Showing posts with label జయ ఉగాది. Show all posts
Showing posts with label జయ ఉగాది. Show all posts

Sunday, 30 March 2014

జయ ఉగాది

జయ ఉగాది 

శ్రీలు చిల్కునటంచు చిల్కలు పల్కంగ 
జయమంచు ఘోషించె జయ యుగాది 
కోకిలమ్మలు పాడి కురిపించ దీవెనల్ 
జయమంచు ఘోషించె జయ యుగాది
మరుమల్లియల తావి మనసుల రంజింప 
జయమంచు ఘోషించె జయ యుగాది
జలజల పారేటి జలధార జతజేరి 
జయమంచు ఘోషించె జయ యుగాది

కష్ట కాలాలు గతియించె కలుగు శుభము 
నష్టములు చేర రావింక నలువ కరుణ 
దృష్టి ప్రగతిన సారించి దృఢముగాను 
ఇష్టసిద్ధిని గనుమనె ఈయుగాది

సకల పాఠక మిత్ర జనాళికి 
జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
చెరుకు రామ మోహన్ రావు