ఆర్య వైశ్యులు
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా--అమరము(ఆర్యా = శ్రేష్టురాలు , దాక్షాయణీ
= దక్షుని కూతురు, గిరిజా = పర్వతరాజు హిమవంతుని కుమార్తె,
మేనకాత్మజా = మేనకా దేవి కూతురు, మేనక
హిమవంతులు భార్యాభర్తలు.)
ఆర్య లేక ఆర్యాంబ అన్నది అమ్మవారి బహుళ నామావళిలో ఒకటి. విష్ణువర్ధనుని ఏలుబడిలోని పెనుగొండ రాజ్యమునేలిన కుసుమశ్రేష్టి కుమారితగా జన్మించి, వయోదికుడగు విష్ణువర్ధనుడు ఆమెను మోహించి వివాహము చేసుకోను ప్రస్తాపన కుసుమ శ్రేష్టి గారి ముందు ఉంచితే, వాసవి తన తండ్రితో తానూ వివాహము చేసుకోను ఉద్దేశ్యమే లేదని చెబుతుంది. రాజు ఆగ్రహోదగ్రుడై దండెత్త దలచినపుడు తనకు బాసటగా 714 గోత్రములయందలి 102 గోత్రములవారు నిలచుతారు. ఆమె జీవచ్ఛవాలుగా బ్రతికేకంటే ప్రాయోపవేశము చేయుట సముచితమని వ్గారికి తెలుపుతుంది. ఆమెను మహాత్మురాలిగా గుర్తించి కుసుమశ్రేష్ఠి మొదలగువారు ఆమెను గూర్చి ప్రశ్నించుతారు. తానూ ఆర్యామ్బానని తెలియజేస్తూ వారికి తన దివ్యదర్శనమునొసంగి తనతోబాటు అగ్నికి ఆహుతి కమ్మని చెబుతుంది. వారంతా తిరిగీ ఆర్యవైశ్యులుగా, వాసవాంబ వారి ఇలవేల్పుగా తిరిగీ భూమిపై అవతరించుతారు. ఆర్య అన్న అమ్మయొక్క నామమును ఆలంబనగా చేసుకొని వారు ఆర్యవైశ్యులైనారు. ఆర్య అన్న మాటకు శ్రేష్ఠము అన్న అర్థము ఉండుటవల్ల వారు శ్రేష్ఠి యన్న బిరుదమును వారు కలిగియున్నారు. శ్రేష్ఠి అన్న తత్సమ శబ్దమునకు వికృతే 'శెట్టి'. ఆ విధముగా ఈ శబ్దము ఎంతో గౌరవార్థమును కలిగియున్నది.
నిబద్ధతతో ఒకపనిని సదా ఆచరించుతాను అన్న భావనను వర్తన అని అనుట కద్దు. ఈ వర్తన దురాశతో ముడిపడితే దుర్వర్తన అవుతుంది. పరిమితి ఏర్పరచుకొంటే సద్వర్తన అవుతుంది. అట్టి సక్రమమైన పరిమితితో సమాజములోనికి అడుగు పెట్టినవారే వర్తకులు. అసలు శ్రేష్ఠులైనవారు కావున నాడు వారు వర్తకులైనారు.
ఇది కలికాలము. ఇది వంచన ‘కల’ కాలము. సంపదకు ‘ఆకలి’ కాలము. మోసపు మూ’కల’ కాలము. అందుచే ఎంతోమంది వ్యాపారులితే అయినారుగానీ వృత్తి పై నిష్ఠ లేదు. అట్లని అందరూ నిష్ఠ లేనివారేనా అంటే అది సమంజసము కాదు. నీతినియమములన్న పట్టాలపై నేటికి కూడా నడిచే ఆర్య వైశ్యులుండుటచే వాసవాంబ చల్లని చూపుల బాటలో పయనించుతూ, తమ లాభములో 10 శాతము నేటికినీ ప్రజా హితమునకు సంఘ సేవకు దోహదపడుచున్నారు. ఆతల్లికి కృతజ్ఞతగా దసరా ఉత్సవాలను ప్రొద్దుటూరి వైశ్యులు ఎంత ఘనంగా చేస్తారో చెప్పుట, తలకందని విషయము. అమ్మకు అంతటి కృతజ్ఞులు వారు. మైసూరు లో వలె మహారాజు జరిపించడు ఇక్కడ, వైశ్యుల కష్టార్జితముతోనే జరుపుతారు.

నేను నా బాల్యములో ప్రతి రోజూ చూసిన మాట చెబుతున్నాను. కడప జిల్లా
ప్రొద్దుటూరులో రంగయ్య గారి సత్రము పేద విద్యార్థులకు భోజన వసతులను ఉచితముగా
సమకూర్చేది. అచ్చటి అమ్మవారిశాల లో కూడా విద్యార్థులకు ఉచిత గదులను భోజన వసతిని
కలిగించేవారు. పత్తి, నూనె, బంగారునకు పెట్టింది పేరు
ప్రొద్దుటూరు. వైశ్యులయి కూడా కర్నాటక సంగీతమును దేశ విదేశములలో వినిపించిన నా
మిత్రులు శ్రీ తలిశెట్టి వెంకట సుబ్బారావు గారు, వారి కుమార్తె, వాణీ వరప్రసాదిని, వాణీ నామధేయిని చి.కుం.సౌ. వాణి
గొప్ప సంగీత విద్వాంసులు. శ్రీ సదానందీశ్వరయ్యగారు గొప్ప Association Leader. జమ్మలమడుగులో వంకదార వారిసత్రము ప్రయాణీకులకు తాత్కాలిక
ఉచిత బస కొరకు గదులనిచ్చేది. లభ్ద ప్రతిష్ఠులు, పెండేకంటి
వెంకట సుబ్బయ్య గారు, కొణిజేటి రోశయ్య గారు గవర్నర్లగా
పనిచేసిన వారు. వెంకటయ సుబ్బయ్యగారు ఇపుడు లేరు. తమిళనాడులో సుంకువారి సత్రము,
జనపన వారి సత్రము మొదలగునవన్నీ వైశ్యులవే! మద్రాసు మహానగరములోని G.N. Chetty రోడ్ అన్న వీధి దీవాన్ బహద్దూర్ గోపతి నారాయణస్వామి చెట్టి
గారి పేరుతో నేటికినీ విలసిల్లుచున్నదని బహుశ అతి తక్కువమందికి తెలిసియుండవచ్చు.
తిరుమల బ్రహ్మోత్సవములకు నేటికినీ చెన్న పట్టణములో వాసికెక్కిన Parrys Corner ప్రాంతములో వుండే
వైశ్యులే గొడుగులు తీసుకొని వస్తారు. ఈ కార్యక్రమము అక్కడి చెన్నకేశవ స్వామి
గుడినుండి మొదలోపుతుంది. ఆంధ్రులకు రాష్ట్రమును తెచ్చిన పొట్టి శ్రీరాములు గారు
కూడా వైశ్యుడే! ఈ విధముగా వైశ్యులలో అగ్రగణ్యులు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా
విస్తరిల్లియున్నారు.
పేదరికపు పంచన నిలచిన నేను, మా తండ్రిగారి పట్టుదల, వితరణ పరులైన వైశ్యుల ధన సహాయము వల్ల P.U.C. నుండి P.G. వరకు చదువగలిగినాను. ప్రచారము వారి ఆచారము కాదు. నాటి దాతలకు ఈ విధముగా కృతజ్ఞత తెలుపుకొనగల్గుట నా సుకృతము. వర్ణములు వుండి కూడా ఆంగ్లేయులు రాకమునుపే కాదు వచ్చిన తరువాత కూడా, 1917 వ సంవత్సరములోRe.1= 13$ లు గా వుండినది. 1947 కు అది Re.1=$1అయినది. ఈ రోజెంత? రూపాయి విలువ అన్నది మనము చెప్పనవసరము లేదు, తెలిసినదే కాబట్టి. మన పాటికి మన ధర్మమును పాటించనివ్వకుండా చేసి మన ఐక్యతను చిన్నా భిన్నము చేయుటచే మనకీదశ దాపురించినది.

అసలు ఇంత జరిగినా వర్ణాశ్రమ ధర్మమును నిష్ఠతో పాటించుతూ సాంఘీకపరమగు
అవమానములను సహించుతూ ధర్మానికి కట్టుబడి నెగ్గుకు వస్తూవున్న ఏకైక వర్ణము
వైశ్యులే!
వారి దీక్షాదక్షతకు ఇవే నా నమస్సుమాంజలులు.
స్వస్తి.

No comments:
Post a Comment