Sunday 19 July 2020

కొనకుండా నవ్వుకొనండి వివిధ సందర్భ విచిత్ర సంభాషణలు


కొనకుండా నవ్వుకొనండి
వివిధ సందర్భ విచిత్ర సంభాషణలు
1. సినిమాహాలులో కనిపించిన మిత్రుడుహలో! సినిమాకేనా ?
జవాబు: లేదు బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి!
2. సిటీ బస్సులో ఒక లావుపాటి స్త్రీ చెప్పుకాలితో నా పాదమును అణగద్రొక్కి నేను అబ్బ అంటూనే అటువైపుజూచి అన్నది:కాలికి నొప్పి అయ్యిందా?
నా జవాబు: లేనేలేదండి నేను బస్సు ఎప్పుడెక్కినా Local Anesthesia తీసుకొనే ఎక్కుతాను. ఏం, మళ్ళీ తొక్కదలచుకొన్నారా?
3. అది అర్ధరాత్రి సమయము. ఒకవ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగిన ప్రశ్న: పడుకొని నిద్రబోతున్నారా?
నా జవాబు: అబ్బే లేదండీ కూర్చొని ఆడుకుంటున్నాను.
4. నా పొట్టి వెంట్రుకల cuttingను చూసి ఒకడు అడిగిన ప్రశ్న: haircutting చేయించుకొన్నారా?
నా జవాబు: అబ్బే లేదు. ఆకురాలు కాలము కదా! వాటికవే రాలిపోయినాయి.
5. ఆదివారం పొద్దున 6గం. లకు Land Line నుండి మాట్లాడుతున్న ఒకడు: హలో! నేను Land Line నుండి మాట్లాడుతున్నాను. ఇంట్లోనే ఉన్నారా?
నాజవాబు: ఫరవాలేదు నేను నా Land Line మెడకు తగిలించుకొని బజారులో ఉన్నాను చెప్పండి?
6. నాకారును clean చేస్తూ వుంటే ఒకడు అడిగిన ప్రశ్న: కారు క్లీన్ చేస్తున్నారా?
అయ్యో లేదండీ! కారుకు నీళ్ళు పడుతూ వున్నాను, బస్సవుతుందని!
7. ఒకడు: ఏమండీ ఈ కొండ మీది నుండి దూకితే పుణ్యం వస్తుందంటారా?
నేను: అది తెలియదు కానీ ప్రాణము పైకి శరీరము క్రిందికి వస్తాయని తెలుసు.
8. ఒకడు: ఆడపిల్లలను అందముగా సృష్టించినాడు దేవుడు కానీ వాళ్లకు బుద్ధినివ్వలేదు. ఎందుకంటారు?
నేను: ఇస్తే మనలాంటి మూర్ఖులను పెళ్ళిచేసుకోరు కదా!
9. ఒకడు: నేను చెప్పింది చక్కగా వినిపించుకోరేమండీ?
నేను: మీరు చక్కగా చెబితే చక్కగా వినిపించుకోగలను.
10. ఒకడు: నేను పాటలు చాలా బాగా పాడుతాను. మరిమీరు?
నేను: నేనుకూడా! వేలంపాటలు బాగా పాడుతాను.
చెరుకు రామ మోహన్ రావు


1 comment: