రుద్ర సూక్త ధ్యాన శ్లోకం
యజుర్వేద తైత్తిరీయ సంహితలోని రుద్ర నమక ధ్యాన శ్లోకము అందరికీ తెలిసినదే.
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకామ్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో2భిషించేచ్చివం ||
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకామ్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో2భిషించేచ్చివం ||
కృష్ణయజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకంలో నాలుగవ ప్రశ్న, ఘోష శాంతి సూక్తం ఉన్నది. పాతాళము నుండి నభస్థలాంతము వరకు వ్యాపించిన జ్యోతిర్లింగ రూపుడైన రుద్రమహాదేవుని అభిషేక క్రియ ఇందులో ఈ విధముగా వర్ణింపబడి ఉన్నది. ప్రాగ్దిశ నుండి అష్ట వసువులు గాయత్రీ చందస్సులో మహాదేవుని స్తుతిస్తూ అమృతముతో అభిషేకిస్తున్నారు. దక్షిణ దిశనుండి ఏకాదశ రుద్రులు త్రిష్టుప్ చందస్సులో రుద్రుని స్తుతిస్తూ అభిషేకిస్తున్నారు. ద్వాదశాదిత్యులు ప్రతీచీ దిశనుండి జగతీ చందస్సులోనూ, ఉత్తర దిశనుండి విశ్వేదేవతలు అనుష్టుప్ చందస్సులోనూ అభిషేక క్రియ నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండములో ఊర్ధ్వ దిశనుండి దశ దిశలనుండి బృహస్పతి పఙ్క్తీ చందస్సులోని మంత్రములతో అభిషేక క్రియ నిర్వహిస్తున్నాడు. (“Structure of the Universe – Vedic” by K Sivananda Murty, 2013)
పింగళుని ఛందశ్శాస్త్రంలో సూత్రములు ఇలా ఉంటాయి. (గాయత్ర్యా వసవః (3.3), జగత్యా ఆదిత్యాః (3.4), విరజో దిశాః (3.5), త్రిష్టుభో రుద్రాః (3.6)….) పింగళుని సూత్రాలకు ఆధారం వేదమే! వేద మంత్రములనుండి, పింగళుని చందశ్శాస్త్రమునుండి బ్రహ్మాండ నిర్మాణమును ఊహించుకొనవచ్చును.

No comments:
Post a Comment