Tuesday 8 January 2019

చెరుకు రామ మోహన్ రావు


చెరుకు రామ మోహన్ రావు
చెరుకు ఇంట నుంది చేవేమొ తెలియదు
ఊరు లేదు కాన ఉనికి లేదు
పేరునిచ్చె తండ్రి ప్రీతి మీరగ నాకు
కాచుచుంటి నేను కాంక్ష మీర
పై పద్యమునకు ఒక అర్థమెమంటే ఇంటిపేరు చెరుకే గానీ నాలో సరుకు వున్నదా లేదా అన్నది నాకు తెలియదు. ఉద్యోగరీత్యా వూర్లు పట్టుకొని తిరిగినాను కావున 'నాది' అని చెప్పుకొనే వూరు లేకుండా పోయింది. కానీ ఎక్కడికి పోయినా మా తండ్రిగారిచ్చిన పేరుకు చెడ్డ పేరు రాకుండా కాపాడుకొనుచున్నాను.
  వేరొక అర్థమేమంటే నా ఇంటిపెరులో చెరుకు మాత్రమే వుంది. వూరు లేదు అంటే చెరుకూరు కాదు. అంటే వూరు ఉంటేనే కదా ఉనికి ఉంటుంది. తండ్రి ఇచ్చిన పేరైన రామ మోహన్ రావు ను దానికి కలిపి 'చెరుకు రామ మోహన్ రావు' గా చలామణి అగుచున్నాను గానీ ఆ చెరుకులో చేవ వుందో లేదో నాకుతెలియదు.
చెరుకే చక్కెరకమ్మగు
 చెరుకే బెల్లమునకమ్మ చింతింపంగా
చెరుకే కమ్మదనమ్మా

చెరుకే నీ యింటిపేరు చెణుకుల రామా!

No comments:

Post a Comment