Saturday 7 January 2017

తెలుగు--విద్యామాధ్యమము


తెలుగు -- విద్యా మాధ్యమము 

విద్యా మాధ్యమమే ఆంగ్లమయినపుడు 'తెలుగు దేశం' కూడా పేరు మార్చుకొని ' ఆంగ్లదేశం ' అంటే 'ENGLISH COUNTRY' గా మార్చుకొంటే చాలా సమంజసముగా ఉంటుందేమో! 

అని నా కుడ్యము పై నేను ప్రచురించిన వాక్యమునకు స్పందిస్తూ ,

శ్రీయుతులు చింతల పల్లె కాశీపతి శర్మ గారు ఈ విధముగా వ్రాసినారు.
ఒక సమాజముయొక్క అభ్యున్నతి రెండు విధములుగా వుంటున్నది. ఒకటి, ఆర్థిక లేక లౌకిక అభ్యున్నతి. (Materialistic development). రెండవది మానసిక లేక ఆత్మయొక్క అభ్యున్నతి. (mental or spiritual advancement).

ఆర్థిక లేక అభ్యున్నతికి ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువుకొనడం ఉత్తమమన్నది నా అభిప్రాయము. ఎందుకంటే, నవీన విజ్ఞాన శాస్త్రవిషయములు చాలావరకు ఆంగ్ల భాషలోనే వివరించబడివున్నవి. ఈ విద్యను అభ్యసించిన తరువాత ఉద్యోగమునకు వెళ్ళవలెనంటే కూడా ఆంగ్ల భాషలో ఈ విద్యను అభ్యసించినవారు, ఒక్క ఆంధ్రదేశమునందు మాత్రమేగాక, భారత దేశములోని యే ప్రాంతములోనైనను, లేక ప్రపంచములోని యే దేశమునందైనను ఉద్యోగమును సంపాదించుకొనుటకు అవకాశముంటున్నది. పోటియందు నిలబడటకు కూడా అవకాశముంటున్నది. అంతేకాక ఈ విజ్ఞాన శాస్త్రమునందలి technical పదములను తెలుగులోనికి మాఱ్చుకొనడంకూడా చాలా కష్టము. ఇది అనవసరమన్నదికూడా నా అభిప్రాయము. ఇప్పుటి విద్యచాలావరకు పొట్టకూటికి, materialistic advancementకు మాత్రమే వుంటుండటంచే ఈ విద్యలకు మాత్రమే జీవితమునందు ప్రాధాన్యతనివ్వవలెనని అనుకొంటున్నవారు వీటిని English భాషలోనే చదువుకొంటేనే మంచిది. మానసిక లేక ఆధ్యాత్మిక వికాసమును కోరుకొంటున్నవారు, మన మాతృభాషయందుగానీ లేక ఈ భారతదేశముయొక్క ఉన్నతమైన సంస్కృతిని, కళలను, లేక పౌరాణిక, ఆధ్యాత్మిక విషయములను తెలుసుకొనగోరుచున్నవారు, వీటిని తెలుగులో అంతటికంటే ముఖ్యముగా సంస్కృతమునందు తెలుసుకొన్నప్పుడే విషయములు స్పష్టముగా అర్థమవుతాయి. తెలుగుకంటే కూడా ఈ విషయమునందు సంస్కృతం యెక్కువగా తోడ్పడుచున్నది. భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయములు, కళలు, పౌరాణికమైన విషయములు లేక ఆధ్యాత్మిక విషయములను సంస్కృతములో చదువుకొన్నప్పడే, మిగిలిన యే భాషలో అంటే తెలుగు, ఇంగ్లీషు వీటిలో చదువుకొనడంకంటే యెక్కువ అవగతమగుచున్నవి. ఈ విధముగా భారతీయులందఱు సంస్కృతంలో చదువుకొనడం దేశ సమైక్యతకుకూడా ఉపయోగకరముగా వుంటుంది. యావత్తు దేశానికి ఒకే భాషగా వుంటుంది. Knowledge Sharingకుకూడా యిది ఉపకరిస్తుంది. సంస్కృతమును నేర్చుకొన్న తరువాత తెలుగును నేర్చుకొనడం, వ్యవహారికంలో ఉపయోగించుకొనడం, యేమంతటి కష్టము కాదన్నది నా అభిప్రాయం. సంస్కృతముయొక్క ఔన్నత్యమును గుఱించి యెక్కువగా నేను చెప్పవలసిన అవసరం లేదని అనుకొంటున్నాను. Same pattern may be adopted in whole of India. Let AP State be the beginner. 

దేశ ప్రజల అభ్యున్నతి లౌకికంగానూ, ఆధ్యాత్మికంగానూ వుంటున్నప్పుడే యావత్తు సమాజముయొక్క ప్రగతికి అది తోడ్పడుతుంది. కేవలం లౌకిక లేక ఆధ్యాత్మిక ప్రగతులలో యే ఒక్కటి మాత్రమే చాలదు. ప్రగతి రెండింటిలోనూ వుండాలి. ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణముగా నవీన విజ్ఞాన శాస్త్రములను ఆంగ్లములోనూ, మన భారతీయ సంస్కృతి, విజ్ఞానములను సంస్కృతములనూ చదువుకొన్నప్పుడే ఈ రెండింటిలోనూ భావితరాల పౌరులు అభ్యున్నతి చెంది ప్రపంచంలోనే రాణించుటకు అవకాశముంటున్నది.

పిల్లలకు చిన్న వయసులో యెక్కువ శ్రమను కలిగించకుండా, చిన్న వయసులో విద్యను ఈ రెండు భాషలకు మాత్రమే పరిమితిని చేసుకొనడం మంచిది. కొంత పెరిగిన తరువాత తెలుగును వారంతకు వారే చాలా సులభముగా నేర్చుకొంటారు. దేశ భాషలందు తెలుగు లెస్సఅన్నది వాస్తవమైనప్పటికీ, తెలుగు fanatism ద్వారా ఒరుగ బోవునది యేమియును లేదు, కేవలము ప్రాంతీయ, భాషా విభేదములు తప్ప. 
***************************************************************************
వే. చింతలపల్లె కాశీపతి శర్మ గారూ నమస్తే. మనఃపూర్వకముగా మదిలోని భావనల తెలిపిన మీ సౌశీల్యతకు నమస్కారము. మీరు మనసార మంచి యని తలచినది వ్యక్తము చేసినారు. మీ అభిప్రాయముతో నేను ఏకీభవించలేక పోతున్నాను కానీ మీ మంచి మనసును అభినందిస్తూ వున్నాను.
మీరు సమాజముయొక్క అభ్యున్నతి రెండు విధములుగా వుంటున్నది అని తెలిపినారు. ఒకటి, ఆర్థిక లేక లౌకిక అభ్యున్నతి. (Materialistic development). రెండవది మానసిక లేక ఆత్మయొక్క అభ్యున్నతి (mental or spiritual advancement) అని.
నేను ముందు నాకు చేతనైనంత క్లుప్తముగా రెండవ దానిని గూర్చి తెలియబరుప ప్రయత్నిస్తాను. జ్ఞానము అనంతము. అంతయును ఆకళింపు చేసుకొనుటకు జీవిత కాలము చాలదు. అందువలన తల్లి గర్భమందున్నప్పుడే శిశువునకు, ఒక విధముగా చెప్పవలెనంటే, విద్యా బోధన తల్లి పురాణేతిహాసములు వినుటతో మొదలవుతుంది. ఈ విషయము పురాణేతిహాసములలో నిరూపింబడిన వాస్తవము. ప్రపంచములోనికి అడుగు పెట్టినతరువాత 8 సంవత్సరములకల్లా బ్రాహ్మణ బాలకుడైతే ఉపనయనము చేసి వేదవిద్యకు సిద్ధము చేస్తారు. ఇక ఆతని జీవితము ఆధ్యాత్మికమునకే అంకితము. ఋషుల కాలములో వారు వేదాంతమునకంకితమై జీవితమును గురుశిష్య పరంపరగా కొనసాగించేవారు. వేదాంతము అనగా ఉపనిషత్తులే! ఈ ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించినాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధములు అన్నది మీకు తెలియని విషయము కాదు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించుట జరిగింది. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించినవి. సరైన జ్ఞానమునకు, సన్మార్గమునకు ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినవి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. నా బోటి వారు వాని నుండి ఉత్సాహముతో ఏ కాస్తో కూస్తో తెలుసుకోవచ్చునేమోకాని, సంపూర్ణముగా తెలుసుకొన జాలరు. పూర్వపు మహనీయులు విద్యకై తమను ఆశ్రయించిన వారికి, ఒకవేళ తమకు తెలియకుంటే, నాయనా ఈ విషయము నాకూ తెలియదు. ఫలానా రాజు వద్దకు, బ్రాహ్మణుని వద్దకు కాదు, వెళ్లి తెలుసుకొందామని వెళ్ళేవారు.
సకల భాషలకు తల్లి సంస్కృతము. విద్య, అవిద్య రెండూ ఆ భాషలోనే ఉన్నాయి. విద్య అంటే ఆత్మా విద్య మాత్రమె అన్న మాట మీకు తెలియనిది కాదు. మిగత, నేడు మనమనే విద్యలన్నీ అవిద్యలే!
అవిద్య అన్నది నేటి Science and Technology. కావున విద్య కోరిన వాడు ఆత్మ సాధనకు అహరహమూ కృషిచేస్తాడు. అన్యమతడు ఆశించడు. ఆ ఆత్మవిద్య  సంవృద్దిగా, సాకల్యముగా సమగ్రముగా, సంపూర్ణముగా సర్వ శ్రేష్టముగా సంస్కృతములో నిలిచి ఈ దేశానికి వన్నె తెచ్చింది. అట్టి నా తల్లికి తల్లియగు సంస్కృతవాణికి సాష్టాంగ నమస్కారములు.
అందుకే నేటికి కూడా ఆంగ్ల భాషాభిమానులు అమితముగా అభిమానించే Voltaire (I am convinced that everything has come down to us from the banks of Ganga, Astronomy Astrology, Spiritualism etc. It is very important to note that some 2500 years Pythagoras went from Samos to the Ganga to learn geometry), Oppenheimer (What we shall find in Modern Physics is an exemplification, an encouragement, a refinement of old hindu wisdom) The youngest Noble prize laureate and Welsh physist Brian David Josaphson (The Sankhya hold the key to the laws of mind and thought process which are corelated to the quantam field i.e. the operation and distribution of particles at atomic and molecular levels). అసలు సాంఖ్యమునకు ఆద్యుడు కణాదుడు. రసవిద్య సమగ్రముగా తెలిసిన నాటి మహనీయులలో కణాదుడు, నాగార్జునుడు పేరెన్నిక గన్న వారు. భారతీయ శాస్త్ర విజ్ఞానము అన్న శీర్షిక క్రింద ఎన్నో వ్యాసములను శృంఖలగా వ్రాసి యుండినాను. వీరెవ్వరూ నాకు తెలిసి ఆంగ్లము నేర్చినవారు కాదు.
ఈ విధముగా Science పరముగా కూడా ఈ దేశ ఔన్నత్యమును గూర్చి సంస్కృత వాణి ఔన్నత్యమును గూర్చి చెప్పుకొంటూ పోవచ్చును. ఆధ్యాత్మికత కే కాదు ఆధిభౌతికత కు కూడా సంస్కృతమే మాతృక.
 నేను ఆంధ్రమును గూర్చి ఎంతో విస్తారముగా చాలా కాలము క్రిందట వ్రాసినాను. మనదేశ భాషలలో సంస్కృతమునకు అతి సన్నిహితమైన భాష ఆంధ్రము. అక్షరములు ఎక్కువయినా పదమును స్ఫుటముగా పలుకగలిగిన భాష ఆంధ్రమే! ఆంధ్రుడై ఆంధ్రము నేర్చినవాడు  ప్రపంచము లోని ఏ భాషనైనా నేర్చుకొన గలడు కానీ ప్రపంచములోని ఏ భాషకు చెందిన వాడయినా ఆంధ్రమును అంత సులభముగా నేర్చుకోలేడు. మన ఆంగ్లము ఏమాత్రమూ చదువుకొనని రాజ మహేద్రవరమునకు చెందిన దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారిని ఎంతో గౌరవముతో నియంత హిట్లరు తన జర్మనీ కి సగౌరవముగా రప్పించుకొని నాటికి ఆధునికమగు ఆయుధ నిర్మాణమును వేదములలో చెప్పిన రీతిగా చేయించుకొన్నాడు. వైదీకము ఉట్టిపడే ఆ మహనీయుని చిత్ర పటము నేటికీ జర్మనుల విదేశీకార్యాలయమునందు విరాజిల్లు చున్నది. ఆ మహనీయుని బోలె ఎల్లాప్రగ్గడ సుబ్బారావు గారు తెలుగు చదివి తదుపరి ఒక ఆయుర్వేద వైద్య కళాశాలలో పనిచేసి తన ప్రతిభచే అమెరికా వెళ్లి తెలుగు బావుటాను ఎగురవేసిన వారే! చెప్పుకొంటూ పోతే చాలా వుంది. typing చేతగాని నాతో ఇంత టైపు చేయించినారు. నేను మీ సహృదయతకు కట్టుబడి ఇంత వ్రాసినాను.
1.తెలుగు మాట్లాడుట వల్ల 72,000 నాడులు కదులుతాయి. మెదడుకు నోటికి ఇంతకన్నా ఆరోగ్యమైన భాషలేదు. సంస్కృతముతో కలిపి ప్రపంచములోని ఏ భాషనైనా సరే తెలుగు నేర్చిన వాడు, మాట్లాడ గలుగుతాడు.
2. ఈ రోజునకు కూడా తెలుగులో ఉన్నన్ని పదాలు ఆంగ్లములో లేవు. ఆంగ్లము పదములను ప్రపంచ భాషల నుండి దొంగలించ వలసిందే. అసలు ఆ భాషలో తెలుగు తమిళ పదాలు అంతెందుకు మన దేశములోని అన్ని ప్రాంతీయ భాషలలోని పదములు  కూడా ఎన్నో వారు స్వంతము చేసుకొన్నారు. అటక, పందికొక్కు, ముంగీస, పందిరి మొదలయినవి తెలుగు పదములే. ఒకవేళ సాంకేతిక పదములు ఆంగ్లమూ వున్నవి అని అన్నా, వానిని యధాతథముగా తీసుకొని బోధన భాషగా మాత్రము తెనుగును ధారాళముగా తీసుకొన వచ్చును. ఇది నా అభిప్రాయము కాదు సుమా! విద్యావేత్తలది.
3. ఆంగ్లములో ఉన్నదీ 26 అక్షరములు. నాలుక కదిలించ కుండా పెదవులు కలుపకుండా A నుండి Z వరకు మనము పలికితే బయటికి వచ్చె స్వరములు ‘A E I O U’ అన్న స్వరములు అంటే అచ్చులు మాత్రమె.
4. ఆంగ్లములో మాత్రమె Science అభివృద్ధి చెందలేదు. ఆంగ్లమే తెలియని జర్మని, జపాన్, చైనా, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశములు ఆంగ్లముతో అనుబంధము లేకనే  Science పరముగా ఎంతో అభివృద్ధి చెందినవి.
5. ప్రతి పనికీ మొదలు అన్నది ఒకటి ఉంటుంది. ‘ఆరంభింపరు ....... విఘ్నాయాస సంత్రస్తులై’ అన్న భర్తృహరి సుభాషితములోని మొదటి పాదమును వంటబట్టించుకున్న మనవారు, వంటయింటి పొయ్యిలో పిల్లిని లేపకుండా నక్షత్ర భోజన శాలలకు అలవాటు పడి ఆరోగ్యము నాశనము చేసుకొన్నారు.
6. మనది అని చెప్పినంత మాత్రమున కన్నతల్లి తో సమానము మనకు తెలియనంత గొప్పది అగు మాతృభాషను గౌరవించుటను fanaticism అన్నందుకు మనఃపూర్వకముగా బాధపడుచున్నాను.
7. వారి SCIENCE లో వచ్చె చాలా పదములు గ్రీకు మరియు లాటిన్ నుండి తీసుకొన్నవే! పోకాక్ అన్న ప్రసిద్ధ ఆంగ్లేయ చరిత్రకారుడే వ్రాసిన ‘INDIA IN GREECE’ అన్న గ్రంధమును చదివితే గ్రీకుల వాగ్విభవము సంస్కృత జన్యమే అన్న విషయము అవగతమౌతుంది. కావున మనము తలచుకొంటే ఇటు సంస్కృతము నుండి గానీ, తెలుగు నుండీనే గానీ ,లేక ఆగ్లమున వాడే ఆ సాంకేతిక పదమును యథాతథముగా తీసుకొని వాక్యమును తెలుగులో నిర్మించుకొన వచ్చును.
8. నేను బాల్యములో వ్రాయుట కూడా రాని మా అమ్మమ్మ వద్ద అమరము, తెలుగు శతకములు నేర్చుకొన్నాను. A B C D ….. అక్షరాలు 6 వ తరగతిలో మొదలు పెట్టినాను. నా వయసు వారంతా అట్లే చేసియుంటారు. మరి వారు గొప్ప పదవులు అలంకరించలేదా! నేను ఆంగ్లములోనే కాక హిందీలో కూడా వ్రాయగాలను. నేను ప్రత్యేకముగా హిందీ, ఇంగ్లీషు, ఆ మాటకు వస్తే తెలుగు కూడా ఎవరివద్దా నేర్చుకోలేదు. నా పైని దయతో దీనిని స్వోత్కర్షగా భావించవద్దు.
9. పిల్లలకు 5 సంవత్సరముల వరకు పెద్దలు నేర్పించేవి,  పరిసరములు నేర్పించేవి, ఒక సమూహములో తాము గమనించేవి వెంటనే నేర్చుకొంటారు. కాకపోతే భావ వ్యక్తీకరణ చేయలేరు. అందువల్ల ఆ సమయములో A for Apple కు పంపకుండా ఇంటిలో నె ఉంచుకొని వారిని ఆడిస్తూ పాడిస్తూ తల్లి, అప్పుడప్పుడు తండ్రి, ఒకవేళ ఇంటిలోనే ఉంచుకొని యుంటే వారి తల్లిదండ్రులు(అంటే పిల్లల అవ్వ తాతలు) ఆ పిల్లలకు భాష, సంస్కృతి, సచ్ఛీలము ఎంతయినా నేర్పించ వచ్చును. ఇది పునాది. ఇది గట్టిగా వుంటే కట్టే మేడ  ఆకాశము తాకినా ఆశ్చర్య పోవలసిన అవసరము ఉండదు. అందుకే పెద్దలన్నారు: 
రాజవత్ పంచవర్షాణి దశావర్షాణి తాడవత్
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్
10. మీరు గమనించితే నేను Science అన్న మాటకు ప్రత్యామ్నాయముగా శాస్త్రము అని వాడలేదు. శాస్త్రము చెప్పినది చెప్పినట్లే! ఇది ఇట్లు చెయ్యమని శాశించుతుంది. Science is subject to changes. మన కాలమున వాడిన అల్లోపతి మందుల పేర్లు వానిని కనిపెట్టిన వారు కూడా మరచి పోయి ఉంటారు. ఇప్పుడు అన్నీ కొత్త పేర్లే. అసలు అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అల్లోపతిలో ఆయనకు వచ్చిన జ్వరమునకు మందులు లేక చనిపోవుట జరిగింది.  అల్లోపతి కి ఆద్యుడు హిప్పోక్రేటిస్ రుగ్మతలకు చెడు రక్తము కారణమని నొక్కి వక్కాణించినారు. ఆ చెడు రక్తము తీయుట వల్లనే వాషింగ్టన్ స్వర్గస్థులైనారు. ఆయుర్వేద ఔషధములు మాత్రము శతాబ్దాల తరబడి అవే పేర్లనే కలిగి వున్నాయి. ఇప్పుడిప్పుడు పరాయి నాగరికత వ్యామోహ పరులు తాము కనిపెట్టినట్లు చెప్పేందుకు ఈ పేర్లను కూడా మారుస్తూవున్నారు. వీరిని తాగిన తల్లి రొమ్మునే గుద్దేవారు అన్నా తప్పు లేదేమో! నాడి పట్టుకొని రుగ్మతలన్నీ ఉచితముగా చెప్పిన వైద్య శాస్త్రము కలిగిన దేశమిది. అసలు తెలుగువారు  ఆయుర్వేదములో ఎంతో పేరు సాధించినవారు. 
11. పదకొండవ శతాబ్దము వాడయిన పావులూరి మల్లన గణితమును పద్య గ్రంధముగా వ్రాసినారు. ఆ కాలమునకు ఆంగ్లము లేదు. విజ్ఞానమునకు కొదువ లేదు. కొల్లురు లోని త్రుప్పు పట్టని ఉక్కు జయ స్తంభమును ఆది శంకరులు అచటికి వచ్చిన సందర్భముగా ఏర్పాటు చేసిన నిపుణ మతులు అక్కడి జాలరులు. ఎంతటి సాంకేతిక పరిజ్ఞానమూ చూడండి. ఇక ఢిల్లీ లోని ధ్వజస్తంభమును గూర్చి మీకు తెలిసియే ఉంటుంది.
12. మహాత్ముడు పాణిని వెలుగునకు తెచ్చిన ఛందస్సు గణిత మయము. మనము తెనుగునకు కూడా అదే వాడుచున్నాము. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.
గరువు=U=aఅనుకొందాము
లఘువు=I=b అనుకొందాము
ఈ రెంటినీ తీసుకొని గణితశాస్త్రములోని  పౌనఃపున్యముల (Permutations and Combinations a branch of mathematics brought to the world by our Indian Rishis) సహాయముతో పెర్చుదాము.
UU  UI IU II . UU  అంటే UXU = U^2; అదేవిధముగా UI+IU= UI+UI= 2UI  II=I^2. ఇప్పుడు ఆ సమాసమును పూర్తిగా ఈ విధముగా వ్రాయ వచ్చును.
U^2+ 2UI+ I^2 = (U+I)^2 అంటే (a+b)^2 అన్న మాట. ఇదేదో కాకతాళీయముగా వచ్చినదని తలువ వద్దు . ఈ విధముగా (U+I)^n కు కూడా ఫలితమును సాధించ వచ్చు. ఇటువంటి విజ్ఞానమును మన వద్ద నుండి సంపాదించి వారి పేరుతో పెట్టుకున్నారు పాశ్చాత్యులు. వారికి మన భాష రాదు మరి ఈ పనిని ఏవిధముగా చేసినారు. మన సంస్కృత , ఆంధ్ర పండితులకు ఇతోధికముగా డబ్బు ఇచ్చి నేర్చుకున్నారు. తరువాత మన శాస్త్ర విషయములను స్వంతము చేసుకొన్నారు. నేను ఇచట ఆధ్యాత్మికతను గూర్చి చెప్పుట లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికతకు పరాకాష్ట ఈ దేశము. అది మీరు నేను కాదనము. మన శాస్త్ర విషయములు మనవద్ద నుండి నేర్చుకొని వారి భాషలో వారు తెలిపితే, మనము ఆ భాష నేర్చుకొని అవి చదివేదానికంటే మన భాష నేర్చుకొని మన విజ్ఞానముగా చెప్పుకొనుట  గౌరవాస్పదము కాదా!
13. నావలె పేదవారగు నాటి విద్యార్థులు 11వ తరగతి వరకు చదివినది తెలుగును బోధన భాష గా కలిగియే! కళాశాల చేరిన వెంటనే ఆంగ్ల మాధ్యమము. మొదటి నెల కష్టమైనా తరువాత మొదటి నుండీ ఆంగ్లమే చదివిన ఏ విద్యార్థి కన్నా నేను తక్కువ మార్కులు తెచ్చుకోలేదు. నేనే కాదు నా మిత్రులకూ తక్కువ అంకములు రాలేదు. అందుకు కారణము నా మాతృభాషే నని  గర్వముగా చాటుకొంటాను. అప్పుడు క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు తప్ప వేరే విధమయిన అంటే నేటి మాదిరి ప్రయివేటు మేనేజిమెంటు స్కూళ్ళు లేవు. మాకన్నా  చాలా కాలము క్రితమే మునిసిపల్; ముస్లిం హై స్కూల్ ఉండేది. అక్కడ బోధనా భాష మాత్రము ENGLISH. కానీ ఉర్దూ భాషకు ఉన్నతమైన ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ
విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమము నల్లేరు పై నడకే. కానీ మేము కళాశాలలో చేరిన అచిరకాలములోనే వారిని అధిగమించి  గణితము మరియు SCIENCE లో వారికన్నా ఎక్కువ అంకములను తెచ్చుకునే వారము. ఆంగ్లమును అతి సులభముగా ఒడిసి పట్టుటకు కారణము  తెలుగు భాషే! అందులోని సంస్కృత శబ్దములు 80% ఉండవచ్చునన్నది పండిత శ్రేష్ఠులు చిలుకూరి నారాయణ రావు గారి అంచనా!
14. విమానమును ఆవిష్కరించినది రైటు సోదరులు కాదు ‘శివకర్ బాపు తల్పాడే’ అన్న సంస్కృత అధ్యాపకుడు. దానికి ఆయన పెట్టిన పేరు ‘మరుత్సఖ’. ఆయనకు సహకరించింది సుబ్బరాయ శాస్త్రి అన్న ఆంధ్ర వైదీకి. నాటి ఆంగ్లేయుల కుట్రతో ఆ ఆవిష్కరణ రైటు సోదరులకు చేరగా వారు తమ పేరుతో హక్కును (పేటెంట్) ను నమోదు చేసుకొన్నారు. తల్పాడే గారు పిచ్చి పట్టి మరణించినారు. వారిరువురికీ ఆంగ్లము రాదు. వేగసామ్యాత్ విమానో ఆండజానాం.’ పక్షులవలె వేగముగా స్వేచ్ఛగా సంచరించ గలుగుటచే వానిని విమానము అనుట జరిగినది అని తెలిపిన భరద్వాజ మహర్షి ‘ బృహద్విమాన సంహితలో’ ఎంతో వివరముగా విశాదీకరించినారు. ఇక్కడ ఐన్ స్టీన్ తన విద్యార్థితో జరిగిన సంభాషణ పొందుపరచుచున్నాను.
 Student: “Dr. Einstein, aren’t these the same questions as last year’s (Physics) final exam?

Dr. Einstein: “Yes; but this year the answers are different”

15. US, UK వంటి విదేశములలో ఆంగ్లము తెలియని వారు ఉద్యోగములను సంపాదించే అవకాశమును కలిగి యుండరు అని కొందరంటారు. నేను ఆంగ్లమును ఒక భాషగా నేర్చుకొన కూడదు అని నేనెక్కడా చెప్పలేదు, చెప్పను. తెలుగు పునాదిగా ఎన్ని భాషలు నేర్చుకున్నా మంచిదే! ఏ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కు కావలిసినది నైపుణ్యము, ఆంగ్లమున ప్రాథమిక ప్రవేశము. తెలుగు రాణి వారితో మాట్లాడగలుగునంత. అమెరికాలోనే చదివే మన పిల్లలకు తెలుగు వచ్చె అవకాశమే తక్కువ, కానీ వారికి ఆంగ్లముకూడా అంతంత మాత్రమె వస్తుంది. తెలుగుకు బదులుగా ఆంగ్లము, ఒకవేళ నేర్చినంత మాత్రమున చురుకుదనము రాదు. అది ప్రకృతిసిద్ధము.
తెలుగును గూర్చి ఆంగ్లములో, కొందరు పండితులు తెలిపిన అభిప్రాయములను గమనించండి:
Telugu was exposed to the influence of Prakrit as early as the 3rd century B.C.'. From this we know that the language of the people was Telugu, although the language of the rulers was different.


As Velcheru Narayana Rao states in page 3 of his book Classical Telugu Poetry: "every Sanskrit word is potentially a Telugu word as well, and literary texts in Telugu may be lexically Sanskrit or Sanskritized to an enormous extent, perhaps sixty percent or more." As C.P Brown states in page 266 of his book A Grammar of the Telugu language: "Every Telugu rule is laboriously deduced from a Sanskrit canon". As David Shulman states in page 3 of his book Classical Telugu Poetry: "The enlivening presence of Sanskrit is everywhere evident in Andhra civilization, as it is in the Telugu language". Based on all these facts Telugu should be classified into Indo-Aryan group.

 'Nannaya meticulously laid down the ground rules and semantics of writing in Telugu by borrowing from Sanskrit grammar and inventing original rules'. Telugu literature until then was Prakrit based and devoid of a grammar.

ఇచట మూర్తి సిరిగిరాజు గారి అభిప్రాయము నాకు నచ్చుటచే ఆంగ్లము లో వారు వ్రాసిన అభిప్రాయమును తెలియబరచు చున్నాను.

Murthy Srigiriraju 1. Every country teaches it's children & educates in their own language!
Because it is a natural instinct to think, assimilate & express better in one's own language, for acquiring better skills & communication!

2. Alas, it was the evil motto of the British colonial rulers to enslave us, by not properly getting us educated, keeping majority of people aloof from education & continue to be illiterates for centuries!

3. Imagine, had mother tongue been our medium of instruction after attaining independence, by now illiteracy in India would have vanished. More & more scientists & scholars & original thinkers would have emerged! It is due to English medium only a few were educated, majority are good for nothing either in English or mother tongue, so far as communication & literary skills are concerned! It is confined only to a few elite class/castes!

4.One more damage done was, we were alienated from our culture, traditions, Vedas, Upanishads, Epics & various literary & socio, economic & scientific ancient scriptures, for not able to read & understand ! Either they were confined to museums or destroyed!

5. In the process, the mother of all languages, Sanskrit became a dead language & died a natural death, as English replaced Sanskrit as lingua franca, becoming medium of common communication & administration among all linguistic states!

6. Had Sanskrit been allowed to be popularised, in place of English, imagine, how far we would have traveled & achieved in scientific & technological advancements, as most of our ancient Sanskrit scriptures are the mines & embodiments of treasures of scientific knowledge, since thousands of years!

7. But this enormous valuable literature was stolen by westerners, who got benefited & now developed, discovered & invented various present science & technology, using our ancient literature as a spring board!

8. One more reason for denying our education in mother tongue is to easily popularize their Christian religion, & encourage conversions, by distancing us from our literature, culture, traditions & praying & worshipping practices, which are available in our vernacular languages & Sanskrit literature! 

9. Once denied our language, compelled to learn English, we became closure to their teachings, literature, religion, customs & traditions & practices, including our dress code & manners! So now we are neither fully Indian nor western! Such is the damage, if we ignore our mother tongue, the root cause for growth & development of any country & its people!

Ananth S Bommakanti chinna tanam lo maatru baasha lo vraayadam chadavadam vaste, taruvaata vere bhassahalu nerchukovadam chala sulabhamu..nenu america lo choosinadi kooda ide.. chala chinnabucchukovalasina vishayamu emitante, mana teluguvaalu maatram telugulo maatladam chinnatanam gaa bhavistaaru...pillalaku kooda telugu bhaasha nerpincharu.. ade aravam, marathi pillalu enta baaga maatladevaaro.. alage spanish, mexican and italian vaarukooda, entoo anargalamgaa vaari maatrubhaashanu, aanglamunu maatladadestaru...kaneesam maataram vaaramaina idi tappu ani grahinchi, maapillalaku telugu chadavadam vraayadam rondoo nerpinchaali.appude malla telugu bhasha kotta jeevam posukontundi..

Ananth S Bommakanti
చిన్నతనం లో మాతృభాష లో వ్రాయడము చదవడము వస్తే, తరువాత వేరే భాషలు నేర్చుకోవడము చాలా సులభము. నేను అమెరికాలో చూసినది కూడా ఇదే!చాలా చిన్నబుచ్చుకోవలసిన విషయము ఏమిటంటే మన తెలుగు వాళ్ళుమాత్రము తెలుగులో మాట్లాడటం చిన్నతనముగా భావించుతారు. పిల్లలకు కూడా తెలుగు భాష నేర్పించరు. అదే అరవము, మరాఠీపిల్లలు ఎంత బాగా మాట్లాడేవారో. అలాగే స్పానిష్,
మెక్సికన్ అండ్ ఇటాలియన్ వారు కూడా, ఎంతో అనర్గళంగా వారి మాతృభాషను మాట్లాడేస్తారు. కనీసం మాతరం వారైనా ఇది తప్పు అని గ్రహించి, మా పిల్లలకు తెలుగు చదవద్ఫం వ్రాయడం రెండూ నేర్పించాలి. అప్పుడే తెలుగు భాష మళ్ళా జీవం పోసుకొంటుంది.
చివరిగా ఒక్క మాట. ‘కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి’ అన్నది జగద్గురువులు ఆది శంకరులు చెప్పిన మాట ఆమ్మ యగు జగన్మాతను గూర్చి. ఈ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ‘వాణి’ కూడా ఈమె అవతారమే! వాణి అంటే భాషే కదా ! భాషకు ఆది మాతృభాషే కదా పుట్టిన బిడ్డకు. కావున  ఆ బిడ్డ మెదడు మొదట స్పందించేది మాతృభాషకే కదా! రాను రానూ అన్ని భాషలూ నేర్చుకోగలుగుతాడు ఆ బాలుడు. అటువంటి తల్లి గొప్పను గూర్చి ఎంత చెప్పినా తక్కువే. తల్లిని తూలనాడే కుపుత్రులు వుండ వచ్చు ‘కుమాత’ ఎన్నటికీ ఉండదు. అందువల్ల
తెలుగు Fanaticism ద్వారా ఒరుగ బోవునది యేమియును లేదు, కేవలము ప్రాంతీయ, భాషా విభేదములు తప్ప.అన్న మీరన్న ఈ ఒక్క మాట నాకు హృదయ శల్యము. మిగతా అంతా మీ అభిప్రాయము మీ ఇష్టము.


స్వస్తి.

No comments:

Post a Comment