Tuesday, 21 July 2020

మన జాతీయ గీతము

మన జాతీయ గీతము
https://cherukuramamohan.blogspot.com/2020/07/blog-post_21.html

Americaఅన్న పేరు ఎట్లు వచ్చింది అంటే:
Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9, 1454 February 22, 1512) was an Italian explorer, financier, navigator, and cartographer

 from the Republic of Florence. Sailing for Portugal around 15011502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)
పైన, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.
దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు మనదేశామునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం' గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు ఉపయోగించము అని నా మనవి.

మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల, ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.
నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦ 

రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో 

బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్ 

ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ 

సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే 

అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ 

గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ 

గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది. 

ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు 

కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది 

ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే 

సాక్ష్యము .

In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of 

Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can 

be no debate about it. Of course Bankimchandra does show Durga to be 

inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can 

be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the 

nation].
మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో 

కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు 

నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం' ఆలపించరాదని ఉద్ఘాటించినది 

రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత 

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ 

గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో 

సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక 

పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో 

ప్రతిఘటన ఏదీ!

ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది .

మిగతది రేపు.........



Sunday, 19 July 2020

కొనకుండా నవ్వుకొనండి-దేవానాంప్రియుని సమక్ష సంభాషణ (Interview)


కొనకుండా నవ్వుకొనండి-దేవానాంప్రియుని Interview

ఇదేమిటి శీర్షికే కడు విచిత్రముగా ఉన్నదని ఆలోచించుతూ వుండియుంటారు. అవును ఏదయినా 

మాట నిటారుగా చెబితే క్షణములో తలలో దూరి క్షణములో మాయమౌతుంది. కాస్త 

వంకరటింకరగా చెబితే తలలో దూరుటకు కాస్త ఆలస్యమయినా బయటికి పోలేక తలలోనే 

నిలిచిపోతుంది. అందుకే కొత్తదనము కలిగిన ఈ శీర్షిక. దేవానాంప్రియ మన కథానాయకుని పేరు. 

బాగానే వున్నది. ఇటువంటి పేరు ఎవరూ పెట్టుకొనగా చూడలేదే! అని మీరు తలువ వచ్చును. 

అందుకే ఈపేరు ఉంచినాను. ఈకాలము అంతా అర్థము పర్థము లేని పెర్లేకదా ఎక్కువగా 

పెట్టుకొనేది. ముఖ్యముగా ఆడపిల్లల పేర్లు రానురాను విచిత్రముగా వినిపిస్తున్నాయి ‘శల్య’ అంటే 

ఎముక, ఇదొకపేరు, ప్రహేళిక అంటే నుడికట్టు (puzzle), రజని అంటే చీకటి, ఇదొకపేరు, యామిని 

అంటే రాత్రి ఇదొక పేరు, గణిక అంటే వేశ్య ఇదొక పేరు, శిరీష అంటే దిరిసెన ఇదొక పేరు. ఇక 

పురుషులలో అయితే పుంఖానుపుంఖాలు. అందుచే నేను నా కథానాయకునికి దేవానాంప్రియుడు 

అని నామకరణము చేసుకొన్నాను. నిజముగా ఈ మాటకు ‘మూర్ఖుడు’ అని అర్థము. 'దేవతలకు 

ప్రియుడు' అన్న అర్థములో అశోక చక్రవర్తికి కూడా ఈ పేరు ఉన్నది. మన నాయకుడు మొదటి 

అర్థమునకు అర్హుడు.

నిజానికి Interview అన్న ఆంగ్ల పదమునకు అర్థము ఒకరినొకరు చూచుకొనుట. కానీ మనము 

దానిని ఉద్యోగ విషయమై అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పుట అన్న అర్థములో 

వాడుచున్నాము. మనము  'సమక్ష సంభాషణ' అని దానిని తెనిగించ వచ్చు. ఏమి చేద్దాం, మనకది 

అవమానకరము.

ఇక విషయానికి వస్తే ఈయన SSLC అంటే ఆకాలములో 11వ తరగతి 10మార్లు చదివి 

ఆతరగతిలోనే P.Hd. పుచ్చుకొన్నాడు. ఆ కాలములో వార్డుషి శాఖాధిపతులు (Bank’s Branch Managers) తామే నచ్చిన అభ్యర్థులను ఉద్యోగమునకు ఎన్నుకొనేవారు. ఈయనను ఉద్యోగము లోనికి తీసుకొన్న శాఖాధిపతికూడా,  ఈయన చదివినదే చదివి చదివినదే చదివి సంపూర్ణ జ్ఞానమును బడసినాడని తలచి ఉద్యోగమిచ్చినాడు. 10 సంవత్సరములు కళ్ళుమూసి తెరిచే లోపలే గడచిపొయినాయి. ఈ పది సంవత్సరములలో ఈయనకు ఏపని ఇచ్చినా దానిపనైపోయినట్లే అన్న నిశ్చితాభిప్రాయానికి బ్యాంకినే రప్పింప జేసినాడు.

ఈయనకు ఆ సమయములో పదోన్నతి కొరకు పరీక్ష మరియు మౌఖికమునకు (Exam and 

Interview) పిలచినారు. ఆరోజులలో బ్యాంకికి ఖర్చు కలిసి వస్తుందని ఆ విధముగా చేసే వారు. పరీక్ష 

వ్రాసిన తరువాతి రోజునుండి Interview మొదలయ్యేది. Interview కు వచ్చినవారంతా, స్వంత 

Coat వుంటే తప్ప Coat and Tie బాడుగకు తీసుకొనేవారు. మన ప్రియుడు కూడా బాడుగకే 

తీసుకొని అద్దెకిచ్చిన వానితోనే Tie కట్టించుకొని Coat వేసుకొని Interview Hall చేరుకొన్నాడు. 

నలుగురితోబాటూ తానూ నారాయణుడై కూర్చున్నాడు. దానికి కొద్దిదూరములో A\C Chamber 

లో  Interviews జరుగుతూ వున్నాయి. అది వేసవికాలము. Fan లు అక్కడొకటి ఇక్కడొకటి 

ఉన్నందువల్ల ప్రియునికి గాలి ఆడుట కష్టమై పోయింది. రెండు గంటలు వేచియున్నా లోనికి 

పిలువలేదు. చేత కాక చేతులెత్తి పక్క వారినడిగి Tie, loose చేసుకొన్నాడు. Coat కు కూడా 

గుండీలు విప్పి గాలి తన శరీరమును తాకేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉండిపొయినాడు.

ఇంతలో ‘దేవానాంప్రియు’నికి పిలుపు రానే వచ్చింది. ఇక Tie కట్టుకోనూ లేడు, coat బొత్తాలు 

పెట్టుకోనూ లేడు. తెగించి పాతాళభైరవిలో మాంత్రికుని గుహలో ప్రవేశించిన తోటరాముని మాదిరి 

విసురుగా లోనికి బయలుదేరినాడు. ప్రతీక్షకుల (Candidates) కొరకు పరచిన ఎర్రతివాచీ 

మొదళ్ళు లేచియుండుటచే ఆత్రములో ఉన్న మన కథానాయకుడు తొట్రుపాటుపడి తన నిశ్చలత కోల్పోయి తటస్థ నిశ్చలతలో నిలువలేక వెంకటేశ్వరునిముందు అంగప్రదక్షిణకు బోర్లా పడుకొన్న భంగిమలో వారి ముందుపడి నమస్కారము Sir అంటూ సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించినాడు. వస్తూవున్న నవ్వునాపుకొని Interview Board Members, ముగ్గురూ, Messenger తో అతనిని లేపించి ఆసనమున కూర్చుండ జేసి మంచినీళ్ళిప్పించి, అతనిచే సర్డుకొన్నాను అని చెప్పించి ప్రశ్నలు వేసినారు.

ప్రియుడు English లో poor తెలుగులో weak. మొదటి Member ఆంగ్లములో అడిగిన ప్రశ్నను 

ఆకళింపు చేసుకొని 5 నిముసములలో ఆంగ్లములో ఆయన జవాబు చెప్పే లోపల, రెండవ 

Member తెలుగులో వేరే ప్రశ్నను సంధించినాడు. ఈ సారి 3 నిమిసములలో,  జవాబు చెప్పుటకు 

నోరు తెరుస్తూనే మూడవ వ్యక్తి తిరిగీ English లో ప్రశ్నించినాడు. ఈ సారి దేవానాంప్రియుని వద్ద 

జవాబే లేదు. మొదటి Member ‘You can go’ అన్నాడు. అంతే Hero బయటికి వచ్చివేసినాడు. 

వస్తూనే సాటి అభ్యర్థులు అతనిని చుట్టుకొని, బెల్లము చుట్టూ ముసిరిన ఈగలవలె, Interview బాగా 

చేసినావా అని అడిగినారు. అడుగు లోనికి పెట్టినది మొదలు బయటికి వచ్చేవరకు జరిగిన అన్ని 

విషయయములతో పూర్తిగా కలత చెందిన మనవాడు ‘ఇది ఒక interview నేనా! ఈ నా పుత్రుడు 

అడిగితే ఆనాపుత్రుడు అడుగుతాడు, ఆనాపుత్రుడడిగితే ౩వ నా పుత్రుడు అడుగుతాడు. 

ఏనాపుత్రునికి జవాబు చెప్పేది అన్నాడు. (పుత్రుడు=కొడుకు). హాలంతా నవ్వులతో దద్దరిల్లితే 

Interview Board Members బయటికి వచ్చి వింత చూచుట వారి వంతయింది.

స్వస్తి.

కొనకుండా నవ్వుకొనండి వివిధ సందర్భ విచిత్ర సంభాషణలు


కొనకుండా నవ్వుకొనండి
వివిధ సందర్భ విచిత్ర సంభాషణలు
1. సినిమాహాలులో కనిపించిన మిత్రుడుహలో! సినిమాకేనా ?
జవాబు: లేదు బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి!
2. సిటీ బస్సులో ఒక లావుపాటి స్త్రీ చెప్పుకాలితో నా పాదమును అణగద్రొక్కి నేను అబ్బ అంటూనే అటువైపుజూచి అన్నది:కాలికి నొప్పి అయ్యిందా?
నా జవాబు: లేనేలేదండి నేను బస్సు ఎప్పుడెక్కినా Local Anesthesia తీసుకొనే ఎక్కుతాను. ఏం, మళ్ళీ తొక్కదలచుకొన్నారా?
3. అది అర్ధరాత్రి సమయము. ఒకవ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగిన ప్రశ్న: పడుకొని నిద్రబోతున్నారా?
నా జవాబు: అబ్బే లేదండీ కూర్చొని ఆడుకుంటున్నాను.
4. నా పొట్టి వెంట్రుకల cuttingను చూసి ఒకడు అడిగిన ప్రశ్న: haircutting చేయించుకొన్నారా?
నా జవాబు: అబ్బే లేదు. ఆకురాలు కాలము కదా! వాటికవే రాలిపోయినాయి.
5. ఆదివారం పొద్దున 6గం. లకు Land Line నుండి మాట్లాడుతున్న ఒకడు: హలో! నేను Land Line నుండి మాట్లాడుతున్నాను. ఇంట్లోనే ఉన్నారా?
నాజవాబు: ఫరవాలేదు నేను నా Land Line మెడకు తగిలించుకొని బజారులో ఉన్నాను చెప్పండి?
6. నాకారును clean చేస్తూ వుంటే ఒకడు అడిగిన ప్రశ్న: కారు క్లీన్ చేస్తున్నారా?
అయ్యో లేదండీ! కారుకు నీళ్ళు పడుతూ వున్నాను, బస్సవుతుందని!
7. ఒకడు: ఏమండీ ఈ కొండ మీది నుండి దూకితే పుణ్యం వస్తుందంటారా?
నేను: అది తెలియదు కానీ ప్రాణము పైకి శరీరము క్రిందికి వస్తాయని తెలుసు.
8. ఒకడు: ఆడపిల్లలను అందముగా సృష్టించినాడు దేవుడు కానీ వాళ్లకు బుద్ధినివ్వలేదు. ఎందుకంటారు?
నేను: ఇస్తే మనలాంటి మూర్ఖులను పెళ్ళిచేసుకోరు కదా!
9. ఒకడు: నేను చెప్పింది చక్కగా వినిపించుకోరేమండీ?
నేను: మీరు చక్కగా చెబితే చక్కగా వినిపించుకోగలను.
10. ఒకడు: నేను పాటలు చాలా బాగా పాడుతాను. మరిమీరు?
నేను: నేనుకూడా! వేలంపాటలు బాగా పాడుతాను.
చెరుకు రామ మోహన్ రావు


Wednesday, 15 July 2020

కొనకుండా నవ్వుకొనండి FAMILY PROBLEM


కొనకుండా నవ్వుకొనండి-FAMILY PROBLEM
https://cherukuramamohan.blogspot.com/2020/07/familyproblem-two-menone-american-and.html
Two men, one American and an Indian were sitting in a bar drinking shot after shot. The Indian man said to the American,
"You know my parents are forcing me to get married to this so called
homely girl from a village whom I haven't even met once.
We call this arranged marriage. I don't want to marry a woman
whom I don't love...I told them that openly and now have a hell
lot of FAMILY PROBLEMS."......
The American said, “Talking about love marriages?
I'll tell you my story. I married a widow whom I deeply loved and dated for 3 years. “After a couple of years, my father fell in love with my step-daughter and so my father became my son-in-law and I became my father´s father-in-law. My daughter is my mother and my wife my grandmother. More problems occurred when I had a son. My son is my
father's brother and so he is my uncle. Situations turned worse when my father had a son. Now my father's son I.e. My brother is my grandson.
Ultimately, I have become my own grandfather and I am my own grandson.
And you say you have family problems...?!
ఒక అమెరికన్ ఒక ఇండియన్ స్నేహితుడు ఒక రెస్టారెంట్ లో కలుసుకొని ఒకరి బాధలు ఒకరితో చెప్పుకొంటున్నారు. మొదట ఇండియన్ ఈ విధంగా చెప్ప మొదలుపెట్టినాడు "మా దేశములో అమ్మాయిని వారి కుటుంబమునువారి సాంప్రదాయమును చూసి , ఆ పైన పెళ్లిచూపులు ఏర్పాటుచేసి పెళ్లి చేయడమనేది సనాతన ధర్మమూ ఏర్పరచిన మార్గము. కానీ కాలము మారిపోయింది. మాకు మీ సాంప్రదాయమంటేనే ఎంతో ఇష్టము. నచ్చిన వారిని పెళ్లి చేసుకొని కొన్నిరోజుల తరువాత నచ్చకపోతే ఆవిడను వదిలి వేరొకరిని పెళ్లి యాడవచ్చు. ఇప్పుడు మాతల్లిదండ్రులు ఒక అమ్మయిని చూసివచ్చి , ఆమెది మంచి కుటుంబమని , వారు సాంప్రదాయాన్ని పాటించుతారని, ఆవిడను పెళ్లియాడమని నన్ను వత్తిడి చేస్తున్నారు. ముక్కు మొగము తెలియని అమ్మాయిని ఏవిధముగా పెళ్లి చేసుకోవాలో తెలియుట లేదు. పెళ్లి జరిగితే అన్నీ ప్రోబ్లెంసే . అనుకొంటే నా మతి పోతూవుంది."
అందుకు ఆ అమెరికా స్నేహితుడు ఈ విధముగా బదులిచ్చినాడు." నీవు ,అసలు ప్రాబ్లం లేకుండానే ఎదో కొండ నెత్తిన పడినట్టు బాధ పడుతూవున్నావు.అసలు PROBLEM అంటే ఏమిటో నేను చెబుతా విను.
నేను, మా దేశములో, ఒక విధవరాలిపై మనసుపడి ముందు భర్తతో కుమార్తెను కన్నఆవిడను పెళ్లి చేసుకొన్నాను.
కాలక్రమములో మా తండ్రి మా ఆవిడ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఆవిధంగా నా కూతురు నా తల్లి అయ్యింది. నా భార్య నాకు అమ్మమ్మ అయ్యింది.నా తండ్రి నాకు అల్లుడైనాడు. కొంత కాలానికి నాకు కొడుకు పుట్టినాడు. నా సమస్యలు అపరిమితమైపోయినాయి. నాకొడుకు నా తండ్రికి మరిది నాకు UNCLE అయినాడు.
నా తండ్రికి కొడుకు పుట్టడముతో పరిస్థితులు ఇంకా విషమించినాయి. ఇప్పుడు ఆ అబ్బాయి నాకు తమ్ముడు, మనుమడు రెండు ఔతాడు. చిట్ట చివరికి,కట్ట కడపటికి ,తుట్ట తుదకు నాకు నేనే తాతను నాకు నేనే మనవణ్ణి .
ఇప్పుడు చెప్పు PROBLEMS ఎవరివో ?
ఇది కేవలము నవ్వుటకే కాకుండా ఆలోచించుటకు కూడా ఉపయోగపడేది .
పాఠకులు అధికముగా ఉంటారన్న ఉద్దేశ్యముతో తెలుగులో అదే విషయాన్ని కాస్త పెంచి వ్రాసినాను .

Saturday, 11 July 2020

కృతజ్ఞత (నా జీవితపు మధుర స్మృతి)


కృతజ్ఞత (నా జీవితపు మధురస్మృతి)
నేను నా గురించి ఈ ఆస్యగ్రంధి మాధ్యమములో అవసరమయితే తప్ప తెలుపుకోను. అది నా అలవాటు, అహంకారము కాదు. అట్లని నాలో అహంకారము లేదు అని చెప్పుటలేదు. కానీ దానిని వీలయినంతవరకు తగ్గించుకొనే ప్రయత్నము నిరంతరమూ చేస్తూనే వుంటాను. ఇది వాస్తముగా గ్రహించ ప్రార్థన. స్వోత్కర్ష కాదు.
కృతజ్ఞత అన్నది మానవునికి భూషణము కాని ఆభూషణము. అదివుంటే తనవెంట  ఇంకెన్నో సల్లక్షణాలను చేర్చుతుంది. కృతఘ్నత అన్నది మనిషిని రాక్షసుని చేస్తుంది. ఈ విషయమై ఒక పది దినముల క్రితము మీకు తెలిపిన శ్లోకమునే సందర్భోచితమగుటవల్ల తిరిగీ తెలుపుచున్నాను.
బ్రహ్మఘ్నేచ సురాపేచ స్తేనే భగ్న వ్రతే తథాl
నిష్కృతిర్విహితా బుద్ధిః కృతఘ్నే నాస్తి నిష్కృతిఃll
బ్రహ్మహత్య చేయువారికి, త్రాగుబోతులకు, దొంగలకు, వ్రతభంగము చేయువారికి, సత్పురుషులు ప్రాయశ్చిత్త విధానమును తెలిపిరి, కానీ కృతఘ్నులను ఉద్ధరించుటకు ఎటువంటి నిష్కృతిని తెలుపలేదు. కృతఘ్నతకు మించిన పాపమే లేదు. చేసిన మేలు మరచినవాడు ఒక పూజకు పనికిరాని పూవు. తినుటకు పనికిరాని పండు. దుర్గంధభూయిష్టమైన వాయువు.
నేను సంఘములో గుర్తింపు పొందుటకు కారణభూతులు మా అమ్మమ్మ, మాతండ్రి. నా తండ్రికి నేను ఒకడినే సంతానము. తల్లి నాకు ఒక సంవత్సరము నిండగనే పరమ పదము చేరుకొంది. ఆడదిక్కు లేమిచే విధవరాలయిన నాఅమ్మమ్మను బ్రతిమలాడి  నన్ను ఒప్పజేప్పినాడు నా తండ్రి.
తదాదిగా వారి జీవిత ధ్యేయము నా ఉన్నతి మాత్రమే! ఎంతో కష్టపడి నన్ను
గణిత పారంగత ప్రక్రమము న (M.Sc. Maths.) తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయములో చేర్చినారు. ఆ రెండు సంవత్సరముల ప్రక్రమములో చివరి రెండునెలలు నా తండ్రి కొంత ఆర్థికపరమగు ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చినది. నేను ఛాత్రవాసిని(Hostler) కాను.
అప్పుడు ఆ పరమాత్ముడే పంపినట్లు, శ్రీ రామకృష్ణ జూనియర్ కాలేజి అప్పటి ప్రిన్సిపాలయిన
శ్రీ రామ మూర్తిగారు మరియు వారి ఆచార్య బృందములో మువ్వురు, వారిలో ఒకరి స్నేహితుడయిన నరసింహారావు గారితో,  స్నాతకోత్తర పట్టాలు ఉండికూడా, మళ్ళీ MA చేయడానికి వచ్చినారు.
నా తండ్రి శ్రీ రామూర్తి గారికి తెలుసు. నేను రామకృష్ణ కాలేజిలో ఒక్క తరగతి కూడా చదువలేదు. గోపాలకృష్ణముర్తిగారు మాకు ఇరుగు పొరుగు. సీతారామయ్యగారు దూరపు బంధువు. అయినా నన్ను చూడవలెనను తలంపు కలిగినది రామమూర్తి గారికి. వారు 5మందీ కలిసి నేను ఉన్న గదికి వచ్చినారు. కుశల ప్రశ్నలు ముగిసిన వెంటనే రామమూర్తిగారు, నీవు ఒక్కనివే ఇక్కడ ఎందుకు,? మాతోబాటూ వుండి చదువుకొందువుగానీ అని, ఆ కొద్ది పరిచయముతోనే ఆయన ఎంతో ఆప్యాయతతో కూడిన అధికార స్వరములో నన్ను పిలచినారు. అప్పటికప్పుడు రూము ఖాళీ చేసి ఇవ్వవలసిన బాడుగ కట్టివేసి వారితో బయలుదేరినాను.
ఆరోజునుండి నా భారము పూర్తిగా వారిదే! వ్యక్తిగతముగా మాత్రము నా మంచిచెడులు రామమూర్తిగారే చూసేవారు. నాచదువు, తిండి, నిద్రల బాధ్యత అంతా ఆయనదే! ఆకాలములో పరిక్షలు దగ్గరగా ఉన్నందువల్ల ఎవరికీ ఏవిధమైన వ్యాయామము కూడా లేదు. అందుకొరకు ఆయన తన పాతవిద్యార్థులు, Medicine చదివే వారితో చెప్పి అరుగుదలకు అందరికీ కలిపి ఒక పెద్ద సీసా Corminative Mixture తెప్పించి ఎవరికీ కావలసినపుడు వారిని తీసుకొమ్మని చెప్పినారు. నా బాధ్యత మాత్రము వారిదే! అదేవిధముగా భోజనమునకు ఒక బ్రాహ్మణ మెస్ నుండి carrier వచ్చేది. తనప్రక్కన కూర్చోబెట్టుకొని సరిగా తింటున్నానా లేదా గమనించేవారు. ఇక చదువు విషయములో నేను రోజూ వారు చదివినంతసేపూ చదువ వలసిందే! రాత్రి నేను నిద్ర ఆపుకోలేకపోతే ఆయన తెప్పించియుంచిన Dexidrin మాత్ర ఒకటి ఇచ్చి వేసుకోమ్మనేవారు. అదివేసుకొంటే చదివినంతసేపూ, అంటే ఏదయినా పనిలో ఉన్నంతసేపూ, నిద్ర వచ్చేదికాదు. నిద్ర పోదలచి పడుకొని కళ్ళు మూసుకొంటే నిద్రవచ్చివేసేది.
పరీక్షలు అందరమూ, ముఖ్యముగా, రామమూర్తిగారి దయవల్ల నేను, చక్కగా వ్రాసి ఊరుచేరుకొన్నాము. ఒకరోజు అర్ధరాత్రి సమయములో ఇంట్లో అందరమూ నిదురబోయే సమయములో ఇంటిముందు శబ్దముచేస్తూ ఒక 2wheeler ఆగింది. మెలుకువలో వున్న మాతండ్రి లేచి చూస్తే, ఎదురుగా రామమూర్తిగారు. ఒక్క క్షణము ఆలస్యము చేయకుండా వెంకప్పగారూ! మీ కుమారునికి 1st class వచ్చింది. అని ఎంతో ఉద్వేగాముగా చెప్పినారు అదే సమయములో నాకూ మెళుకువ వచ్చి మరి మీరంతా సార్! అంటే అందరమూ అదే క్లాస్ లో పాసయినాము అన్నారు. ఈ వేళలో Results ఎట్లు తెలిసినవని నా తండ్రి వారినడిగినారు. యూనివర్సిటీ లో పనిజేసే నా పాత students, Telegram ఇచ్చినారని చూపించినారు. వారి వయసు అప్పటికే 56, 57 సంవత్సరములు ఉంటాయి. ఎంత ప్రేమ ఎంత అభిమానము. మరచితే నాకు అన్నము కూడా పుట్టదు. ఇవి అన్నీ ఇట్లు ఉంటే, తిరుపతిలో  సరదాగా మాట్లాడే సమయములో నేను చొరవ తీసుకొని ఆయనతో ఒకమాట అన్నాను. ఆరోజులలో PANAMA సిగరెట్లు ఒక పాకెట్ లో 20 వచ్చేవి. అటువంటివి ఆయన రోజుకు తక్కువంటే 2 పెట్టెలు కాల్చేవారు. ఆయన వస్తున్నారు అంటే ముందు పొగ కనిపించేది. అందుచేత నేను ఆయనను నడిచే పొగబండి అని ప్రక్కనున్న స్నేహితులతో అనేవాడిని అని చెప్పినాను. పిల్ల సొయ్యము అంటారు, అంటే పెద్ద చిన్న తారతమ్యమెరుగకుండా నేను ఆ మాట ఆయనతో చెబితే ఎంతగా నవ్వినారో నాకు ఈనాటికీ గుర్తే! పదే పదే అదే అదే మాట నన్ను అడిగడిగీ చెప్పించుకొని నవ్వేవారు. ఇంతటి అనుబంధము ఎంతమందికి కలిగే అవకాశమొస్తుంది.
       రోజులు గడిచిపొయినాయి. ఫలితములు తెలిసిన కొన్నినెలలకే నాకు పెళ్లి అయిపోయింది. ఉద్యోగము లేదు. పెళ్ళికి వచ్చి ఆయన నేను Interview లకు వెళ్ళుటకు గానూ నా Documents పెట్టుకొనుటకు ఖరీదయిన, అందమయిన Bag చదివించినారు. అది జీర్ణమైనా కూడా ఆయన జ్ఞాపకార్థము ఇప్పటికీనా దగ్గరగా ఉంచుకొన్నాను.
SBI లో ఉద్యోగమూ , కాలాంతరములో ఆఫీసరును అయినాను. తిరుపతి Zonal Office లో పనిచేసే కాలములో, ఆయన కుమారుడు, పేరు కుమార్, చార్టర్డకౌంటెంటు, నేను ప్రకాశం Region లో పని చేస్తూ వుంటే నావద్దకు వచ్చినాడు.కుశల ప్రశ్నలు ముగిసినతరువాత తనకు కారు లోను కావాలనీ, నావద్దకు వెళ్ళమని సారుచెప్పినారానీ అన్నాడు. అతనికి లోను ఇవ్వవలసినది కడప రీజియన్, రీజినల్ మేనేజర్. వారు నాకు బాగా తెలిసినవారే కాబట్టి, కుమార్ను పిలుచుకొనిపోయి వారికి పరిచయము చేసి లోను విషయము చెప్పినాను.  వారు తప్పకుండా చేద్దామనుటతో సమస్య తీరిపోయింది. ‘Thanks అన్నా’ అన్నాడు కుమార్. నేను ‘వద్దు కుమార్. ఆదినా బాధ్యత. సారు నన్ను నీతో సమానముగా చూసుకొంటారు.  మరి ఆమాత్రము నీకు సాయము చేయలేనా’ అని చెప్పి పంపినాను.
కారు లోను Sanction అయినది. కొత్త తెల్ల Ambassador కారు కొని మొదట తిరుమల వేంకటేశ్వరుని దర్శనమును ముగించుకొని నేరుగా కారు దిగువ తిరుపతిన మాయింటిముందు నిలుపుట జరిగినది. నా అడ్రసు సారు వద్ద ఉండినది కాబట్టి ఇల్లు తెలుసుకొనుట వారికి కష్టముకాలేదు. కారు ఎవరికొరకు ఆగినది అన్న ఆతురుతతో నేను బయటికి అడుగులు వేసినాను. అమ్మగారు కుమారు అతని భార్య పిల్లలు దిగినంతనే రందిరందని ఆహ్వానించి ‘సారూ ఏడీ’ అని అడిగినాను. కారు లోపల ఉన్నారని చెబుతూ వారు ఇంటిలోనికి దారి తీసినారు. నేను అచటనే నిలిచి తెరచిన తలుపుగుండా సారును చూసి ‘లోపలికి రండి సార్’,  అని అత్యంత ఆదరముతో పిలచినాను. నేను కారులోపలికి తలవంచి మాట్లాడుతూవుంటే ఆయన నా భుజములు పట్టుకొని నీరునిండిన కళ్ళతో ‘Brittle Bone Disease (Osteogenesis Imperfecta) వచ్చినది. కాస్త ఎక్కువగా కదిలినా ఎముకలు చిట్లుతాయి. ఇపుడు నడిచే  పొగబండి నడువలేన్ని బండి అయిపోయినది. సిగరెట్స్ కూడా మానివేసినాను’ అన్నారు. అసంకల్పితముగా నాకూ కంట నీరు కారినది. నన్ను నేను సర్దుకొని Tiffin చేయించుతాను అని ఎంతబలవంత పరచినా Tea మాత్రమే తాగుతానన్న వారికి నేను ఇంటిలోనికి వెళ్లి కప్పుతో Tea తెచ్చి వారికి ఇచ్చినాను. త్రాగి వారు ‘మళ్ళీ చూడనౌతుందో కాదో’ అన్నారు. ధైర్యము చెప్పే ప్రయత్నములో ‘మీకు బాగయిపోతుంది లెండి’ అన్నాను. తన కుటుంబ సభ్యులను రమ్మనమని చెబితే, నేను అలాగేచేసి, మేమందరమూ కూడా బయటికి వచ్చినాము. అవే కడసారి చూపులు. ఆతరువాత ఒక నెలలోపే ఆయన పరమపదించినారు. గాడిచెర్ల రామారావు గారి వీధినుండి NGO కాలనీ కి ఇల్లు మారుటలో నా అడ్రసు పోగొట్టుకొన్నందుచేత నాకు తెలియబరుపలేకపోయినారు. ఇంకా బాధాకరమైన విషయము ఏమిటంటే ఆయన కుమారుడు కూడా ఆతరువాత ఎక్కువ కాలము బ్రతుకలేదు. ఆవిధముగా నాతండ్రి గురువు, దైవమును దూరము చేసుకొన్నా మందభాగ్యుడను.
రెండు నెలలే కావచ్చు నావున్నతి కుంటు పడకుండా కాపాడిన వారు నాకు తండ్రివంటివారు కాక మరేమిటి. పాఠ్యాంశములు నేర్పక పోయివుండవచ్చును గానీ జీవిత పాఠాలతో బాటూ మాటలాడే తీరు తెన్నూ మొదలయినవి వారివద్దనుండి నేర్చుకొన్నాను. ఆ విధముగా వారు నాకు గురువులే! నాదారిని సరిదిద్ది నన్ను ఋజుమార్గములోనుంచి దానినుండి తప్పకుండా జూచిన వారు నాకు దైవమే కదా! దేవుడు అమరుడు. ఆయన నాలో దీపకళికయై నేనున్నంత వరకూ నాకు దిశానిర్దేశము చేస్తూనే ఉంటారు.
అసలు ఈ విషయమును పంచుకొనుటకు కారణము నా కుమార్తె. ఆమె నిన్న దేనికోసమో వెదుకుతూ వుంటే పోగొట్టుకొన్నాననుకొన్న ఈ ఫోటోను నాకు Scan చేసి, వీలయినంతవరకు మరకలను తీసివేసి చూపించి, నేను ఆ ఫోటోను పదిమందికి చూపించి ఈ వృత్తాంతము వ్రాయుటకు దోహదము చేసినది.
స్వస్తి.