ఘజియాబాద్
గతము ఘన కీర్తి కలిగియున్నా, గతము కంటకప్రాయమైనదై
ఉన్నా, గతమునందు నరరూప రాక్షసుల వాతబడి కోట్లాది స్వజనులు అసువుల
బాసినా, మనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఎందుకంటే మన ధ్యానము,
ధ్యాస, ధ్యేయము ధనార్జన మాత్రమే! దానికొక పరిధి,పరిమితి ఏమాత్రమూ లేదు. అసలు మన నాయకుల సముపార్జనకు ఆకాశమే హద్దు. ఒకవేళ వారికి
ఊర్ధ్వ లోకములకు పోవు సమయమున ఏమయినా ప్రత్యేక వెసలుబాటు ఉందేమో!
అది గతమని తలచి నింపాదిగా ఉండిపోతే మన పూర్వ వైభవము
గుర్తించి తిరిగీ దానిని భూమిపై ప్రతిష్ఠించగలమా! అణువిఘాతముచే అణువణువూ నేలమట్టమయిన
హిరోషిమా నాగాసాకీని పట్టించుకోకుండా వదలిపెట్టి ఉంటే జపాను ఈనాడు ఇంత ప్రగతి సాదించి
ఉండేదా!
వారి సంస్కారమును గూర్చి ఒక్కమాట చెప్పి ఈ ఉపోద్ఘాతము
చాలించుతాను. జపాను వెళ్ళిన భారతీయుడొకడు అక్కడి రైలులో ప్రయాణము చెయవలసి వచ్చినది.
ఇక్కడి వలెనే ఎదుటి Seat పై కాళ్ళను నిటారుగా సాచి ఉంచినాడు. ఆ కాళ్ళను
ఆనుకొని కూర్చున్న జపానీయుడు వెంటనే ఆ కాళ్ళను తన ఒడిలో ఉంచుకొన్నాడు. భారతీయుడు ఎందుకు
ఆవిధముగా చేసినారని అడిగితే అది మరొక్క వ్యక్తి కూర్చునుటకు కేటాయింపబడిన స్థలము,
కాళ్ళను ఉంచుకొనుటకు కాదు. ఇక మీ కాళ్ళను నా ఒడిలో ఎందుకు ఉంచుకొన్నానంటే
మీరు మా అతిథులు, మీకు ఉచిత రీతిని సపర్య చేయుట మా ధర్మము
అన్నాడట ఆ జపానీయుడు. ఆయన చూపినది ఒకనాటి మన సంస్కారము. నేడు మనకు వంటబట్టినది అసహ్యము
అసభ్యమయిన సంస్కారము. ఇది ఎవరి వద్దనుండి నేర్చుకొన్నామో నాకయితే అంతుబట్టలేదు.
ఇక ఘజియాబాద్ ను గూర్చి తెలుసుకొందాము.
ఘజియాబాద్
https://cherukuramamohan.blogspot.com/2017/05/blog-post_24.html
పురాణములననుసరించి ధర్మరాజునకు 7 వ తరము వాడయిన
నిచక్షు అను రాజు, తన పరిపాలనా
కాలములో బీభత్సమును సృష్టించిన వరదల వల్ల తన రాజధానిని వత్స దేశపు నగరమగు కౌశాంబిని
రాజధానికి అనుకూలమగు నగరముగా తయారు చేయించి అచటికి మార్చినాడు. ఈ వంశము యొక్క 26 వ తరపు రాజు 'రాజా ఉదయనుడు'. ఈ నగరము మహాభారత
కాలములో లేదు గానీ ఈ ప్రాంతపు ఉనికి మాత్రము ఎన్నో శతాబ్దములకు పూర్వము కూడా
కనిపిస్తుంది. జాతక కథలలో కౌశాంబి ని
గూర్చి అనేక మార్లు వినవస్తుంది. గౌతమ బుద్ధుని కాలములో దేదీప్యామానముగా వెలుగుచుండినది
ఈ నగరము. కాళిదాస, భాస, క్షేమేంద్ర
మహాకవుల గాథలు ఈ ప్రాంతముతో ముడిపడి ఉన్నాయి.
ఈ నగరము ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో వుంది. ఇది ఘజియాబాద్
జిల్లాకు కేంద్రమగు ఘజియాబాదునకు 13 కి.మీ. దూరమున 15 నిముసముల ప్రయాణ సమయమును కలిగియున్నది.
ఇక ఘజియాబాద్ నగరమును గూర్చి తెలుసుకొందాము. దానికి పూర్వము
ఘాజి అన్న మాటకు అర్థమేమి అని తెలుసుకొందాము.
ఒట్టోమాన్ రాజవంశ కవియగు అహ్మదీ1402 లో వ్రాసిన వ్రాత
ప్రకారము ఘాజి అన్న మాటకు ఈ విధమగు అర్థము
చెప్పబడినది. గూగుల్ నుండి నేను సేకరించినది యథాతథముగా మీ ముందుంచుచున్నాను.
“The Ottoman
poet Ahmedi, writing ca. 1402, defines ghazis as "the instruments of God's
religion, a servant of God who cleanses the earth from the filth of
polytheism." (Lewis, The Political Language of Islam, pp. 147–148, note 8)
అదే పదమునకు ఆంగ్ల పదకోశములు ఏమి అర్థమును తెలుపుచున్నవో
ఒకసారి గమనించండి.
gha•zies
1. A Muslim
who has successfully fought against non-Muslims.
2. Used as a
title for such a warrior. (The free Dictionary. com)
The Cambridge
History of Turkey defines Gaza as "a raid for plunder, later came to mean
holy war fought for Islam.
అసలు ఈ 'ఘజ్వా' అన్నది
ఎట్లు ప్రాచుర్యములోనికి వచ్చిందో గమనించండి.
When
performed within the context of Islamic warfare, the ghazw's function was to
weaken the enemy's defenses in preparation for his eventual conquest and
subjugation. Because the typical ghazw raiding party often did not have the
size or strength to seize military or territorial objectives, this usually
meant sudden attacks on weakly defended targets (e.g. villages) with the intent
of demoralizing the enemy and destroying material which could support their
military forces. Though Islam's rules of warfare offered protection to
non-combatants such as women, monastics and peasants (in that they could not be
slain), their property could still be looted or destroyed, and they themselves
could be abducted and enslaved (Cambridge History of Islam, p. 269)
ఇక ఇటీవలి కాలములో నవంబరు 2015 లో పారిస్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల
సందర్భముగా ఆ ఉగ్రవాది మూక ఏమి చెప్పిందో చూస్తాము:
Gazawat as
holy war: After the terrorist attacks on Paris in November 2015, the Islamic
State group is said to have referred to its actions as "ghazwa".
Probably the most famous use of the term "ghazwa" is in the phrase
'Manhattan Raid', used by Al-Qaeda to refer to the September 11th attacks.
అంటే పై విషయములవల్ల మనకు ఘజ్వా అన్న మాటకు 'ఇస్లామేతర మానవాళి' వినాశనము అని మనకు
అవగతమగుచూ వుంది.
తిరిగీ ఇపుడు ఘజియాబాదు యొక్క పూర్వ చరిత్ర తెలుసుకొందాము. ఈ
నగరము క్రీస్తుకు పూర్వము 2500
సంవత్సరముల నాటి చరిత్ర కలిగి వుంది. ఘజియాబాద్ ను ఆనుకొని ప్రవహించు హిందన్ నది
తీరములందు మోహన్ నగర్ కు దగ్గరగా, త్రవ్విన
త్రవ్వకములలో బయల్పడిన కొన్ని గ్రామములు
ప్రాంతములు మహాభారత రామాయణ కాలము నాటివి. వానిలో 'ఘర్ముక్తేశ్వర్' 'పూత్' 'అహర్' ప్రాంతములు 'మహాభారతము'నకు అనుబంధమై
యుండగా, 'లోని' కోట, రామాయణములో, శతృఘ్నుని చే
వధింపబడిన 'లవణాసురు'నిది గా
గుర్తిపబడుచున్నది. అసలు 'లోని' అన్న పేరు బహుశ 'లావణి' అని తనపేరు తో లవణాసురుడు తన పేరుతో నిర్మించుకొన్న ఆ కోట 'లోని' అయినదేమో! అసలు
సముద్ర గుప్తుడు ఇచట అశ్వమేధ యాగము చేసినట్లు ఇచ్చటి త్రవ్వకముల ద్వారా తెలియ
వచ్చుచున్నది. 1740 తుగ్లక్
రాజులకు వజీరుగా నుండిన వజీర్ ఘాజీయుద్దిన్ తనపేరు పెట్టి ఈ నగరమునకు తనదైన శైలిలో
కొన్ని మార్పులు చేసి ' ఘజీయుద్దీన్
నగర్' మార్చినాడు.
కాలాంతరములో ఈ పేరును కురుచచేసి 'ఘజియాబాద్' గా
నామకరణము చేసినారు.
పర్షియా, మొసపుటేమియా మున్నగు దేశములను జయించిన పిమ్మట భారత దేశము ముస్లీము దేశము
కాకపోవుట, అవధికందని
అందలి సంపత్తి, అంతకన్నా
ముఖ్యముగా అచటి దేవాలయములను కూల్చి అందలి సంపదను వశము చేసుకొనుట అన్న ధృడమైన
ఆలోచనలతో, అప్పటికే
తనదైన శైలిలో దేశమును నాశనము చేసి పాలకుడై ఏలుచున్న సుల్తాన్ నసీరుద్దిన్ ముహమ్మద్
తుక్లక్ తో 1938
యుద్ధమునకు దిగి దేశమును నాశనము చేయుచూ, వేలకు వేల కోట్ల విలువ చేసే దేశ సంపదను, లక్షలాది
భారతీయులను, విగత జీవులను చేసి తన కైవశము చేసుకొన్నాడు. తాను చేసిన ఈ పైశాచిక
చర్యను 'ఇస్లాము యొక్క
ప్రాబల్యము కొరకై అల్లా పేరుతో చేసిన పవిత్ర కార్యముగా' చెప్పుకొన్నాడు.
'పళ్ళూడగొట్టుకొనుటకు
ఏ రాయి అయితేనేమి' అన్నట్లు
ఏ ముస్లిం పాలకుడయినా చేసినది భారత దేశ నాశనమే! స్వాతంత్ర్యము సాధించినా మనము మన
పట్టణములకు, ఊర్లకు, ప్రాంతములకు, పల్లెలకు వారి
పేర్లు కలిగియుండవలసినదేనా!
పాకిస్తాన్ ప్రభుత్వము
తమ దేశములోని కరాచీ లోగల 'రాంబాగ్' ను 'ఆరాం బాగ్' గా మార్చింది.
లాహోర్ లోని 'వన్ రాధారాం' ను ' హబీబ్ కోట్' గా
మార్చింది.
1970 లో
బలూచిస్తానములోని 'హిందూ
బాగ్' ను 'ముస్లిం బాగ్' గా మార్చింది.
ఇటువంటివి ఎన్నో! ఎన్నెన్నో! నేను చూపినది మచ్చుకు మాత్రమే!
హరూన్ ఖాలిద్ అన్న ప్రముఖ రచయిత వ్రాసిన, వ్రాయ బోవుచున్న
పుస్తకములు,
A White Trail
and two forthcoming books, In Search of Shiva and Walking with Nanak. చదివితే
మనకు అచ్చటి పరిస్థితి అర్థము కాగలదు.
మనదేశములో ముస్లిం పాలకుల పేర్లతో ఏర్పడిన ప్రాంతముల పేర్లు
నేటికి కూడా నాటి పాలకుల దౌష్ఠ్యమునకు ప్రతీకగా వారిపై మన విధేయతకు దర్పణముగా
అలహాబాదు, ఔరంగాబాదు, హైదరాబాదు, ఫిరోజ్ పూర్, ఫిరోజ్ కోట్, ఆదిలాబాద్, వంటి ఎన్నో
ప్రాంతములు స్వాతంత్ర్యము వచ్చి 70 సంవత్సరములయినా ఎటువంటి మార్పు లేకుండా యథా
తథముగా ఉన్నాయి. ఈ విధముగా చెప్పుకొంటూ
పోతే అవి లెక్కకు మిక్కుటములు.
నేను ఈ వ్యాసమును వ్రాయుటలోని కారణము ఏమిటన, బహు
విగ్రహారాధకులమగు మనకు వారిమతము శత్రువు కాకపోయినా, ఇస్లాం మతమునకు వారి మతగ్రంధము ప్రకారము మనము శత్రువులము.
అటువంటి వారిని చంపి తన విధేయతను 'అల్లా'కు చాటేవాడు 'ఘాజీ'. మరి
అధికసంఖ్యాకులమగు మనదేశములో ఇంకా ఇటువంటి
పేర్లు గల ఊర్లలో నిర్లజ్జగా నివసించుచున్నామే మనకు స్వాభిమానము లేదు కానీ అది రాదా అది రాకూడనిదా! ఎంతో పురాణ
ప్రశస్తి కలిగిన కౌశాంబిగా ఈ నగరమును మార్చ కూడదా! ఆ జిల్లాకు 'కౌశాంబి' అన్న పేరు పెడితే మన దేశము యొక్క ప్రాచీన
వైభవమునకు వన్నె తెచ్చినవారము కామా! మీరే ఆలోచించండి.
స్వస్తి.
No comments:
Post a Comment