కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్లు
మరచి వినరా
సర్వం నీకే బోధపడుర
ఢిల్లీ కి చెందిన సీనియర్
పోలీస్ ఆఫీసర్ ఒకరు ఇటీవల ఒక విషయాన్ని బహిర్గతం చేసినారు. అదేమిటంటే, "ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న క్రైస్తవ సంస్థల కార్యకలాపాలు, అలజడులు
చాలా చిన్న విషయం మాత్రమే. మనకి కనిపించని, మన ఊహకి అందని ఎన్నో
కార్యకలాపాలను మన దేశంలో నిర్వహించడానికి క్రైస్తవ సంస్థలు యోచన చేస్తున్నాయి.
హిందువులు, హిందూ సంస్థలపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడానికి క్రైస్తవ సంస్థలకు విదేశాల
నుండి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ఈ దేశం
మిక్కిలి బలోపేతమౌతుందనీ, ముందు, ముందు తమలాంటి వారి కుతంత్రాలు
పనిచేయవనీ వీరి భయం. అందువల్ల మోదీకి, హిందూ సంస్థలకు వ్యతిరేకంగా
ఎంతటి అసహ్యకరమైన పోరాటం చెయ్యడానికైనా వీరు వెనుకాడటంలేదు." అని.
రాబర్ట్ రోసారియో బ్రిటన్ కు
చెందిన ఫుట్ బాల్ క్రీడాకారుడు. ఇతనిని ఏ టి.వి. చానెలూ మత సంబంధమైన విషయాలు
చర్చించడానికి ఏ రోజూ పిలవలేదు. కానీ ఉన్నట్లుండి ఈ మధ్య మత ఘర్షణల పట్ల ఆందోళన
వ్యక్తం చేసేందుకు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమానికి ఓ టి.వి. వారు ఇతనిని
పిలిచినారు. చర్చ పేరుతో హిందువులపై విద్వేషం వెళ్ళ గక్కేందుకు చర్చి చేపట్టిన
కార్యక్రమం ఇది. మరి హిందువులు వారి హిట్ లిస్టులో ఉన్నారుగా! ఈ టి.వి. చర్చలో మాట్లాడుతూ రాబర్ట్, "ఇటీవల భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. మేము
భారతీయులమని చెప్పుకునే బిషప్ లు నిత్యం దాడులకు గురవుతున్నారు. అలాంటప్పుడు
భారతదేశంలోని చర్చి వ్యవస్థ భారతీయ చర్చిగా ఎలా పనిచేయగలదు? భారత
ప్రభుత్వం మా భద్రత పట్ల పూర్తి భరోసా ఇవ్వాలి" అన్నాడు. ఇది
విన్నవారెవరికైనా భారతదేశంలో క్రైస్తవులకు భద్రత లేదనీ, పధకం
ప్రకారం నిత్యం వారిపై దాడులు జరుగుతున్నాయనీ అనిపిస్తుంది.
కానీ వాస్తవం మరో విధంగా ఉంది. భారతదేశంలోని
చర్చి దేశద్రోహకరంగానే పని చేస్తోంది. మనదేశంలోని చర్చి అనుయాయులకు మనదేశం పట్ల
అవిశ్వాసము,
విద్వేషము నిత్యం బోధింపబడుతూంటాయి. చర్చి వ్యవస్థకు
ప్రజాస్వామ్యంలో నమ్మకం లేదు. చర్చి యొక్క అధికార క్రమం యొక్క ఆదేశాలనే వారు
శిరసావహిస్తారు. వాటికన్ లో గల అత్యున్నత మతాధికారుల సంఘం "రోమన్ పోన్టిఫ్"
చే నియమించబడినవాడే మనదేశంలో చర్చి బిషప్ లేదా చర్చి ప్రతినిధి కాగలడు. అంతేకాదు, భారతదేశంలోని
ప్రతి బిషప్ లేదా మతాధికారి భారతదేశంలోని వాటికన్ రాయభార కార్యాలయం "Nuncio" ఆదేశానుసారమే పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ వాటికన్ రాయబార కార్యాలయం
భారత ప్రభుత్వంతో సమానంగానే మనదేశంలో సమాతరంగా తన కార్యకలాపాలను నడుపుతోంది. ఈ Nuncio లో ఏ ఒక్కరూ భారతదేశ క్రైస్తవులచే ఎన్నుకోబడినవారు కాదు. అయినా ఈ కార్యాలయం
ప్రతిసారీ భారత ప్రభుత్వంపై ఏదో ఒక సాకుతో విరుచుకుపడుతూంటుంది.
హిందువులను వారి దేవతల చిత్రపటాలపై ఉమ్మి
వేయమనీ, వాటిని కాళ్ళతో తొక్కుతూ "క్రీస్తుయే అసలైన దేవుడని" బిగ్గరగా అనమని
క్రైస్తవ మిషనరీలు బలవంతం చేస్తూంటారు. హిందుత్వానికి చెందిన ప్రతి దానినీ ద్వేషించమని, హిందూ
సంప్రదాయపు కట్టూబొట్టులను విడిచిపెట్టేవేయమని, హిందువుల ఇళ్ళకు వెళ్ళ వద్దని, హిందువులతో
కలిసి భుజించవద్దని నూరిపోస్తూంటారు. ఇదే నిజమైన మతారాధన అని ప్రచారం చేస్తూంటారు.
భయపెట్టి, బెదిరించి, ద్వేషం
వెళ్లగక్కుతూ,
హింసాత్మక ధోరణులు, చిన్నా పెద్దా కానుకలను
ఎరవేసి - ఇలా రకరకాల పద్ధతులను హిందువులపై ప్రయోగించడం ద్వారా క్రైస్తవులు తమ
జీసస్ ని అమ్ముకుంటున్నారు. మరి "ఘర్ వాపసీ" కార్యక్రమం ద్వారా ఎందరో
హిందూధర్మంలోకి తిరిగి వస్తే మాత్రం "క్రైస్తవులపై మోదీ ప్రభుత్వం
వచ్చినప్పటి నుంచి దాడులు పెరిగిపోతున్నాయి " అంటూ CBCI (Catholic Bishops
Conference of India) గగ్గోలు పెడుతుంది. "ఘర్
వాపసీ" భారతదేశాన్ని అప్రతిష్ఠ పాలు చేస్తోందనీ, ఇది
వల్ల మైనారిటీ మతస్తులు భయాందోళనలకు గురిచేస్తోందనీ, ఇలాంటివి దేశంలో
మతపరమైన విభజనకు దారితీస్తుందనీ, దేశంలో ఒక వర్గం వారే సురక్షితంగా బ్రతకగలరనీ, దేశంలో
క్రైస్తవులకు ప్రభుత్వం అన్ని రకాలుగాను రక్షణ ఇవ్వాలనీ వీరు వాదిస్తున్నారు.
మరి మనదేశంలోని క్రైస్తవ పెద్దలు
భారతదేశాన్ని తమ మాతృభూమిగానే ఇష్టపడుతున్నారా? లేక ప్రపంచాన్నంతటినీ
క్రీస్తు రాజ్యంగా మార్చాలనే తమ లక్ష్యంలో ఒక భాగంగానే భారతదేశాన్ని భావిస్తున్నారా?
మనదేశంలోని సెక్యులర్ మేధావులు, క్రైస్తవ
పాస్టర్లు హిందువులను దెయ్యాలుగా, హిందుత్వాన్ని ఒక ప్రమాదకరమైన దానిగానే
చూస్తారు. ప్రచారం చేస్తారు. మనదేశ సరిహద్దు రాష్ట్రాలలోని జనాభా నిష్పత్తి వేగంగా
మారుతోంది. కొన్ని దశాబ్దాలలోనే నాగాలాండ్ జనాభాలో 80 శాతం మంది
క్రైస్తవులుగా మారిపోయినారు. ఇదే సెక్యులరిస్టులు, పాస్టర్లు ఒక
రేపిస్టుకి (అతడు క్రైస్తవుడు కాబట్టి) న్యాయం చెయ్యాలని దిమాపూర్ లో ఊరేగింపు
చేసారు.
The
State vs Catholic Popes Francis Bergogli et al కేసులో
ప్రధాన న్యాయవాది చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం.
అదేమిటంటే,
"ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో తన కార్యకలాపాలను
విస్తరింపజేసుకొనుటకు మాఫియాలతో, ప్రభుత్వాలతో, పోలీసులతో, కోర్టులతో
కుమ్ముక్కయిపోయి కేథలిక్ చర్చి ఒక పెద్ద అంతర్జాతీయ వ్యవస్థగా రూపొందింది"
అని.
దీనిని బట్టి ప్రపంచాన్ని క్రైస్తవ
సామ్రాజ్యంగా మార్చడానికి కేథలిక్ చర్చి ఎంతటి బృహత్ పథకాలను రూపొందించుకుంటోందో
మనకి అవగతమౌతుంది . ముఖ్యంగా భారతదేశంలో హిందువులే టార్గెట్ గా కేథలిక్ చర్చి
వ్యవస్థ ముమ్మురంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది.
D.rajakishore
D.rajakishore
No comments:
Post a Comment