Friday 14 March 2014

ఆంటీ--అంకుల్--మమ్మీ--డాడీ--మేడం

ఆంటీ--అంకుల్--మమ్మీ--డాడీ--మేడం 


 'aunty' 'uncle' ను గురించి . అసలు ఒక క్రొత్త వ్యక్తిని ఆ సంబోధనలతో పిలువా వలసిన అవసరమేమిటో నాకు అర్థము కాదు.
ఒకవేళ వయసులో బాగా పెద్దవారిన కొత్త వారిని గురువుగారు అంటే ఒరిగి పోయేదేమీ లేదుకదా. ఆంగ్లేయులకు పెళ్లి అంటే 
ఇద్దరు వ్యక్తుల మధ్య ఒడంబడిక . అదే మన సాంప్రదాయములో రెండు కుటుంబాల నడుమ ఒడంబడిక . అందుకే మన 
ధర్మమూ లోని పెళ్లి మంత్రములలొ 'divorce' అన్న పదము నకు స్థానము లేదు. అది లేకుండా వాళ్ళకు గానీ ముస్లిములకు 
గానీ 'contract' ఉవుండదు.
ఒక భర్తతో పిల్లలను కని ఆపైన ఆమె ఎంతమందిని పెళ్ళిచేసుకొంటే వారందరూ ఆపిల్లలకు 'అంకుళ్ళు' అదే విధంగా ఆ మగవాడు 
ఒక పడతి తో సంతానము కలిగిన పిదప ఆమెను విడిచి , తనజీవితములో చేసుకోబోయే ఆడవాళ్ళంతా 'ఆంటీలు'
అందువల్ల ఈ పదములను వాడవద్దు . ఈ విషయమును పది మందికి పంచి వాడించవద్దు .మన సంస్కృతిని పెంచండి.

మమ్మీ అంటే పీనుగు అని అందరికీ తెలిసినదే . డాడి అనేది'డెడి' గా ధ్వనించుతుంది . అంటే పీనుగు అనే అర్థము . ఆవిధముగా 
పిలిపించుకొనుట ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రుల వితరణకు వదిలి పెడుతున్నాను.
ఇక 'మేడం'. మేడం అనే మాట 'మాదామ్' అన్న french పదము నుండి పుట్టినది . మా = my, నాయొక్క ; దామ్ = dame 
(యజమానురాలు ,లేడీ) కాబట్టి మేడం అంటే my lady అని అర్థము . 
కావున దయతో స్త్రీలను అమ్మ అని సంబోధిస్తే చాలామంచిది . ఈ శబ్దం 'ఓం' నుండి ఉత్పత్తి అయినది .

No comments:

Post a Comment