Saturday 4 September 2021

అజరామర సూక్తి – 352 अजरामर सूक्ति – 352 Eternal Quote – 352

 అజరామర సూక్తి  352

अजरामर सूक्ति  352

Eternal Quote  352

https://cherukuramamohan.blogspot.com/2021/09/352-352-eternal-quote-352.html

अवज्ञया दातव्यं कस्यचिल्लीलयापि वा

अवज्ञया कृतं हन्यात् दातारं नात्र संशयः - रामायण, बाल

అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా l

అవజ్ఞయా కృతం హన్యాదాతారం నాత్ర సంశయః ll రామాయణము బాలకాండ

స్వామి (యజమాని) ఎంత‌ భక్తిశ్రద్ధలతో కొన్ని పుణ్యకార్యాలు చేయాలని ప్రారంభించినా 

క్రింద పని చేసేవాళ్ళలో అంతటి భక్తిశ్రద్ధలుండవు. ముఖ్యంగా దాన ధర్మాదులు, ఆహార 

వితరణాదులు చేసేటప్పుడు వాళ్ళు ఆహారాదులు తీసుకొనడానికి వచ్చిన వారి 

విషయములో నిర్లక్ష్యభావం చూపించడం సహజం.

దశరథ మహారాజు తలపెట్టిన అశ్వమేధయాగానికి దేశంలోని వివిధవృత్తులు గలవారినీ

నాలుగు వర్ణాలవారినీ ఆహ్వానించాలి. భోజనాదుల సమయంలో వాళ్ళు ఏమైనా 

కామక్రోధాదులు చూపించినా మీరు మాత్రం వాళ్ళ విషయంలో కొంచెం కూడా 

అనాదరం చూపించకూడదు" అని వసిష్ఠ మహాముని అశ్వమేధయాగాని ఏర్పాట్లు 

చేయడానికి నియుక్తులైనవారి నందరినీ ఆజ్ఞాపించాడు.

"సర్వే వర్ణా యథా పూజాః ప్రాప్నువన్తి సుసత్కృతాఃl

 న చావజ్ఞా విధాతవ్యా కామక్రోధవశాదపి"ll (బా.కాం. 13.12)

"అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా l

అవజ్ఞయా కృతం హన్యాదాతారం నాత్ర సంశయః"ll

ఎవ్వరికీ ధిక్కారపూర్వక  లేదా నిర్లక్ష్యయుక్త మగు దానము చేయకూడదు. ధిక్కారంతో చేసిన దానం ఇచ్చేవారిని నాశనం చేస్తుంది, దాని గురించి ఎటువంటి సందేహం లేదు.

అనగా ఎవ్వరికీ కూడ, అనగా ఆ వ్యక్తి అతిథి కావచ్చు అభ్యాగతి కావచ్చు, అనాదరంతో 

గాని అశ్రద్ధతో గాని భోజనాదులు ఇవ్వకూడదు. అనాదర పూర్వకంగా చేసిన దానం 

దాతకు అపాయకరం. సందేహం లేదు.

భారతీయ సనాతన ధర్మ జీవనంలో దానానికి మిక్కిలి ప్రత్యేకత ఉంది. సర్వమానవ 

వికాసానికి దాన గుణము ఎంతో తోడ్పడుతుంది. అందుకే మన పురాణాలు

ఇతిహాసాలు, కావ్యాలు దానము యొక్క ఔన్నత్యాన్ని అనేక కథల రూపంలో 

అందించినాయి. రామాయణ మహాకావ్యం దాన ప్రశస్తిని గురించి ప్రస్తావిస్తూ దానం చేసే 

విధానం గురించి ఈ విధముగా వివరించుతూవుంది. దీనులకు దానం చేసేటప్పుడు 

దానం చేసే వ్యక్తికి ఎటువంటి ధిక్కార గుణం ఉండరాదంది. దాన కర్తకు మానసిక 

పరిఫూర్ణత ఉండాలి తప్ప. లెక్కలేనితనంతోగానీ, విలాసానికిగానీ దానం చెయ్యరాదని 

రామాయణం స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ధిక్కారంతో చేసిన దానం ఇచ్చిన వానినే 

నాశనం చేస్తుందని చెప్పింది. మనిషి అన్ని విధాలా పురోగతి సాధించడానికి దానగుణం 

ఊతమిస్తుంది. స్వార్థగుణం మనిషి పతనాన్ని నిర్దేశిస్తుంది. పతనం కాకుండా తనను 

తాను కాపాడుకోవాలనుకున్నప్పుడు అతడు ఆశ్రయించే ప్రధాన ధర్మం దానమే. దానిని 

తన వ్యక్తిత్వంలో ఒక ప్రధాన భాగంగా చేసుకుంటే తప్ప అది మనిషిలోని మానవత్వాన్ని 

వెలిగించలేదు. పూర్ణ పురుషుడై ప్రవర్తిల్లి సమాజానికి మార్గదర్శనం చేసిన రామాయణ 

మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుడు. రాముని వ్యక్తిత్వంలోని ప్రతి అంశం మానవులకు ఆదర్శప్రాయం. అడుగడుగునా ఆ ఆదర్శపురుషుని వ్యక్తిత్వమే దర్శనమిచ్చే రామకథలో దశరథ మహారాజు మాటలను ఒకసారి మననం చేసుకుంటే రాముని ఔన్నత్యం తెలుస్తుంది. శ్రీరాముడు వనవాసానికి సిద్ధపడినప్పుడు పరితపించిన తండ్రి..

 సత్యేన లోకాని జయతి దీనాన్‌ దానేన రాఘవః

గురూన్‌ శుశ్రూషయా వీరోధనుషాయుధి శాత్రవాన్‌

 అంటూ విలపించినాడు. శ్రీరామచంద్రమూర్తి సత్యం కారణంగా ప్రజలను, దానం 

కారణంగా దీన జనులను, సేవ చేత గురువులను ధనురాది ఆయుధ సంపత్తి చేయ 

శత్రువులను వశపరుచుకున్నవానిగా తన పుత్రుణ్ణి గురించి మనసులోని మాటలను 

మహారాజు వ్యక్తపరిచినాడు. దానమనేది సత్యంతోనూ, పరాక్రమంతోను

సేవాభావంతోనూ తులతూగే ఉత్తమ ధర్మంగా గుర్తించవచ్చు. అందుకనే ‘దానవీరం’ - 

అనే మాటతో ఇదొక వీరచిహ్నంగా సనాతనులు భావించినారు. దానం యొక్క 

ఔన్నత్యాన్ని చాటి చెప్పినారు.

अवज्ञया दातव्यं कस्यचिल्लीलयापि वा

अवज्ञया कृतं हन्यात् दातारं नात्र संशयः - रामायण, बाल

अवमानना ​​या अवहेलना करके कभी किसी को दान देंअवमानना ​​में किया गया दान देने वाले का 

नाश कर देगा, इसमें कोई संदेह नहीं है

'दान' एक ऐसा कार्य है जो किसी के दिल की भलाई के लिए किया जाता है, नाम और प्रसिद्धि के लिए 

नहींइसे विनम्रता और शालीनता के साथ करना चाहिएदेने का लाभ लेने वाले के लिए उतना नहीं है 

जितना देने वाले के लिए हैदेने वाले को पाने वाले से कुछ ज्यादा ही भगवान् का आशीर्वाद मिलता है । 

इसलिए, वह साझा करने में सक्षम हैलेकिन तब देने वाले को ज्यादा फायदा होता है क्योंकि वह उसे 

निस्वार्थता सिखाता हैइसलिए वह जिस रवैए से देते हैं वह बहुत महत्वपूर्ण हैतिरस्कार, अहंकार या 

उदासीनता के साथ देना सबसे खराब प्रकार का देना हैएक देना कभी भी अवमानना ​​​​के साथ नहीं 

देना, क्योंकि देने वाले को नष्ट करना निश्चित है! देने वाले का उद्देश्य विमल होना चाहिए ताकि विफल 

होने पर भी देना व्यर्थ नहीं होता और देनेका फल जरूर मिलता है l अगर देना किसी के नैतिक 

आधार के मानकों को नीचे ला रहा है, तो शायद दें!

जैसा कि ज्ञानी कहते हैं, जब आप अपना सर्वश्रेष्ठ देते हैं तो आप दूसरों से सर्वश्रेष्ठ प्राप्त करते हैंयह 

उस दृष्टिकोण से शुरू होता है जिसके साथ हम देते हैंनम्रता ही एकमात्र उपाय हैएक व्यक्ति का 

मूल्य उसमें रहता है कि वह क्या और कैसे देता है; वह नहीं जो वह प्राप्त करने में सक्षम हैक्योंकि

यह देने में है कि हम प्राप्त करते हैं! देने का तरीका स्वयं सामग्री से कहीं अधिक मूल्यवान है

avajñayā na dātavya kasyacillīlayāpi vā

avajñayā kta hanyāt dātāra nātra saṃśaya - rāmāyaa, bāla

Never give (charity) to anyone with contempt or disregard. Charity done in contempt will obliterate the giver, there is no doubt about that.

'Giving' is an act that is done out of the goodness of one's heart, not for name and fame. It should be done with humility and modesty. The benefit of giving is not for the receiver as much as it is for the giver. The giver was blessed with a little more than the receiver. Hence, he is able to share. But then, the giver benefits more because it teaches him selflessness. Therefore, the attitude with which he gives is very important. Giving with contempt, arrogance or displaying apathy are the worst kinds of giving. One give never give with contempt, for, it is certain to destroy the giver! Isn't giving futile if the purpose is defeated? If the giving is bringing down the standards of one's moral ground, might as well not give!

Like they say, you get the best out of others when you give the best of yourself.  That begins with the attitude we give with. Humility is the only way. The value of a person resides in what and how he gives; not what he is capable of receiving. For, it is in giving that we receive!  The manner of giving is worth much more than the material itself.

స్వస్తి.

 

 

 

No comments:

Post a Comment