Wednesday 24 March 2021

అజరామర సూక్తి - 187 अजरामर सूक्ति - 187 Eternal Quote - 187

 అజరామర సూక్తి - 187

अजरामर सूक्ति - 187

Eternal Quote - 187

https://cherukuramamohan.blogspot.com/2021/03/187-187-eternal-quote-187.html

क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः l - शिशुपाल वध ( कवी माघ )

క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః l శిశుపాల వధ (మాఘ కవి)

క్షణక్షణము కొత్త అలంకారాన్ని సంతరించుకొంటూ నిత్య నూతనముగాఉంటూ నిరంతరమూ ఆకట్టుకోనేదేకదా నిజమన రూపమంటే ! ఒక్క వాక్యములో ఎంత గొప్ప మాట చెప్పినారో మహానుభావుడైన మాఘకవి . కాబట్టి మనము ఆతురుతగాచూచేవి క్షణికమైన అందాలు పొందేది క్షణికమైన ఆనందాలు.

అందుకే ఏనాడో ఆది శంకరులవారు

'నారీ స్తనభర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం l

ఏతన్మాంసావసాది వికారం మనసివి చింతయ వారం వారం' ll

అని చెప్పినారు . అన్నమయ్య కూడా 'మరువను ఆహారమ్మును మరువను సంసార 

సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీమాయ'అన్నారు. ఏది నిత్యమో ,ఏ 

వర్చస్సు నిత్యనూతనమోఏది శాశ్వతమో,దానిని చిన్న వయసులోనే పట్టుకొంటే ఇక ఆ 

వ్యక్తికి తిరుగేమున్నది . 'అనగననగ రాగ మతిశయిల్లుచు నుండుఅనికదా ఆర్య 

వాక్కు. అట్లని సన్యాసము తీసుకొనవలసిన అవసరము లేదు .

ప్రహ్లాదుని ఆదర్శముగా నెంచి భగవంతుని సాధించిన చాలు. ఒక వ్యక్తికి అంతకు 

మించిన సంతృప్తి వేరేమున్నధి. 'అహములేని 'ఇహముఅనుభవించుతూ ఆ 

పరమాత్ముని ఆకర్షణకు లోనైతే అంతకన్నా కావలసినది ఏమున్నది .

 

क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः l - शिशुपाल वध ( कवी माघ )

जो हर घड़ी नित्य नूतन होकर हर घड़ी हर पल  मन को लुभाता है वही सही सौंदर्य होता हैबाकी सब हमारा भ्रंती होता है|

यही जगद्गुरु शंकराचार्य जी भी बोलते हैं|

नारी स्थान भर नाभी देशं दृष्ट्वा मागा मोहावेशं l

एतान मांस वसादि विकारं मनसिवि चिन्तय वारं वारं ll

जो नारी के अन्गाङ्गोन के भ्रम मे फस जाता है और हमेशा उसी चिन्तन मे लगा रह्ताहै तो वह मुकिती के बारेमे क्या सोच

सकताहै अगर हम मानसिक पीड़ा से मुक्त होगएंगे तो आमुष्मिक सुविधा के बारेमे सोच सकते हैं l

Kshane Kshane yannavataamupaiti tadeva roopam ramaneeyataayaah l - Shishupaalavadham (Maagha kavi)

Beauty is that which takes on a new form every minute (so that the one who looks at it is never tired or bored)

Adi Shankara says :

Naree sthana bhara nabhi nivesam, Mithyaa mayaa mohaavesam l

Ethan mamsavasaadhi vikaram, Manasi vichinthaya vaaram vaaram ll

A lady’s busts divine, her bellies shapely, they are but gates of deceit, and the joy that is given out,

Is by flesh and fat alone. Think of this, Day in and day out / Annamayya says" I am not oblivious to this mundane pleasures like food, attachment to the family, sexual desires etc," like a drop of water on a lotus leaf, if one could be able to concentrate on the ever enchanting entity viz. GOD how much bliss he can gain. Saadhana gives Samvruddhi.

If this is realised at a young age like Prahlaada what else is required for his contentment.

స్వస్తి.

1 comment: