లింగం
లిమః గమయతీతి లింగం : అంతము అంటే లయముతో ప్రారభంయ్యేది లింగము.
లిం గమయతీతి లింగం : అంటే సృష్టి తొ మొదలై లయము చెందేది లింగము.
గణితము ప్రకారము రెండు బిందువుల గుండా ఓకే వృత్తము పోగలదు. అంటే సృష్టి లయము రెండు బిందువులయితే వాటిని కలిగినదే ఈ జగత్ స్థితి. సృష్టింపబడినది లయించ వలసిందే, లయమమైనది సృష్టింప బడవలసిందే! ఈ ప్రయాణమును ఎరుకపరచేదే లింగము. లింగము అంటే చిహ్నము, గురుతు అని అర్థము. అసలు మనుస్మృతిలో 16 వేరువేరు అర్థములున్నాయి.
సృష్టి స్థితి లయములను నిర్వహించే పరబ్రహ్మ చైతన్యమును బహురూపములలో భావించి ఆరాధించుట అన్నది వేద విదితము. ఎవరో చెప్పినది కాదు. ఈ విగ్రహారాధనలో ప్రముఖమైనదే లింగ పూజ. ఈ లింగము యొక్క అర్థమును గూర్చి మనము ముందే చెప్పుకొన్నాము. ఈ లింగమును ఆద్యన్తములు లేని పరమేశ్వర స్వరూపముగా భావించి షోడశోపచారములతో పూజించుట స్మృతులు మనకు నిర్ణయించిన విధివిధానము. అసలు ఆది శంకరులవారు పాండురంగని కీర్తిస్తూ 'పరబ్రహ్మ లింగం భజే పాండు రంగం' అని కీర్తిస్తారు ఆయన విగ్రహము ముందు నిలిచి.
హృదయమునకు కుడి వైపున నాభినుండి జానెడు ఎత్తులో(అధౌ నిష్ట్యా వితః శాన్తిః నాభ్యం ఉపరి తిష్ఠతి) ఉన్నది నిష్టి. దీనిని sinus node అని అంటారని కూడా హృద్రోగ నిపుణులు చెబుతారు. అది ' నీలతోయద మధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః అని వేదము నందు చెప్పబడినది. అది నీలి రంగు కలువ కోరకము వలే నుండగా దాని కొసన పరమాత్మ లేక పరమేశ్వరుడు అణురూపములో ఉంటాడట. ఆ కోరకము లింగాకృతియే కదా!
అంటే ఈశ్వరుడు కలకాలము మనయందే లింగాకృతి లో వున్నాడనే కదా అర్థము. ఈ వాస్తవాన్ని గ్రహించితే అందరమూ అన్య మతస్థులను కూడా కలుపుకొని ఎంతో అన్యోన్యముగా మనగలుగ వచ్చును. అసలు ఈ జ్యోతికి ఆధారము అగుపించదు అనివిన్నాను. అది నిజమయితే పరమేశ్వరుడు ఆధార రహితుడు అన్న వేదవాక్కునకు పుష్టి చేకూరుచున్నట్లే కదా! అది అపుడు మనలో వెలిగే జ్యోతిర్లింగమే కదా!
లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమము చెప్పింది. లోకమంతా శివలింగము అనెడు భావనతో మనము లింగారాధన చేయవలేనన్నది తాత్పర్యము. అసలు NASA వంటి సంస్థలు తమ పరిశోధనా సారముగా 'అండాకృతిలోనున్న ఈ బ్రహ్మాండ కాంతిపుంజ గర్భములో ఈ గ్రహనక్షత్రాదులు ఇమిడియున్నాయి' అని మన వేదవిజ్ఞానము వివరించిన రీతిని ధృవపరచినారు.
మరి ఈ విషయమును ఎటువంటి ఉపగ్రహముల సహాయము లేకనే కేవలము తమ తపః శక్తితో చాటిన మహర్షులు ఎంత గోప్పవారో మనము అర్థము చేసుకొనుటకు మేధస్సు చాలకున్నా వారి విజ్ఞానానికి, విశ్వశ్రేయోదీక్షకు సాష్టాంగ దండప్రణామములను ఆచరించుదాము.
సృష్టి స్థితి లయములను నిర్వహించే పరబ్రహ్మ చైతన్యమును బహురూపములలో భావించి ఆరాధించుట అన్నది వేదం విదితము. ఎవరో చెప్పినది కాదు. ఈ విగ్రహారాధనలో ప్రముఖమైనదే లింగ పూజ. ఈ లింగము యొక్క అర్థమును గూర్చి మనము ముందే చెప్పుకొన్నాము. ఈ లింగమును ఆద్యన్తములు లేని పరమేశ్వర స్వరూపముగా భావించి షోడశోపచారములతో పూజించుట స్మృతులు మనకు నిర్ణయించిన విధివిధానము. అసలు ఆది శంకరులవారు పాండురంగని కీర్తిస్తూ 'పరబ్రహ్మ లింగం భజే పాండు రంగం' అని కీర్తిస్తారు ఆయన విగ్రహము ముందు నిలిచి.
హృదయమునకు కుడి వైపున నాభినుండి జానెడు ఎత్తులో(అధౌ నిష్ట్యా వితః శాన్తిః నాభ్యం ఉపరి తిష్ఠతి) ఉన్నది నిష్టి. దీనిని sinus node అని అంటారని కూడా హృద్రోగ నిపుణులు చెబుతారు. అది ' నీలతోయద మధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః అని వేదము నందు చెప్పబడినది. అది నీలి రంగు కలువ కోరకము వాలే నుండగా ఆని కొసన పరమాత్మ లేక పరమేశ్వరుడు అణురూపములో ఉంటాడట. ఆ కోరకము లింగాకృతియే కదా!
అంటే ఈశ్వరుడు కలకాలము మనయందే లింగాకృతి లో వున్నాడనే కదా అర్థము. ఈ వాస్తవాన్ని గ్రహించితే అందరమూ అన్య మతస్థులను కూడా కలుపుకొని ఎంతో అన్యోన్యముగా మనగలుగ వచ్చును. అసలు ఈ జ్యోతికి ఆధారము అగుపించాడు అనివిన్నాను. అది నిజమయితే పరమేశ్వరుడు ఆధార రహితుడు అన్న వేదవాక్కునకు పుష్టి చేకూరుచున్నట్లే కదా! అది అపుడు మనలో వెలిగే జ్యోతిర్లింగమే కదా!
లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమము చెప్పింది. లోకమంతా శివలింగము అనెడు భావనతో మనము లింగారాధన చేయవలేనన్నది తాత్పర్యము. అసలు NASA వంటి సంస్థలు తమ పరిశోధనా సారముగా 'అందాక్రుతిలోనున్న ఈ బ్రహ్మాండ కాంతిపుంజ గర్భములో ఈ గ్రహనక్షత్రాదులు ఇమిదియున్నాయి' అని మన వేదవిజ్ఞానము వివరించిన రీతిని ధృవపరచినారు.
మరి ఈ విషయమును ఎటువంటి ఉపగ్రహముల సహాయము లేకనే కేవలము తమ తపః శక్తితో చాటిన మహర్షులు ఎంత గోప్పవారో మనము అర్థము చేసుకొనుటకు మేధస్సు చాలకున్నా వారి విజ్ఞానానికి, విశ్వశ్రేయోదీక్షకు సాష్టాంగ దండప్రణామములను ఆచరించుదాము.
Prathi Manishe yokka sirassu voka Lingaakaarame kadhaa.
ReplyDeleteThat is right
ReplyDeleteNASA reference site id ఇవ్వగలరు.
ReplyDelete