Saturday 11 March 2017

రాయలసీమ రసజ్ఞత మరియొక దత్తపది

రాయల సీమ రసజ్ఞత
క్షామము దాపురించి పలుమారులు చచ్చెను జంతుసంతతుల్
వేమురు జచ్చినారు ప్రజ వేనకువేలు చరిత్ర లోపలన్
క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా
నామృత పుష్టికిన్ కొరత నందని రాయలసీమలోపలన్
కన్నీరు,మున్నీరు,పన్నీరు,తేనీరు అనే పదాలను యిచ్చి రాయాలసీమ లో నీటి కోసం
 రాముడిని ప్రార్థించ మని ఒకసారి అవధానం లో నాగఫణి శర్మ గారిని అడుగగా వారి పూరణ :
కన్నీరున్ దిగ ద్రావలేము గదరా గంభీర మేఘా కృతీ
పన్నీరౌ నీ కడగంటి చూపు చిలుకన్ భద్రాంగ జాగేలరా
మున్నీరై చను సీమ జీవితములో ముత్యమ్ము నీ చూపే రా
తిన్ నాతిన్ గలిగించు వాడ దయతో తేనీరు రామప్రభో

   నేను అంతటి శక్తివంతుడను కాదు కాబట్టి ఇంటి వద్ద పూరించినది
కన్నీరన్నది త్రావలేము వరదా కరుణింత చూపింపవా
మున్నీరై యది ముంచి మాదు ఎదలన్ మోదంబు గొంపోయె, నీ
పన్నీరౌ కరుణాకటాక్షములచే పట్టింపులన్ వీడుచున్
తిన్నాత్రావితి నంచు వూరుకొనకన్ తేనీరు రామప్రభో! 
దత్తపది
ఏసుమేరిసిలువచర్చి కృష్ణుని పరంగా ...
ఒక గోపిక శ్రీకృష్ణునితో చేసుకొనే విరహముతో కూడిన వేడికోలు, గమనించండి. నేను ఇంటిలో కూర్చొని పూరించిందే!
ఏ సుదతి నీడనుంటివొ
నీ సఖినెడబాయ న్యాయమేరీతియగున్
భాసిలు వరదా నా దరి


నీసరి చర్చించలేను నిజముగ కృష్ణా!

No comments:

Post a Comment