Friday 18 January 2019

మన జాతీయ గీతము

మన జాతీయ గీతము
లంకె: https://cherukuramamohan.blogspot.com/…/01/blog-post_18.html

నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦ రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరంగీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్ ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది. ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే సాక్ష్యము .
In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can be no debate about it. Of course Bankimchandra does show Durga to be inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the nation].
మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు నడచినాడు.

మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో ప్రతిఘటన ఏదీ!
ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది .
మిగతది రేపు చదువుదాం.....
ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగింది .
ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్ గారు నెహ్రు కుటుంబానికి ముఖ్యముగా నెహ్రు గారి తండ్రి మోతిలాల్ నెహ్రుకు అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది. ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములోనికి తర్జుమా చేసి జార్జ్V గారికి 1919 డిసెంబరు28న  సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు కదా !

ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు ఆయన చొప్పించిన అబిప్రాయము.
ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో తమ ఆనంద మఠ్ నవలలో సంతల్ పరగణాల లోని సన్యాసులు ఆంగ్లేయులకు విరుద్ధముగా పోరాడుతూ ఈ పాట రూపములో దేశ మాతపై తమ భక్తిని చాటుటకు   వ్రాసిన దేశ భక్తి గీతాన్ని తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .
"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The proceedings began with the singing by Rabindranath Tagore of a song specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28, 1911) "When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously." (Indian, Dec. 29, 1911)


ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా మోతిలాల్ నెహ్రు గారి ప్రోత్సాహంతో, కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితేతన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది. మన జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.
మిగిలిన భాగము రేపు చూద్దాము.
3వ భాగము
విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని  పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!



జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)
 జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా
పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా
వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా
తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా
జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

ఆహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ
హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖిస్తానీ
పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా
జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ
తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ
దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా
జనగణ పథ్ పరిచాయక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే
ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా
జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే
గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే
తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే
తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే
జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll
"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల ఆధారములను ఒకపరి పరికించుదాము -
మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.
1. 1919 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం జరిగింది.
2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1919 లో బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము. మరివిధాత అంటే బ్రహ్మబ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హుడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా!
తరువాతి భాగము రేపు......
4వ భాగము 
4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆసే - తవ సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పుపశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది. దక్షిణమున ఫ్రెంచ్ మరియు పోర్చుగీసు వలసు ఉండినవి.
5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది. పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని అనుకొనుటకు వీలు కాదుఅన్వయము కుదరదు కాబట్టి.
6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం "రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై  కదా వుండినారు.
7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్ పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునావాడ తగునా?
8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా! 
పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును "టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!
మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.
పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి సింహాసనము  చేజిక్కించుకొనిదేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన మీర్ జాఫర్ నుఅతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు. ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూముఖోపాధ్యాయ  ముఖర్జీగానూబందోపాధ్యాయ బెనర్జీగానూ మారిపోయినాయి. అయితే శ్యాం ప్రసాద్ ముఖర్జీ 
ఖుదీరాం బోస్చిత్తరంజన్ దాస్సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికిఠీవికిదర్జాకుదర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక ఈ నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :
మిగిలినది రేపు.....

5వ భాగము

1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్ కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని ఎంచి, విధించినారు.  ఇది 1908,మే 21న జరిగిన ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర లేకుండా చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !
2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.
3. ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.
4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన భాషణము ఇవ్వలేదు .
5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.
6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు. 
7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ బహుమతినిచ్చినారని కూడా అంటారు. 

ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు, చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. ఈ మహనీయుని గూర్చి ఈ తరం యువతరం తప్పక తెలుసుకోవలసి యున్నది .

1889 డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే ఆంగ్లేయుల పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.  బెంగాలులోని మిడ్నపూరుకు చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ నాయకునిగా దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు గురియైనవాడు. 16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే మిడ్నపూరు పోలీసు స్టేషను వద్ద బాబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు సంవత్సరములకు ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11 ఆగస్టు 1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు అభియోగమును  మోపి  ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్ అన్న ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన  మేజిస్ట్రేటును బాంబు ఒక చేతితో రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు బదులుగా కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు. ఎట్లయితేనేమి ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి STATESMAN అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  ఈ విధముగా వ్రాసినది.
The English daily, The Statesman, wrote on the following day, May 2, 1908:
The Railway station was crowded to see the boy. A mere boy of 18 or 19 years old, who looked quite determined. He came out of a first-class compartment and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande Mataram'...
ఇక్కడ ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన సహచర వర్గమునువిప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.
The Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published about him with the headlines   "Khudiram's End: Died cheerful and smiling" the newspaper wrote: "Khudiram's execution took place at 6 a.m. this morning. He walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was drawn over his head." An established British newspaper, The Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged that he mounted the scaffold with his body erect. He was cheerful and smiling." The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.
నేను ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి ‘మహాత్మా’ అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ సమయమున ‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ ఖుదీరాం గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు బాసినారా లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో ఐక్యమైనాడు.  ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ  అయినట్లు ఆ తారలో మనకు కనిపించడు. మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ నవసరము లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే భారతీయ విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.
నేడు బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు మధ్యందినమార్తాండు.
చాలా దూరం వచ్చినాము. మళ్ళీ కలుసుకొందాము.

స్వస్తి

No comments:

Post a Comment