పద్మావతి లేక రాణీ పద్మిని.
పద్మావతి లేక రాణీ పద్మిని.
1540లో ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సూఫీ కవి మాలిక్
మహ్మద్ జాయసీ ‘పద్మావత్’ పేరుతో రాసిన కవితలో ఈ రాణి ప్రస్తావనుంది. మాలిక్ కథ
ప్రకారం.. పద్మావతి సింహళ దేశ రాజకుమారి.
అందాల రాశి. 13, 14 శతాబ్దాల మధ్య జన్మించింది. ఈమెను రాజస్తాన్‌లోని
చితోడ్‌గఢ్ రాజు రతన్‌సేన్ పెళ్లాడతాడు. అల్లావుద్దీన్ మరణించిన 224 ఏళ్ల
తర్వాత జాయసీ కవితలో పద్మావతి గురించి వ్రాయటం జరిగింది. ఇది వాస్తవము అనుటకన్నా
కాల్పనికము అన్నవారు ఎక్కువ.
तन चितउर, मन राजा कीन्हा। हिय सिंघल, बुधि पदमिनि चीन्हा॥
गुरू सुआ जेइ पंथ देखावा । बिनु गुरु जगत को निरगुन पावा ?॥
नागमती यह दुनिया-धंधा । बाँचा सोइ न एहि चित बंधा ॥
राघव दूत सोई सैतानू । माया अलाउदीन सुलतानू ॥
प्रेम-कथा एहि भाँति बिचारहु । बूझि लेहु जौ बूझै पारहु ॥
ఆ విషయమును జాయసీ నే పై విధముగా పుష్ఠి చేస్తున్నాడు.
తనువు చిత్తౌడట, మనసు రతన్ సింగ్ /రతన్ సేన్, హృదయము
సింహళము, బుద్ధి పద్మిని/పద్మావతి, గురువు
చిలుక, నాగామతి (రతన్ సేన్ మొదటి భార్య)లోకరీతి, రాఘవ్ చేతన్ దైత్యుడు, అల్లా ఉద్దీన్ మాయామోహితుడు.
అంటే తాను ఈ
కథను వేదాంతపరముగా అల్లినానని చెప్పినాడు.
పద్మావతి లేక రాణీ పద్మిని – 2
కథను వేదాంతపరముగా అల్లినానని చెప్పినాడు.
మిగిలినది రేపు.......
కానీ ఇక్కడ మనము గ్రహించవలసిన రెండు మూడు విషయముల గూర్చి ఆలోచించుదాము.
1. ఆయన కవిత అంతా కల్పన లేక వేదాంతపరమైనదైతే వాస్తవికతలో ఉన్న వ్యక్తులను
ఎందుకు ఇందులో పాత్రలను జేసినట్లు?
2. ఇక కథ కల్పన అనుకొంటే అందులో వాస్తవిక సంఘటనలకు చోటు ఎందులకు
ఇచ్చినట్లు?
3. పద్మినిని గూర్చిన పుట్టు పూర్వములు(అంటే పెళ్ళికి పూర్వములు) చరిత్రకారుల
అందుబాటులో లేవు. అందువల్ల ఆమె పూర్వకథకు కల్పన జోడించి తన ఊహను వాస్తవానికి
అతికినాడు. శ్రీలంక, చిలుక హీరామణి, రాజా గంధర్వసేనుడు,
రాణీ చంపావతి ఇవన్నీ కాల్పనికములే!
4. పర మతస్థుడు, సూఫీ మార్గమును అనుసరించినవాడు, పారసీకముతో
అనుబంధమున్నవాడు, ఊహలను తాను అలవాటు పడిన సాహిత్యపు చాయలలోనే
వ్రాయగలడు అన్నది నిర్వివాదమన్నది నా ఉద్దేశ్యము. కానీ ఇక్కడ అల్లాఉద్దీన్
ఖిల్జీతో తన ఊహలను ఎందుకు జోడించినాడు?
5. రాజస్తానమునందు చరిత్ర వ్రాయించే అలవాటు నాటి రాజులకు లేక ఎన్నో
చారిత్రిక వాస్తవాలు జానపదుల నోళ్ళలోనే నానుతూ వుండిపోయినాయి. మరొక విషయము ఏమిటంటే, జాయిస్,
రాణీ పద్మిని కథ రాజస్థానములో పౌరుల నోళ్ళలో నానుతూ వున్న కథకు,తరువాతి
కాలమువారు తమ కల్పనలను జోడించే అవకాశము
ఎంతో వుంది. జౌహర్ కుండ్ లో అగ్నికి ఆహుతి అయిన ఉదంతములు మనము రాజస్థాన్ చరిత్రలో
జరిగినట్లు చదువుతాము. మరి పద్మిని అగ్నికి ఆహుతియైన వాస్తవిక కథనమును జాయసీ
యధాతథముగానే గ్రహించినాడేమో! నేటికినీ మనము చిత్తూర్ దుర్గములో జౌహర్ కుండ్ ను
చూడవచ్చును.
ఈ 5వ విషయమును బలపరచుతూ క్లుప్తముగా రాణీ పద్మావతి కథను, నరేంద్ర
మిశ్ర అను రాజస్థాన్ ప్రభుత్వ ఆస్థాన కవి, గోరా బాదల్
అన్నమహావీరుల సాహసమును మరియు ఆయన వ్రాసిన
కొన్ని పంక్తులను గమనించుదాము. వారు వ్రాసిన ఈ కవిత చదువుతూ ఉంటేనే ఎక్కడ లేని
ఆవేశము వస్తుంది. ఈ కావ్యమును నేడు ఉత్తర భారతమున అత్యధిక ప్రఖ్యాతి గాంచిన డా.
కుమార్ విశ్వాస్ ను అమితముగా ప్రభావితుని చేసింది. ఇంకా వుంది .....
పద్మావతి లేక రాణీ పద్మిని – 3
13వ శతాబ్ధము అంత్యము మరియు 14వ శతాబ్దపు
ఆరంభములో అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్
మీద కన్ను వేసినాడు. దురాశతో దండెత్తినాడు కానీ దుర్గమమైన ఆ దుర్గము కొండపై
నుండుటచే జయించ లేక వెనుదిరిగినాడు.
రతన్ సింగ్ కొలువులో రాఘవ్ చేతన్ అనే గొప్ప సంగీత
విద్వాంసుడు ఉండేవాడు. గొప్ప విద్వాంసుడను పేరు రాణీ వాసమునందు గాన్చినాడు. కానీ
అతను మంత్రవాది కూడా! వామాచారము రాజ్యములో నిషిద్ధము. రాజు ఒకనాడు రాఘవ్
దుశ్చర్యను గమనించుటచే ఆతనిని దేశ బహిష్కృతునిచేసినాడు. ఆతడు పద్మావతి వద్దకు పోయి
మొరపెట్టుకొంటే తన సంగీత పాండిత్యమును గతములో ఎంతగానో మెచ్చకొన్న పద్మావతి, తన చేతి బంగారు గాజును బహూకరించి
ఇంతకుమించి ఏమీ చేయలేనని చెప్పింది.
ఆ దుర్మార్గుడు ఖిల్జీ వద్ద తన సంగీత విద్య తో
తన్మయునిజేసి, ఖిల్జీ వానిని పొగడగా నా సంగీతము
రాణీ పద్మిని సౌందర్యము ముందు బలాదూరన్నాడు. స్త్రీ జాతిని మన పూర్వులు 4
విధములుగా విభజించినారు. అవి 1. పద్మిని 2. హస్తిని, 3.
చిత్తిని, 4. శంఖిని. ఈ నలుగురిలో, గుణముల
బట్టి, పద్మిని జాతి స్త్రీ అత్యంత శ్రేష్ఠమైనది . ఆయా జాతి
స్త్రీల గుణగణములు ఇప్పుడు మనకు అనవసరము. అందువల్లనే ఆమె పేరు పద్మిని అన్న మాట
ప్రచారములోనికి వచ్చిందని లోకులు అనుకొంటారు.
చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రావల్ రతన్ సింగ్
కు ఒక వర్తమానం పంపించినాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేనుఎంతో విని
యున్నాను. ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకొనుచున్నాను అని వర్తమానముయొక్క సారాంశము.
రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించినారు. రాణి
పద్మినితో చర్చించినారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక
స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ద్రత, స్నేహాన్ని
మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని
దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం నిజమని నమ్మటము వారు చేసిన తప్పు. నమ్మినారు
కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపి మన రాణి గారికి సోదర తుల్యుడుగా
అతణ్ణి గౌరవించుదాము” అని తీర్మానించినారు. ఆ సమయమున ప్రధాన సైన్యాధ్యక్షుడగు గోరా
అందుకు తన అసమ్మతిని తెలిపినాడు. రాజుకు కోపము వచ్చి రణనీతిని వదలి రాజనీతి ని
చేపట్టినవానికి సైన్యాధికారము తగదని దేశ బహిష్కరణ గావించినాడు.
అప్పుడు గోరా, అదే ఆస్థానములో ఉద్యోగియైన,
తల్లిదండ్రి లేని పిల్లవాడగుటచే తానే పెంచిన తన అన్న కొడుకు బాదల్
తో రాజుకు నీడలా వుండి రాజ్యమును కాపాడుమని తెల్పి అడవులకేగినాడు.
రాజు తాము తలచిన విధముగానే ఖిల్జీకి
కబురుపంపినారు. చంకలు గుద్దుకొంటూ ఖిల్జీ మెరికలవంటి సిపాయీలతో చిత్తౌడ్ చేరినాడు.
రాజు రాణారతన్ సింగ్, మంత్రులూ, చిత్తోడ్
ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ఠ అతిధిగా గౌరవించినారు. విందు తర్వాత
రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపించినారని, ఆమెకు
బదులు ఒక సౌందర్యవతియైన
సేవికను చూపినారని పలువిధములగు వార్తలు
ప్రచారములో వున్నాయి. ఖిల్జీ తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను
కొనసాగిస్తూ రాణా చేయి పట్టుకొని రాజద్వారపు గుమ్మము వరకు నడిచి, ముందే కుట్ర పన్నిన విధముగా తన
సైనికులతో రాజును బంధించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినిని తనకు
లొంగిపోవలసిందిగా కబురు పంపించినాడు.
ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి
గురియైన తరువాత రాణి పద్మినికి తెలిసివచ్చింది రాజ తంత్రములో తెల్లనివన్నీ పాలు
కాదని.
అల్లాఉద్దీన్ ఖిల్జీ ఎంతటి దుర్మార్గుడు అన్నది
నేను కొన్ని నెలల క్రితము వ్రాసియుండినాను. అందువల్ల ఇక్కడ ఆతని ప్రస్తాపన తేలేదు.
రాణీ పద్మినికి అడవులకు వెళ్ళిన గోరా అపుడు
గుర్తుకొచ్చినాడు. ఆమె అశ్వారూఢయై గోరాను వెదకుతూ అడవులు చేరినది. వెదకి వెదకి
చివరికి ఆతనిని ఒక చెట్టుక్రింద గోరా విశ్రమించుట కనిపిస్తుంది. తనకు కలిగిన
కష్టము ఆయనకు తెలిపి, ఆయన కాళ్ళపై బడి కన్నీటితో
తడుపుతుంది. అప్పుడు గోరా ఏమంటున్నాడో కవి మాటలలోనే చదవండి.
ఇంకా వుంది.........
यह क्या करती हो गोरा पीछे हट बोला
और राजपूती गरिमा का फिर धधक उठा था शोला
महारानी हो तुम सिसोदिया कुल की जगदम्बा हो
प्राण प्रतिष्ठा एक लिंग की ज्योति अग्निगंधा हो
जब तक गोरा के कंधे पर दुर्जय शीश रहेगा
महाकाल से भी राणा का मस्तक नहीँ कटेगा
तुम निश्चिन्त रहो महलो में देखो समर भवानी
और खिलजी देखेगा केसरिया तलवारो का पानी
राणा के शकुशल आने तक गोरा नहीँ मरेगा
एक पहर तक सर काटने पर धड़ युद्ध करेगा
एक लिंग की शपथ महाराणा वापस आएंगे
महा प्रलय के घोर प्रबन्जन भी न रोक पाएंगे
शब्द शब्द मेवाड़ी सेना पति का था तूफानी
शंकर के डमरू में जैसे जाएगी वीर भवानी
जिसके कारन मिट्टी भी चन्दन है राजस्थानी l
दोहराता हूँ सुनो रक्त से लिखी हुई क़ुरबानी ll
నేను యధాతథ అనువాదము చేయక, పై కవిత భావమును నా
మాటలలో తెలిపినాను.
జరిగి ప్రక్కనకు ఇదేమి తల్లీ
ఈ పని చేయకుమెపుడూ మళ్ళీ
అనుచూ నాతల మెడపై నుండగ
నరికెద రిపులను కత్తికి కండగ
మన విరోధులకు కాలకాలుడే
మన ఇలవేలుపు ఏకలింగడే
సాక్షిగ దనరగ చెప్పుచుంటిని
ఏకము చేయుచు మంటిని మింటిని
రాణా బంధ విముక్తుడు అగుచును
మేవారుకు తానొచ్చి చేరును
సందియమెందుకు ఇది నా శపథము
మెదలెను మదిలో పథకము పథముూ
మరల మరల మార్మ్రోగ తెల్పెదను
రక్త లిఖితమౌ వీరుల చరితము
రాజస్థానపు మృత్తిక కూడా
సురుచిర చందన సుగంధ భరితము
నిజంగా రాజస్థానీ భాషలో వ్రాయబడిన ఈ కవిత
చదువుతూవుంటే ఒడలు పులకరించి పోయింది.
పద్మావతి లేక రాణీ పద్మిని – 5
రాణి తోడుత గోరా కూడా చిత్తౌడ్ దుర్గము చేరినాడు. పుత్ర సమానుడగు బాదల్ తో
దేశం కోసం ప్రాణత్యాగము చేసే సమయము ఇపుడు వచ్చినది
యవన రక్తముల ఏరులు పారే కాలము ఇదుగో దాపురించినది
మంచి సమయమిది మించిన దొరుకదు పోరుకు ఉరకలు వేసెను డెందము
నడుము బిగింపుము, హూంకరించుము, చావో
రేవో తెల్చుకొందము
అని చెప్పినాడు గోరా. ఏడువందల పల్లకీలలో తన చెలికత్తెలతో వస్తూ
వున్నట్లు ఖిల్జీకి కబురు చేరినది. అంటే లోన ఒకరు మోయుటకు నలుగురు వెరసి ఐదు మంది.
మొత్తము 3,500 మంది మాత్రమే! అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి
గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ
పారవశ్యముతో కన్నుగానక యున్న ఆతని వద్దకు రాణి పనుపున వార్తాహరుడు వచ్చి
చివరిసారిగా ఆమె రాణాను చూసి ఖిల్జీ వద్దకు వస్తానని చెప్పగా సంతోషముతో
సహమతుడైనాడు ఆ మాటలకు.
రాణి పద్మిని పల్లకీలో స్త్రీ
వేషంలో ఉన్న యోధుడు గోరాయే! వెంట పెద్ద సుత్తె చేపట్టిన కంసాలి కూర్చోనియున్నాడు.
రెప్ప పాటు కాలములో జరగావలసినదంతా జరిగిపోయింది. రతన్ సింగ్ తప్పించుకొన్నాడు. అశృ
నయయనాలతో గోరాను కౌగిలించుకొని తనది తప్పని తెలుపుకొన్నాడు. గోరా ఇప్పుడు ఆ మాటలకు
తావులేదని చెబుతూ బాదల్ ను ఆయనకు అండగా నిలిపి అనుసరించమన్నాడు. గోరా కారాగారము
వద్ద ఖిల్జీ సైనికులతో తలపడినాడు. వెనుకపాటుగా ఖిల్జీ సేనాని జఫర్ ఖాన్, గోరా
తల ఉత్తరించినాడు. తల నేల వాలకమునుపే గోరా కరవాలము మెరుపు తీగెయై జఫర్ తల తుంచింది. జఫర్ ప్రాణాలు గోరాకన్నా ముందే అనంత
వాయువులలో కలిసిపోయినాయి.
అచట బాదల్ రతన్ సింగ్ ను క్షేమంగా దుర్గముచేర్చి తిరిగీ యుద్ధరంగమునకు
వచ్చి వీరోచితముగా పోరాడి అసువులు బాసినాడు. ఆ విధముగా మహా వీరులైన గోరా బాదల్ ల
చరిత్ర సమాప్తమైనది.
తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్
ఘడ్ మీదికి దండయాత్ర చేసినాడు. కొండ పై గల కోటకు నిత్యావసర వస్తువులు పోకుండా
బలమైన కట్టుదిట్టముచేసి రాణా రతన్ సింగ్ ను, ఇతర యోధుల్ని
చంపికోటను వశపరుచు కొన్నాడు. కానీ ఎంతో
కాంక్షతో అంతఃపురములోనికి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల
రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు
స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల
మీదా కూడా పడకుండా నిరోధింప దలచి తమ
జీవితములను తృణప్రాయంగా నెంచి
జౌహర్ కుండ్ లో అగ్నికి ఆహుతియై పోయినారు. మానము పోయిన పిదప మంగళ
సూత్రమును వారు కోరుకోలేదు.
మానసంరక్షణ కొరకు ఆత్మాభిమానము కాపాడుకొనుటకు వారెపుడూ చంపుటకయినా
చచ్చుటకైనా సిద్ధమే! అదీ రాజపుత్రులంటే!
స్త్రీలు అత్యవసర పరిస్థితులలో ఈ విధముగా చేసే ప్రాణ త్యాగాన్నే జౌహార్ అనిఅంటారు. ముష్కరుల
చేతుల్లో తమ మానధనాలను అర్పించలేక అగ్నికి ఆహుతి కావడాన్ని అంతకు మునుపు కొన్ని
సంవత్సరాల క్రితం రాణాథాంభోర్ జరిగినదని ఆ పిదప ఇది రెండవ జౌహర్ అని
తెలులియవస్తూవుంది.
రేపు కొంత విషయ విశ్లేషణ గావించుదాము.......
పద్మావతి లేక రాణీ పద్మిని – 6
కల్నల్ అనిల్ అథాలే
గారు గతములో చరిత్ర విభాగ ప్రధాని గా (Head) (రక్షణ విభాగ మంత్రిత్వ శాఖ) పనిజేసి విశ్రాంతి
గైకొనుచున్నారు. ఇపుడు నేను మీ ముందుంచు అభిప్రాయము వారిదే! వారిపుడు పూణే లో
విశ్రమించుచున్నారు.
"14 వ శతాబ్దమునకు చెందినా రాణీ పద్మావతి అగౌరవమునకన్నా
ఆత్మార్పణయే మిన్న అని తలచి అల్లావుద్దీన్ వాత బడకుండా అగ్ని గుండమునకు
ఆత్మార్పణము గావించుకొన్న ఆదర్శ వనిత. చిత్తౌడ్ లోని పద్మినీ అంతఃపురము
మరియు మిగత రాణులతో మరియు సైన్యాధి పతుల సతీమణులతో ఆమె ఆత్మార్పణము గావించుకొన్న జౌహరు కుండమును తిలకించితే ఒడలు పులకించుటయే గాక ఎనలేని గౌరవ ప్రపత్తులు నాటి ఆదర్శ మహిళల పై మనకు
ఎనలేని గౌరవ ప్రపత్తులు కలుగుతాయి. అటువంటి ఒక ఆదర్శ మహిళ యొక్క చలన చిత్రమును
చేబూనిన వారు నాట్య దృశ్యములు స్వప్న దృశ్యములతో చలన చిత్రమును నిర్మించవచ్చునా!
అదే ఫ్రెంచ్ వీర వనిత
యైన జోన్ ఆఫ్ ఆర్క్ ఒక అతి సామాన్య కుటుంబంలో ఫ్రాన్సులో లోరేన్ రాష్ట్రానికి
దగ్గరలో ఉన్న డొయ్రెమీ అనే గ్రామంలో 1412లో జన్మించింది. ఫ్రాన్సు భూభాగామును కబళించుటకు బ్రిటీషు రాజు ప్రయత్నముచేస్తే పురుషవేషమున సైన్యమును నడిపించి బ్రిటీషు
వారిని గడగడలాడించింది. బ్రిటీషు వారికి బందీగా చిక్కి వీరగతిని ప్రాప్తినందింది. మతము
చేతిలో సజీవ దహనమునకు గురియైన జోన్, 500 సంవత్సరాల తర్వాత
అదే మతముచే దేవదూతగా కీర్తింపబడింది. మరి అటువంటి వీరవనిత చిత్రమును పాశ్చాత్యులు
తీసిన యెడల మనమందు ఆర్క్ నర్తించుట లేక స్వప్న సుందరియై ఒక హీనమగు తలంపు కలిగిన
దుష్టుని కలలో మెలికలు తిరుగుట ఊహించుకొనగలమా! మన మనస్తత్వము శ్రీనాథుని ఒక చాటువును
చాటుచున్నది. ఆ పద్యమును ఇచటఉటంకించుట అసభ్యము కావున ఆయన అభిప్రాయమును వేరు
విధముగా చెప్పుచున్నాను. యౌవ్వనమున మగవానికి మీసాలు క్రొత్తగా అంకురించుతున్నాయా!
లేక పైపెదవి లోపలి పొరలలో ముందునుండే ఉన్నాయా! అన్న 'ప్రధ్వంసా భావము - ప్రాగభావము' అన్న
తర్క శాస్త్ర రీతిలో నిరుపయోగామయిన తర్కముతో నిజమును నీరుగార్చుచున్నాము.
మరొక విషయము, నా
ఆప్తమిత్రుడగు నీలకంఠా రెడ్డి గారు తాను స్వయముగా ఆ కోటను ఎంతో విమర్శనాత్మకముగా
చూసి వచ్చినారు. ఆయన పద్మిని చరితమును అక్షరమక్షరమూ బలపరచుచున్నారు.
ఇక, ఈ వాస్తవమును ఒకసారి
పరికించుదాము.
చరిత్రకారుడగు జియాఉద్దీన్ బరానీ (1285 – 1357)
ఖిల్జీ మరియు అతని ప్రియుడు బానిస మరియు అంతేవాసి అయిన మాలిక్ కాఫర్ ను గూర్చి ఏమంటున్నాడో
ఒకసారి పరికించుదాము.
“సుల్తాను అవసాన దశకు చేరి తన జ్ఞాపక శక్తిని కూడా పోగొట్టుకొన్న చివరి
4,5 సంవత్సరములలో మాలిక్ మీద అధికముగా ఆధారపడవలసి వచ్చినది. అటు రాజ్యభారమునే కాక
ఇటు కృతఘ్న, నిరుపయోగ, అకారణ అనుగ్రహార్త మరియు అసమంజస లైంగిక వ్యవహారులను
కనిపెట్టి శిక్షింప అధికారములను ఆతనికి ఇవ్వటము జరిగినది. పన్నులను నియంత్రించి
ప్రజలకు మేలుచేసినాదన్న వారాలకు ఈ చరిత్రకారుడు ఏమి చెబుతున్నాడంటే ఈ క్రొత్త
విధానము వల్ల భూమిపన్ను పంటయొక్క ఆదాయములో
5౦% చెల్లించవలసి వచ్చేదట.
కాఫర్ అంటే సరిపోని ఉన్నతాధికారులు, ఖిల్జీ సలహాదారులు, ఆతనిని
చంపివేస్తారు.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయమునందు Doctorate కొరకు ప్రయత్నించుచున్న ఋచిక
శర్మ అను ఒక విద్యార్థిని ఏకంగా ఖిల్జీ వంటి మహానుభావుని అప్రతిష్ఠ పాలుజేసి తమ
గొప్పదనము చాటుకొనుటకు ఆతనిపై ఈ పద్మావతీ అభియోగామును ఆపాదించినారని వచించినది. ఇందులకు
ఆమె ఇర్ఫాన్ హబీబ్ అన్న 18వ శతాబ్దపు చరిత్రకారుని వుటంకించుతూవుంది. బహుశ ఆమెకు
ఖిల్జీ మరణము తరువాత నాలుగు వందల సంవత్సరముల
తరువాత వ్రాసిన యీతని రచన తప్ప ఖిల్జీ కాలములోని చరిత్రకారులు వ్రాసిన లేక ఆతని
తదనంతరము, 14వ శతాబ్దమునకు దగ్గరగా వుండిన చరిత్రకారులు వ్రాసిన ఆధారములు
దొరకలేదేమో! ఆమె మాటలలోనే యథాతథముగా
విషయమును చదవండి.
Ultimately Khilji is
referred to as the “People’s King” who implemented a series of reforms that included
a new taxation system and the introduction of an espionage system ostensibly
for the welfare of the people”
‘Speaking Tree’ అన్న శీర్షిక క్రింద నేను చదివిన ఆంగ్ల రచన లోని ఈ వాక్యములు చదవండి:
What remains till
date, a matter of argument is Alauddin Khilji’s sexuality. Many historians
claim that the ruthless Khilji ruler was bisexual and a paedophile. During his
reign, Alauddin declared himself to be The Prophet. He even went to the extent
of forced Qazis, into manipulating religious approvals suiting his whims and
fetishes.
Slave market: And,
one fact which remained well-guarded until recently, is the involvement of
Indian-born general Malik Kafur in his personal life. According to Devdutt
Pattanaik, Once during his visit to the famous slave market ‘Baccha Bazi’ in
Gujarat, Alauddin purchased Malik, after being left mesmerised by his beauty.
Jayasi’s folklore
also mentions Alauddin Khilji’s heterosexual personality.
According to
Jayasi’s poem, Alauddin’s lust for his sexual passions, had reached such a
level that it is said his harem had more than 70,000 males, females and
children. Of which, 30,000 women, were the widows of men that he killed in one
day.
ప్రేమికుడగు మాలిక్ కాఫర్ ను నమ్మినందుకు అతని చేతనే చంపబడుతాడు . తానూ
సుల్తాన్ కాగలనని తలచిన మాలిక్ కాఫర్ కూడా చంపబడుతాడు. ఇదీ మన దేశమును పాలించిన
సుల్తానుల చరిత్ర.
ఇక ఖిల్జీ ప్రవేశ పెట్టిన పన్ను విధానమును చాలా క్లుప్తముగా పరిశీలింతము.
About Khilji
implementing his series of wide-ranging agrarian and fiscal “reforms”. The
piece is not only factually misleading, it is also a propaganda masquerading as
an informed opinion that seeks to subvert the history of oppression and
violence against a people.
By the time Khilji
came to power, Muslim rule had been established over most of north India for
over a century during which Afghan and Turkic warlords acquired large landholdings
and established themselves as middlemen between the state and the peasantry,
eating into the power and influence of the Hindu warlords.
The historian
Zia-ud-din Barani, writing shortly after Khilji’s death, informs us about the
consequence of Khilji’s taxation system:
While the
cultivators were free from the demands of the landowners, the high taxes
imposed by the state meant they had “barely enough for carrying on his
cultivation and his food requirements.
ఇన్ని వాస్తవాలను కాలదన్ని , వీరాధి వీరులు, అసమాన పౌరుషవంతులు అగు రాజపుత్రులను
కాదని, పరిస్థితులు ప్రతికూలించినపుడు పతిగౌరవమే తన గౌరవమని ప్రాణాలను త్యజించిన
సాధ్వి రాణీ పద్మిని లేక పద్మావతికి నివాళులు అర్పించలేని హైందవుడు ,హైందవుడా
అన్న అనుమానము కలుగక మానదు.
స్వస్తి
స్వస్తి
Facebook comment:
Sudha Jandhyala: మీరు చెప్పిన విషయములు అన్నీ సరియైనవే.కాని మన సినిమాలలో ఇలాంటి
దుశ్చర్యలు చూపటం కొత్తకాదు.ఒక దేవుని సినిమా అయినా ఒక పౌరాణికమైనా ప్రజలని తప్పు
ఆలోచనల వైపు ఉదా: శ్రీ కృష్ణుని రాసలీల అలాగే రామాయణంలో శూర్పణఖ స్వప్నాలు ఇలా
చెప్పుకుంటూ పోతే ఎన్నో.ఇలాంటి ధోరణి మారాలి.మారితే వాళ్లకి కాసులు రావు.కనుక
చరిత్ర కాని ఏదైనా వక్రీకరిస్తారు.ఫలితం తో వాళ్లకి సంబంధం లేదు.ఈ వ్రాతలు,చెప్పటాలు కంఠశోష గ్రుడ్డివాని ముందర అద్దం పెట్టటంలాంటిదే
అవుతోంది.ఎప్పడో మార్పు రావాలి.రావాలనే మీతాపత్రయంతో కాస్తన్న కదలిక వస్తే సంతోషం.
చెరుకు రామమోహన్ రావు జవాబు
మీ మాటలు అక్షర సత్యములు. కానీ నేను ఫలితమునాశించి పనిజేయుట
లేదు.వేలమందిలో ఎ ఒక్కరికి కనువిప్పుగలిగి మన ధర్మ రక్షణకు కంకణ బద్ధులయినా నా
కృషికి గుర్తింపు వచ్చిందనే భావించుతాను.నా బాధ సినిమాను గూర్చి కాదు. సనాతన
ధర్మమును ఆచరించేవారే ఆ ధర్మమునకు గండికొట్ట ప్రయత్నము చేస్తున్నారు. నిజముగా
రాజస్థాన్ వెళ్లి చిత్తౌడ్ దుర్గమును చూసి అందలి జౌహర్ కుండ్ ను తిలకించి కంట తడి
పెట్టుకొన్న ఆంధ్రులలో నా మిత్రులు కొందరున్నారు.
ఇక సినిమాల గూర్చి అంటారా! దానవీర శూర కర్ణ లో భానుమతికి దుర్యోధనునికి ఒక
యుగళ గీతం వుంది. అది దర్శకుని వూహ. వారు భార్యాభర్తలు కావున దర్శకుడు ఊహాత్మకమైన
ఆ పాటను అందులోో జొప్పించినా నాటకీయతకు భంగము వాటిల్లలేదు. అదే ద్రౌపది తో
దుర్యోధనునికి స్వప్న సన్నివేశము గానీ, లేక ఏ శూర్పణఖ కలలోనో రాములవారితో ఒక యుగళ గీతము
నాలపించినట్లుగానీ చిత్రీకరించితే ఔచిత్యభంగము ఆగ్రహ కారకము ఔతాయి.
కావున సినిమాలలో అటువంటివి చూపితే 'ఈ సినిమా' గతే పట్టియుండేది. 'మాయా బజారు' భారతములో లేని కల్పన. కానీ ఊహ పాత్రల
ఔచిత్యమునకు భంగము కలిగించలేదు. అందుకే ఆ ఊహను అమితముగా ఆదరించి కళాఖండముగా
నిలిపినారు.
ఇక నా కృషి విషయం.నేను పడుతూ వుండే కష్టాన్ని గమనించినారు. కృతజ్ఞుణ్ణి.
మన గ్రంధముఖి బృందములో ఎంతో మంది చదువుకొన్నవాళ్ళు, అనుభవజ్ఞులు, వయోవృద్ధులు కొన్ని
ప్రచురణలపై వారి వ్యాఖ్యలను చూస్తే ఎంతో అసందర్భముగా వుంటాయి. అందుకే నేను
వ్యాసములో 'ప్రధ్వంసా భావము - ప్రాగభావము' అన్న తర్క శాస్త్రములోని సంఙ్ఞలను వాడుచూ కొందరి వ్యాఖ్యలు ఈ విధముగా
వుంటాయి అని వ్రాసినాను.
ఆశ చెడ్డది, కస్నీ మంచిని ఆశించుతూ కృషి చేస్తున్నాను. నా తరువాతి
కాలమునకైనా దానిని గుర్తించి స్వధర్మ రక్షణము గావించినా చాలు. అట్లు లేకున్నా నా
సంతృప్తి నాది.
మనసారా, మీరు
శ్రమ తీసుకొని వ్రాసిన అభిప్రాయమునకు శిరసా నమస్కరిస్తున్నాను.
Suseela Palepu
Suseela Palepu Rani
padmavathi seeta, droupadi, jhansi laagaa thama soldiers tho yeduruthirigi
yudham chesinatlayithe satisahagamanaalu stri anachivethalu vundevi kaademo
Anduke Rani padmavathi story ni charitraka puranaalloki cherchaledu.antha
goppaga mana Bharatheeyulu aalochincharu. Idi Arabic lipilo vundante daanardham
Yemiti?
Like · Reply · 1
hr · Edited
Manage
Cheruku Ramamohanrao
Cheruku Ramamohanrao
అరబ్బీ లిపిలో సుల్తానుల దౌష్ట్యమునే గోప్పదనముగా భావించి నాటి,
వారిచే సమానిమ్పబడిన, చరిత్రకారులు
వ్రాసినారు. ఆయా కాలముల తరువాత వ్రాసిన వారివల్లనే మనకు నిజము తెలియుచున్నది.
సీత ద్రౌపది ఝాన్సీ లలో కూడా ఎంతో వ్యత్యాసమున్నది. ఝాన్సీ లాగా సీతా
ద్రౌపదులు యుద్ధము చేయలేదు. ఒకవేళ మీరన్నట్లు పద్మావతి రణరంగమునకుపోయి ఖిల్జీ కి బందీ అయివుంటే ఆమె శీలము ఏమయి ఉండేదని ఊహించగలరు.
"యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్న
ఆర్యవాక్కును పాటించిన భూమియిది. చదువుల తల్లి సరస్వతి. సపద రాణి మహాలక్ష్మి,
శక్తి దాత పరాశక్తి.
ఘోష, లోపాముద్ర,
సులభ, మైత్రేయి, గార్గి,
మొదలగు స్త్రీలు వేదము చదివిన వారు.
అంతెందుకు శంకర మండనమిశ్ర సంవాదములో న్యాయ నిర్ణేత మండన మిశ్రులవారి సతీమణి
ఉభయ భారతే!
ఈ దేశపు స్త్రీలను తక్కువచేయవద్దు. 14 వ శతాబ్దము వరకు స్త్రీకి అత్మలేదు, ఆమె
పురుషుని విలాస వస్తువు అను ప్లాటో మాటలు నమ్మిన వారు పాశ్చాత్యులు.
No comments:
Post a Comment