Monday 26 December 2016

ఇది సూచన కాదు వినతి

ఇది సూచన కాదు వినతి 1
ఒక రెండు వేల సంవత్సరముల వెనుకకు పోతే అసలు ప్రపంచమున నాడు నేడు కూడా పరిఢవిల్లినది, పరిఢవిల్లు చుండెడిది మన సనాతన ధర్మమూ మాత్రమే. మనదేశములో మతము అన్న పేర్లతో కాలూనినవి రెండు. వారి వారి దేవుళ్ళు, దేవదూతలు చెప్పిన ప్రకారము మనము అందరమూ వారికి అంటరాని వారమే! మన స్త్రీలు వారి పొందునో, మన పురుషులు వారి మత తీర్థమును పుచ్చుకొని వారి పాదముల చెంతనో నిలుచుటచే ఆ మతములు ఈ దేశమున కాలూనినవి. దేవుడు కనిపించట చేతనో, మత ప్రవక్తలు మన దేశమున చూపిన మహిమలచేతనో కాదు. వారి శాసనమును కాదన్నవారి తలలు ఉత్తరించబడినాయి అది కూడా కోటి సంఖ్యలో! మరి మన నేతలను చూద్దామంటే వారికి మతములపై గల అభిమానము ధర్మముపై లేదు. ఇటీవలి రోజులలో మాన్యతములగు మన ఆంద్ర ప్రదేశపు ముఖ్యమంత్రి జరూసలేమునకు పోవు మతస్తులకు 40,000 రూపాయలు చేసినట్లు విన్నాను. హజ్ కు వెళ్ళు మతానువర్తులకు కూడా పుష్కలమగు రాయితీలను అందజేస్తూనే వున్నారు. మరి ఆమతములకన్నా ఈ ధర్మము సనాతనమైనది, ఎన్నో ఆటుపోటులకు ఎదురొడ్డి నిలచినదీ కదా మరి మాన్యులు, మహనీయులు, పరమ దయాశీలి, పరమతస్థులను కూడా ఎంతో ప్రేమతో ఆదరించే ఆ దేశపు (ఆంధ్ర ప్రదేశపు)ముఖ్యమంత్రిగారు తానూ తన పూర్వులు తన బంధువులు, తన మిత్రులుఅధిక శాతములో గల తన ఏలుబడిలోని ప్రజలు ఇందరు సనాతన ధర్మమును పాటించుతూ వున్నారు కదా! మరి వారి తీర్థయాత్రలకు ఏవిధమైన వసతులు రాయితీలు కలిగించుచున్నారో వారికే ఎరుక.  వారే కాదు ఘనమైన చిరంజీవి గారు కూడా అన్య మతస్తులకు ఎన్నో వరాలనిచ్చినారు.
ఇది సూచన కాదు వినతి 2 చదవండి


ఇది సూచన కాదు వినతి 2
వీరిరువురికీ
 Dr T.H.Chowdary)
 * Director: Center for Telecom Management & Studies
Chairman: Pragna Bharati, Andhra Pradesh
 Fellow: Tata Consultancy Services & Satyam Computer Services
Former: Information Technology Advisor: Government of Andhra Pradesh
Chairman & Managing Director, Videsh Sanchar Nigam Ltd
గారు ఈ విషయములో బహిరంగ లేఖయే వ్రాయుట జరిగినది. మరి వారికి పొరుగింటి పుల్లగూర మాత్రమె ఎందుకంత రుచి. వారు మన సనాతన ధర్మావలంబులకు కూడా దయతో కైలాస మానస సరోవర యాత్రకు ఒక్కొక్క యాత్రికునికి ఒక లక్ష రూపాయల రాయితీ అయినా ఇచ్చి పేదలకు భగవంతుని సన్నిధానమునకు పంపిన పుణ్యము కట్టుకొన వచ్చును. ఎందుకు అట్లు చేయుట లేదు. ఈ ధర్మములో పేదలు లేకనా, భక్తి లేకనా, పుణ్యక్షేత్రములు లేకనా! అన్నీ ఉన్నాయి కానీ అసలైనది మాత్రమే లేక పేదలు పోలేక పోతున్నారు. ఈ ధర్మమూ యొక్క ఔన్నత్యము తెలుసుకొనుటలో వెనుకబడుతున్నారు.
పోతే పోయినది గాక! మనమైనా సంఘటితమౌదాము. మనది మతము కాదు. ఇది ధర్మము. నడవడిక, ప్రవర్తనము. అంతే కానీ పరమతముల వలె నమ్మకము (FAITH) కాదు. ఇది క్రూసేడులు, జీహాదులు లేని ధర్మము. సత్కర్మకు సత్ఫలితము దుష్కర్మకు దుష్ఫలితము వానికవే మన కాతా లో వచ్చి చేరుతాయి.
ఇది సూచన కాదు వినతి 3 చదవండి

ఇది సూచన కాదు వినతి 3
అందువలన మనము మంచిగా నడచుకోనవలసి యున్నది అని ఈ ధర్మము చెబుతూ వుంది. మన ప్రతి పండుగకు  దైవ పరమైన, ప్రకృతి పరమైన ఒక కారణముంది. కానీ ఇతర మతములవి తాము తమకుగా ఏర్పాటు చేసుకొన్నవి.
ఈ విషయమును ఒకసారి గమనించండి. రేపు రాబోయే జనవరి 1 వ తేదీని తీసుకోండి. అది ఏ విధమైన పండుగు. రాత్రులు భూత ప్రేత పిశాచములు విలయతాండవము చేసే సమయము. జంతువుల క్రొవ్వుతో తయారు చేయబడే వత్తుల వెలుతురులో వాని యొక్క అండములు, కొన్ని కొన్ని తినుబండారములకు మాంసము, ఎముకలపొడి ఆల్కాహాలు మొదలయినవి వేసి చేసే కేకులు అను పేరుతో ఎంతో ఆబగా కొని తెచ్చుకొని తింటున్నామే నిజముగా మనము పూజించే హరిహరాదులెవరైనా కోరినారని మనము చదివినామా విన్నామా  లేక మన పండుగ ఏదయినా అట్లు చేసుకొనుచున్నామా! ఎందుకు మన ఆడపడచులు ఉదయాత్పూర్వమే 'Happy New Year' ముగ్గులు వేస్తున్నారు. వారి ఋతువులు నాలుగే. చివరి ఋతువు AUTUMN. అంటే ఆకురాలు కాలము. ఇది ప్రాణముల వదులుటకు సంకేతము. ఈ కాలములో వస్తుంది ఈ జనవరి నెల. ఈ సమయములో ఎవరయినా సంవత్సరాది జరుపుకొంటారా! ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోండి. పర మతస్తులు జరుపుకొనే వారి వేడుకలు వారే చేసుకోనివ్వండి. మీరు పాల్గొనకండి. మీయింటి వినాయక వ్రతములో వారు పాలుపంచుకొనుట లేదుకదా! ఇది అప్రాచ్యులకు పండుగ కావచ్చు ప్రాచ్యులకు కాదు కదా! అంటే పశ్చిమ దేశస్థుల పండుగ కావచ్చునేమోగాని తూర్పు వాసులకు కాదు గదా!
ఇది సూచన కాదు వినతి 4 చదవండి

ఇది సూచన కాదు వినతి 4
పరులధర్మము విడుద్దాం,  ఇకనైన అంతా కలుద్దాం, భరత మాతను తలుద్దాం, అందరొకటిగ నడుద్దాం
ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హంతవ్యం మానో ధర్మో హతో వదీత్
మన ధర్మమును మనము కాపాడుకొంటే అది మనలను రక్షిస్తుంది. మరి మనము దానిని నాశనము చేస్తే అది మనలను నాశము చేయక మానదు.
శుభం భూయాత్

చెరుకు రామ మోహన్ రావు 


పవని నాగేంద్ర ప్రసాద్ నమస్కారం..ఈమధ్య ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంయుక్త ఆధ్వర్యంలో "దివ్య దర్శనం" అనే పధకం రూపుదిద్దుకున్నది..ఈ పథకంలో భాగంగా, ప్రతి జిల్లా నుంచీ సంవత్సరానికి 10,000 మందికి రాష్ట్రం లోని 5 పెద్ద దేవాలయాల దర్శనం పూర్తీ ఉచితంగా కల్పిస్తారు..ప్రతి మండలం నుంచీ 200 మందికి జిల్లా మొత్తం మీద 10,000 మందికి...ఇందుకయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వం వారే భరిస్తారు..ప్రతి మండల కార్యాలయం లో ఇందుకు దరఖాస్తులు, పూర్తీ చేసిన దరఖాస్తులు సవీకరించే ఏర్పాటు చేశారు..ఒకరగంగా ఒక అడుగు పడింది అని చెప్పొచ్చు..

No comments:

Post a Comment