Saturday 4 September 2021

అజరామర సూక్తి – 353 अजरामर सूक्ति – 353 Eternal Quote – 353

 

అజరామర సూక్తి  353

अजरामर सूक्ति  353

Eternal Quote  353

https://cherukuramamohan.blogspot.com/2021/09/353-353-eternal-quote-353.html

सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता

मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत्अज्ञात

సర్వతీర్థమయీ మాతా సర్వదేవమయః పితా l

మాతరం పితరం తస్మాత్ సర్వయత్నేన పూజయేత్ll అజ్ఞాత

సకల నదుల యొక్క సంగమమే తల్లి

నిఖిల దేవతలకు నెలవు తండ్రి

వారి పాదములను వాంఛతో సేవించు

రామ మొహనుక్తి రమ్య సూక్తి

తల్లిదండ్రులపై వినాయకునకున్న భక్తి శ్రద్ధ జగద్విఖ్యాతము. ఆ మాటను నేను వ్రాసిన 

పాటలో ఈ విధముగా పొందుపరచినాను.

వందే వందే గజాననా

గౌరీ ప్రియసుత గజాననా

హారతి గొని మా కలుషమెల్లను

హరియించుమయా హరు తనయా

మాతా పితరుల పాద సేవలో

మహిమను నాడే చాటితివీ

జగతినెల్ల కడు శీఘ్రగతిన జని

చుట్టి కొమరుని ఓడగొట్టితివి 

ఏదో పాత సినిమాలో ఒక పాట ఈ సందర్భములో గుర్తుకు వస్తూ ఉన్నది.

‘నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుడతారా’ అని. ఒకవేళ నేటి 

కాలములో తలిదండ్రులను ఈ విధముగా అడిగే పిల్లలు కూడా ఉన్నారేమో! మరి 

అటువంటి వారు ఇక తలిదండ్రులను గౌరవించుట, పూజిచుట సంభవమన్న 

విషయము ఊహకు కూడా అందని విషయము. కన్నా తరువాత ఒక వ్యక్తిని చూపి ‘ఈయన మీ నాన్న’ అని పరిచయము చేస్తుంది. బహుశ తల్లిచేసే మొదటి బోధ అదేనేమో! శిశువుకు ఊహ వచ్చినప్పటినుండి తండ్రి లౌకికమగు విషయాలు, తన అనుభవాలు, శిశువు అనుమానాలకు సమాధానములు చెబుతూ జ్ఞానాభివ్రుద్ధికి ఎంతో దోహదము చేస్తాడు. అసలు సరియైన గురువు ఎవరు అని ఎంతో యోచన చేసి నిర్ణయించుతాడు. మారిన జీవన విధానములో తల్లిదండ్రులు ఇరువురూ ఆ విషయములో పాలు పంచుకొంటున్నారు.

ఈ సందర్భములో రామాయణములో మనము వినే శ్రావణ కుమారుని కథ అత్యంత 

సందర్భోచితము కావున మీ ముందు ఉంచుచున్నాను.

(ఈ కథను వికీ పీడియా నుండి, ముద్రణా సౌలభ్యము పొందుటకు తీసుకొన్నాను) శ్రవణ 

కుమారుడు హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర. తల్లిదండ్రుల 

పట్ల ఎంత అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వం గలవాడు.

శ్రవణుడు వయసు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించినాడు. వారిరువురినీ 

పోషించిడం కోసం బాలుడైన శ్రవణ కుమారుడు సంపాదించవలసి వచ్చేది. ఈ 

ప్రయత్నంలోనే అతడు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు ప్రయాణము 

చేస్తుండేవాడు. తన తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు కావడం చేత వారు తనతో పాటు 

నడవలేరని ఒక కావడి లో కూర్చుండ బెట్టుకొని ఆ కావడిని తన భుజంపై మోస్తూ 

ప్రయాణాన్ని కొనసాగిస్తుండేవాడు. ఒకసారి వారు ఒక అడవిలో ప్రయాణిస్తుండగా 

శ్రవణుని తల్లిదండ్రులకు దాహం వేసింది. వారి దాహార్తిని తీర్చుటకు శ్రవణుడు ఒక 

పాత్రతో నీళ్ళు తేవడానికి దగ్గర కనిపించిన ఒక వాగు వద్దకు వెళ్ళినాడు. అదే 

సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు కొలనులో నీళ్ళు ముంచుకుంటున్న 

శ్రవణుడిని జింకగా పొరబడి తనకున్న శబ్దభేది విద్య ద్వారా ఆ శబ్దం వినిపించిన దిశగా 

బాణం విడిచినాడు.

శరాఘాతంతో అవసానము సమీపించిన శ్రవణుడు నీటి పాత్రను తన తల్లిదండ్రులకు 

అందించమని చెప్పి తుదిశ్వాస విడిచినాడు. దశరథుడు తెచ్చిన నీళ్ళను అందుకున్న 

అంధులైన శ్రవణుని తల్లిదండ్రులు తన కుమారుడే అనుకున్నారు. దశరథుడు 

అన్యమనస్కంగానే జరిగిన దుర్ఘటనను వారికి వివరించి క్షమాపణ కోరినాడు. 

పుత్రశోకంలో ఉన్న వారు దశరథుడు కూడా తమలాగే పుత్రశోకం అనుభవించక 

తప్పదని శాపం పెట్టి తన కుమారుని చంపిన వానిచేత నీళ్ళు తాగి బ్రతక లేక వెంటనే 

తనువు చాలించినారు. ఆ శాప ఫలితమే శ్రీరాముని వియోగానంతరం దశరథుని 

మరణం.

శ్రవణునిది ఎంతటి సేవాతత్పరతయో చూడండి. నేటి పిల్లలు అంత చేయనవసరము 

లేకున్నా, బాల్యమునండు తల్లిదండ్రులచే అట్టి కథలు విన్నయెడల పెద్దయి తాము 

ఆచరించుటయే గాక తమ పిల్లలకు కూడా బోధించగలుగుతారు. ఒక్క ఈ సనాతన 

ధర్మములోనే, అనాథలుకూడా  తల్లిదండ్రులను కలిగియున్నారు. వారెవరో కాదు ‘పా 

ర్వతీపరమేశ్వరులు’. అందుకే మహాకవి, కవికుల శిరోమణి యగు కాళీదాసు

‘వాగార్థాత్ వివ సంపృక్తౌ వాగర్థాత్ ప్రతిపత్తయే

జగతఃపితరౌవందే పార్వతీపరమేశ్వరౌ' అన్నారు.

తల్లిదండ్రుల గొప్పదనము అంతది. అసలది ఎంత చెప్పినా తీరనిది.

सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता

मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत्अज्ञात

एक माँ सभी तीर्थों की अवतार है, पिता सभी देवताओं का स्वरुप हैअत: माता-पिता का हर प्रकार से 

आदर करना चाहिए

सभी पवित्र स्थानों पर जाकर सद गुण प्राप्त करने के बदले में, उसे केवल अपनी माँ का सम्मान 

करना सीखे तो बसएक पिता स्वयं सभी देवताओं का एक अवतार हैवे ही आज इस दुनिया में 

हमारे यहां होने का एकमात्र कारण हैंउनके पालन-पोषण और देखभाल के बिना किसी के जीवन 

की कल्पना करना भी कठिन होता हैमाता-पिता लगातार अपने बच्चों के लिए हर समय, अपने 

तरफ से  सर्वश्रेष्ठ देने का प्रयास करते हैंअगर दुनिया में कोई शुभचिंतक होते हैं ओ माता-पिता बाद ही 

गिना जासकता है l

यही कारण है कि सभी बाधाओं को दूर करने वाले भगवान गणेश ने भी अपने माता-पिता को नमन 

किया! उन्होंने उन्हें और उनके भाई, भगवान सुब्रह्मण्य को चुनौती दी, कि पूरी दुनिया की सबसे पहले 

परिक्रमा करने वाला कौन होगाभगवान सुब्रह्मण्य ने तुरंत अपने मोर पर सवार होकर दुनिया का 

चक्कर लगाने के लिए तैयार कियालेकिन गणेश, अपने शरीर के ताकत और कमजोरियों बारे में 

बहुत जानते थे l उसीलिए उन्होंने बस अपने माता-पिता, पार्वती और परमेश्वर के प्रदक्षिण करके प्रणाम 

किया और चुप रहगयाउन्होंने वास्तव में चुनौती जीत ली थी, क्यों कि माता पिताके परिक्रम दुनिया 

का परिक्रम होजाता है !

यह सच है कि माता-पिता अपने बच्चों की दुनिया सोचते हैं, लेकिन बच्चों के लिए वे ही दुनिया हैं!

बच्चे दुनिया के सबसे मूल्यवान संसाधन हैं और उनके भविष्य के लिए कोइ भी अवसर नहीं छोड़ना 

हैंमाता-पिता अपने बच्चों को धन नहीं, बल्कि श्रद्धा की भावना दें! प्यार और सम्मान पालन-पोषण 

की सबसे महत्वपूर्ण आधारशिला होबच्चे हर मोड़ पर माता-पिता का पूरा आदर करें!

sarvatīrthamayī mātā sarvadevamaya pitā

mātara pitara tasmāt sarvayatnena pūjayet

 

A mother is (an embodiment) of all pilgrimages, a father is (an embodiment) of 

all deities. Hence, revere the mother and father with all efforts.

 For one to get the same virtues he would by visiting all the holy places, all he 

has to do is, revere his mother. A father is an embodiment of all the deities 

themselves. They are the sole cause for us being here in this world today. It is 

hard to imagine one's life without their nurture and care. Parents constantly 

strive to provide the best that they can give for their children at all times. There is 

no well-wisher better than parents!

 Isn't that why even Lord Gaeśa, the remover of all hurdles Himself, bowed 

down to His parents! They posed a challenge to Him and His brother, Lord 

Subrahmaya, as to who will be the first to circumambulate the whole world. 

Lord Subrahmaya immediately took off on His peacock, ready to circle the 

world. But Gaeśa, who was very aware of the strengths and weaknesses (His 

speed), simply circled around His parents, Pārvatī and Parameśvara, and 

prostrated to them. He had indeed won the challenge! It is true that parents think 

the world of their children, but for children, they ARE the world!

 Children are the world's most valuable resource and the best hope for its future. 

Let parents bequeath to their children not riches, but the spirit of reverence! May 

love and respect be the most important cornerstones of parenting. May children 

at every juncture revere parents diligently!

స్వస్తి.

No comments:

Post a Comment