतम् ॥ - भागवतम्

मनुधार्म स्मृति, जिसका मनु ने रचना की है, यही भावना व्यक्त करती है l 

एकः प्रजायते जन्तुरेक एव प्रलीयते ।

एकोऽनुभुङ्क्ते सुकृतं एक एव च दुष्कृतम् ll मनुस्मृति

दोनों का यही सारांश है l

 अकेला ही जीव जन्म और मरण को प्राप्त होता है एक ही धर्म का फल सुख और अधर्म का 

दुःखरूप फल को भोगता है ।

एक प्राणी अकेला पैदा होता है (औरअकेले ही नष्ट हो जाएगा। वह केवल अपने अच्छे कर्मों का फल भोगता हैऔर अकेले बुरे कर्मों का फल भी भोगता है

जीव जन्म के समय अकेला होता है और वह अकेला ही मरता है। इस बीचअपने जीवन के दौरानवह अकेलेपन को मात देने के लिए हर संभव कोशिश करता है l हो सकता है कि उसके आस-पास कई दोस्त और परिवार होंलेकिन फिर भीजब वह गुजरता हैतो वह अकेला चला जाता है। उसके दोषों और गुणों को छोड़कर कोई भी उसे आगे की यात्रा पर साथ नहीं रख सकता

 यदि कोई अपने जीवनकाल में अच्छे कर्म करता हैतो उसे अकेले ही उन गुणों का लाभ मिलता है। वह यह नहीं कह सकता, 'मुझे लगता है कि मेरे हिस्से में पर्याप्त गुण हैंशायद मैं अपने जीवनसाथी के साथ कुछ साझा करूंगा', या, 'मैंने पर्याप्त गुण एकत्र किए हैंमैं इसे अपने बच्चों के लिए विरासत के रूप में छोड़ना पसंद करूंगा' !!

 इसी तरह दोषों के साथ भी। अपने कुकर्मों का खामियाजा खुद ही भुगतना पड़ता है। सिर्फ इसलिए कि वह जीवन में भ्रष्ट होकर अपने परिवार का पालन-पोषण कर सकेउसका परिवार उन कार्यों के लिए जवाबदेही नहीं उठा पाएगा। उसे अपने ऊपर ही लेना होगावास्तव में उसके पास कोई विकल्प नहीं है। यह स्वतः ही उसके साथ  जाता है और इसका खामियाजा उसे अकेले ही भुगतना पड़ता है

 विवेकपूर्ण बनें। जीवन तब और भी अकेला हो जाता है जब कोई खुद को नहीं जानता। जब कोई अपनी सांगत का आनंद लेता है तो वह सबसे अच्छा सौदा है जो वह कभी भी मांग सकता है!

 Eka prasūyate jantu eka eva pralīyate 

Eko’nubhukte suktam eka eva ca duShkRtaM ॥ - Bhagavata

There is another shloka from Manudharma shaastra which goes almost with the above shloka:

ekaH prajAyate jantur_eka eva pralIyate |

eko'nubhu~Nkte sukRitam_eka eva cha duShkRitam ||

One is born alone, one dies alone.

One bears the fruits of good and bad deeds, oneself. (4:240)

The relatives discard the dead body like a wooden log or lump of clay (burn or bury in earth) and go back, only dharma follows you in the other world. (4:241)]

A being is born alone (and) will perish alone. He enjoys the fruit of his good deeds alone, and also (suffers the fruit) of the bad deeds alone.

A being is alone at birth and he dies alone as well. In between, during his life, he tries all possible tricks and trades to beat the loneliness, to no avail. One might have numerous friends and family around him, but then, when he passes on, he goes alone. None can keep him company on the onwards journey, except, his vices and virtues.

 If one did good deeds in his lifetime, he alone gets to reap the benefit of those virtues. He cannot say, 'I think I have enough virtues in my share, maybe I'll share some with my spouse', or, 'I have collected ample merits, I would love to leave it for my children as an inheritance'!!

 Likewise with vices too. One has to bear the brunt of his misdeeds all on his own as well. Just because he was corrupt in life, so that he could provide for his family, his family will not be able to shoulder accountability for those actions. He has to take it upon himself! He has no choice, actually. It comes with him automatically and he has to suffer the brunt alone.

 Be prudent.  Life is even lonelier when one doesn't know himself. When one enjoys his own company that is the best bargain he could ever ask for!

స్వస్తి.

No comments:

Post a Comment