Tuesday, 21 July 2020

మన జాతీయ గీతము

మన జాతీయ గీతము
https://cherukuramamohan.blogspot.com/2020/07/blog-post_21.html

Americaఅన్న పేరు ఎట్లు వచ్చింది అంటే:
Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9, 1454 February 22, 1512) was an Italian explorer, financier, navigator, and cartographer

 from the Republic of Florence. Sailing for Portugal around 15011502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)
పైన, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.
దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు మనదేశామునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం' గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు ఉపయోగించము అని నా మనవి.

మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల, ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.
నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦ 

రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో 

బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్ 

ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ 

సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే 

అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ 

గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ 

గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది. 

ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు 

కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది 

ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే 

సాక్ష్యము .

In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of 

Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can 

be no debate about it. Of course Bankimchandra does show Durga to be 

inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can 

be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the 

nation].
మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో 

కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు 

నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం' ఆలపించరాదని ఉద్ఘాటించినది 

రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత 

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ 

గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో 

సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక 

పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో 

ప్రతిఘటన ఏదీ!

ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది .

మిగతది రేపు.........



2 comments:

  1. Very beautifully presented. We are much benefited by this valuable information which is to be read by every Indian. Thanks sir for this great effort.

    ReplyDelete
  2. వందేమాతరం గీతం గురించి మీరు తెల్పిన విషయాలు అన్నీ అందరికీ తెలియ వలసినవి.
    బంకించంద్ర చటర్జీ గారి ఆనందమఠ్ నవలలోని ఆ గీతాన్ని ఒకప్పుడు పాడిన రవీంద్రనాథ్ టాగోర్ ఆతరువాత
    ముస్లింలు ఆ వందేమాతరం గీతాన్ని పాడకుండా బహిష్కరించడం అన్న విషయాన్ని సమర్ధించడం చాలా చాలా బాధాకరమైన, ఆశ్చర్యకరమైన విషయం.ఆయన కూడా ముస్లింల లాగే మాట్లాడుతూ ముస్లింలకు వత్తాసు పలకడం
    దారుణమైన విషయం.ఆయన యే విధంగా దేశభక్తుడు కాగలడు అన్నప్రశ్న సహేతుకమైనదవుతుంది.
    మీ సందేశం యెందరికో కనువిప్పు అవుతుంది రామ్మోహన్ రావు గారూ... మీకు అనేక అభినందనలండీ.

    ReplyDelete