Wednesday 21 September 2016

హితునిగా మారె విధి తాను హిట్లరునకు

హితునిగా మారె 

విధి తాను హిట్లరునకు

https://cherukuramamohan.blogspot.com/2016/09/blog-post_77.html

 

ఈ భర్తృహరి సుభాషితమును ఒక సారి గమనించండి.

భగ్నాశస్య కరండ పిండిత తనో ర్మ్లానేంద్రియస్యక్షుదా

కృత్వాఖుర్వి స్వయం పరం నిపతితో నక్తం ముఖే భోగినః

త్రుప్తస్తత్పిశితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా

స్వస్తాస్తిష్ఠత దైవమేవ హి పరం వృద్ధౌః క్షయే కారణం

ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవిగారి చక్కని ఈ అనువాద పద్యమును చూడండి.

రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండ బద్ధమై

భీతిలి చిక్కి యాశ చెడి పెద్దయు డస్సిన  పాము వాత సం

పాతము చెందె దాని తిని పాము తొలంగె బిలంబు త్రోవనే

ఏతరి హాని వృద్ధులకు నెక్కుడు దైవము కారణమ్మగున్

 

పాముల బుట్ట లేక పెట్టెలో బంధింపబడి ప్రాణము పోవుట తథ్యమని భావించిన 

పామునకు, ఆహారము లోన ఉంటుందని భ్రమసి , ఆ పెట్టె లేక బుట్టకు బోరియచేసి 

లోనికి వెళ్ళిన ఎలుక పాముకు విందై కూర్చుంది. దానిని తిన్న పామునకు అన్నము 

మరియు కన్నము దొరుకుటచే   హాయిగా అన్నము తిని  ఆ కన్నముగుండా బయటకు 

వచ్చినది. ఇదే కదా ఘటన కర్మ విధి అంటే! ఇటువంటి అనుభవాలు హిట్లరు 

జీవితములో ఎన్ని వచ్చినవో చూడండి.

అసలు హిట్లర్ అన్న పదమును విడదీస్తే మనకు రెండు పదాలు వస్తాయి. హిట్ మరియు 

టల్. హిట్ అనే ఆంగ్ల పదమునకు అర్థము వేగముగా తాకుట. టల్ అనే హిందీ 

పదమునకు అర్థము నిలువరించుట.  అంటే ప్రమాదాలనుండి తప్పించుకునే అదృష్టము 

కలిగినవాడేమో హిట్లర్ అంటే!

అందుకే తనను తానే చంపుకోన్నాడేమో! తన పేరునకు అర్థము మారకుండా!

హిట్లర్‌ నియంత అన్నది అందరికీ తెలిసిన విషయమే!. దాదాపు 6 కోట్లమంది 

యూదుల మారణహోమానికి ఆతడు సూత్రధారి. ఇప్పటికీ పోలెండు, జర్మనీ, లాంటి 

దేశాలలో సామూహిక మారణ శాలలు ఉండేవట. అందుకే అతని మరణాన్ని ఎందఱో 

కోరుకున్నారు. ఎంతోమంది ఆయనను  చంపుటకు ఎన్నో కుట్రలు పన్నినారు. కాని 

అన్నిటి నుండి ఆయనను విధి కాపాడుతూ వచ్చింది.

విషయమును తెలుసుకొనుటకు ముందు పైన శీర్షికలో వున్న పద్య పాదముతో 

పూరింపబడిన ఈ పూర్తి పద్యమును చదవండి.

హతుని జేయగ తనవైరులాత్రపడుచు

హత్య మార్గమ్ములెన్నియో అమలు పరచ

హంతకుల కుట్రల న్నింటి నణచివేసి

హితునిగా మారె విధి తాను హిట్లరునకు

ఇప్పుడు ఆయనను చంప బూనిన కొన్ని వింతయైన వాస్తవాలను చూస్తాము . మొదటి 

ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండు యోధుడు హెన్రీ టాండీకి యుద్ధభూమిలో పీలగా

విసురుగా ఉన్న ఒక జర్మన్‌ సైనికుడు ఎదిరించ వస్తే, అతన్ని చంపాలనిపించక 

వదిలివేయటం జరిగింది. ఆ పొరపాటు -ప్రపంచ చరిత్రను దారుణంగా ప్రభావితం 

చేస్తుందని అతను అప్పట్లో ఊహించలేదన్న విషయం మనకు ఈ విషయాలు చదివితే 

తెలియ వస్తుంది. ఆ విధముగా వదిలివేయబడిన బక్క ప్రాణియే  అడోల్ఫ్‌ హిట్లర్‌. తన 

తప్పిదానికి టాండీ తన 86 సంవత్సరాల జీవిత కాలమూ  పశ్చాత్తాప పడుతూ 

ఉండిపొయినాడు.

హిట్లర్‌ను హత్య చేయాలన్న కుట్రలు ఎన్నో జరిగినాయి. వీటి నుండి ప్రాణాలతో బయట 

పడినపుడల్లా హిట్లరు ''విధి నా పక్షము వహించి  నేను సాధించవలసిన కార్యమునకు 

దోహదము చేస్తూ వున్నాడు'' అని అనేవాడు. ''మృత్యువు వేదన నుండి, వత్తిడి నుండి

విముక్తి'' అని కూడా అనేవాడు. కొన్ని కోట్ల మంది మృత్యువునకు కారణమయిన ఓ 

నియంతలో ఈ ధోరణి గమనించితే మనకు విడ్డూరముగా గోచరిస్తుంది.

అసలతనికి భవిష్యత్తు ముందే తెలుసునా అనిపిస్తుంది, ఆతను నొకప్పుడు ఒక 

మిత్రునితో అన్న మాటలు వింటే : నాతో ఎప్పుడూ ఒక పిస్తోలు ఉంటుంది. నా ముగింపు 

దగ్గర పడినప్పుడు ఇది ఒక్కటే  నన్ను కాపాడేది'' అని గుండె చూపించినాడట.

మిలటరీ యోధుల సమావేశంలో ప్రసంగించడానికి 1939 నవంబరు 9న హిట్లరు 

మ్యూనిచ్ వెళ్ళటము జరిగింది. ఆ రోజు ఎందుకనో అతని మనస్సు కీడుని 

శంకిస్తోంది.'ఇవాళ నా ధోరణి మార్చాలి' అని అనుకొన్నాడట. జార్జ్‌ అల్సన్‌ అనే ఒక 

వడ్రంగి సమావేశానికి ముందుగానే వేదిక పక్కన ఉన్న ఒక స్తంభమునకు ఒక  దొంగ 

అర తయారు చేసి ఉంచినాడు. సభ జరిగే రోజున ఒక పక్క పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు 

చేస్తూండగా, తాను సిద్ధం చేసిన అర లో బాంబును ఉంచి సరిగ్గా 11 -20 కి ప్రేలే 

విధముగా ఏర్పాటు చేసి యుంచినాడు. పది గంటలకు హిట్లర్‌ ప్రసంగం 

ప్రారంభమవుతుంది. ఆవేశంగా ఊగిపోతూ గంటల కొద్దీ మాటలాడే హిట్లర్‌ యొక్క 

ప్రసంగం మధ్యలోనే బాంబు పేలుతుంది. అంతటితో సభ, హిట్లర్‌ జీవితం 

అర్ధాంతరంగా ముగుస్తాయి. అదీ ఆయన విరోధులు పన్నిన పన్నాగము. విచిత్రంగా 

ఆనాడు 11 -07 నిముషాలకి హిట్లర్‌ తన ప్రసంగాన్ని ముగించినాడు. మామూలుగానైతే 

ప్రసంగం ముగిసిన పిదప కనీసం ఓ అరగంట కార్యకర్తలతో మాట్లాడుతూ గడపడం 

హిట్లర్‌ యొక్క అలవాటు. కాని ఆనాడు అందుకు భిన్నంగా ప్రసంగం ముగియగానే 

హిట్లర్‌ బయటకి వెళ్లిపోవటం జరిగింది. సరిగా విరోధులు అనుకొన్న విధముగానే 8 

నిముషాల తర్వాత బాంబు పేలింది!

ఈ విషయము గమనించండి. నాజీ సైన్యంలో పనిచేసే ఓ సైనికోద్యోగి తన కారణాలేమో 

తెలియవు కానీ హిట్లర్‌ ను మాత్రము హత్య చెయ్యడానికి సంకల్పించి ఒక ప్రణాళిక 

రచించినాడు. ఆ రోజు హిట్లర్‌ ప్రసంగించే వేదిక క్రిందనే బాంబును ఏర్పాటు చేసినాడు. 

అంతా పకడ్బందీగా జరిగిపోయింది. ఇక ప్రేలడమే తరువాయి. హిట్లర్‌ ప్రసంగం 

ప్రారంభమయింది. ఈ లోపల శౌచానికి వెళ్లవలసిన అగత్యం ఏర్పడింది ఆ ఉద్యోగికి. 

శౌచాలయము లోనికైతే వెళ్ళినాడు గానీ  విచిత్రంగా బయటి గడియ పడుటతో అతను 

లోపలే ఉండిపోవలసి వచ్చింది. హిట్లర్‌ ప్రసంగం ముగిసింది. బాంబు ప్రేలే అవకాశమే 

లేకుండా పోయింది.

హిట్లర్‌ శత్రువులు అతణ్ణి అంతమొందించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా విధి ఆయన్ని 

కాపాడుతూనే వచ్చింది.

ఇది ఇంకా విచిత్రమయిన సందర్భం. నెపోలియన్‌ కు వ్యతిరేక పోరాటములో 

ప్రధానపాత్ర వహించిన ఒక యోధుడి మునిమనుమడు క్లౌస్‌ షాంక్‌ వాన్‌ స్టాఫెన్‌ బర్గ్‌

హిట్లరు యొక్క నాజీ సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌. హిట్లర్‌ ను హతమార్చాలనే వర్గంలో 

సభ్యుడు. చాలా సమర్ధుడు. సైనిక శాఖలో చాలా పరపతి ఉన్నవాడు. అయితే ఆయన ఆ 

ప్రయత్నమును చేసే లోపుగానే చుక్కెదురయింది. ఆయన కారు ఒక లాండ్‌ మైన్‌ 

(భూమిలో పాతిపెట్టిన బాంబు) మీద నడిచి పేలింది. అతను ఒక కన్ను, ఒక చెయ్యి

రెండో చేతికి మూడు వ్రేళ్లు పోగొట్టుకున్నాడు. అయినా హిట్లర్‌ని చంపే ఆలోచన 

మాత్రము అతను వదులుకోలేదు. ఒకానొక సమావేశంలో హిట్లర్‌తో పాటు గోరింగ్‌

హిల్మర్‌ అనే ఇద్దరు ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో స్టాఫెన్‌బర్గ్‌ 

అన్న అతడు గూడా పాల్గొన వలసి వుంది. ఈ ముగ్గురినీ ఒకే బాంబుతో 

హతమార్చవలెనన్నది శత్రువుల ఆలోచన. ఒక ఎర్ర బ్రీఫ్‌ కేసులో అధికార పత్రాలతోపాటు 

ఒక బాంబుని పెట్టుకుని కార్యాలయానికి స్టాఫెన్‌ బర్గ్ వచ్చినాడు.

సమావేశం జరిగే హాలులో పెద్ద బల్ల ముందు అనుకొన్న ప్రకారము హిట్లరు కూర్చుని 

వుంటాడు. హిట్లర్‌ కు వీలయినంత దగ్గరగా తానూ కూర్చొనుటకు ఏర్పాటు 

చెయ్యమన్నాడు అక్కడున్న ఒక తన నౌకరుకు. తనకు చెవి సరిగ్గా వినబడదు అందువల్ల 

దగ్గరగా కూర్చోవలసి వస్తూ వుందని కూడా నమ్మబలికినాడు. అతను అనుకొన్న 

విధముగానే ఏర్పాటు జరిగింది. హిట్లరు కుర్చీకి దగ్గరగా టేబిలు కింద బాంబు ఉన్న బ్రీఫ్‌ 

కేసును కూడా  తాననుకొన్న రీతిగానే వుంచినాడు.  తన పని ముగిసిన పిదప  మెల్లగా 

జారుకున్నాడు. సమావేశంలో ఒక ఆఫీసరు, హిట్లరు చూపించే పఠమును చూచుటకు  

ఆ మేజా మీదికి వంగబోయినాడు. కాలికి ఏదో తగులుచున్నట్లనిపించిన కారణముగా 

వంగ లేక పోయినాడు. గమనిస్తే అది ఒక బ్రీఫ్‌ కేసు. కాలితో పక్కకు త్రోయబోయినాడు.

అది కదలలేదు. సరే అతను క్రిందికి వంగి దానిని  టేబులుకు మరోప్రక్క పక్క- హిట్లరు కుర్చీకి దూరంగా వుంచేసి పఠాన్ని చూస్తూ నిలబడినాడు.

12 -42 నిముషాలకు భయంకరమైన శబ్దంతో బాంబు పేలింది. అందరూ 

తుళ్లిపడినారు. కుర్చీలు గాలిలోనికి లేచినాయి. కాని బాంబు దూరంగా పేలిన కారణంగా 

హిట్లరుకు కనీసం గాయము కూడా కాలేదు. హిట్లరు పాంటు పీలికలయింది. 

ముఖమంతా నల్లగా బూడిద అలుముకొనింది. మిగతా వారికి గాయాలయినాయి. 

పీలికలయిన పాంటుని గర్వంగా చూపిస్తూ: ''నాకెప్పుడూ అనిపిస్తూంటుంది. యిలాంటి 

అనర్థం ఏదో జరుగుతుందని'' అని నవ్వినాడట హిట్లర్‌.

కానీ ఎందరో చంపడానికి ప్రయత్నాలు చేసినా తప్పించుకొని బ్రతికి బట్టగట్టిన  హిట్లరు 

-1945 ఏప్రిల్‌ 30న ఒక మిలటరీ బంకర్‌లో చావుకి కొన్ని నిముషాల ముందు తనతో 

జీవితమంతా కలిసి ఉన్న ఈవా ను పెళ్లిచేసుకుని తన 7.65 కాలిబర్‌ వాల్టర్‌ పిస్తోలుతో 

తనను తాను కాల్చుకుని చనిపోయినాడు.

ఇదీ విధి విధానమంటే!

స్వస్తి.

No comments:

Post a Comment