Thursday 1 December 2016

ఓంకార స్వరూపము

ఓం శబ్దముతో శరీరములోని అలసట దూరమౌతుందని నిరూపించిన అమ్మాయి

ఓం శబ్దముతో శరీరములోని అలసట దూరమౌతుందని అన్వేశా రాయ్ అన్న9వ తరగతి చదివే పదునాలుగేళ్ళ బాలిక ప్రయోగాత్మకముగా నిరూపించినది. పశ్చిమ బంగాల్ లో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను ఆకట్టుకొనింది.
ఓం శబ్దము వినుటరక్తములో ఆక్సిజన్ శాతము పెరిగి  కార్బండయాక్సైడ్ మరియు లాక్టిక్ ఆసిడ్ల నిలువలు తగ్గుతాయని తద్వారా అలసట ఉండదని ఆ అమ్మాయి కలకత్తా, జాదవ్ పూర్  యునివెర్సిటీ ప్రొఫెసర్ల సమక్షమున తన ప్రయోగము ద్వారా నిరూపించింది.





ఓం నమో పరమాత్మయే నమః
ఓం అను అక్షరమును ఊహించవలయును. ఓం అని గానము చేయవలెను.ఏ విధంగా అమరమై, అమృతమై, అభయమై యుండు ఓంకారమును ఊహించుచున్నాడో, అతడు దేవతలవలె అమృతత్వమును పొందును.
నామారూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయి యున్నది. ఈ జగత్తు దానినుండియే కలిగినది. దానియందే లయమగుచున్నది. దానియందే ప్రతిస్టితమైయున్నది. కావున శాంతుడై బ్రహ్మమును ఉపాసించ వలయును.
నామరుపాలతో గుడిన ఈ జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా ఏకమై, అద్వితీయమై యుండినది.
ఓ శ్వేతకేతు! ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై యున్నది. ఆ పరమాత్మయే సత్యము. అదియే ఆత్మ. అదియే నీవై యున్నావు.
ఆచార్యుడైన మనుజుడు బ్రహ్మమును తెలిసికొని వెంటనే మోక్షమును బడయుచున్నాడు.
సనత్కుమారుడు-భూమ (గొప్పది, బ్రహ్మము,ఆత్మ) అనునదియే సుఖము – అల్పమైన దానియందు సుఖము ఉండదు. కావున గోప్పదియే సుఖము. ఆ గోప్పదియగు ఆ ఆత్మనే తెలిసికొనవలయును.
దేనియందు(ఆత్మయందు) దానికంటె వేరైనది ఏదియు కనబడుటలేదో, వినబడుట లేదో, తెలియబడుట లేదో, అదియే భూమ. దీనికంటే వేరైనది అంతయు అల్పము. భుమా స్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైన దానికి నాశము కలదు.
ఆ భూమ (ఆత్మ) క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల అంతటయు నిండియున్నది. ఈ కనిపించు ప్రపంచమంతయు అదియే. అదియే నేను. నేనే క్రింద, పైన ఎల్లెడల ఉన్నాను. అంతయు నేనుగా వున్నాను.
క్రింద, పైన, అన్ని చోట్లను ఆత్మయే నిండియున్నది. అంతయు ఆత్మయే. ఈ విధముగా చుచియు, తలన్చియు, తెలిసికోనువాడు అత్మయందే క్రీడించుచుండును. అత్మ తనయందే వున్నదని ఆనందమొందుచుండును. తానె రాజైయుండును. సమస్త లోకములందును తన ఇష్ట ప్రకారము వర్తించుచుండును. ఎవడు ఆత్మను మరియొక విధముగా ఎరుగునో అట్టి అజ్ఞాని ఇతర రాజుకు లోబడియుండును. నాశముకల లోకములను పొందును. లోకము లన్నిటియందును తన ఇస్టప్రకారము సంచరించుటకు అతనికి సాధ్యపడదు.
ఈ ప్రకారము ఆత్మను తెలిసికోనినవాడు మృత్యువును చూడదు; రోగమును పొందడు; దుఃఖము నొందడు. సమస్తమును ఆత్మగా చూచును. సమస్తమును సర్వవిధములుగా అగుచున్నాడు. సృష్టికి పూర్వము ఆ ఆత్మయే (బ్రహ్మయే) యున్నది. తరువాత అదియే మూడై, ఐదై, ఏడై, తొమ్మిదై, అనేకమైనది.
మొట్టమొదట ఆహారమును శుద్దముగా చూడవలెను. దానిచే అంతఃకరణ శుద్ధి కలుగును. దానిచే స్మరణ శక్తి కలుగును. దానిచే అజ్ఞాన గ్రంధు లన్నియు విచ్చినములై పోవును. అతని దోషములు తోలిగిపోవును. అని భగవంతుడు సానత్కుమారుడు నారదునికి తెలిపెను.
ఈ దేహమునకు ముసలితనము కలిగినను బ్రహ్మమునకు (ఆత్మకు) అట్టి ముసలితనము కలుగదు. దేహమునకు దెబ్బ తగిలినను బ్రహ్మమునకు తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది. దేహము సత్యము కాదు. బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించియున్నవి. ఈ ఆత్మ (బ్రహ్మము) పాపరహితమైనది. దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక లేవు.అది సత్యకామమై (అది తలంచిన ప్రకారం జరుగును). సత్యసంకల్పమై యున్నది. ఇట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికోనినచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానవర్తులై అనుసరించువారు ఏ యే ఫలమును, ఏ యే ప్రదేశములలో కోరుదురో, దానినే పొండుడురుకాని సమస్తమును పొందనట్లు, సమస్తమును స్వేచ్చగా పొందలేరు.
ఈ ఆత్మ హృదయమునందే కలదు. ఈ ప్రకారము తెలిసికోనినవాడు ప్రతిదినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఈ ప్రకారమెరిగినవాడు సంప్రసాదుడనబడును. అట్టి వాడు (బ్రహ్మానుగ్రహము నొందినవాడు) దేహాత్మ భావాది అజ్ఞానమునుండి తొలగి పరజ్యోతి స్వరూపమును(ఆత్మను) ఆశ్రయించి దానితో ఐక్యమొందుచున్నాడు. కనుక జీవునకు అత్మయనెడి పేరు ఏర్పడినది(జీవాత్మ అని). ఆ ఆత్మ అమృతమై, అభయమై, బ్రహ్మమై యున్నది. ఆ బ్రహ్మమునకు సత్యమని పేరు.
ఈ ఆత్మ సేతువు (గత్తు౦ వంటిది. సర్వమును భరించుచున్నది. ఈ ఆత్మ కాలపరిచ్చేదము లేనిది. దానికి ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్క్రుతములు లేవు. కావున ఆత్మయందు సమస్త పాపములు నసించిపోవుచున్నవి. అత్మలోకము పాపసంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ ప్రకారముగా ఉపాసించువారు స్వర్గమును (ఆత్మపదమును) పొందుచున్నాడు.
ఈ ఆత్మను తెలిసికోనినచో అంధుడు (అజ్ఞానము కలవాడు) అంధత్వము లేనివాడగును. శరీరమున్నపుడే అజ్ఞాని జ్ఞానియగును. శరీర మున్నపుడు, తచ్చరీరకార్యములచే దుఃఖమొందినవాడు సుఖమొందును. సంకటము నొందినవాడు సంకటము లేనివాడగును. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలగుచున్నది. అతడు ఎల్లప్పుడు (జ్ఞాన) ప్రకాశముకలవాడై ఆత్మైక్యము నొందును.
యజ్ఞమనునది బ్రహ్మచర్యమే. జ్ఞానియగువాడు బ్రహ్మచర్యము వలన యజ్ఞఫలమును పొందుచున్నాడు. బ్రహ్మచర్యముచే మనుజుడు ఆత్మను పొందుచున్నాడు.
హృదయమునందు నూటఒక్క నాడులు కలవు. వానిలో ఒక్కనాడి (సుషుమ్న) మూర్ధమునకు పోవుచున్నది. దానిద్వారా జ్ఞాని ఊర్ధ్వమునకేగి అమ్రుతత్వమును పొందుచున్నాడు. ఇతర నాడులు అడ్డముగా అంతటా వెల్లుచున్నవి.
ఆత్మ పాపరహితమైనది. వార్ధక్యము లేనిది, మరణము లేనిది, శోకము లేనిది, ఆకలిదప్పికలు లేనిది. అది సత్యకామమును, సత్యసంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను బాగుగ వెదకి తెలిసికోనవలెను. అట్లు తెలిసికోనినవాడు సమస్తలోకములను, సమస్త అభిలాషలను పొండుచున్నాడని ప్రజాపతి చెప్పెను.


సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమనీ వారి ప్రతిష్ఠకు సత్యమే కారణమనీ, వారి శక్తికి మూలం సత్యమేననీ ఛాందోగ్యోపనిషత్తు ప్రవచిస్తోంది. అరుణ రుషి తన పుత్రుడైన శ్వేతకేతువుతో అష్ట సిద్ధుల్లో మొదటిదైన 'అణిమ'యే యావత్ప్రపంచానికి 'ఆత్మ' అనీ అదే సత్యమనీ, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజమనీ చెబుతాడు. 

'సాధనఅనే పదం తరచుగా వాడుతుంటారు.  సాధన అంటే?
శిల్పి యొక్క సాధనలో బండరాయి నుండి భగవంతుని రూపం బహిర్గతమవుతుంది.  అలానే ఆత్మజ్ఞాన ప్రాప్తికై తగురీతిన మనసును సంస్కరించుకొనేందుకు అవలంభించే విధానమే సాధన.  

'తస్మాత్ శాస్త్రం ప్రమాణంతేశాస్త్రం ద్వారానే జ్ఞానం లభిస్తుంది.  అయితే ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఎలా పొందాలిఒకసాధారణమైన పుస్తకం చదివినట్లుగా శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందలేము.  దాన్ని బోధపరచే తత్త్వవేత్త ద్వారానే శాస్త్ర జ్ఞానాన్ని పొందగలము.  "ఆత్మావారేద్రష్టవ్యః  శ్రోతవ్యః మన్తవ్యః నిదిధ్యాసితవ్యః" ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడు శ్రవణమనననిదిధ్యాసనలతో మాత్రమే పొందగలడని ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తుంది. 

శ్రవణం అంటే?
గురుముఖతః సాధకుడు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.  గురువు తను పరంపరగా పొందిన శాస్త్రానికి తన సాధనలో పొందిన అనుభవాలను మేళవించి శృతియుక్తిఅనుభవములతో బోధిస్తాడు. అట్టి వాక్యాలను శ్రద్ధతో గ్రహించడాన్నే శ్రవణం అంటారు. 

మననం అంటే?
గురువు ద్వారా గ్రహించిన విషయాన్ని ఏకాంత ప్రదేశంలో ఆశీనుడై మనసులో ధారణ చేస్తూఆ విషయాల పట్ల విచారణ చేయడమే మననం.  మననం చేయడం వల్ల జ్ఞానము ధృడ పడుతుంది. 

నిదిధ్యాసన అంటే?
మనన సమయంలో కలిగే సంశయాలను గురువు ద్వారా నివృత్తి పొందిన వ్యక్తిలో తత్త్వం పట్ల సరైన అవగాహననిష్ఠ కలుగుతుంది. అట్టి సాధననే నిదిధ్యాసన అంటారు.

సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలి? 
కామక్రోధాలుఈర్ష్యాసూయలురాగద్వేషాలుమదమాత్సర్యాలుదంభందర్పంఅహంకారంమమకారం ఇవన్నీ సాధకుని బలహీన పరచే కోణాలు.  కనుక సాధకుడు పూజజపముధ్యానమనే అనుష్ఠానములతో అంతఃకరణ శుద్ధి పొందిక్రమేపీ వీటి నుండి బయటపడగలడు.  

మోక్షం పొందేందుకు పూజలుజపాలుస్తోత్ర పారాయణలు అవసరమా?
అది పొరపాటు.  ఇవన్నీ భక్తీ యొక్క అంగాలు.  పాలను పోసే ముందు పాత్రను ఎలా శుద్ధి చేస్తామో అలానే పరమపవిత్రమైన జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడి హృదయ క్షేత్రము కూడా శుద్ధి పొందాలి.   అందుకే'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవగరీయసీమోక్షసాధనకు అంతఃకరణ శుద్ధి అవసరము.  అట్టి అంతఃకరణ శుద్ధికి భక్తి అనే మార్గాన్ని సూచించారు.  కాబట్టి భక్తుడు కానిదే జ్ఞాని కాలేడు.  జ్ఞానార్జనకు భక్తి మొదటి మెట్టు.  ఈ మెట్టునే ఎక్కలేని వాడు మోక్షపదానికి అర్హుడు కాలేడు.  కాబట్టి సాధకుడు పూజజపముస్తొత్రపారాయణల వంటి సత్కర్మలను ఆచరించి భక్తి అనే సోపానంతో అంతఃకరణ శుద్ధిని పొందగలడు.

భక్తి అంటే ఏమిటి?
నుదుట విభూతి రేఖలుబొట్టు ధరించి ఉదయంసాయంత్రం పూజలు చేయడంప్రతిరోజూ గుడికి వెళ్ళడం వంటివి భక్తికి బాహ్యాంగాలు మాత్రమే.  భక్తి అనే మహత్తరమైన భావాన్ని వీటి వరకే పరిమితం చేయకూడదు.  రౌడీలు,గూండాలుఖూనీ చేసే వారు కూడా బొట్టు పెట్టుకుంటారు.   పూజలు చేస్తారు.  గుళ్ళుగోపురాల చుట్టూ తిరుగుతారు.  కనుక భక్తిని కేవలం ఈ బాహ్యకర్మలకే పరిమితం చేసి సంకుచితభావన తో చూడకూడదు.  భక్తునిలో చిత్తశుద్ధిని కలిగించి క్రమేపీ అతనిని పరిపక్వస్థితికి చేర్చేదే భక్తి. అట్టి చిత్తశుద్ధి కలిగిన సాధకుడు ధ్యానం ద్వారా అంతర్ముఖతను పొంది నిజస్వరూపమైన ఆత్మతత్త్వమందు నిశ్చల స్థితిని పొందగలడు.

ధ్యానంలో మనసు నిలకడగా ఉండడం లేదు.  ఎందువల్ల?
మనసు అలజడిఉద్వేగాలకు లోనై రకరకాల విన్యాసాలు చేస్తుంది.   విన్యాసాలకువికారాలకు మన ఆహార విహారాలే కారణమౌతున్నాయి.  కనుక సాధకుడు తన ఆహార విహారాల్నిచుట్టూ ఉండే పరిసరాలను తన సాధనకు సానుకూలమైనట్లుగా మార్చుకోవాలి.   అంతే కాని సాధనకు విరుద్ధమైన మార్గాలలో పయనిస్తూ మనసు నిలవడం లేదని ఫిర్యాదు చేయడం సముచితం కాదు.

మరి ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు యోగాసనాలుప్రాణాయామం వంటివి సహకరిస్తాయా?
ప్రాణాయామంయోగాసనాల వల్ల శరీరంలోని నాడులు శుద్ధమై చక్కటి దేహధారుఢ్యం లభిస్తుంది.   అయితే మనసు ఏకాగ్రతను పొందాలంటే అంతరంగిక సాధనను అలవాటు చేసుకోవాలి.  తిరిగే ఫ్యానుని ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగాపరుగులు తీసే మనసుని నియంత్రించేందుకు కూడా మార్గముంది.

No comments:

Post a Comment