Sunday 11 July 2021

భోజరాజు బోయ యువతి కథ

భోజరాజు - బోయ యువతి

https://cherukuramamohan.blogspot.com/2015/12/blog-post_25.html

మన రాజులు దేశమున తమతమ భూభాగములను పాలించు కాలములో పౌరులంతా తరతమ భేదములు లేకుండా మాట్లాడేవారు అనుటకు ఈ బోయవనిత కవితా శ్లోకమే సాక్ష్యము. ఇది కేవలము బ్రాహ్మలు పాలకులు మాట్లాడుచుండిన భాషకాడు. ఇది సార్వజనీనము. ఇక చదవండి.

ఒకనాడు భోజరాజు రాజ ప్రసాదపు ప్రాంతములో  మలిన వస్త్రములను దాల్చి ఎండలో 

అలసి బాధ పడుతూ,ఆయాసపడుతూ వస్తున్న ఒక బోయ స్త్రీని చూచుట జరిగింది. 

ఆయన ఆ యువతితో  ఈవిధముగా ప్రశ్నోత్తరముల రూపములో సంభాషణ 

ప్రారంభించినాడు.   

భోజ:-కాత్వాం పుత్రీ?==కుమారీ!నీ వేవ్వరవు?

బోయ:-నరేంద్ర లుబ్ధక వధూ నాః=రాజా నేనొక బోయవనితను.

భోజ:-హస్తే కిమేత్తన?=నీ చేతిలోని దేమి?

బో.వ:--పలలం=మాంసము.

భోజ:-క్షామా కిం?= కొద్దిగా నున్నదేమి?

బో.వ:-- సహజం బ్రదీమి నృపతే యద్యాధరా చ్చ్రూయతే

నాస్తి త్వదరి ప్రియాకృత తటీ నీరేషు సిద్ధాంగనాః

గీతాం గాన తృణః చరంతి హరిణాస్తే నామిషం దుర్లభం

రాజోత్తమా!ఆదరముతో నేను విన్న నిజము తెల్పెదను. నీ శత్రువుల యొక్క భార్యల 

కన్నీటి మడుగు యొడ్డున సిద్దాంగనలు పాడుచున్నారు. లేళ్ళు ఆ పాటలను విని 

ఆనందిచుచూ మేతకై తిరుగుట మానివేసి చిక్కిపోయాయి. అందుకే మాంసము 

ఎక్కువగా దోరుకుట లేదు.

భోజ:- నీ చమత్కారమునకు ఆనందిం చితిని.ఈ భూషణములను తీసికొనుము 

అనుచూ తన ఆభరణములను తీసి ఆ బోయ పడుచుకు యిచ్చివేసి తన దారిన వెడలి 

పోయెను.

స్వస్తి.

No comments:

Post a Comment