Tuesday 11 July 2017

దార్ (دار)


దార్ (دار)
దార్ (دار) అన్న పదానికి ఇల్లు, నివాసము, నెలవు, భవంతి,భూమి దేశము మొదలగు అర్థములు నిఘంటువులో కనిపించుతాయి. 'దరి' అన్న అర్థము కూడా సమంజసమేమో అని నాకనిపిస్తుంది. దరి అంటే 'ఒడ్డు'. ఈ విభాగాలను గూర్చి 'ఖురాను' లో గానీ 'హదీసు' లేక 'హథీథ్'లలో గానీ కనిపించదు. ఈ 'హథీథ్' అన్న మాటకు ఖురాను లో చెప్పబడినది కాక, ముసల్మానులకై  ప్రవక్త ప్రవచనము అన్న అర్ధముగా, చేయ తగినవి చేయ తగనివి అని తెల్చిచేప్పే వివరణలు గా  గ్రహించవచ్చునని నా అభిప్రాయము. స్థూలముగా ఈ దార్ అన్నది రెండు విధములుగా విభజింపబడినది.
1. దార్ అల్ ఇస్లాం 2. దార్ అల్ హర్బ్ అని.
1. దార్ అల్ ఇస్లాం : అంటే శాంతి నివాసము అని అరబిక్ భాష రాని మనము అర్థము చేసుకొనవచ్చును. ఇది పూర్తిగా ముస్లిం సామ్రాజ్యమై వుంటుంది సౌది అరేబియా లాగా.అక్కడ పాలకుల మాటే వేదము. ప్రజల నోటికి తాళము. ఆదేశమునకు హిందువు పోతే తన పండుగలు పబ్బాలు గానీ, వ్రతములు నోములు కానీ చేసుకోన వీలు లేదు. అంతెందుకు దేవుని చిత్రమును జేబులో ఉంచుకొనుట కూడా నేరమే! ఇచట వారి మతము మాత్రమే చెల్లుబాటవుతుంది. అన్యమతస్థులు అక్కడక్కడ వున్నా, అసలు మతానికి అనుకూలముగా తమను మలచుకోనవలసినదే! షరియాకు అంటే ముస్లిం న్యాయ వ్యవస్థ కు కట్టుబడి ఉండవలసిందే!
దీనిని అబూ హనీఫా ఏర్పరచినట్లు చెబుతారు . ఇందలి ప్రధానాంశాలు ఈ విధముగా వుంటాయి.
1. ముస్లిములంతా ఆ దేశముతో, ఆ దేశములో సంపూర్ణమగు సుఖమును పొందవలెను.
2. అట్టి దేశము ముస్లీముల చేత మాత్రమె పరిపాలింపబడవలెను.
3. ముస్లిం దేశములతో సరిహద్దులు కలిగియుండవలెను.
2. దార్ అల్ హర్బ్ (دار الحرب) ' యుద్ధభూమిగా అర్థము చెప్పుకోనవచ్చును.
దీనిని దార్ అల్ ఘర్బ్ అని కూడా అంటారు. అంటే పాశ్చ్యాత్య నిలయము అని మనము అర్థము చేసుకొన వచ్చును. హర్బ్ అన్నది జిహాద్ కు దగ్గరగా వుండే అర్థము వస్తుందని కాబోలు దానిని ఘర్బ్ అని ఒక క్రొత్త పేరు పెట్టినారు. ఇచ్చట ముస్లీములకు ప్రత్యెక చట్టము ఉండదు. ప్రత్యెక రాయితీలు కూడా వుండవు. ఇప్పుడు అరేబియా దేశములు ఐక్యరాజ్య సమితి సభ్యులు కావున ఈ విభాగము యథాతథముగా వాడుకలో లేదు. కానీ వారి మతము మెజారిటీ లో వున్నది అంటే ఈ దార్ అల్ హర్బ్ ను పాటించుతారు.
మెజారిటీ గావున్న కాశ్మీరు ముస్లిములు అచ్చట పండితులను ఎంత క్రూరముగా చంపినదీ, హిందూ స్త్రీలను మాన భంగము చేసినదీ, పురుషులను తుపాకులతో బెదిరించి మతమును మార్పించినది దూరముగా వున్నా మనము తలచుకొంటేనే ఓడలు కంపించుతుంది. మరి అచట వుండి అనుభావిన్చినవారికి ఎంత వ్యథ భయము మానసిక ఉత్పాతము కలిగియున్తుందో మనము ఊహించుకొన వచ్చును.  మిగతా వారు ఎంత కష్టపడి తప్పించుకొని వచ్చినదీ మనకు తెలియని విషయములు కాదు. ఇక పాకిస్తాన్ ను గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. 1947 లో 25% వున్నా హిందూ జనాభా 2014నకు 1% అయినది. మనము హాయిగా A.C. గదిలో కూర్చుని ఎన్నో విషయములను విశ్లేశించుతూ వున్నాముగానీ ఒక్క సారయిన సాటి హిందూ సోదరుల దయనీయ స్థితిని గూర్చి చిన్తించుచున్నామా! అక్కడి ముస్లీముల లాగా మనము ఇక్కడి ముస్లీములతో వ్యవహరించుచున్నామా! బంగ్లాదేశ్ లో హిందువులు  1947 లో 31% 2012 కు 9% వున్నారు. లక్షల మందిని ఊచకోత కోయగా, చెరబట్టి మత మార్పిడులు చేయగా ఎంతో మంది భారత దేశానికి వలస వచ్చినారు. 1951 లో 9.93% వుంటే 2011 నాటికి 14.23% వున్నారు. దీనిని బట్టి ఈ దేశము యొక్క ఔన్నత్యమును తెలుసుకోవచ్చు. మనము క్షేమముకదా అన్న స్వార్థ చింతన వీడి ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణ మారణ హోమములు జరిగిపోయినాయో!  ఈ విషయములను పదే పదే  వివిధ విధములగు ప్రసార మాధ్యమముల ద్వారా జన బాహులళ్యమునకు తెలియజేయ వలసిన బాధ్యత మనకు వుంది. ‘ఇది వాళ్లకు తెలియనిది కాదు’ అని అనే వాళ్ళు మనలో ఎక్కువమంది ఉంటారు.
ఇది ఒక Amazon ad లాంటిది. Amazon అందరికీ తెలిసిందే! అయినా విరివిగా ads వాళ్ళు వేస్తూనే వుంటారుకదా! ఇదీ అంతే. ఉత్తర ప్రదేశ్ లోని మావ్ జిల్లాలో 42.98% హిందువులుంటే 56.76% ముస్లిములున్నారు. ఇది ఎప్పటికయినా ముస్లిం దేశమే కావచ్చు. కేరళలోని మల్లపురము లో హిందువులు అతి తక్కువ. అంతా ముస్లిములే! ఏహిందువయినా చేత కాక తన భూమిని అమ్ముకొనవలెనన్నా దానిని ముస్లిములకు మాత్రమె అమ్మవలేనన్న చట్టమును అచ్చటి స్థానికులు ప్రవేశపెట్టినారు. తమిళనాడులోని ముస్లిములు 5% అయితే, తమిళనాడు లోని వెల్లూర్ వద్ద నున్న మేల్ విశారం లో  హిందువులు 22.97% అయితే ముస్లిములు 76.12% వున్నారు. ఇది మునిసిపాలిటి. ఇక్కడ వారు ఏమి చెబితే అదే జరిగేది. స్వంత దేశములోనే ఎంత బాధను భారించుతున్నారో చూడండి హిందువులు. ఇచట తమ మతములోకి మారిన వారికే తగిన వసతులు కల్పించుతామని వారు చెబితే శ్రీ సుబ్రమణ్య స్వామిగారిని అచ్చటి తమిళ్ మోర్చా వారు ఆహ్వానించితే ఆయన  మెల్వె విశారం వెళ్లి నయానో భయానో అది పరిష్కరించినారు.

దీనిని  3.దార్ అల్ దవా  4. దార్ అల్ అమన్ అని రెండు భాగాలుగా వ్యవహరించుతారు.
3. దార్ అల్ దవా: ముస్లిములు మైనారిటీ లో వున్నా మెజారిటీ లో ఒకే మతము ఉండక  పలుమతములుంటాయి. అప్పుడు ముస్లీములు తమకు కావలసిన రాయితీలనన్నిటినీ మరీ మరీ అడిగి తీసుకోనవలెనని ఆమత పెద్దలు చెప్పినారు. అప్పుడు క్రమేణా వారు తమ మతప్రయోజనములను కాపాడుకొంటూ ముందునకు సాగిపోతూ వుంటారు.
4. దార్ అల్ అమన్ : ఇందులో వారి పాత్ర ఎక్కువగా ఉండదు. వీరు మైనారిటీ లో వుంటారు మెజారిటీ రిలిజియన్ ఒకటే ఒంటుంది. వారు కట్టిందే రక్ష వారు పెట్టిందే భిక్ష అన్నట్లు ‘కుక్కిన పేను వలె’ ఉండవలసిందే! ఒకసారి ఆష్ట్రేలియా లో ఒక ఇమాం మాకు ‘COMMON CIVIL CODE’ వద్దు షరియా కావాలన్నాడు. వెంటనే ఆ దేశపు ప్రధానమంత్రి అవన్నీ కుదరవు వుంటే వుండండి పోతే పొండి అన్నాడు. తెల్ల వారుతూనే ముస్లిం ప్రతినిధులు ఆ ఇమాం తెలియక అన్నాడు  COMMON CIVIL CODE’ మాకు సమ్మతమే అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మైనారిటీస్, మెజారిటీ జన జీవన స్రవంతి లో కలిసిపోతేనే దేశములో ఉండమన్నాడు . అదేవిధముగా ఇంగ్లాండ్ లోని ఒక పట్టణపు మేయర్ తో ఒక ఇమాం భోజనశాలలో pork పెడుతున్నారంటే మీరు మా కట్టుబాట్లకు అనుకూలముగా ఉండవలసిందే అన్నాడు. మళ్ళీ వాళ్ళు నోరు మెదపలేదు. మనము మాత్రము ముస్లిం హోటళ్లకు పోయి వాళ్ళు పెట్టింది తిని వస్తూ ఉన్నాము, అందులో beef ఉందా అనికూడా విచారించకుండా.

మీరు ప్రతిఘతించండి, వారిపై కత్తులు దూయండి, తరిమి పారగొట్టండి అని నేను చెప్పుట లేదు. మీరు సాటి ముస్లిమును మీ ప్రాంతములో చూసుకొనే రీతిలో వారు సాటి హిందువును చూచుకొనుట లేదు అని తెలియజేస్తున్నాను.   ఈ విధముగా ముస్లిముల మత అసహనము రాను రానూ ప్రాకితే ప్రత్యక దేశాలు అగుటకు ఎక్కువ సంవత్సరములు పట్టకపోవచ్చు. సమరస భావన కలిగిందంటే సంతోషము సర్వత్రా వెల్లివిరుస్తుంది.

నాకెందుకు నాకెందుకు అని ఉండిపోవద్దు. ఇటువంటి వ్యత్యాసములు రాకుండా చూసుకోనవలసిన బాధ్యత యువతదే!


No comments:

Post a Comment