కొనకుండా నవ్వుకొనండి-దేవానాంప్రియుని Interview
మాట నిటారుగా చెబితే క్షణములో తలలో దూరి
క్షణములో మాయమౌతుంది. కాస్త
వంకరటింకరగా చెబితే తలలో దూరుటకు కాస్త ఆలస్యమయినా
బయటికి పోలేక తలలోనే
నిలిచిపోతుంది. అందుకే కొత్తదనము కలిగిన ఈ శీర్షిక. దేవానాంప్రియ
మన కథానాయకుని పేరు.
బాగానే వున్నది. ఇటువంటి పేరు ఎవరూ పెట్టుకొనగా చూడలేదే! అని
మీరు తలువ వచ్చును.
అందుకే ఈపేరు ఉంచినాను. ఈకాలము అంతా అర్థము పర్థము లేని పెర్లేకదా ఎక్కువగా
పెట్టుకొనేది. ముఖ్యముగా ఆడపిల్లల పేర్లు రానురాను విచిత్రముగా
వినిపిస్తున్నాయి ‘శల్య’ అంటే
ఎముక, ఇదొకపేరు, ప్రహేళిక అంటే నుడికట్టు (puzzle),
రజని అంటే చీకటి, ఇదొకపేరు, యామిని
అంటే రాత్రి ఇదొక పేరు, గణిక అంటే వేశ్య ఇదొక పేరు, శిరీష అంటే దిరిసెన ఇదొక పేరు.
ఇక
పురుషులలో అయితే పుంఖానుపుంఖాలు. అందుచే నేను నా కథానాయకునికి దేవానాంప్రియుడు
అని నామకరణము చేసుకొన్నాను. నిజముగా ఈ మాటకు ‘మూర్ఖుడు’ అని అర్థము. 'దేవతలకు
ప్రియుడు' అన్న అర్థములో అశోక చక్రవర్తికి కూడా ఈ పేరు ఉన్నది. మన నాయకుడు మొదటి
అర్థమునకు అర్హుడు.
నిజానికి Interview అన్న ఆంగ్ల పదమునకు అర్థము ఒకరినొకరు చూచుకొనుట. కానీ మనము
దానిని ఉద్యోగ విషయమై అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పుట అన్న అర్థములో
వాడుచున్నాము. మనము 'సమక్ష సంభాషణ' అని దానిని తెనిగించ వచ్చు. ఏమి చేద్దాం, మనకది
అవమానకరము.
ఇక విషయానికి వస్తే ఈయన SSLC అంటే
ఆకాలములో 11వ తరగతి 10మార్లు చదివి
ఆతరగతిలోనే P.Hd. పుచ్చుకొన్నాడు. ఆ కాలములో వార్డుషి శాఖాధిపతులు (Bank’s Branch Managers) తామే నచ్చిన అభ్యర్థులను ఉద్యోగమునకు
ఎన్నుకొనేవారు. ఈయనను ఉద్యోగము లోనికి తీసుకొన్న శాఖాధిపతికూడా, ఈయన చదివినదే చదివి చదివినదే చదివి సంపూర్ణ
జ్ఞానమును బడసినాడని తలచి ఉద్యోగమిచ్చినాడు. 10 సంవత్సరములు కళ్ళుమూసి తెరిచే
లోపలే గడచిపొయినాయి. ఈ పది సంవత్సరములలో ఈయనకు ఏపని ఇచ్చినా దానిపనైపోయినట్లే అన్న
నిశ్చితాభిప్రాయానికి బ్యాంకినే రప్పింప జేసినాడు.
ఈయనకు ఆ సమయములో పదోన్నతి కొరకు పరీక్ష
మరియు మౌఖికమునకు (Exam and
Interview) పిలచినారు. ఆరోజులలో బ్యాంకికి ఖర్చు
కలిసి వస్తుందని ఆ విధముగా చేసే వారు. పరీక్ష
వ్రాసిన తరువాతి రోజునుండి Interview
మొదలయ్యేది. Interview కు వచ్చినవారంతా, స్వంత
Coat వుంటే తప్ప Coat and Tie బాడుగకు
తీసుకొనేవారు. మన ప్రియుడు కూడా బాడుగకే
తీసుకొని అద్దెకిచ్చిన వానితోనే Tie
కట్టించుకొని Coat వేసుకొని Interview Hall చేరుకొన్నాడు.
నలుగురితోబాటూ తానూ
నారాయణుడై కూర్చున్నాడు. దానికి కొద్దిదూరములో A\C Chamber
లో Interviews జరుగుతూ వున్నాయి. అది వేసవికాలము.
Fan లు అక్కడొకటి ఇక్కడొకటి
ఉన్నందువల్ల ప్రియునికి గాలి ఆడుట కష్టమై పోయింది. రెండు
గంటలు వేచియున్నా లోనికి
పిలువలేదు. చేత కాక చేతులెత్తి పక్క వారినడిగి Tie, loose
చేసుకొన్నాడు. Coat కు కూడా
గుండీలు విప్పి గాలి తన శరీరమును తాకేందుకు విశ్వప్రయత్నాలు
చేస్తూనే ఉండిపొయినాడు.
ఇంతలో ‘దేవానాంప్రియు’నికి పిలుపు రానే
వచ్చింది. ఇక Tie కట్టుకోనూ లేడు, coat బొత్తాలు
పెట్టుకోనూ లేడు. తెగించి పాతాళభైరవిలో
మాంత్రికుని గుహలో ప్రవేశించిన తోటరాముని మాదిరి
విసురుగా లోనికి బయలుదేరినాడు. ప్రతీక్షకుల
(Candidates) కొరకు పరచిన ఎర్రతివాచీ
మొదళ్ళు లేచియుండుటచే ఆత్రములో ఉన్న మన
కథానాయకుడు తొట్రుపాటుపడి తన నిశ్చలత కోల్పోయి తటస్థ నిశ్చలతలో నిలువలేక
వెంకటేశ్వరునిముందు అంగప్రదక్షిణకు బోర్లా పడుకొన్న భంగిమలో వారి ముందుపడి
నమస్కారము Sir అంటూ సాష్టాంగ దండ ప్రణామమును ఆచరించినాడు. వస్తూవున్న
నవ్వునాపుకొని Interview Board Members, ముగ్గురూ, Messenger తో అతనిని లేపించి
ఆసనమున కూర్చుండ జేసి మంచినీళ్ళిప్పించి, అతనిచే సర్డుకొన్నాను అని చెప్పించి
ప్రశ్నలు వేసినారు.
ప్రియుడు English లో poor తెలుగులో weak. మొదటి Member ఆంగ్లములో అడిగిన ప్రశ్నను
ఆకళింపు చేసుకొని 5 నిముసములలో ఆంగ్లములో
ఆయన జవాబు చెప్పే లోపల, రెండవ
Member తెలుగులో వేరే ప్రశ్నను సంధించినాడు. ఈ సారి
3 నిమిసములలో, జవాబు చెప్పుటకు
నోరు
తెరుస్తూనే మూడవ వ్యక్తి తిరిగీ English లో ప్రశ్నించినాడు. ఈ సారి
దేవానాంప్రియుని వద్ద
జవాబే లేదు. మొదటి Member ‘You can go’ అన్నాడు. అంతే Hero బయటికి వచ్చివేసినాడు.
వస్తూనే
సాటి అభ్యర్థులు అతనిని చుట్టుకొని, బెల్లము చుట్టూ ముసిరిన ఈగలవలె, Interview బాగా
చేసినావా అని అడిగినారు. అడుగు
లోనికి పెట్టినది మొదలు బయటికి వచ్చేవరకు జరిగిన అన్ని
విషయయములతో పూర్తిగా కలత
చెందిన మనవాడు ‘ఇది ఒక interview నేనా! ఈ నా పుత్రుడు
అడిగితే ఆనాపుత్రుడు
అడుగుతాడు, ఆనాపుత్రుడడిగితే ౩వ నా పుత్రుడు అడుగుతాడు.
ఏనాపుత్రునికి జవాబు
చెప్పేది అన్నాడు. (పుత్రుడు=కొడుకు). హాలంతా నవ్వులతో దద్దరిల్లితే
Interview
Board Members బయటికి వచ్చి వింత చూచుట వారి వంతయింది.
స్వస్తి.
No comments:
Post a Comment