సుమ బాణుని శరమా నిను
మరచిపోవ నా తరమా
దివిని వీడి దిగి రావా నా
చెంతకు ప్రియతరమా
గొలుసు కట్టు లిపి లోపలి
తెలియరాని వివరమా
ఇచ్చితినని యా విధాత
మరచినట్టి వరమా
నిదురలోన నను వీడక చూపుతావు
సురవనాల
తన్మయతన విందువు నా భావ భరిత
కవనాల
కనులు మూసుకొన్నపుడే
కనబడుదువు నా లోపల
కనులు తెరువ నీవు లేని జగము
జూతు నే వెలుపల
నా కోరిక 'రామా' నే తీర్చుకొనగ నా తరమా
చెరుకు రామ మోహన్ రావు
No comments:
Post a Comment