Thursday 2 September 2021

అజరామర సూక్తి – 351 अजरामर सूक्ति – 351 Eternal Quote – 351

 అజరామర సూక్తి  351

अजरामर सूक्ति  351

Eternal Quote  351

https://cherukuramamohan.blogspot.com/2021/09/351-351-eternal-quote-351.html

वनस्पतेरपक्वानि फलानि प्रचिनोति यः ।

स नाप्नोति रसं तेभ्यो बीजं चास्य विनश्यति ॥- व्यास भारतम् - विदुरनीति

వనస్పతేర్నపక్వాని ఫలాని ప్రచినోతియః l

సనాప్నోతిరసం తేభ్యో బీజం చాస్య వినశ్యతి llవ్యాస భారతము - విదురనీతి

పండు మాగనిదే, అంటే కాయగానే తుంచితే ఇటు దాని మధురటి రసమునూ పొందలేము అటు విత్తనమునూ కొత్త మొక్కకి నాటుటకూ ఉపయోగించలేము. ఎందుచేతనంటే వగరుగానో పుల్లగానో ఉన్న ఆరసమును తాగలేము, పక్వానికి రాణి బీజమును నాటి ఫలితమునూ పొందలేము.

కావున ఏపనికైనా సరైన సమయము, సరైన ప్రదేశము తప్పనిసరిగా అవసరమే !

పండు పక్వానికి రానప్పుడు, అది కోయుటకు సిద్ధముగా ఉండదు. పండు పక్వానికి వచ్చినప్పుడు, చెట్టు నుండి వేరుచేయడానికి ఒక చిన్న స్పర్శ కూడా సరిపోతుంది కాబట్టి ప్రకృతి చాలా సంపూర్ణంగా మనకొరకు తన ఫలితమును సిద్ధము చేసింది! అంతే కాదు, మాగిన పండు నుండి పై తొక్క సులభంగా వేరు చేస్తుంది మరియు లోపల విత్తనం కూడా నాటుకు సిద్ధముగా ఉంటుంది! అప్పుడు ఈ పనులకు పెద్దగా శ్రమ అవసరం లేదు. అటువంటి ఖచ్చితమైన రూపకల్పనను మన ఇష్టానికి ధ్వంసము  చేసినప్పుడు, ఫలితము కూడా తారుమారు అగుట చాలా సహజము. పండని సమయంలో కాయను చెట్టునుండి వేరుచేస్తే, దాని రసాలు ఆస్వాదించుటకు యోగ్యముగా ఉండవు. పక్వత దానికి ఇంకా  సిద్ధించలేదు. లోపల ఉన్న విత్తనము కూడా దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేదు కాబట్టి దానిని నాటినా మరొక మొక్కను మొలకెత్తనివ్వగల సామర్త్యమును కలిగియుండవు. ఇన్ని నష్టాలను మన అవగాహనారాహిత్యము వలన భరించవలసి వస్తుంది.

పండు కోయడానికి సిద్ధంగా ఉండేంత వరకు సహనాన్ని పాటించుటచేత చాలా ఎక్కువ ప్రయోజనాలను పొందుతాడు. మనము పడే తొందర ప్రకృతి పై ఎటువంటి ప్రభావమునూ చూపలేదు. మనకొరకు చెట్టు కాయను పండు చేయదు! పండులో సరైన నిష్పత్తిలో సరైన రసాలను, సరియైన విత్తనములనూ సమయం మాత్రమే పూరించగలదు.

అదేవిధంగా, జీవితము లోని అన్ని రంగాలలో, సరియైన సమయములో, సరియైన చోట సరియగు దిశానిర్దేశముతో ఏపనినైనా చేయవలసి యుంటుంది.  ‘తొందరపడే గొడ్డు మురికి నీరు తాగుతుంది’ అంటారు పెద్దలు. 'నేను చాలా ప్రయత్నం చేసినాను!' అనుట కేవలము మూర్ఖత్వమౌతుంది.

కాయ మాగకుండ కాస్తైన తినలేము

విత్తు నాటలేము వివరమరయ

కాలమొకటి నీకు కలసి రా వలెనురా

రామమోహనుక్తి రమ్య సూక్తి

 ప్రయత్నం మాత్రమే ఫలితాన్ని ఇవ్వదు, దీనికి సరియైన సమయము కూడా కావలసియుంటుంది. ఒక వ్యక్తి తన ప్రయత్నాలను అన్ని వేళలా సరైన మార్గము, సమయము కొరకు వేచియుండక తప్పదు.

కాబట్టి సరియైన సమయములో సరియైనపనిని, సక్రమముగా చేయడం, జీవితంలోని ఏ రంగమున కూడా విజయమునకు కీలకమౌతుంది!

 

वनस्पतेरपक्वानि फलानि प्रचिनोति यः ।

स नाप्नोति रसं तेभ्यो बीजं चास्य विनश्यति ॥- व्यास भारतम् - विदुरनीति

जो फलों के पेड़ों से कच्चे फल तोड़ते हैं, वह केवल उनका रस प्राप्त करता है, बल्कि उसके बीज को भी खराब कर देता है

हम जो कुछ करने के लिए तय करते हैं उसका सही समय, सही जगह तय करना भी बहुत जरूरी है जब फल पके नहीं होते हैं, तो वह तोड़ने के लिए तैयार नहीं होता हैप्रकृति ने चीजों को इतनी अच्छी तरह से डिजाइन किया है कि जब कोई फल पक जाता है, तो उसे पेडसे अलग होने और गिरने के लिए बस एक छोटा सा स्पर्श पर्याप्त होता है! इतना ही नहीं, छिलका आसानी से फल से अलग हो जाता है और बीज भी अंदर से अलग हो जाता है! ज्यादा प्रयास की जरूरत नहीं हैजब इस तरह के एक आदर्श डिजाइन के साथ छेड़छाड़ की जाती है, तो यह काफी स्वाभाविक है कि परिणाम में भी छेड़छाड़ की जाती है! यदि कोई फल कच्चा होने पर तोड़ाजाता है, तो उसका रस अपने चरमोत्कर्ष पर नहीं पहुँच पाताजायके अपनी संपूर्णता में विकसित नहीं हुए होंगेअंदर का बीज भी अपनी पूरी क्षमता तक नहीं पहुंच पाता और इसलिए दूसरे पौधे को अंकुरित नहीं कर पाता! इतने सारे नुकसान का जोखिम क्यों ?

जब तक फल कटने के लिए तैयार हो जाए तब तक धैर्य बनाए रखने से उस व्यक्ति को अधिक

लाभ होता है जो अपना धैर्य खो देता है वह जल्दीबाजी से कोइ निर्णय लेगाजल्दबाजी करने से काम 

नहीं चलेगाऐसे मामिले में सबूरी ही सर्व श्रेष्ठ है, आवेग अनर्थदायक होसक्ता है l   फल नहीं 

पकेगा तो न फल का मधुर रस प्राप्त करसकते न बीज नए पौधों केलिए बोसकते ! केवल समय ही 

फलों में सही अनुपात में सही रस भर सकता है

इसी तरह, जीवन के सभी क्षेत्रों में, सही चीजें, सही समय पर, सही जगह पर करना होता हैअसामयिक ढंग से किया गया कोइ भी कार्य निश्चय ही व्यर्थ सिद्ध होगाकोई नहीं कह सकता, ' मैंने बहुत प्रयास किया फिर भी फल प्राप्त नहीं हुआ !' क्योंकि, यह अकेले प्रयास करनेसे नहीं मिलता है l सही परिणाम पाने के लिए, यह सही समय का भी जरूरत पड़ता हैजिस तरह एक खिलाड़ी खेल शुरू होने से पहले ही गोल नहीं मार सकता, उसी तरह हम सही समय और सही दिशा केलिए ओप्रतीक्षा करना पड़ता है l

आखिरकार, सही समय पर सही तरीके से सही काम करना, जीवन के सभी क्षेत्रों में सफलता की कुंजी है!

vanaspaterapakvāni phalāni pracinoti ya

sa nāpnoti rasa tebhyo bīja cāsya vinaśyati Vyasa Bharatam - Viduranīti

He who plucks the unripe fruit from the fruit trees, he not only doesn't acquire 

their juices but spoils its seed as well.

Right time, right place!

When fruit is not ripe, it is not ready for plucking.  Nature has designed things so 

perfectly that when a fruit is ripe, just a small touch is enough for it to detach 

from the tree and fall!  Not only that, the peel separates from the fruit easily and 

so does the seed inside!  There is not much effort needed.  When such a perfect 

design is tampered with, it is quite natural that the result gets tampered as well!  

If a fruit is plucked when unripe, its juices wouldn't have reached their 

culmination.  The flavors would not have developed to their entirety.  The seed 

inside wouldn't have reached its fullest potential either and hence wouldn't be 

able to sprout another plant!  Why risk so many losses?! 

Keeping the patience until the fruit is ready for harvest reaps far more benefits to 

the person than to one that loses his patience.  Hurrying nature won't work.  The 

tree will not ripen the fruit as per the onlooker's schedule after all!  Only time can 

fill in the right juices in the right proportions in the fruit.

Similarly, in all walks of life, one has to do the right things, at the right time, in the 

right place.  The same action done in an untimely manner will most certainly turn 

out wasteful.  One cannot say, 'but I put in a lot of effort!'  For, it is not the effort 

alone that yields results, it is the perfect timing as well.  Just like a player cannot 

hit a goal even before the game starts and expect to score, one has to put his 

efforts in the right direction at all times.

After all, doing what's right in the right way at the right time, is the key to success 

in all walks of life!

స్వస్తి. 


No comments:

Post a Comment