Friday, 6 May 2022

నా పుస్తకోద్ఘాటన సమావేశమున నా ప్రసంగము.

 నా పుస్తకోద్ఘాటన సమావేశమున నా ప్రసంగము

ఇది 5 సంవత్సరముల క్రితము జరిగిన నా పుస్తకముల ఆవిష్కరణ సభ. ఉద్దండులు ఆసనములనలంకరించిన సభ. కొందరు ప్రముఖులు ఆత్మీయులు ఆరోగ్యము, వార్ధక్యము అడ్డుపెట్టుటచే హైదరాబాద్ రాలేకపోయినారు. వారి ఆశీస్సులు అభినందనలను మాత్రము అందజేసినారు. నా ఉపన్యాసములో వారందరినీ గూర్చి తగినమేరకు వ్రాసినాను. ఇందులో కొందరు మన మధ్యలేరు. వారి ఆశీస్సులు అభిమానము నన్నంటుకొనియే ఉంటాయి. సమకాలీన విజ్ఞులను గూర్చి తెలుసుకొంటారని, నా ఆశ. అందుకే నాటి విషయము నేడు తిరిగీ మీముందు ఉంచుచున్నాను.

 ఈ లేఖనము చదువుటకు పెద్దదే! కానీ సగము సగముగా నేను ప్రకటిస్తే చదువుటకు కొంత ఉత్సాహము తగ్గుతుందన్న ఉద్దేశ్యముతో పూర్తి పాఠమును మీ ముందుంచుచున్నాను.

నా సమావేశ ఉపన్యాస విన్యాసము

పుస్తకావిష్కరణ సమయమున నాచే చేయబడిన ఉపన్యాసము:

నా పేరు రామ మోహన్ రావు. మా తండ్రి నన్ను 'రాముడూ' అని పిలిచేవారు. ఆయన పెద్దవాడు కావున DO అని శాసించేవాడు. నేను ఆ అవకాశమును ఇప్పుడు పోగొట్టుకొన్నాను. కారణం ఆయన శివుని రాముని తలచి-తలచి , తన్మయుడై తపించి జపించి  కైలాసము చేరినాడు. దేవుని కలియుటకై. 'అమ్మ' లేని నన్ను పెంచిన మా అమ్మమ్మ కూడా శివారాధన చేసి-చేసి శివ సాయుజ్యము చేరింది. ఇక ఇద్దరూ అక్కడ వున్నపుడు, ఆ సాంబశివుని శిశువును మచ్చిక చేసుకొంటే నన్ను శివునికి వారు మువ్వురూ కొంచెము 'Recommend' చేస్తారన్న నమ్మకముతో మొదట ఆయనను ప్రార్థించి నా ఉపన్యాసమును ప్రారంభిస్తాను. తప్పక చెవులు మూసుకొని శ్రద్ధగా వింటారని ఆశ.

మీ వంటి సహృదయుల అభిమానమును తప్పించి జీవితములో నేను సాధించినది ఏమీ లేదు. సాధించినది లేదు కాబట్టి  నన్ను నేను దండగ రాముడు అని అనుకొంటూవుంటాను. ఇక వినాయకునికి నా ప్రార్థన:

దండగ రాముడ నీకై

దండల తగు అండనివ్వు దాక్షిణ్య నిధీ 

దండములు గూర్చి దండిగ

దండగ మెడవైతునేక దంతుడ నీకున్

శ్రీకరమౌ కరమ్ము మది చింతలు బాపుచు సేద తీర్చుచున్ 

ఆకరమౌచు నాకవన మమృత ప్రాయము గాగ ప్రణవమై 

భీకర భావజాలముల భీతిని బాపుచు మార్దవమ్ముగా 

శ్రీకర భావసంపదల సిద్ధిని గూర్చు గణేశు గొల్చెదన్

సభనలంకరించిన విజ్ఞులకు, ప్రాజ్ఞులకు, ఉపజ్ఞులకు, సర్వజ్ఞులకు, సంస్కార సంయుక్తులగు సదస్యులలోని సరస్వతీ మాతకు సవిధేయతా నమస్కారము. ఒక కార్యక్రమము సక్రమముగా జరుగ వలెను అంటే అందుకు అత్యంత ప్రధానమగు ఉపాంగము వేదిక. అది లేదంటే ఆవిష్కరణే లేదిక. కావున నా కృతజ్ఞత మొదట 'భారత్ వికాస్ పరిషత్' కు సమర్పించుకొంటాను. సంస్థకు ప్రాణము దానిని నడిపే వ్యక్తులే. ఈ సంస్థకు ఇంతటి పేరు ప్రతిష్ఠ కూర్చిన శ్రీయుతులు సుబ్బారావు గారు, హనుమంత రావు గారు, రాజేశ్వర రావు గారు, ఇంకా ఎందఱో ప్రముఖులు, నాకు పేర్లు గుర్తులేక తెలుపలేక పోతున్నాను, ఎన్నో సేవా కార్యక్రమములకు తోడుగా ఈ సారస్వత వ్యాసంగమును కూడా పెట్టుకొని సమర్థవంతముగా సాగిస్తున్నారంటే వీరపర భగీరతులు కాక వేరెవ్వరు. నన్ను అన్ని విధముల ఆదుకున్న, అట్టి సౌమనస్కులగు వారందరికీ నా సవినయ కృతజ్ఞతలు. ఇటువంటి వారి పరిచయము కలుగుట నా అదృష్టము, కలిగించిన శ్రీయుతులు నాగేశ్వరరావు, మూర్తి గార్లకు నా ఆశీస్సులు. నేను అను కదలలేని ఈ రథాన్ని కదిలించే రెండు చక్రాలు వారిరువురు.

ఇక పుస్తకము విషయమునకు వస్తే, కృతిని ఆర్యులు ‘కవన కన్య’ అంటారు. కన్యకకు నేను పితృత్వమును బడసిన తరువాత తగిన సమయములో తగిన వరుని తప్పక చూడవలసినదే కదా! అసలు మానవుడు ఆశాజీవి. అందునా తండ్రి తన కుమార్తెల మీద కొంచెము మమతానురాగములను ఎక్కువగా పెంచుకొంటాడు. పుట్టబోయేది ‘కవన కన్యక’ అంటే కూతురే కాబట్టి పుట్టుటకు ముందే వరాన్వేషణ ప్రారంభించినాను. శివుడు తగినవాడనిపించింది. ఎందుకంటే విష్ణువు వలె పట్టు వస్త్రములు కోరడు, ఎగరడానికి ఏ విమానమో కదలడానికి ఖరీదయిన కారో కోరడు. ఆయనకు ఎద్దు, ఆ ఎద్దుకు ఇంత మేత నీళ్ళు వుంటే చాలు. ప్రేమగా దువ్వి ఎంత దూరమయినా ప్రయాణము సాగించుతాడు. మరి అల్లుని మర్యాదకు పెట్టే ఖర్చు నాకు తగ్గిపోయినట్లే కదా! ఆయన నిత్య నిరంతర నిఖిలాత్మకుడు. అమేయుడు, అజేయుడు, అజరామరుడు. అప్పుడు నా కూతురు కూడా కలకాలము దీర్ఘుసుమంగళిగానే ఉండిపోతుంది కదా! ఆయన కాలకాలుడు. మరి తనతో ఉన్నవారికి నాశము ఉండదు కదా! అందుకే ఆయనను నా కూతురికి భర్తగా ఒప్పించినాను.

ఇక పెళ్లికుమార్తెను సర్వాంగ సుందరముగా తయారు చేయుటకు ‘Bridal Makeup’ అవసరము కదా! అంటే Printing అని నా ఉద్దేశ్యము. దానికి ప్రత్యేకముగా విశాఖపట్న వాస్తవ్యుడు శ్రీ ధర్మతేజ వెంకట్రావు ప్రత్యేకమగు శ్రద్ధ తీసుకొని  అచ్చొత్తించి సమయమునకు అందజేసినారు. ఆయనకు మిక్కిలి కృతజ్ఞుడను.

ఇక పెళ్లి పెద్దలను గురించి చెప్పుకొనవలె. నేను ఇటీవల అరుణాచలేశుని దర్శనమునకు పోయినపుడు ఆయనతో ‘స్వామీ మరి నీ పెళ్ళికి పెద్ద ఎవరని మొరపెట్టుకొన్నాను.’ అందుకు బదులుగా ఆయన “మూర్ఖుడా! కంటి ముందే నా పేరు గలిగిన  నీ గురువును పెట్టుకొని కలియ జూస్తున్నావే కనిపించని వారి కోసం “ అన్నాడు. నా జ్ఞాననేత్రము విప్పారింది. ఒక బరువు తీరింది. మరి ఈ పెళ్ళికి పురోహితుడెవరు అని అడిగినాను. అందుకు స్వామి “ విద్వన్ మణి, అవధాన సహస్ర ఫణి, మాడుగుల నాగఫణి వుండగా చింత ఏల” అన్నాడు. ఆవిధముగా శర్మగారు కూడా అమరినారు. మరి పెళ్ళిపెద్దలో, అవధానం నాగరాజ రావు, చొప్పకట్ల సత్యనారాయణ, చప్పిడి నీలకంఠా రెడ్డి , ఉన్నారు అని స్వామి అన్నారు. ఈ పెద్దల పేర్లకు ‘గారు’ ఎందుకు చేర్చలేదంటే వారి పేర్లు తెలియజేస్తూ వుండేది శంకరుడు కదా! ఇక ప్రేక్షకులు అంటావా నీ సభలో ఉండబోయేవారంతా నా గణములే! అన్నారు. నేను ఎంతో భాగ్యశాలిని, ఇంతటి ఉత్తమ ప్రేక్షకులు కలుగుట. ఎండాకాలము కాబట్టి మామిడి తోరణాలు కోయిల సన్నాయి ప్రకృతే సమకూర్చింది.  ఇక నాకేమి కొదవ.

ఇంకొక ముఖ్యమయిన విషయము , అసలు వివాహము హిమాలయములలోనే జరుగుచున్నదా అన్నట్లు మన భారత్ వికాస్ పరిషత్తు సమకూర్చిన ఈ వాతానుకూల వేదిక (Air Conditioned hall) అతిధులకు ఆహ్లాదమును సమకూర్చుతుంది. ఆడపిల్ల పెళ్ళి కదా! అంతో ఇంతో ఎంతో కొంత సహకరించుట ఉచితమని తలచి, ఈ పెళ్ళి ఖర్చునకు తమవంతు ఆర్ధిక సహాయమును చేసిన వితరణ శీలులందరికీ మనఃపూర్వక నమస్కారము నాచరించుచున్నాను.

ఈ పెళ్ళి ఇంత వైభవముగా జరుగుటకు దోహదపడిన ప్రముఖులకు పద్య రూపములో నా కృతజ్ఞతలు, వస్త్రమునకు నూలుపోగులా, అగరు బత్తీకి వెదురు పుల్లలా, వెన్నిలా ఐస్క్రీముకు వేఫర్ కోనులా, TV బొమ్మకు cable connection లా, నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను.

1. Dr. శ్రీ పి వి అరుణాచలం గారు

వీరికున్న డిగ్రీలు వీరు నిర్వహించిన పదవులు గణితమునకు సంబంధించినవయితే ఆంధ్రమున వీరి పాండిత్యము అపూర్వము. వారి బిరుదులూ, హోదాలు, పట్టాలు నేను చదువబట్టితే సమయము అందుకే సరిపోతుంది. అందుకు ‘దాసరి తప్పు దండముతో సరి’ అన్నట్లు వారికి నమస్కరించి నా ప్రసంగము కొనసాగించుతాను. మొన్న ఈ మధ్య ‘తెలుగు విశ్వ విద్యాలయము వారు’ వీరిని సన్మానించుటయే ఇందుకు తార్కాణము.

కళ్ళు మసక గొన్న, కంటియద్దమతడు

జ్ఞానవని యతండు  జ్ఞాన ఖనియు

దారి గనని వాని దైవమే యాతండు

గురుతునుంచుకొనుము  గురువతండు

పి’ వివరమెరుగ   ప్రొఫెసరు (S V University)

వి’ విషయము తెలుసుకొన్న వీసీయగు నీ (Dravidian University, Kuppam)

పీవీ’ ని ముందు గల్గిన

పీవీ అరుణాచలార్యు ప్రీతిగ కొలుతున్

2. Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు 

వీరు ఆది నుండి తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్ సంస్థాన్  (Indian Institute Of Science)) విద్యుత్ తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME, PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్ విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు. సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010 – విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of Science, Indian National Academy of Science మరియు Indian Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచున్నారు. నా మాట వీరిని గూర్చి

సాంకేతికంబైన చదువు నెవ్వరు సాటి

కలన విద్య యందు గాంచ మేటి

ఆచార్య పదవికే యాతడౌను కిరీటి

సందేహతప్తుని సతత సురటి

సరస గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి

ధర్మ దర్శక వితతి ధన్వి ధాటి

విజ్ఞాన మధుపుష్ప విష్టపమ్మున తేటి

వసుధ మేధావిగ్రావంపుకోటి

నాదు ప్రార్థన మన్నించి నలువ రీతి

అట్టి విద్వచ్ఛిరోమణి యాదరాన

వ్రాసె దనమాట, శివునాఙ్ఞ వాటుగొనుచు

శంకరునిదాస విరచిత శతకమునకు

౩. Dr. మాడుగుల నాగఫణి శర్మ గారు

అజ్ఞాన తిమిరాంధక ద్యుమణి నాగఫణి. ఈయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆ స్వయంప్రకాశక మణికి జీరో బల్బు అవసరమా! అయినా నా మాటగా ఒక మాట చెప్పుట నా బాధ్యత.

సంస్కృతాంధ్రమునందు సవ్యసాచియతడు

దేవగురుని, ధాత్రి, దీటతండు

ప్రావాణి మెడలోని ప్రాలంబ మాతండు

కచ్ఛ పీరవయుక్త  కంఠుడతడు

పృచ్ఛక  కల్హార పృశ్నిపూషుడతండు

వైరి పండిత దంతి వెట్టమతడు

శత సహస్రవధానజగతి ప్రఖ్యాతుండు

మన తెల్గుగళసీమ మణియతండు

మాడుగుల వంశ మకుటాయమానమతడు

మంచియను మాటకవనిలో మారతండు

గతము మరువక దలపోయు ఘనుడతండు

నాగఫణి శర్మ నామాన నెగడునతడు

4. వేదమూర్తులు సామవేదం షణ్ముఖ శర్మ  గారు

ఈయన విజ్ఞాన ఖని, ప్రజ్ఞాధని, సుజ్ఞాన సుమవని. ఈయనను గూర్చి నేను చెప్ప బూనటము శ్రీ గంధపు చెట్టు నకు చందనము వ్రాయుటయే! బాధ్యత కాబట్టి ఒక మాట చెప్పక తప్పదు.

ఋషుల ఘనత దెల్ప ఋషి పీఠమును నిల్పి

జనుల సేవ జేసె జగతి మెచ్చ

అపర షణ్ముఖుడతడన్యుండు కాదిల

మనకు మంచి పంచు మార్గదర్శి

సామవేదమన్న సామన్యుడామరి

సకల వేద మూర్తి సత్వవర్తి

అట్టి వ్యక్తి చిత్తమందున్న  షణ్ముఖు

నర్చి మ్రోక్కులిడుదు నాత్మ సాక్షి

5. Dr. వేటూరి ఆనంద మూర్తి గారు

వీరు అన్నమయ్య కృతులను వెలుగులోనికి తెచ్చుటయే గాక బహుళ పరిశోధనా గ్రంధములను వ్రాసి గొప్పగొప్ప విషయముల వెలికి తెచ్చిన మహనీయులు, బ్ర.శ్రీ.వే. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కుమారులు. పద కవితలపై doctorate పట్టా సాధించినారు. ఉస్మానియా విశ్వ విద్యాలయమున Professor గా 35 సంవత్సరములు పనిచేయుటయే కాక శ్రీలంక మొరీషియస్ విశ్వ విద్యాలయములకు పనిచేసి Cambridge University visiting Professor గా కూడా వుండినారు.

క్రొత్త యన్న చింత కొంతయైనను లేక

కావ్య మెట్టిదన్న కలత లేక

కూర్చె తనదు మాట కోరిన తడవుగా

అట్టి విజ్ఞునతము నంజలింతు

ఆనంద మూర్తి మనసది

ఆ నందన వనము, పలుకు, నాత్మీయతయున్

ఆనంద బంధురములవి

ఆ నందకుమారు పగిది యాతడు నాకున్

6. బ్ర||శ్రీ||వే|| చొప్పకట్ల సత్యనారాయణ గారు

వీరు సత్యసాయిబాబా  గారి పరమ భక్తులు.  వీరి రచనలన్నీ  సాయి సంకీర్తనే.  వీరు శ్రీ సత్యసాయి గీతాంజలి (2 భాగములు) శ్రీ సత్యసాయి సంకీర్తనా త్రిశతి, శ్రీ సత్యసాయి చరితము (2 భాగములు) శ్రీసత్యసాయి భాగవత సత్కథామృతము (4 భాగములు) (చంపూ ప్రబంధము -3419  గద్య పద్యములు)  వ్రాసిన మేటి కవి పండితులు. నాటి భారతి పత్రికకు ఎన్నో వ్యాసములు వ్రాసినవారు.  విద్యా జ్యోతి అన్న మాస పత్రికకు సంపాదకునిగా 2 సంవత్సరములు పని చేసినారు.  ఆంధ్రప్రాచ్య కళాశాలా  ఉపన్యాసకులుగా 30 సంవత్సరములు పనిజేసి  ఇప్పుడు D.D. Colony లోని తమ స్వగృహములో విశ్రాంతి తీసుకుంటూ వున్నారు.

సరసమైన రీతి సాహితీ రసప్రీతి

పాప కార్య భీతి బహుళ నీతి

సరకు గొనని ఖ్యాతి షడ్వర్గపు అరాతి

చొప్పకట్ల నియతి జయతిజయతి

7. Dr. నాగరాజారావు గారు

నాగరాజారావు గారు నాకు ఒక పెద్ద దిక్కు.  ఆయనను ఎప్పుడు నాకు అన్నగానే తలుస్తాను.  ఆయన సహవాసము బ్యాంకి  ద్వారానే అయినా,  ఆ తరువాత  మాత్రము  విడిపోని ముడియై నిలిచినది.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయములో Reader గా పని చేసి ఇపుడు విశ్రాంతి తీసుకుంటున్నారు.  దత్త మండలమైన కడప కర్నూలు అనంతపురము బళ్ళారి జిల్లాలకు ‘రాయలసీమ’ అన్న నామకరణము  చేసిన మహనీయుడగు  చిలుకూరి నారాయణ రావు గారి పై పరిశోధన జరిపి Doctorate పొందినవారు.  

రావా కల్గెను నాకు కష్టమనగా రాకెట్ల నేనుందు నీ

రావాలేల యటంచు తక్షణమునన్ రాగంబుయున్ దీక్ష పా

రావారంబుగ  నొప్ప నాకు తగుసా రంబైన సద్బోధతో

రావా! వత్తువు  నీవు  నాగ, మహ,రాజావధానంబుతో

8. శ్రీ నీలకంఠారెడ్డి  గారు

నీలకంఠారెడ్డి నాకు నిజమైన తమ్ముడు. నిజమునకతడు నా బహిః ప్రాణము.  అసలా శంకరుడే తన అంశనీ నీలకంఠుని రూపములో పంపినాడని నా నిశ్చితాభిప్రాయము.  ఏమి విజ్ఞత. ఎంత సంస్కారము. ఆ నీలకంఠుడు దేవతల కష్టములను తీర్చ హాలాహలమును ఒక సారి మ్రింగితే తడవ తడవకు నాకు సంభవించిన హాలాహల సాదృశ్య మైన  కష్టములను అణుమాత్రము కూడా సంశయించక   ఆరగించి అరిగించుకున్నాడు.  ఆతనికీ సంస్కారము నిచ్చిన తల్లిదండ్రులకు, గురువు మరియు బిడ్డ నిచ్చిన  మామయగు శ్రీ శివశంకరరెడ్డి గారికి త్రికరణ శుద్ధిగా  నమస్కరించుచున్నాను.

నిక్కమైన మనసు నీటైన తలపులు

నింగి మీద బడ్డ నిలచునట్టి

తపనయున్నవాడు  తానాయె నాతోడు

నీలకంఠారెడ్డి నిజముగాను

మనసు వాడి పోని మల్లెల పూదండ

నిక్కమైన రెడ్డి నిండుకుండ

ఆపదన్న వారి కతడండయునుదండ

వైరి దయ్యములకు వేపమండ

9. శ్రీ  గొట్టిముక్కల  సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

శ్రీ  గొట్టిముక్కల  సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిజమునకు ఒక అరుదైన వ్యక్తి . వారి పరిచయ భాగ్యము  నా పూర్వ  జన్మ సుకృతము.  ఆయన మహోన్నత వ్యక్తి. వందకు పైచిలుకు కావ్యములు  వ్రాసినా పేరుకు ప్రాకులాడని మహా కవి, పండితుడు.   వీరు విశ్రాంత ఆంధ్ర పండితులుగా కర్నూలు జిల్లా నంద్యాల లో నివసించుచున్నారు.  సాహితీ వాచస్పతి మొవ్వ వృషాద్రిపతి వంటి లబ్ధప్రతిష్ఠులు  శాస్త్రి గారిని గూర్చి ‘ వీరు కవివతంసులు విపశ్చిదగ్రగణ్యులు  అనుటలో సందేహము లేదు అన్నారు.

ఈయన సంస్కృతాంధ్రాంగ్ల   కన్నడ భాషా ప్రవీణులు.  ఈయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.  ప్రసిద్ధ మాసపత్రిక జ్యోతి కి ఒక నవలను వ్రాయుటయే కాక బుడ్డా వెంగలరెడ్డి గారి చరిత్ర పద్య కావ్యముగా వ్రాసి రేనాటి ఋణము తీర్చుకున్నాడు. వీరికివే నా కృతజ్ఞతలు

మహనందీశ మహా కృపాబ్ధిగతమౌ మాణిక్య మీరీతిగా

మహానీయంబగు గొట్టిముక్కల మహా మన్యంపు వంశంబునన్

మహదానందము గూర్చగా తెలుగుకున్ మహాత్మ్యమున్ చేర్చగా

మహ దేవాంకిత సుబ్రహ్మణ్య కవిగా మాన్యుండు గల్గెన్ ధరన్.

10. Dr. కోడూరి ప్రభాకర రెడ్డి గారు

పుస్తక రచన సంపూర్ణమౌతూనే నేను మాటలాడిన మొదటి వ్యక్తి డా.ప్రభాకరరెడ్డి గారు. ఆయన ప్రోద్దటూరి లో శిశు వైద్య నిపుణుడు. ఆయన సేద్యము, వైద్యము, పద్యము  దేనిలోనైనా దిట్ట. 

 సేద్యములో వైద్యములో

పద్యములో గద్యములో

విజ్ఞతలో విభవములో

లేడుసాటి లేదుపోటి

కోమల సాహితీ వల్లభ’ బిరుదాంకితుడు అనేకానేక పద్య, గద్య, నాటక రచయిత. వారు వ్రాసిన ‘రేనాటి పలుకుబళ్ళు’ అన్న కరదీపికతో రాయల సీమ మారు మూలాలు కూడా సులభముగా చూడవచ్చును. ఇంత వైదుష్యమున్నా నేను  వ్రాసిన శతకములో DTP తప్పులు, వ్యాకరణ దోషములు సవరించి పంపిన వారి అభిమానమునకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

స్నిగ్ధ  భావ కమలాలను

ముగ్ధ మొహనముజేసే

కవితా సవితా  మూర్తికి

కడు కోమల హృదయానికి

సేద్య వైద్య పద్య విద్య

చేయగలుగు చేవగలుగు

ప్రతిభాకరుడౌ శ్రీయుత

ప్రభాకరున కిదేనా

సవినయంపు హృది స్పందన

సారస్వత అభినందన

కోమల సాహితీ వల్లభ

కొనుము కడప సుర్యపభ

చివరిగా ఒక్క మాటతో నా ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసమును గైకొనుచున్నాను. నేను కొన్ని పుస్తక ఆవిష్కరణ సభలలో చూసిన ఒక ప్రత్యేక పాఠక వర్గమును గమనించిన తరువాత ఈ పద్యము వ్రాసినాను. మేధో పటుత్వము, ఆలోచనా సరళి, ఊహాలోకావలోకనము, పద సంపద, అన్నింటికీ మించి పాఠకాకర్షణా యోగ్యత  కలిగిన మానసిక సమతౌల్యము అవసరము వ్రాయసకానికి. సహాయ సహకారమునందించగల అంగ బలము అవసరము. ఇక మూడవది అర్థము. అర్థము లేకుండా పనిని తలపెట్టుట వ్యర్థము. అందుకే ఈ మాట వ్రాసినాను.

చదివియు పద్యమందుగల సాంద్రత గాంచగ లేని విజ్ఞునిన్ 

మొదలు తుదంట దా చదివి మోదము తెల్పని బుద్ధిమంతునిన్ 

ఉదియగొనంగదా కృతిని ఊరక పొందగా జూచు శ్రేష్ఠునిన్

కదియగ వీరికిద్ధరను గానము వీరికి వీరె సాటియౌ

శ్రద్ధతో వినిపింపజేసిన మీ సహనమునకు నమస్కరించుతూ ఇక ఈ ఉపన్యాస విన్యాసము నుండి సన్యాసము స్వీకరించుతాను.

స్వస్తి.

 


Tuesday, 19 April 2022

ఖురాన్ - రామదన్ - రోౙా

ఖురాన్ - రామదన్ - రోౙా

https://cherukuramamohan.blogspot.com/2022/04/blog-post_19.html

అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట','మాటిమాటికి చదివే' గ్రంథము అని అర్ధము. అల్లా ఇచ్చినది అన్న అర్థము లేదు.

రామదన్ మాసపు గొప్పదనము 'దివ్య ఖురాన్' గ్రంథము ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం ' అని మౌల్వీలు చెబుతారు. మరి ఈ మాసపు ప్రారంభమునుండి చివరకు చేరులోపల ‘పవిత్ర ఖురాను’ మొత్తము ఇవ్వబడినది అని చెప్పగలరా! అసలు చదువు అన్నదే రాని, వారు తలచుకొనే ప్రవక్తకు ‘అల్లా’ లిఖిత గ్రంధము ఇచ్చే అవకాశమే లేదు. ఇచ్చినాడనుకొన్నా ఆయన ‘కాగితము కలము’ వాడిన దాఖలాలు లేవు. కావున ఈ పని మౌఖికముగానే జరిగియుండవలె. మరి ప్రవక్త గారికి ‘హీరా’ గుహలలో ‘ఖురాన్’ ను తెలియబరచిన దేవదూత ("Angel Gabriel" for Christians) జిబ్రీల్. మరి ఈ దేవదూత గారు తెలుసుకొన గలిగినది ‘అల్లా’ చెబితేనే కదా! మరి ఈయనకు ‘అల్లా’ తెలియజేసినట్లు ‘పవిత్ర ఖురాన్’ లో సాక్ష్యాధారాలేవయినా చూపగలరా! అసలు ‘పవిత్ర ఖురాన్’ ‘అల్లా’ స్వయముగా చెప్పినారన్న ప్రచారము విరివిగా వాడుకలో ఉన్నది. మరి ‘పవిత్ర ఖురాన్’ ప్రారంభములోనే ఏమి చెప్పబడుతూ ఉన్నదో చూడండి:

'పవిత్ర ఖురాన్' మొదట అరబ్బీ భాషలో వ్రాయబడినది. 'అల్లా' తెలియబరచినది కూడా అరబ్బీ భాషలోనే అని ఆ మతపెద్దలు కూడా చెబుతారు. ఖురాన్ "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" అనే వచనంతోనే ప్రారంభమవుతుంది. ఖురాన్ లోని అన్ని సూరాలు (అధ్యాయాలు) 'బిస్మిల్లా'''' తోనే ప్రారంభమౌతాయి (ఒక అధ్యాయం "సూరా తౌబా" మినహాయించి).

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం ( بسم الله الرحمن الرحيم ), అన్న 'ఖురాన్' లోని మొదటి అరబ్బీ భాష లొఇని వాక్యమునకు అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు అని అర్థము.

దీనిని బట్టి మనకు తెలియచ్చుంది ఏమనగా 'పవిత్ర ఖురాను'ను అల్లా నేరుగా చెప్పలేదు అని తెలియవచ్చుచున్నది. మరి ఆ మతపెద్దలు చెప్పుచున్నది అసమంజసమే కదా!

అరబ్బీ భాష లోని అక్షరాలకు (అబ్‌జద్) సంఖ్యలు ఇవ్వబడ్డాయి. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అనే వాక్యంలో గల అక్షరాల సంఖ్యలను కూడితే '786' అనే సంఖ్య వస్తుంది. అందుకే ముస్లింలు తరచూ ఈ 786 అనే సంఖ్యను వాడుతూ ఉంటారు. కాని దీనికి ఎలాంటి ఆధారము ఖుర్ఆన్ మరియు హదీసులో లేదు. ‘పవిత్ర ఖురాను’ చెప్పిన వాక్యములు మాత్రమే అనుసరణీయములైతే మరి ‘హదీసు’లు ఎందుకు పుట్టినట్లు. ఈ ;హదీసులయండు ‘ఇట్లు చెప్పినారు’ ‘ఈవిధముగా చేయమన్నారు’ ‘ఈ పోరాకారముగా జరిగినదట’ అని ఖురాను పుట్టిన తరువాత ఎన్నో వందల సంవత్సరములకు ఈ ‘హదీసులు’ సంకలనము చేయుట జరిగినది. ఇవి వాస్తవము అన్న రుజువును ఎవరైనా చూపించగలరా!

ముహమ్మద్ ప్రకటన ప్రకారం దేవదూత గేబ్రియల్ (జిబ్రీల్) వారికి ఖురాన్ వచనాలు వినిపించినాడు. ‘పవిత్ర ఖురాన్’ వచనాలను వారు నమ్మే ‘దేవదూత ముహమ్మద్ గారు’ తన అనుచరుల చేత వ్రాయించినారు కానీ తన చేతితో వ్రాయలేదు. చదువుకోకుండా అన్ని వచనాలు గుర్తుపెట్టుకోవడం కష్టము. కొన్ని కవితలనైతే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కానీ అనేక వచనాలని గుర్తుపెట్టుకొనుట మానవ సాధ్యము కాదు. మానసిక శాస్త్రము  ప్రకారము ఒక వ్యాసమును రెండు మూడు సార్లు చదివితేనే గుర్తు ఉంటుంది. ఒకసారి మాత్రమే చదివినప్పుడు కొన్ని వాక్యాలైనా మరిచిపోవుట సహజము. ముహమ్మద్ గారు,  తమ తోరాహ్ గ్రంథము చదవలేదని యూదుల వాదన. అవి కేవలము విని సేకరించి యుండవచ్చునని యూదుల వాదన.

ముహమ్మద్ 632లో మరణించినాడు. అతని జీవితంలోని తొలి రచన అనగా  'The earliest written material of his life is the sira of Ibn Ishaq (750)'. అని తెలుపబడినది కానీ అది పోయినది. ఇబ్న్ హిషాక్  రచన లోని కొన్ని భాగములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హదీసులు కూడా తరువాత వచ్చినవే! ఈ హదీసుల యొక్క ఆరు అధికారిక సేకరణలు ఉన్నాయి: అవి 'బుఖారీ, ముస్లిం, ఇబ్న్ మాజా, అబూ దావూద్, అల్-తిర్మిది మరియు అల్-నిసాయ్'. అన్నీ ముహమ్మద్ తర్వాత 200 మరియు 300 సంవత్సరాల మధ్య నాటివి. 'నిజాము దేవుడెరుగు నీరు పల్లమెరుగు'.

There is a notable lack of critical scholarship on the Koran. Major questions still needing answers include:

How did the Koran come to us? [Issues of compilation and transmission]

When was it written and who wrote it?

What are the sources of the Koran? [The origin of stories, legends, and principles]

What is the Koran? [How do we determine authenticity?]

The traditional account claims that the Koran was revealed to Muhammad, written down in bits, and not collated before Muhammad's death.

(From The Origins of the Koran: Classic Essays on Islam's Holy Book, Edited by Ibn Warraq; Prometheus Books, 1998, Summarised by Sharon Morad, Leeds)

ఇక అసలు విషయమునకు వద్దాము.

రమదాన్ మాసమున తెల్లవారుఝామున ౩ లేక ౩.౩౦ కు చివరి భోజనము చేస్తాడు మోమీన్ (మోమీన్ అనగా ఇస్లామును పాటించే వ్యక్తి). ఈ భోజనమును ‘సహరీ’ అంటారు. అదేవిధముగా సాయంకాలము 6. 6.౩౦ఆపై తెల్లవారిన తరువాత, పగలు ముగిసిన పిదప  అసుర సంధ్య సమయములో అనగా సాయంకాలము 6, 6.౩౦ కు తమ ఉపవాస వ్రతమును ముగించి తినే మొదటి భోజనమును ‘ఇఫ్తార్’ అంటారు. ఈ సమయమునుండి తెల్లవారు ఝామున ౩.౩౦ వరకూ తింటూ ఉండవచ్చును. ఎక్కువ మంది తెల్లవారు ఝాము౩.౩౦కు నిదుర లేచుట కష్టమని తలచి ఆసమయమువరకు రాత్రంతా మేలుకొని, తిని నిదురపోతారు.  ఎటూ గాని సమయములో తింటూనే నిదురించుట ఎంతవరకు ఆరోగ్య ప్రదము అన్నది వైద్యులు లేక  ఆ పరమాత్ముడు చెప్పవలసిన మాట. ఇక వారు పగలు తినేది ఉండదు కాబట్టి పగలంతా ఎక్కువమంది నిద్దురలోనే గడుపుతారు. మరి ఉద్యోగస్తులకు ఆ వెసలుబాటు ఉండదు కదా! పైగా వడ్డీ మీద బ్రతుకుట ‘పవిత్ర ఖురాన్’ ప్రకారమూ చేయగూడని పని. మరి ముస్లిములలో ఎందరినో మనము బాంకు ఉద్యోగులుగా చూడవచ్చును. మరి వీరు ధనముతో లావాదేవీలు జరుపవలేనుకదా  మరి రాత్రి అంతా మేలుకోన సాధ్యమౌతుందా. అట్లు మేలుకొనక నిదురించితే తెల్లవారు ఝాము ౩.౩౦ సమయము తప్పిపోయే అవకాశము ఉంది. మరి ఆ పరిస్థితి ఎటుజూచినా సక్రమముగా ‘రోౙా పాటించే వ్యక్తికి నెలపొడవునా సాధ్యమా!

రోౙా’ అన్నది ఉర్దూ పదము. ఇది ఖురాన్ లో కనిపించదు. ఖురాన్ దీనిని ‘సౌమ్’ అని సంబోధించుతుంది.

మిగిలినది రేపు........

ఖురాన్ - రామదన్ - రోౙా – 2

సూరా 2- ఆయత్ 187:

సూరా2- ఆయత్ 187 యొక్క ఇంగ్లీషు భావమును ఇచట తర్జుమా చేయుట జరిగినది. నిజానికి ఖురాన్ అరబ్బీ లో వ్రాయబడినది. తర్జుమాదారులు అందరూ తమ తమ అభిప్రాయములను చొప్పించి తర్జుమా చేయుటచే అసలు భావము, అరబ్బీ తెలియనందువల్ల, అర్థము చేసుకొనలేకున్నాము. కావున ఖురాన్ లో ఉన్న నిజము అల్లాకెరుక.

తర్జుమా: అస్-సౌమ్ (ఉపవాసాలు) రాత్రి మీరు మీ భార్యలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం చట్టబద్ధమైనది. వారు లిబాస్ అంటే. బాడీ కవర్, లేదా స్క్రీన్, లేదా సకాన్, (అంటే మీరు ఆమెతో కలిసి జీవించడంలో ఆనందాన్ని పొందుతారు 7:189 వ సూరా వలె) తఫ్సీర్ అత్-తబరి], వారికి మీరు మరియు మీరు వారికి ఒకేలా ఉంటారు. బహుశా వివస్త్రలై భోగించుకొంటారు అన్న అర్థమేమో! మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారని అల్లాహ్‌కు తెలుసు, అందుకే అతను మీ వైపు తిరిగి (మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించుచున్నాడు మరియు మిమ్మల్ని క్షమించుచున్నాడు). ‘సహారీ’ వరకూ  వారితో లైంగిక సంబంధాలు కలిగి యుండి అటు పిమ్మట తిరిగీ ‘ఇఫ్తార్’ వరకు నిష్ఠను పాటించవలసినదిగా ఆ ఆయాతు యొక్క సారాంశమయి ఉండవచ్చును.

ఇక్కడ ఒక విషయమును తెలియజేస్తాను. ‘ఖురాన్’ మరియు ‘అరబ్బీ’ భాషా పండితులు చెప్పిన ప్రకారము 1. తిండి, 2. నీరు, ౩. మైథునము రోౙా సమయమున నిషిద్ధములు. కానీ మోమీనులు (ఇస్లామును అనుసరించు వారు) మాసము రోజులు మహిళా పరిష్వంగము లేకుండా దీక్ష కొనసాగించుట కష్టమని మౌల్వీలకు తెలుపగా వారు ‘హదీసుల’ రూపములో ఈ మార్పులు చేయుట జరిగినదని పండితుల మాట. ఒక హదీసు ఈ విధముగా చెబుతూ వున్నది. ఇది నేను youtubeలో విన్న మాట. ఒక మోమీను మొహమ్మద్ (స.అ.స.) గారి వద్దకు వెళ్లి అయ్యా నేను రామదన్ వ్రతము పాటించుటలో తప్పు చేసినాను. నా భార్యను చుంబించినాను అన్నాడట, అందుకు మొహమ్మద్ గారు  (స.అ.స) అది తప్పుకాదు. నీవు ‘ఫుజు’. అంటే పుక్కిలించి ఉమియుట, చేసినట్లు భావించుకో పో అన్నారట. ఈ మాట వారి దత్యకు తార్కాణముగా చెప్పబడుతుంది. అసలు ఇప్పడు లభించే ఖురాను ప్రతి మరియు హదీసుల గ్రంధములు మొహమ్మదు గారి తరువాత 200 నుండి ౩00 సంవత్సరముల నాటివే గానీ ఆయన కాలము నాటిది ఒక్కటి కూడా లేదు. ఈ మతము అరేబియా ప్రాంతమునకు చెందినదగుటచే దంతదావనము, శౌచము, స్నానాదివిధులు నిత్యకార్యములుగా తెలియరాకున్నవి. అవి కేవలము నైమిత్తికములేమో! వ్రతములకు శుచి శుభ్రతలు అధికముగా పాటించు సనాతన ధర్మబద్ధులగు మనకు ఈ పద్ధతులు పచ్చి వెలగ పచన సాదృశమే!

ఇక్కడ మరొక ముఖ్య విషయమును గూర్చి ప్రస్తావించవలసియుంటుంది. అల్లా చెప్పినట్లుగా వ్రాయబడిన ఖురానులో సులభముగా సూటిగా చెప్పగలిగిన మాటలను  లేక ఆదేశములను లేక ఉపదేశములను చేతిలో ఉన్న మున్న ముద్దను తలచుట్టూ తిప్పి నోటిలో పెట్టుకొన్న రీతిన చెప్పబడుతుంది. అందులో కూడా అర్థము చేసుకొనుట అన్నది పాఠకుల అవగాహనకు అనుకూలముగా ఉంటుంది. అందుకే వారు ‘పసంద్  అపా అప్నా ఖయాల్ అప్నా అప్నా’ అంటారు.    పైగా అల్లాకు దేవభాషయగు సంస్కృతము వచ్చినట్లు లేదు. అసలు అరబ్బీ తప్ప వేరుభాష తెలియదు కావుననే ఆ భాషలో తెలిపినాడేమో! మరి అది రాని ముస్లిముల గతి ఏమిటి? అనువాద గ్రంధములబట్టి అఘోరించావలసినదేనా! ఆ అనువాద గ్రంధములు  ‘పుర్రె కొక బుద్ధి జిహ్వ కొక రుచి’ అన్నట్లు తమకు తోచిన రీతి అనువదించినారు. ఇది కాకుండా అసలు చదువే రాని వారి గతి ఏమిటి?  అదే మన సనాతన ధర్మమున భగవంతునిచే చెప్పబడిన ‘భగవద్గీత’ సులభ సంస్కృతములో  ఎంత విపులముగా, విశధముగా, వివరముగా ఉన్నదో పాఠకులగు మీకు చెప్పనే అవసరము లేదు. అసలు ఈ విషయము మన సంస్కృతి సంస్కృతము ఎంత అనాదిగా పునాది కలిగినవో తెలుపుతుంది. గీతలో చెప్పిన కర్మసిద్ధాంతమును బిరక్షరాస్యుడు కూడా ‘అంతా మన కర్మ. ఫలితము అనుభావిన్చావలసినదే అంటాడు’. అడుక్కొనే బిచ్చగాడు ఇంటిముందు నిలబడి ‘ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పదన్నా ఆనాటి పాండవులు ఆకులలములు మేసి అడవిపాలైపోయిరన్నా’ అని పాడుతాడు. అది మన ధర్మము ప్రత్యేకత.

చివరి భాగము మరొకమారు.......

ఖురాన్ - రామదన్ - రోౙా – చివరి భాగము

అసలు ముస్లీములకు ఈ పండుగ ఏవిధముగా సంక్రమించినదో చూద్దాము. మక్కాలో మహమ్మదు (సలిల్లాహు అలైహి వసల్లం) ఇస్లాం ప్రారంభించిన క్రొత్తలలో ఇస్లామ్ కు నమాజు వంటి కొన్ని ముఖ్యమైన పద్ధతులు తప్ప పండుగలు పబ్బాలు లేవు. వారికి పెద్దగా అనుచరగణమూ లేదు. ఆయన మక్కానుండి మదీనా పోయి అచట ఉన్నపుడు కొందరు యహూదీలు వారి మతమగు జూడాయిజం కు సంబంధించిన ఏదో పండుగ చేసుకొంటూవుంటే చూచుట జరిగింది. ఆయన వారి వద్దకు వెళ్లి, ‘మీరు ఎదో విశేషము జరుపుకొంటున్నట్లున్నారు, అది ఏమిటో తెలుప గలరా అంటే, వారు అందుకు జవాబుగా ‘మే ము మాకు ముఖ్యమైన పండుగ జరుపుకొంతున్నాము. దీనిని YAM KIPPUR అని అంటారు’ అని చెప్పినారు. ఇంకా వివరములను ఆయన అడుగగా మేము రోజంతా తిండి, నీరు, మైధునము అన్న వాంఛను విడనాడి  పగలంతా తమ ప్రార్థనా మందిరములో ఎక్కువ భాగము భగవదారాధన, భగవత్సేవలోనే గడుపుతూ  తమ పాప ప్రక్షాళనము గావించుకొంటారు.

వారి Tora లోని Leviticus 23:26-28 నుండి ఈ క్రింది విషయమును చదవండి.

The Day of Atonement (Yom Kippur) follows closely after Rosh Hashanah. We read in Leviticus 23:26-28:

 

The Lord spoke to Moses, saying, ‘On exactly the tenth day of this seventh month is the Day of Atonement; it shall be a holy convocation for you, and you shall humble your souls and present an offering by fire to the Lord. You shall not do any work on this same day, for it is a day of atonement, to make atonement on your behalf before the Lord your God.’

The Lord said to Moses, "The tenth day of this seventh month is the Day of Atonement. Hold a sacred assembly and deny yourselves, and present a food offering to the Lord. Don’t do any work on that day, because it is the Day of Atonement, when atonement is made for you before the Lord your God. Those who do not deny themselves on that day must be cut off from their people. I will destroy from among their people anyone who does any work on that day. You shall do no work at all. This is to be a lasting ordinance to the generations to come, wherever you live. It is a day of Sabbath rest for you, and you must deny yourselves. From the evening of the ninth day of the month until the following evening you are to observe your Sabbath."

మొహమ్మదు (సలిల్లాహు అలైహి వసల్లం) ఏ యూదూలనైతే అడిగినాడో వారు సరిగా తెలియకనే చెప్పినారో లేక కావలెననే చెప్పినారో నా ఊహకు అందలేదు కానీ ‘ఇబ్న్ అబ్బాస్’ సంకలనము చేసిన హదీసులలో ఈ విధముగా ఉంది.

Narrated Ibn; Abbas’

The Prophet came to Medina and saw the Jews fasting on the day of ASHURA. He asked them about that. They replied “This is a good day, the day on which Allah rescued Bani Israel from the enemy. So, Moses fasted this day." The Prophet said, "We have more claim over Moses than you." So, the Prophet fasted on that day and ordered (The Muslims) to fast (On that day).

అసలు ఉపవాసము అన్న సాంప్రదాయము ఇక్కడి నుండియే, ఇస్లాము నందు మొదలైనది. అంతకుమునుపు ఇందుకు సంబంధించిన దాఖలాలు, హదీసుల మాట అల్లా ఎరుగు, ఖురానులో కూడా లేవు. ఇది ఆయన మదీనాకు వచ్చిన క్రొత్తలలో జరిగిన విషయము. అటుపిమ్మట దాదాపు ఒక సంవత్సరమున్నర కల్లా యూదులపై శత్రుత్వము పూని వారిని మొహమ్మదు గారి ఆదేశము మేరకు చేసిన యుద్ధములలో ఊచకోత కోయుట జరిగినది. మరి వారి సాంప్రదాయము కొనసాగించుట తమ మతమునకవమానకరము కదా! అందుచే అల్లా తనకు దేవదూత జిబ్రీల్ ద్వారా ఆదేశామిచ్చినాడని మోమీనులకు తెలిపి, ఖురాన్ ఇచ్చిన మాసముగా రమదాన్ మాసమును ప్రకటించి ఒక నియమావళిని ఏర్పరచి ఈ ఉపవాస పర్వమును ముస్లీములకు అందించినాడు. అదేవిధముగా జేరూసలేమును ప్రధాన పుణ్యక్షేత్రముగా రాడ్డిచేసి మక్కా లోని కాబాకు ఆ పవిత్రతను ఆపాదింపజేసినాడు.

2-184 ఫరూక్ ఖాన్ మరియు నద్వీ వల్ల వెలుగునకు వచ్చిన ఆయాతు లోని సూరా ప్రకారమూ  ఉపవాసము కొన్ని రోజులకనియే చెప్పబడినది కానీ అది ఎన్నిరోజులు అన్నది నిర్ధారింప బడలేదు. (రమదాను మాసమంతా అని చెప్పబడలేదు). ఆవిధముగా ఆ దీక్షను గ్రహించాలేనివారు ఒక పేదకు భోజనము పెట్టి వ్రత దీక్షను పూర్తి చేయవచ్చును. ఈ నిబంధనలు కాలాంతరమున మారవచ్చును అనికూడా ఉన్నది.

ఈ విషయమై బుఖారీ గ్రంథస్థము చేసిన హదీసు లో సలామః బిన్ అల-ఆక్వా ఈ విధముగా తెలుపుచున్నాడు: "ఎవరైతే వ్యాధిపీడితులై ఉంటారో, వయసు మీదబడినవారై ఉంటారో, ప్రయాణాలలో ఉంటారో అట్టివారు ఫిద్యాః, అంటే పేదవానికి, ఉపవాసము ఉండలేని రోజున భోజనము పెట్టుట, చేస్తే  సరిపోతుంది”.

ఖురాన్ లో ఒకసారి చెప్పిన విషము అలాగే కలకాలమూ ఉండిపోనవసరములేదు. దానిలో మార్పులు సూచించవచ్చును లేక దానికి బదులుగా క్రొత్త ఆయాతు అల్లా ఆదేశించ వచ్చును. అనగా ఖురాను తెలిపిన అల్లాది నిలకడతో కూడిన మనస్తత్వము కాదు. అది చలన చిత్రములో బొమ్మలు మారినట్లు మారుతూ ఉంటుంది.  

ఎప్పుడైతే అల్లా ఇఫ్తార్ తరువాత పత్నీ పరిష్వంగము సహారీ అనగా ఆ రాత్రి చివరి భోజనము వరకూ చెప్పినాడో ఆ రాత్రి అంతయూ మోమీనులు తమ భార్యలతో రతిక్రీడల పాల్గొన్ వచ్చును. ఒక కశానమునకు ఇది దైవ శాసనమే అనుకొందాము. మరి రాత్రి ఈవిధముగా గడిపినవాని మనసు అల్లా పై నిలకడగా ఉంటుందా! అసలు రాత్రులు కామోద్దీపనమగు అదుపులేని తిండి  తిన్న వ్యక్తి రాతికేలికి ఆసక్తి చూపకుండా ఉంటాడా! అట్లు చూపి అనుభవించినవాడు ఆరోగ్యముగా ఉండగాలుగుతాడా! అతి మదిలోని ఏ గదిలో నైనా భక్తి భావము ఉండగలుగుతుందా! ఈ ప్రశ్నార్థక వాక్యములకు బదులు దొరుకుతుందా!

ఉమర్ బిన్ అల్ ఖతబ్, మొహమ్మదు (సలిల్లాహు అలైహి వసల్లం) యొక్క ఒక భార్య తండ్రి. వారి మామ అగుటకు ముందు ఆయన రోౙా దినముల రాత్రులందు చాటుమాటుగా భార్యలతో శృంగారము నెరిపేవాడు. అది తెలిసిన మహామ్మదుగారు (సలిల్లాహు అలైహి వసల్లం) అల్లాకు నివేదించగా, ఈ సంభాషణకు మూడవ వ్యక్తి ప్రమేయము ఉండదు, ఆ యన చాటుమాటుతనము అవసరము లేదు నేరుగానే తన భార్యలను అనుభవించవచ్చును అని తన అంగీకారమును తెలిపినాడట. వేరు వేరు ప్రాంతములలో వేరు వేరు సమయములలో ఉదయాస్తమయాలు కలిగిన సూర్యుని ఆధారముతో రామదాను వ్రతమును పాటించుటెట్లు. కావున ఈ నియమ నిబంధనలు ఎడారి వాసులకు అన్వయమగును కానీ అన్యులకు కాదు. లోతుకు పోయే కొద్దీ లొసుగులు కొదవ లేకుండా దొరుకుతాయి. పాఠకులను విసిగించకుండా ఈ విషయమును ఇంతటితో విడిచిపెట్టుచున్నాను.

హిందూదేశములో ఖురాన్ యొక్క ఆంగ్లానువాదము  ఆంగ్లము నందు అరబ్బీ యందు అమితమైన పాండిత్యమును సంపాదించిన  మరియు హైదరాబాదుకు చెందిన అమీర్ అలి అన్న వ్యక్తి వ్రాయుట జరిగినది.  ఈయన నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌ గారితో మూడు సంవత్సరాల అనుబంధంతో సహా విద్యారంగముననూ  మరియు ప్రభుత్వంలోనూ విభిన్నమైన మరియు విశిష్టమైన తత్పరతతో  కృషి చేసి ఆయా రంగముల పురోభివృద్ధికి ఎంతగానో దోహదము చేసినారు. అతను రూరల్ ఇన్స్టిట్యూట్, జామియా మిలియా ఇస్లామియా (1960-65)లో డైరెక్టర్‌గా పనిచేసినాడు. అతను హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా ఉండినారు. గౌరవనీయులైన సర్ అక్బర్ హైదరీ, మరియు ఆయన కొంతమంది H.E.Hలకు ట్రస్టీగా పనిచేయుట జరిగినది.    హైదరాబాద్ చివరి వంశపారంపర్య పాలకుడు నిజాం స్థాపించిన ప్రైవేట్ మరియు మతపరమైన ట్రస్టుల (1967) కు ట్రస్టీగా ఉండినారు. అతను భారతదేశంలోని దక్కన్‌లోని హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డీన్‌గా ఉన్నారు. 1926 మరియు 1969 మధ్య, అతను USA ఆస్ట్రేలియా, ఈజిప్ట్, టెహ్రాన్, బాగ్దాద్, బీరుట్, ఇస్తాంబుల్ మరియు జపాన్‌లలో పర్యటించినారు.

అతను సామాజిక మరియు ఇస్లామిక్ విషయాలపై విమర్శనా పూర్వకముగా వ్రాసినారు. తన జీవితాంతం మధ్యయుగ సనాతన ధర్మం ద్వారా రూపొందించబడిన లేదా ఇస్లామిక్ విశ్వాసంలోకి ప్రవేశించిన అనేక దీర్ఘకాల తప్పుడు నమ్మకాలను అతను సవాలు చేసినారు. అతని భార్య సోఘ్రా అమీర్-అలీ (జ. 3 మే 1911) అతని కార్యకలాపాలకు గట్టిగా మద్దతు ఇచ్చింది.

ఈ విషయమొకసారి శ్రద్ధతో గమనించండి.

ఆర్కిటిక్ వలయమునకు  ఉత్తరమున దాదాపు 350 కి.మీ (215 మైళ్ళు) "నడిరేయి సూర్యు”ని  నార్వే యొక్క ఉత్తర ప్రాంతం నడిబొడ్డున ఉన్న ట్రోమ్సో అను ప్రదేశములోని ముస్లిం నివాసితులు అనుభవిస్తారు. మరి వీరికి ఖురాన్ యొక్క ‘రమదాన్ నియమావళి పాటించట ఎట్లు వీలగును?

ఈ వాస్తవము మీద కాస్త విశ్లేషణ జరుపుకొందాము. ఇస్లాం విశ్వ మానవాళికి సంబంధించిన మతమైతే అందలి నిబంధనలు కూడా విశ్వ వ్యాప్తముగా అనుసరింపబడు రీతిలో ఉండవలెను. మరి సూర్యుడే అస్తమించని ప్రాంతములో రమదాన్ విధులు నిర్వహించుట ఎట్లు? అసలు ఇట్టి నిబంధనలు ఖురాన్ లో బహిర్గతము చేయునపుడు, అట్లు చేసిన అల్లా ఇట్టి విషయములను అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని లోకమంతా ఆచరింపతగిన విధులను విధించావలెను కదా!~ నీరు దొరుకని పాడి పంటలు పంటలులేని ఎడారి ప్రాంత వాసులకు అనువగు విధివిధానము కలిగిన ఈ మతము మన దేశమునకు ఏవిధముగా ఆమోద యోగ్యము?

వైద్య నిపుణులు రామదన్ - రోౙా కు సంబంధించి తెలిపిన వారి అభిప్రాయములను గూగుల్ నుండి సేకరించి యథాతథముగా ఆంగ్లములోనే మీ ముందు ఉంచుచున్నాను.

In a recent study done on the Arab world, diseases linked to cholesterol and diabetes increased by 27.65% because of overeating. Non-compliance with prescribed treatment regimens is common during Ramadan. One study finds that incidences of dehydration increase during the month of Ramadan other health effects include:

Evidence of hemoconcentration and dehydration has been found during Ramadan (El-Hazmi, Al-Faleh, & Al-Mofleh, 1987; Kayikcioglu et al., 1999; Ramadan et al., 1999; Schmahl & Metzler, 1991; Sweileh et al., 1992). Restricted fluid intake, leading to disturbance in the fluid balance, is likely to cause these conditions. In the initial

stages of dehydration, the clinical signs are (an abnormally rapid heart rate.), tiredness and malaise, headaches and nausea. Middle-aged or more elderly persons are usually more prone to the effect of dehydration (Schmahl & Metzler).

Migraines are three times more common during Ramadan, affecting an estimated 90 million Muslims:

 An estimated 90 million of the world’s 1.57 billion Muslims are likely to suffer from migraine headaches during the dawn-to-dusk fasts during the month of Ramadan – which begins on Wednesday, at the height of summer heat. But Jewish researchers in the US and Israel have suggested how to help prevent the problem. Dr. Ibrahim Abu-Salah, Israel’s only Beduin neurologist – who works at Soroka University Medical Center in Beersheba – headed a team that found migraine attacks are three times more common during the Muslim fast than in the rest of the year.

The following study takes a look at the significant fluctuations in the weight of individuals that occurs during the month of Ramadan, primarily as a result of the metabolic changes that occur in the body. Researchers have found decreased heart rate and oxygen consumption during Ramadan (Husain et al., 1987; Ramadan et al., 1999; Sweileh et al., 1992). These findings suggest a metabolic adaptation to fasting. It seems that during the Ramadan daylight hours - when no food or water is taken in - to conserve stored energy, the metabolism slows down (Sweileh et al., 1992). Changes of sleep habit in Ramadan affects autonomic activity and melatonin rhythmicity. The other negative effects may be that, during fasting patients with cardiovascular disease cannot consume medications, such as anti-ischemic, anti-platelet, anti-hypertensive drugs, and drugs of heart failure on time. Some patients may get admitted to the hospital with cardiovascular symptoms owing to failure of therapy.

ఇది అతి క్లుప్తముగా ఖురాన్ – రామదన్ - రోౙా లను గూర్చి వ్రాసినాను. మీరు శ్రద్ధాళువులై విషయమును రహించి అవసరమగుచో మౌనము బూనక మీతో వాదించవచ్చిన ఎదుటివారిని మౌనులను జేయుడురని నా ఆకాంక్ష.

స్వస్తి.


Saturday, 5 March 2022

మకుటాయమాన చాటువులు (మామిడి గొప్పదనము)

 

మకుటాయమాన చాటువులు

 https://cherukuramamohan.blogspot.com/2022/03/blog-post.html

వెలయాలును, శిశువల్లుడు

ఇలయేలిక, యాచకుండు నేగురుధరలో

గలిమియు, లేమిము, దలపరు

కలియుగమున గీర్తికామ! కాటయవేమా!

కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. వెలయాలు, పసిబాలుడు, ఇంటి అల్లుడు, భూపతి,  బిచ్చగాడు భూమిపై గల ఈ 5 మంది తాము ఆశించే వ్యక్తి వద్ద ఇవ్వగల సత్తా ఉన్నదా లేదా అని యోచించరు.

 

“ కవయః క్రాంత దర్శినః” అన్నారు పెద్దలు. సామాన్యులు చూడలేని దృశ్యాలని కూడా కవి తన మనోనేత్రంతో చూడ గలడు. అందుకనే “రవి గాంచనిచొ కవిగాంచును” అనగా సూర్యుడు చూడలేనివి కూడా కవి చూసి వర్ణించ గలడు అని అర్థం. చిన్ని ఉదాహరణ.

ఓ పెంపుడు చిలక దానిమ్మ పళ్ళ గింజలని భుజిస్తోంది. సాధారణంగా దానిమ్మ గింజలు కొంచెంతెల్లగా, కొంచెంఎర్రగా ఉంటాయి. మన కంటికి మామూలుగా కనపడే ఆ దానిమ్మ గింజలని కవి ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి. ఆ చిలుక తినే దానిమ్మ గింజలు.

“ హరి నఖర భిన్న మత్త మాతంగ కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల బీజాని” హరి అంటే సింహం. సింహం యొక్క నఖర=గోళ్ళతో (పంజాతో) భేదించ బడిన మత్త గజము యొక్క కుంభస్థలముపై నుండి కారుతున్న రక్తంతో తడిసిన, (ఏనుగు కనబడితే సింహం ముందుగా దాని కుంభస్థలం పైకి ఎగిరి కొడుతుందిట.)

ముత్యాలహారంలోని ముత్యాలవలె ( కుంభస్థలంనుండి స్రవిస్తున్న రక్తంతో తడిసి, కొంచెంఎరుపు, కొంచెం తెలుపుగా కనబడే ముత్యాలవలె) దానిమ్మగింజలు ఉన్నాయిట” చూసేరా! చిన్న విషయాన్ని ఎంత గొప్ప ఉపమానంతో వర్ణించాడో కవి. అందుకనే ---

“అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిఃl

యధాస్మై రోచతే విశ్వం తధేదం పరి వర్తతే ll”  అనగా

కావ్య సృష్టి చేయటంలో కవి బ్రహ్మవంటివాడు. తనకి తోచిన విధంగా తన కవితాప్రపంచాన్ని సృష్టించు కొంటాడు. అని ఆర్యోక్తి. అట్టి కావ్య ప్రపంచంలో చాటువులని కూడ కవే సృష్టించాడు.

మామిడిని గూర్చి నా మనసులోని మాట:

మావీ నీదగు మాన్యతన్ దెలుప మా కేరీతి శక్యమ్ము  నీ

కేవీ సాటిగ రావు సత్యమిది నీకే చెల్లులే గాంచగా

మోవీ స్పర్శల పుల్కరింతలెగయన్ మూర్ధన్యవైనావులే

ఏవీ నిన్ బొగడంగ శబ్దములు ఎంతెంతేని యోచించినన్

అందరూ ఇష్టపడే మామిడి పండును కవి ఎంతగోప్పగా చాటువులో వర్ణించినాడో  ఇప్పుడు చూద్దాం.---        

 “ ఆభూచ్చామా జంబూ:, దళిత హృదయం దాడిమ ఫలంl 

సశూలం సంధత్తే హృదయమవమానేన పనసఃl 

భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలి ఫలంl 

సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతిll ” ఇది శ్లోకరాజం.

 

ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం చూద్దాం:--- “ జంబూ: = నేరేడు పండు. దాడిమ ఫలం= దానిమ్మ పండు. పనసః= పనసపండు. లాంగలి ఫలం = నారికేళఫలం.( కొబ్బరి కాయని సంస్కృతంలో ఫలమనే అంటారు) చూతం = మామిడిపండు.” ఇవి పై శ్లోకం లోని ఫలాలు. ఇప్పుడు వివరణాత్మకమైన భావాన్ని తెలుసుకొందాం. పై శ్లోకం మరలా చదవండి. ముందుగా నాల్గవ పాదం భావం చూద్దాం

 “పళ్ళలో మామిడిపండు ‘ఫలరాజము’గా ప్రపంచంలో కీర్తించ బడటం చూసి, మిగతాకొన్నిపళ్ళు చాలా బాధ పడ్డాయిట. ఎలా అంటే (ఇప్పుడు మొదటి పాదం నుండి చూద్దాం) నేరేడుపండు ముఖం మాడ్చుకొన్నదట, దానిమ్మపండు గుండె బ్రద్దలైనదట, పనసపండు గుండెలో కత్తి దిగినట్లు అయినదట, కొబ్బరికాయ గుండె నీరైపోయినదట. ఈ విధంగా పళ్ళన్నీ తమ బాధని వ్యక్తపరచినాయి”,  అని కవి ఎంత అద్భుతంగా వర్ణించినాడో చూసినారా! ఇందులో చమత్కారం ఏమిటంటే నేరేడు పండు నల్లగా కమిలినట్లు ఉంటుంది, దానిమ్మని పగలుకొట్టి కాని తినలేము, దానిని చెట్టునుండి విడదీయకుంటే చెట్టునంటుకొనియే పగిలిపోతుంది, పనసపండుని కత్తితో గుచ్చితేకాని తొనలను విడతీయలేము, కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. ఇవి ఆయా పళ్ళకు సహజంగ ఉండే గుణాలు. వీటిని కవి ఆయా పళ్ళ ఈర్ష్యకు ప్రతిరూపాలుగా చిత్రించి ఎంత గొప్పగా పైచాటు శ్లోకములో వర్ణించినాడో చూచినారా! అది కవియొక్క ప్రతిభ.

నా అనువాద పద్యములు కూడా ఒకపరి తిలకించండి:

కవితను ఆస్వాదించుట ఒక కళ. రసానుభూతి కలిగినవాడే నిజమైన, పాఠకుడు, శ్రోత మరియు ప్రేక్షకుడు.'రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు’ అన్నది ‘భాస్కర శతకకారుని’ మాట. కావున చదవండి, తెలుగు గొప్పదనము తెలియండి తెలుగును బతికించండి. 

చెట్టు పట్టు విడక చెదరె దాడిమగుండె

పనస గుండె దిగెను బాకు మొనలు

గుండె నీటి గుంత కొబ్బరి కాయెను

మావి రంగు రూపు మధురిమలకు

  చెట్టు కొమ్మను అట్టిపెట్టుకొని యుండగానే దానిమ్మ గుండె పగిలిందట( పండిన దానిమ్మ చెట్టుకు ఉండగానే పగిలి పోతుంది), పనస గుండెన బాకు మొనలు దిగినాయట, కొబ్బరి కాయ గుండె గుంత పడి నీళ్ళు నిలచినాయట, ఎందువల్ల అంటే అవి మావి పండు రంగు రూపు తీయందనము చూచి ఓర్వలేక!

అల్ల నేరెడేమొ అతి నలుపుగ మారె

పులిసి పోయె నిమ్మ పూర్తిగాను

కర్ర పుచ్చకేమొ కడుపంత నుబ్బెను

మావి రంగు రూపు మధురిమలకు

ఇంకా చూడండి మామి పండును చూసి కుమిలి కమిలి పోయింది నేరేడు పండు, నిమ్మేమో పులిశి పోయింది, కర్రపుచ్చకు కడుపంతా ఉబ్బిపోయింది, మావి రంగు రూపు మాధుర్యమునకు. నూతన వత్సరము అటువంటి మాధుర్యమును మామిడి పండులో నింపిన రీతిగా మనలో కూడా నింపమని భగవంతుని వేడెదము.

ఒక మామిడి పండు ప్రియుడు చవులు పుట్టించే ఆ పండును కైగొని తొక్క జాగ్రత్తగా తీసి  పెదవికి తాకించే లోపునే చేయి జారింది. అందుకు అతడు ఖిన్న వదనుడై ఆపండును ఎన్ని ఆకర్షణలు కలిగిన నీ తెనక రాతిగుండె ఎందుకయ్యింది? అని నిలదీయుచున్నాడు.

ఇదేదో అశ్లీల పద్యమనుకోవద్దు. ఇందు మీరు చూడవలసినది టెంకను గుండెగాను గుండెను రాయిగాను పోల్చుట. ఇది ఒక విధమగు కవితా చమత్కారము.

చక్కని రూపు చూడగను సాంద్రత గల్గిన నీ సువాసనల్

ముక్కున జేరి మానసము ముగ్ధము జేయగ నిన్ను పట్టి చే

జిక్కగజేసి కూసమును  చిన్నగ దీయుచు మోవి చేర్చగా

టెక్కును జూపి జారితివి టెంకయ నీదది రాతి గుండెయా!

 

ఇట్టిదే ఇంకొకటి.

“ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి/

సౌందర్య మాహవసి లోచన లోభ నీయం/

అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే/

యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి //

“రసాలసాలము” అనగా మామిడి పండునే పై చాటు శ్లోకంలో కవి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడో చూడండి.—“ఎవరికైనా కీర్తి, అందము ఉంటే చాలదు, మెత్తనైన మనసు కూడ ఉండాలి అది నీకు (మామిడి పండుకు) లేదు” అని కవి చమత్కరిస్తున్నాడు. ఎలాగో చూడండి.

 

 “ ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగ ఉంది;” అని మామిడిపండులో సహజంగా ఉండే టెంకని కఠినమైన మనస్సుతో పోల్చి వర్ణించడం కవి “క్రాంత దర్శిత్వానికి” నిదర్శనం. కనుకనే కవిని ‘ప్రజాపతి’తో పోల్చేరు. పైభావనకు నా అనువాద పద్యము:

సంసిద్ధ గంధ యుతముగ

సంసర్గము కల్గు చర్మ సౌందర్యముతో

సంసరిత స్వాదు సంయుత

సంసారము టెంక తోడ సాధ్యమె సలుపన్

సంసర్గము=సంబంధము; సంసరితము=జన్మించిన

స్వస్తి.

Saturday, 4 December 2021

జంబుద్వీపం:

 

జంబుద్వీపం:

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post_4.html

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబువులు అంటే నేరడు పళ్ళు. బహుశా ఈ ప్రదేశమంతా నేరేడు చెట్ల మాయమై ఉండేదేమో!

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించినారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. ఇవి మొత్తము 9 ద్వీపములు.

అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కిం పురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. (స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం, ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతము అబద్ధమని అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని సృష్టించినారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరూ దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు. ఇందుకు ఉదాహరణ సుగ్రీవుడు సీతమ్మను వెదకుటకు గానూ మొత్తము భూగోళమును గూర్చి రామాయణము నందు వానర మూకకు చెప్పటమే!

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టింనది కాదని అదంతా  తప్పుడు ప్రచారమని తెలియవస్తూ ఉన్నది. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

ప్రాచీన భారతదేశ చరిత్రకు ఉపయుక్తంగా ఉన్న విషయాలెన్నో పురాణ వాఙ్మయంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భౌగోళిక శాస్త్రమును గురించి ఎంతో విశధముగా కూడా వ్రాయబడి ఉన్నది. మన ప్రాచీనులు భూభాగాన్ని ఏడు ద్వీపాలు గాను, ఏడు సముద్రాలుగానూ విభజించినారు. 'సప్త ద్వీపావసుమతీ' (జంబు,ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర) అని మార్కండేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపవతీ మహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి పోతున్నది. ఈ జంబూ ద్వీపంలో మొదటి పదం నేటి జమ్ము కాశ్మీర్ అను రాష్ట్రంలోని జమ్మూగా ఉన్నది అన్నది నాలో కలుగు సందేహము.

 జంబూ ద్వీపం తొమ్మిది వర్షాలుగా విభజింపబడింది. ఈ జంబూ ద్వీపంలో ఏడు కుల పర్వతాలు న్నాయి. అవి హిమవంతం, హేమకూటం, నిషధం, మేరువు, నీలగిరి, శ్వేతాచలం, శ్రుంగవంతం అనేవి. ఈ కులపర్వతాల నంటుకొని ఏడు వర్షములున్నాయి. అవి ఇలావృత, భద్రాశ్వ, కేతుమాల, హరి, కింపురుష, రమ్యక, హిరణ్మయ, కురు, భరత వర్షములు. హిమవన్నగానికి దక్షిణంగా, సముద్రానికి ఉత్తరంగా భరత వర్షమున్నదని, ఈ భరత వర్షమునకు తూర్పున కిరాతులు, పశ్చిమాన యవనులు, మధ్యన బ్రాహ్మణ, క్షత్రి య, వైశ్య, శూద్రులు ఉన్నారని వాయుపురాణంలో రాయబడినది. ఈ భరత వర్షాంతర భాగమే నేటి భరత ఖండం, హిందూ దేశమని మన రాజ్యాంగ శాసనంలో ఉన్నది.

భరతవర్షము పురాణాల ప్రకారం ఇంద్ర, కేతుమంత, తామ్ర వర్ణ, గభస్తిమంత, నాగ, సౌమ్య, గాంధర్వ, వారుణ, కుమారికా అను తొమ్మిది ద్వీపాలుగా విభజించబడింది. నాటి కుమారికా ద్వీపమే నేటి హిందూ దేశం తో సరిపోవును. ఈ కుమారీ ఖండము హిందూ దేశమును ఆఫ్రికాతో కలిపి యున్చేదిదని, కాలాంతరమున ఇది సముద్రములో కలిసిపోయినదని కూడా కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఈ కుమారికా ద్వీపము మరలా ఏడు విషయాలుగా విభజించబడింది. అవి మధ్య, ఉదీచ్య, ప్రాచ్య, దక్షిణాపథ, అపరాంత, వింధ్య, హిమాలయ ప్రదేశములు. ఇందలి దక్షిణాపాతమే నేటి దక్కన్ పీఠ భూమి. ఈ దక్షిణాపథ దేశాలలో పాండ్య, కేరళ, చోళ, కూల్య, మహారాష్ట్ర, మహిష, కళింగ, విదర్భ, కుండల, ఆంధ్ర దేశములు తెలుపబడినవి. మార్కండేయ పురాణాదులలో ఆంధ్ర దేశము దక్షిణాపథములలో చెప్పబడి నది. కానీ నాటి దేశముల యెల్లలు పురాణములలో వివరింపబడలేదు. స్థల నిర్దేశాన్ననుసరించి ఆంధ్రదేశం కళింగ దేశానికి దక్షిణం గాను, ద్రావిడ దేశానికి ఉత్తరం గాను, కర్ణాటక మహారాష్ట్ర దేశాలకు పశ్చి మాన ఉన్నట్లు మాత్రం చెప్పవచ్చును. ఈ స్థలనిర్దేశం సంస్కృత కావ్యయుగం  తర్వాతి  శిలాశాసనాలలో స్పష్టం చేయబడినది. అసలు దీనిని బట్టి ఆంధ్రదేశము వారి భాష యగు ఆంధ్రము ఎప్పటినున్దియో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదని తెలియవచ్చుచున్నది.

 

          నేటికిని మన సంకల్పంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోఃదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఉత్తర, ఆగ్నేయ ప్రదేశే అని ఆయా ప్రాంతముల ఉనికిని చాటుటలో కృష్ణాగోదావరీ మధ్య దేశే అని కలిపి చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని ప్రాంతాలవారు శ్రీకృష్ణాకావేరియోః మధ్య ప్రదేశే అని చెప్పుకొనుట కూడా కద్దు. నేటి ఆంధ్రదేశం సగం భాగం దండకారణ్యంలోనూ, సగం భాగం కిష్కింధరాజ్యం లోనూ ఇమిడి ఉన్నది అని పెద్దలు చెబుతారు. వింధ్య పర్వతానికి దక్షిణంగా, కృష్ణాస్రవంతికి ఉత్తరంగా, మలయా,మహేంద్ర పర్వ తాలకు మధ్యగా దండకారణ్య మున్నది. దానిలో తూర్పు భాగం జనస్థానం, కృష్ణకు దక్షిణంగా కిష్కింధా రాజ్యముండెను. రామాయణ కాలమున రావణుని సోదరుడగు ఖరుడు ఈ జనస్థానానికి అధిపతి. ఈ జన స్థానమందే పంచవటి కలదు. శ్రీ రామభద్రుడు సీతా సౌమిత్రి సమేతుడై ఈ పంచవటి యందే కొంతకాలం కాపు రముండెను. ఇచ్చటనే సీతాపహరణం జరిగినది. ఈ పంచవటి ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరీ మండలంలోని భద్రాచల క్షేత్రానికి ఉత్తరంగా ఇరవై రెండు మైళ్ళు దూరంలో ఉన్నది. శ్రీమద్రామాయణం, కిష్కింధాకాండలో హనుమదాదులను సీతను వెదకటానికి దక్షిణ దిక్కుకు పోయి, దండ కార ణ్యానికి వెళ్ళి అక్కడ గిరివన దుర్గముల, గోదావరీ తీరముల నండ్ర, పుండ్ర, కేరళ, కురుదేశముల పరికించి రండని ఆజ్ఞాపించినట్లు గలదు.

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

స్వస్తి.

 

Thursday, 2 December 2021

పుష్పగిరి

 

పుష్పగిరి

https://cherukuramamohan.blogspot.com/2021/12/blog-post.html

‘హంస వింశతి’ కావ్యములోని ఈ పద్యమును గమనించండి.

తిరుమల కంచి పుష్పగిరి తీర్థములన్ జని కొంగుముళ్ళతో

వరములు దంపతుల్  వడయ వారికి కాన్కలు వైచి యంతటన్

బరికలు దృష్టి దీపములు పన్నిన గద్దెలు బెట్టి ఏమిటన్

గరమగు పుత్ర వంఛితము గానగ లేక విచార ఖిన్నులై 

తిరుమల , కంచితో ఒకానొకనాడు  సమానమైన, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. 

పుష్పగిరి ఒక అద్వైతపీఠము, పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప కర్నూల్ రహదారిలో కడపకు 16 కిలోమీటర్ల  వద్ద ఎడమవైపు తిరిగి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దక్షిణ భారతదేశం లోని మొట్టమొదటి “ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి” పీఠం , ప్రస్తుతం వైభవం కోల్పోయింది గాని ఈ ప్రాంతానికి “ పుష్పగిరి” అన్న పేరుకి గల కొన్ని పురాణ గాథలు ఇక్కడ ప్రచారం లో ఉన్నాయి.

తల్లి దాస్య విమోచనకోసం నాగులకోరిక మేరకు స్వర్గలోకం నుండి అమృతం తెస్తున్న గరత్మంతుడిని ఇంద్రుడు ఆ ప్రాంతం లో అడ్డగించినాడని, వారిద్దరు పెనుగులాటలో అమృతభాండం తొణికి అందులోని కొన్ని బిందువులు చింది ఇచట గల కొలనులో పడినట్లు, నాటి నుండి ఈ కొలనులో స్నానం చేసిన మానవులు అమరత్వం పొందుతున్నట్లు, ముసలి వారు యవ్వనవంతులుగాను, అనారోగ్యముతో బాదపడుతున్నవారు  ఈ కొలనులొ స్నానం ఆచరించిన పిదప ఆరోగ్యవంతులుగాను అవుతుండడం తో మనుషుల భారాన్ని మోయలేక భూమాత   త్రిమూర్తులతో మొరబెట్టుకోవడం తో  ఆ త్రిమూర్తులు వాయుదేవుని ద్వార ఒక పెద్ద కొండను తెప్పించి కొలను కప్పించారని, ఆ కొలనుపై కొండ తేలియాడగా విష్ణువు ఒక పాదం తోనూ, మహేశ్వరుడు మరొక పాదం తోను తొక్కిపట్టారని, కొండ సరస్సుపై పుష్పము వలే తేలియాడినందున ఆ కొండకు పుష్పగిరి  పేరు వచ్చినదని స్థానికుల కథనం.

పుష్పగిరి సమీపం లో పెన్న, పాపాఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవ్య నదులు కలుసుకొనుట చేత ఈ ప్రాంతం పంచనది క్షేత్రమని ప్రసిద్దికెక్కింది, క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని  నిర్మించట్లు ఉన్నది,  రాష్ట్ర కూట రాజు కృష్ణ వల్లభుడు  ఇక్కడి వైద్యనాధేశ్వర స్వామికి పూజల నిమిత్తం కొంత భూమి దానమిచ్చినట్లు, పల్లవ చిద్దణ దేవరాజు, వైదంబి సోమదేవ, కేశ మహారాజు యాదవ సింగవ, కాకతీయ సామంతుడు కాయస్థ గంగయ సాహిణి, విజయనగర ప్రభువులు, వారి సామంతులు అనేకులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అనేక దానములు ఇచ్చినట్లు ఇక్కడి శాసనములు తెలుపుచున్నవి. ఇక్కడి వైద్యనాధేశ్వర అలయాన్ని కరికాచోళుడు కట్టించాడని చరిత్ర కారులు చెబుతున్నారు,  కాకతీయ ప్రభువు గణపతిదేవులు పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీశివయోగింధ్రుల శిష్యులుగా ఉన్నట్లు ఆంధ్రుల చరిత్ర చాటుతున్నది.

పెన్నా నది ( పినాకిని) పుష్పగిరి గ్రామాన్ని చుట్టి తూర్పుకు ఉత్తరముకు ప్రవహిస్తున్నది, సందర్శకులు పుష్పగిరి గ్రామం నుండి పెన్నానదిని దాటి పుష్పగిరి కొండ చేరుకోవాలి, ఇక్కడ ఒక విశిష్టత ఉన్నది, నాకు తెలిసి శివకేశువులు ఒకే ప్రాంగణము ఉన్న ఆలయం లో ఉండడం అన్నది ఈ దేశం చాలా అరదు, ఇక్కడి విశిష్టత అదే…! ఒకే ఆలయ ప్రాంగణం లో శివకేశవులున్నారు పూజలందుకున్నారు కూడ, శైవులు, వైష్ణవులు చే పూజించబడినారు, మరో విశేషము ఎక్కడ కనపడనీ బ్రహ్మదేవుని విగ్రహం కూడ ఇక్కడ చూడవచ్చు, ఇంకా సంతాన మల్లేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మీ, సుబ్రమన్యస్వామి, గదాధరుడు, యోగాంజనేయులు దర్శనమిస్తారు. మరో విశేషము ఇక్కడి ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడల మీద ఖాళీ లేకుండా  పూర్తిగా  శిల్పాకళాకారులు మొలిచిన , కుడ్య శిల్పాలచిత్రాలు ఉన్నాయి, అంత్యంత మనోహరంగా ఉన్నాయి, రామాయణ, మహాభారత , భాగవత ఇతిహాసాల లోని ముఖ్య ఘట్టాలన్ని  ఈ గర్భగుడి గోడల చుట్టు చూడచ్చును ఈ  అద్భుతం.

ఆస్తికుడివా..? లేక నాస్తికుడివా అన్న బావనతో సంబందం లేకుండ  ప్రతి ఒక్కరు ఈ కళారూపాలను చూస్తూ..ఆస్వాదించవచ్చు, శిల్పకళల పట్ల మక్కువ, ఆసక్తి ఉన్న వారికి ఇక్కడికొస్తే పండగే,  మనకున్న చారిత్రిక సంపదయగుఈ అపురూప కళారూపాలను చూస్తూ మైమరుస్తాము. ఆంధ్ర శిల్పుల నేర్పరితనం అణువణువున కనిపిస్తుంది.  శివకేశవాలయముల చుట్టూ ఉన్న కుడ్య శిల్పకళాఖండాలు,  అందులో నటరాజనృత్యము,కిరుతార్జునీయగాధ, ఏనుగుల వరుసలు, అశ్వరోహకులు, వీరుల విన్యాసాలు చూపరలను రంజింపచేస్తాయి.

ఆలయ విమానం నాగర పద్దతి శిఖరము కలిగి ఉన్నది. విమానమునకు నాలుగు దిక్కులు నంది విగ్రహములున్నవి.   గజాసుర సంహారమూర్తి, కార్తికేయ, వినాయక, భిక్షాటన మూర్తులు గోడలపై చిత్రములైఉన్నవి.  శ్రీచెన్నకేశవస్వామి ఆలయానికి నైరుతి దశలో రుద్రుని పాదము, దానికి రెండుకిలోమీటర్ల దూరములో విష్ణు పాదము కనిపిస్తాయి,  శివకేశవు లిరువురు ఇచట పాదము మోపినారనటకు అవి దృష్టాంతారములు.  పౌరాణిక సంబంధమైన సర్వదేవత ఆలయములు ఇచట కనిపిస్తాయి, మరో విశేషము.. రతీమన్మధుల రతీ భంగిమల శిల్పాలు  నిశితంగా పరశీలిస్తే ఈ గోపురం మీద  కనపడుతాయి.

ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీన మైనది, శ్రీశైలఖండమందును, స్కంధ పురాణమందును,సత్యనాధుని రసరత్నాకరమందును, పుష్పగిరి క్షేత్రమును గూర్చి విశేషములు ఎన్నో ఉన్నవి, ఇక్ష్వాకులు నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణ ద్వారముగా ఈ క్షేత్రము పేర్కనబడింది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామిశ్రీచక్రాన్ని ప్రతిష్టించినారు.వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠము. మిగతవి వారు స్థాపించినవి కావు.

కాశీ యాత్ర గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతం నందు విడిది చేసినారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాసినారు:

పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా

రమణియ్యమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి యయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నది దాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది,

వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లోని బ్రహ్మాండ పురాణం, వాయు పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. శ్రీ శైల మహా సంకల్పంలో ‘...ఏలేశ్వర, స్కంద సోమేశ్వర, ప్రసూనాచల సంగమేశ్వరాద్యుపద్వార శోభితే..’  అని చెప్పడాన్ని బట్టి  పుష్పగిరి క్షేత్రమే శ్రీశైల నైరుతీ ద్వారమని తెలుస్తోంది (ప్రసూనాచలము అంటే పుష్పగిరి అనియె అర్థము). అంతేకాక ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది.

ఇన్నివిధముల ప్రశస్తికెక్కిన పుష్పగిరిని నేడు తాకి తలచేవాడు లేడు.

ఏ నాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మాపని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగం భోట్టూ!

అన్నట్లు తయారయ్యింది నేటి పుష్పగిరి పరిస్థితి.

స్వస్తి.