Wednesday, 28 December 2016

భావి భారత నేతలారా తెలుసుకొండి - క్రిస్మస్ అంటే నిజంగా ఒక పండుగా

నేను శ్రమ తీసుకొని వ్రాసిన క్రిస్మస్ పండుగ గూర్చి చదివి తమ అభిప్రాయమును చెప్పిన వారు అతి తక్కువ. అసాంతము చదివిన వారు నాకు ఇరువురు మాత్రమె కనిపిస్తున్నారు. 1. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు 2. గౌరీ శంకర్ గారు. నేను ప్రొద్దు పుచ్చుటకు వ్రాయుట లేదు. యువత చదివి తెలుసుకోవలెనను సదుద్దేశ్యముతో వ్రాస్తున్నాను. ఆశ అన్నది చెడ్డదని తెలిసినా ఈ వ్యాసమైనా చదివి యువకులు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క వ్రేలితో టైపు చేయాలి ఎందుకంటే నాకు typing రాదు, అయినా మీ మీద నమ్మకముతో కష్టమయినా ఇష్టముగా తీసుకొన్నాను. చదువుతారు కదూ! మీకోసమే సుమా! నేను likes కొరకు post చేయుట లేదు. చదివి మీ అభిప్రాయాన్ని ఆనందాన్ని తెలుపండి. 
కాలగణన (పాశ్చాత్య శైలి, భారతీయ శైలి) మరియు ఒక పరిశీలన అన్న అంశముపై వ్రాసిన వ్యాసమును ఈ క్రింది లంకె లో చదవండి. 
https://cherukurammohan.blogspot.in/


Sudhakar Yv గురువు గారూ ఒక్కరు చదివినా మీ ప్రయత్నం సఫలమే వారి గ్రూప్ లో ఇంకొకరు చదువుతారు ... ... ... నిస్పృహ వద్దు మీ ప్రయత్నం కొనసాగించండి

Kiran Mva Sir, I read your complete story and I know the amount of hard work that would have gone into it. My humble pranams to your service to the society Sir

Cheruku Ramamohanrao Dear Sudhakar, kiran and all my dear brothers The following is my mind.

నిజమునకు నిస్పృహ పడే బలహీనత నాలో లేదు. నాలో ఉన్నదీ ఆవేదన. ఒక చిన్న జరిగిన విషయమును చెబుతాను. నేను ఈ ఆస్య గ్రంధి లేక గ్రంధముఖి సభ్యుడనైన మొదటి సంవత్సరములో నా వయసు వారు ఆధ్యాత్మిక విషయయమున
కు ప్రాధాన్యత ఇస్తూ రచనలు సాగించమంటే, నేను చెప్పిన జవాబు ఒకటే. మీరు చెప్పిన పని కూడా చేస్తూవుంటాను అడపా దడపా. కానీ ఎల్లా కాలమూ అదే చేస్తూ ఉండను. నేటి యువత నా ధ్యేయము. వారు ఈ భూమిని గూర్చి, ఈ మట్టిపై పుట్టిన మహనీయుల గూర్చి, మహిమాన్విత ప్రదేశముల గూర్చి, మనపై మాయాజాలము చేసే పర మతముల వక్ర మార్గములగూర్చి తెలియబరచుతూనే వుంటాను. నేను ఆశా జీవిని. వారిలో ఎదో ఒక నాటికయినా చైతన్యము రాక మానదు. కావున నన్ను కేవలము మీ పని చేయుటకు మాత్రమె సీమితుని చేయవద్దు అన్నాను. ఆ మాటకే కట్టుబడి వున్నాను. యువత చదివితే తెలుసుకొనే వారి సంఖ్య పదులు , నూర్లు, వేలవుతుంది. 
పెద్దలకు మాత్రమె ఉపయోగమగు మగు వ్యాఖ్యానములు పరిమితులు దాటవు. వండిన అన్నము పదిమంది తింటే చేసిన వారికి సంతోషము. వండినది అట్లే ఉంటె పాచిపోతుంది. పాచిన కూడు పక్వమునకు రాదు కదా! అందువల్ల నా రాత నచ్చితే నాలుగు మాటలలో అభిప్రాయమును తెలిపి వారు నలుగురికి పంచితే యువత చైతన్య వంతులౌతారు. మన ధర్మమును పాదుగొలుపుతారు. మన ధర్మమూ పర్వత శిఖరమని, మన యువకులను పర్వతారోహకులు అని అనుకొంటే ఈ రచనలు ప్రాణవాయు ఘటములు. (If our dharma is the mountain peak and youth is the team of explorers, our guidance in the form of articles are the oxygen cylinders.) ఇదీ నా మదిలోని మాట. ఈ సమయములో హిందీ లోని ఒక పాట లోని ఒక చరణము తెలుపుతాను ' एक से एक मिले तो राई बन्सक्ती है परबत- एक से एक मिले तो इंसान कर सककते हैं ससब कुछ- साथी हाथ बढ़ाना - साथी हाथ बढ़ाना - एक अकेला थक जाएगा मिलकर भोज उठाना ' ఇదీ తక్షణ కర్తవ్యము.
నేను ఎక్కువగా వ్రాసియుంటే తప్పుగా తలువ వద్దు.
మీ అందరి అభిమానమునకు మనసారా పేరు పేరున ధన్యవాదములు.
మీరు చదివినట్లు, నేను వ్రాసినదే కాదు ఎవరు వ్రాసినదైనా, తెలిస్తే రచయిత ఇంకా మంచి విషయము తెలుపుటకు శ్రమ తీసుకొంటాడు.
AS Venkatachalapathi Super affectionate. Nice message. Thank you.

Dr-Vanadeep Kaluvagunta Splendid write-up sir! Such a painstaking effort! Reminds me of my publication on Panchangam 4 years ago and other related papers. Meeloni aa vidwadbharita tapanaku pranaamamulu!

Janaki Sistla Mahasaya,Meeru oka Nighantuvulu. Mee krushi amogham. Varnanateetam. Sanskrit Telugu Bhashalalo meeku chakkati avagahana,parignanam vunnayi.
U r a great historian too.
Kota Chalam Garu Maa bandhuvulu. Vari nakshatraganana amogham kalama anni ouposanapattaru. Ayana kumarudu,manumadu maaku anni vivaralu pustaka rupe a chupincharu.
Mana poorveekula medhassu manaku ippudu analonu manapillalalonu kanupistondi.
Mathematics,Astronomy,Physics,Astrology,Ayurveda annintilonu manam prapanchaniki adarsam.
To get into the past and delve into our genius gives us satisfaction,pride and purpose,to go or advance further. But,the westerners mastered this art into practice and shaped the world in technology. There also our Indians from IITs played a very big role,in America and Europe. 
We r proud of our heritage. Veda Samskruti.
Anta Rushimayam. Anandamayam.
We need alert minds,quick thinking,good analysis,wise interpreters. Probing into nature,it's wonders and how to appreciate it and translate into our day to day usage through gadgets,instruments,products and utilities.
Nano technology,AI,Robatics,Machine Intelligence,Space research,sensors,satellites,communications,Internet,wifi and all.
We feel it is the combined wisdom of the Universe.
All r human. God's creations. Have same feelings and aspirations.
Unity is strength.
Let us not feel we r great and get lost. Endaro Mahanubhavulu. Andaru kalisi ee maha prapanchanni uddarinchali.
We were great,they r great. All r great tomorrow. No difference of opinion.
God is one and for all.our visits abroad open our eyes. Our no.system unifies,makes infinity.
We need to feel scientific,pool the knowledge,utilize its findings for the benefit of all. Let us not limit ourselves to our past.
We see Acchanga Telugu and all. Why this limited view?
We fully appreciate ur wisdom and knowledge.
Manandariki avesam unnayi,alochanalu ani,chaduvu samskaralunnai,manchitanam undi. Mundu chuputo aduguleddam.
Think Alike- Bring happiness and Peace to the world.
Have a good day to cheer. 
Regards.
Sowmithri Jataprolu Very interesting . appreciate the research made&lucid presentation. Congrats & Thanks.
UnlikeReply138 mins
Cheruku Ramamohanrao At the outset let me thank you for the sweet words about me though I may not deserve it.
My anxiety is to make the youth aware of the greatness of our Rshis.
I have seen so many people of other religions who penetrate into our territories and attract the gullibles. 
Our perspectives are different. First I am trying to educate the youth that their ancisters are great even today. Adi Shankara is the human form of Lord shiva as you know. The other religions do not have even a single person of that greatness. As you have mentioned about Bra.Sri. Kota Venkatachalam garu' I am just mentioning his book ABHASA KRAISTAVAMU where in he establishes that Jesus himself has not born. About the other religion less said the better. 
Atleast the Muslim population in India can come into Indian census correctly to some extent but in the case of Christians it is simply impossible.
So the primary step is to arrest these defections and I opine this is possible by preaching the greatness of our dharma and our ancisters.
If this is first achieved we can join you entering the second phase .
A Hindu can be seen dressing as Santa but can you see a christian or Muslim in the attire of Shiva or Krishna. 
In their congregations Christians are exhorting that they are successful in making Christmas and New Year's Day as most important festivals than our own. 
The 17th century Western scientists, plagiarised our ancisters' knowledge, and gave to the world their discoveries and inventions in their names. They were so ruthless in discording Jagadish Chandra Bose as inventor of Wireless and giving the credit to Marconi. 
There are so many such things.
This is land where the king asks the lord 
"न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् |
कामये दुःखतप्तानां प्राणिनाम् आर्तिनाशनम् ||

"Na Twaham Kamaye Rajyam Na Swargam Na-apunarbhavam.
Kaamaye Dukha-Taptanam Praninamarti Naashanam."
"O Lord ! I do not want any Kingdom, nor heavenly pleasure nor even escape from rebirth. But I do want that the affliction of all beings tormented by the miseries of life may cease."
shubham bhuyath

Monday, 26 December 2016

ఇది సూచన కాదు వినతి

ఇది సూచన కాదు వినతి 1
ఒక రెండు వేల సంవత్సరముల వెనుకకు పోతే అసలు ప్రపంచమున నాడు నేడు కూడా పరిఢవిల్లినది, పరిఢవిల్లు చుండెడిది మన సనాతన ధర్మమూ మాత్రమే. మనదేశములో మతము అన్న పేర్లతో కాలూనినవి రెండు. వారి వారి దేవుళ్ళు, దేవదూతలు చెప్పిన ప్రకారము మనము అందరమూ వారికి అంటరాని వారమే! మన స్త్రీలు వారి పొందునో, మన పురుషులు వారి మత తీర్థమును పుచ్చుకొని వారి పాదముల చెంతనో నిలుచుటచే ఆ మతములు ఈ దేశమున కాలూనినవి. దేవుడు కనిపించట చేతనో, మత ప్రవక్తలు మన దేశమున చూపిన మహిమలచేతనో కాదు. వారి శాసనమును కాదన్నవారి తలలు ఉత్తరించబడినాయి అది కూడా కోటి సంఖ్యలో! మరి మన నేతలను చూద్దామంటే వారికి మతములపై గల అభిమానము ధర్మముపై లేదు. ఇటీవలి రోజులలో మాన్యతములగు మన ఆంద్ర ప్రదేశపు ముఖ్యమంత్రి జరూసలేమునకు పోవు మతస్తులకు 40,000 రూపాయలు చేసినట్లు విన్నాను. హజ్ కు వెళ్ళు మతానువర్తులకు కూడా పుష్కలమగు రాయితీలను అందజేస్తూనే వున్నారు. మరి ఆమతములకన్నా ఈ ధర్మము సనాతనమైనది, ఎన్నో ఆటుపోటులకు ఎదురొడ్డి నిలచినదీ కదా మరి మాన్యులు, మహనీయులు, పరమ దయాశీలి, పరమతస్థులను కూడా ఎంతో ప్రేమతో ఆదరించే ఆ దేశపు (ఆంధ్ర ప్రదేశపు)ముఖ్యమంత్రిగారు తానూ తన పూర్వులు తన బంధువులు, తన మిత్రులుఅధిక శాతములో గల తన ఏలుబడిలోని ప్రజలు ఇందరు సనాతన ధర్మమును పాటించుతూ వున్నారు కదా! మరి వారి తీర్థయాత్రలకు ఏవిధమైన వసతులు రాయితీలు కలిగించుచున్నారో వారికే ఎరుక.  వారే కాదు ఘనమైన చిరంజీవి గారు కూడా అన్య మతస్తులకు ఎన్నో వరాలనిచ్చినారు.
ఇది సూచన కాదు వినతి 2 చదవండి


ఇది సూచన కాదు వినతి 2
వీరిరువురికీ
 Dr T.H.Chowdary)
 * Director: Center for Telecom Management & Studies
Chairman: Pragna Bharati, Andhra Pradesh
 Fellow: Tata Consultancy Services & Satyam Computer Services
Former: Information Technology Advisor: Government of Andhra Pradesh
Chairman & Managing Director, Videsh Sanchar Nigam Ltd
గారు ఈ విషయములో బహిరంగ లేఖయే వ్రాయుట జరిగినది. మరి వారికి పొరుగింటి పుల్లగూర మాత్రమె ఎందుకంత రుచి. వారు మన సనాతన ధర్మావలంబులకు కూడా దయతో కైలాస మానస సరోవర యాత్రకు ఒక్కొక్క యాత్రికునికి ఒక లక్ష రూపాయల రాయితీ అయినా ఇచ్చి పేదలకు భగవంతుని సన్నిధానమునకు పంపిన పుణ్యము కట్టుకొన వచ్చును. ఎందుకు అట్లు చేయుట లేదు. ఈ ధర్మములో పేదలు లేకనా, భక్తి లేకనా, పుణ్యక్షేత్రములు లేకనా! అన్నీ ఉన్నాయి కానీ అసలైనది మాత్రమే లేక పేదలు పోలేక పోతున్నారు. ఈ ధర్మమూ యొక్క ఔన్నత్యము తెలుసుకొనుటలో వెనుకబడుతున్నారు.
పోతే పోయినది గాక! మనమైనా సంఘటితమౌదాము. మనది మతము కాదు. ఇది ధర్మము. నడవడిక, ప్రవర్తనము. అంతే కానీ పరమతముల వలె నమ్మకము (FAITH) కాదు. ఇది క్రూసేడులు, జీహాదులు లేని ధర్మము. సత్కర్మకు సత్ఫలితము దుష్కర్మకు దుష్ఫలితము వానికవే మన కాతా లో వచ్చి చేరుతాయి.
ఇది సూచన కాదు వినతి 3 చదవండి

ఇది సూచన కాదు వినతి 3
అందువలన మనము మంచిగా నడచుకోనవలసి యున్నది అని ఈ ధర్మము చెబుతూ వుంది. మన ప్రతి పండుగకు  దైవ పరమైన, ప్రకృతి పరమైన ఒక కారణముంది. కానీ ఇతర మతములవి తాము తమకుగా ఏర్పాటు చేసుకొన్నవి.
ఈ విషయమును ఒకసారి గమనించండి. రేపు రాబోయే జనవరి 1 వ తేదీని తీసుకోండి. అది ఏ విధమైన పండుగు. రాత్రులు భూత ప్రేత పిశాచములు విలయతాండవము చేసే సమయము. జంతువుల క్రొవ్వుతో తయారు చేయబడే వత్తుల వెలుతురులో వాని యొక్క అండములు, కొన్ని కొన్ని తినుబండారములకు మాంసము, ఎముకలపొడి ఆల్కాహాలు మొదలయినవి వేసి చేసే కేకులు అను పేరుతో ఎంతో ఆబగా కొని తెచ్చుకొని తింటున్నామే నిజముగా మనము పూజించే హరిహరాదులెవరైనా కోరినారని మనము చదివినామా విన్నామా  లేక మన పండుగ ఏదయినా అట్లు చేసుకొనుచున్నామా! ఎందుకు మన ఆడపడచులు ఉదయాత్పూర్వమే 'Happy New Year' ముగ్గులు వేస్తున్నారు. వారి ఋతువులు నాలుగే. చివరి ఋతువు AUTUMN. అంటే ఆకురాలు కాలము. ఇది ప్రాణముల వదులుటకు సంకేతము. ఈ కాలములో వస్తుంది ఈ జనవరి నెల. ఈ సమయములో ఎవరయినా సంవత్సరాది జరుపుకొంటారా! ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోండి. పర మతస్తులు జరుపుకొనే వారి వేడుకలు వారే చేసుకోనివ్వండి. మీరు పాల్గొనకండి. మీయింటి వినాయక వ్రతములో వారు పాలుపంచుకొనుట లేదుకదా! ఇది అప్రాచ్యులకు పండుగ కావచ్చు ప్రాచ్యులకు కాదు కదా! అంటే పశ్చిమ దేశస్థుల పండుగ కావచ్చునేమోగాని తూర్పు వాసులకు కాదు గదా!
ఇది సూచన కాదు వినతి 4 చదవండి

ఇది సూచన కాదు వినతి 4
పరులధర్మము విడుద్దాం,  ఇకనైన అంతా కలుద్దాం, భరత మాతను తలుద్దాం, అందరొకటిగ నడుద్దాం
ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హంతవ్యం మానో ధర్మో హతో వదీత్
మన ధర్మమును మనము కాపాడుకొంటే అది మనలను రక్షిస్తుంది. మరి మనము దానిని నాశనము చేస్తే అది మనలను నాశము చేయక మానదు.
శుభం భూయాత్

చెరుకు రామ మోహన్ రావు 


పవని నాగేంద్ర ప్రసాద్ నమస్కారం..ఈమధ్య ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంయుక్త ఆధ్వర్యంలో "దివ్య దర్శనం" అనే పధకం రూపుదిద్దుకున్నది..ఈ పథకంలో భాగంగా, ప్రతి జిల్లా నుంచీ సంవత్సరానికి 10,000 మందికి రాష్ట్రం లోని 5 పెద్ద దేవాలయాల దర్శనం పూర్తీ ఉచితంగా కల్పిస్తారు..ప్రతి మండలం నుంచీ 200 మందికి జిల్లా మొత్తం మీద 10,000 మందికి...ఇందుకయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వం వారే భరిస్తారు..ప్రతి మండల కార్యాలయం లో ఇందుకు దరఖాస్తులు, పూర్తీ చేసిన దరఖాస్తులు సవీకరించే ఏర్పాటు చేశారు..ఒకరగంగా ఒక అడుగు పడింది అని చెప్పొచ్చు..

Thursday, 22 December 2016

ఆకాశం గగనం శూన్యం

ఆకాశం గగనం శూన్యం -1
పై మాట నేను బాల్యము నుండి వింటూ వచ్చినాను. అది ఒక శ్లోక భాగము అని నాకు ఆ వయసులోనే అనిపించేది. కానీ ఆకాశము శూన్యము లేక గగనము శూన్యము అని ఒక పదము వాడితే చాలు కదా, రెండెందుకు అని అనిపించేది. ఆకాశము నిజానికి శూన్యమే కాబట్టి.
వయసు పెరిగేకొద్దీ ఆ శ్లోకమును పూర్తిగా తెలుసుకోనవలెనన్న తపన కూడా పెరుగుతూ వచ్చింది. ఏమయితేనేమి స్నాతకోత్తర పట్టాకై  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలమున చేరి గ్రంధాలయమునకు పోయి పుస్తకముల చదివే వెసలుబాటు దొరకిన పిమ్మట అసలు విషయము తెలిసింది.
మనపూర్వులు అంటే క్రీస్తునకు ఎన్నో వేల సంవత్సరములకు పూర్వమే మనవారు సంఖ్యాశాస్త్రమును లోకానికి అందజేయుటయే కాక '0' ను ప్రసాదించుటయేగాక 1 నుండి 10^62 వరకు సంఖ్యలకు నామకరణము చేసినారు.  10^62 ను మహౌఘ అంటారు. చాలా కాలము తరువాత అరబ్బులు దానిని అనుసరించినారు.
మనము అవసరమగు సంఖ్యలను సులభముగా గుర్తుంచుకొనుటకు గూడార్థములో శ్లోకరూపమున బంధించి యుంచినారు మన పూర్వులు. ఈ పద్ధతులు పలు విధములుగా వున్నా ముఖ్యముగా రెండు పద్ధతులకు ఎక్కడలేని ప్రాధాన్యము ఏర్పడినట్లు తెలియవస్తోంది. అవి 1. కటపయాది సంఖ్యలు 2. భూత సంఖ్యలు.

ఆకాశం గగనం శూన్యం -2
కటపయాది సంఖ్యలు: శంకరవర్మ వ్రాసిన సద్రత్నమాల లోని ఈ క్రింది శ్లోకం, ఈ పద్ధతిని వివరిస్తుంది.
నజ్ఞావచశ్చ శూన్యాని సంఖ్యా: కటపయాదయ:|
మిశ్రే తూపాన్త్యహల్ సంఖ్యా న చ చిన్త్యో హలస్వర:||
అనగా, '', '', మరియు అచ్చులకు "సున్నా" విలువ ఇవ్వబడుతుంది. కటపయ తో మొదలు అన్ని హల్లులకు 1-9 వరకూ విలువలివ్వబడినాయి. సంయుక్త అక్షరాలు (వత్తులతో సహా) వచ్చినపుడు, వెనుక వచ్చిన హల్లుని మాత్రమే లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. పొల్లు అక్షరాలను విడిచిపెట్టాలి. ''ది నవ ''ది నవ ''ది పంచక ''ద్యష్టక అన్నది సూత్రము.
ఇక రెండవ విధానము 'భూత సంఖ్య'పంచ భూతముల పేరుతో ఈ విధానము ఏర్పడింది. ఆకాశమునకు విలువ '0' లేక శూన్యము. పృథివీ=1 ఆపస్సు= నీరు=2 తేజస్సు= వెలుగు=3 వాయువు=4 ఆకాశము =0 భూతము = 5. ఈ విధముగా చక్రవర్తి అంటే శత చక్రవర్తులు= 6 ఋషి=సప్త ఋషులు= 7 ఈ విధముగా వుంటాయి.
ఇక శ్లోకమునకు వద్దాము.


ఆకాశం గగనం శూన్యం3
ఆకాశం గగనం శూన్యం ---0
దిగ్సంఙ్ఞాపంక్తిరేవచ-- (దిక్=8 పంక్తిః=2 ఆకాశము, భూమి)= 10
ఎకాదశాఖ్యా రుద్రాశ్చ= 11 (రుద్రులు 11 మంది అని వేదములలో చెప్పబడింది)
మానార్కాః ద్వాదశాహ్వాయా= 12 (సూర్యులు ౧౨గురు, ద్వాదశాదిత్యులు అంటారు)
ఈ నాలుగు పఙ్తులే ఆ శ్లోకము.
'అంకానాం వామతో గతిః' అని చేబుతూవున్నది సంఖ్యా శాస్త్రము. అంటే అంకెలను కుడినుండి ఎడమకు లెక్కించవలెను.
 విధముగా తెలుసుకోనవలేనన్న తపన వుంటే ఏమయినా తెలుసుకోవచ్చు. లేకుంటే పతనమే!
స్వస్తి

చెరుకు రామ మోహన్ రావు

Thursday, 1 December 2016

ఓంకార స్వరూపము

ఓం శబ్దముతో శరీరములోని అలసట దూరమౌతుందని నిరూపించిన అమ్మాయి

ఓం శబ్దముతో శరీరములోని అలసట దూరమౌతుందని అన్వేశా రాయ్ అన్న9వ తరగతి చదివే పదునాలుగేళ్ళ బాలిక ప్రయోగాత్మకముగా నిరూపించినది. పశ్చిమ బంగాల్ లో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను ఆకట్టుకొనింది.
ఓం శబ్దము వినుటరక్తములో ఆక్సిజన్ శాతము పెరిగి  కార్బండయాక్సైడ్ మరియు లాక్టిక్ ఆసిడ్ల నిలువలు తగ్గుతాయని తద్వారా అలసట ఉండదని ఆ అమ్మాయి కలకత్తా, జాదవ్ పూర్  యునివెర్సిటీ ప్రొఫెసర్ల సమక్షమున తన ప్రయోగము ద్వారా నిరూపించింది.





ఓం నమో పరమాత్మయే నమః
ఓం అను అక్షరమును ఊహించవలయును. ఓం అని గానము చేయవలెను.ఏ విధంగా అమరమై, అమృతమై, అభయమై యుండు ఓంకారమును ఊహించుచున్నాడో, అతడు దేవతలవలె అమృతత్వమును పొందును.
నామారూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయి యున్నది. ఈ జగత్తు దానినుండియే కలిగినది. దానియందే లయమగుచున్నది. దానియందే ప్రతిస్టితమైయున్నది. కావున శాంతుడై బ్రహ్మమును ఉపాసించ వలయును.
నామరుపాలతో గుడిన ఈ జగత్తు ఉత్పన్న మగుటకు పూర్వము సత్తుగా ఏకమై, అద్వితీయమై యుండినది.
ఓ శ్వేతకేతు! ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై యున్నది. ఆ పరమాత్మయే సత్యము. అదియే ఆత్మ. అదియే నీవై యున్నావు.
ఆచార్యుడైన మనుజుడు బ్రహ్మమును తెలిసికొని వెంటనే మోక్షమును బడయుచున్నాడు.
సనత్కుమారుడు-భూమ (గొప్పది, బ్రహ్మము,ఆత్మ) అనునదియే సుఖము – అల్పమైన దానియందు సుఖము ఉండదు. కావున గోప్పదియే సుఖము. ఆ గోప్పదియగు ఆ ఆత్మనే తెలిసికొనవలయును.
దేనియందు(ఆత్మయందు) దానికంటె వేరైనది ఏదియు కనబడుటలేదో, వినబడుట లేదో, తెలియబడుట లేదో, అదియే భూమ. దీనికంటే వేరైనది అంతయు అల్పము. భుమా స్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైన దానికి నాశము కలదు.
ఆ భూమ (ఆత్మ) క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల అంతటయు నిండియున్నది. ఈ కనిపించు ప్రపంచమంతయు అదియే. అదియే నేను. నేనే క్రింద, పైన ఎల్లెడల ఉన్నాను. అంతయు నేనుగా వున్నాను.
క్రింద, పైన, అన్ని చోట్లను ఆత్మయే నిండియున్నది. అంతయు ఆత్మయే. ఈ విధముగా చుచియు, తలన్చియు, తెలిసికోనువాడు అత్మయందే క్రీడించుచుండును. అత్మ తనయందే వున్నదని ఆనందమొందుచుండును. తానె రాజైయుండును. సమస్త లోకములందును తన ఇష్ట ప్రకారము వర్తించుచుండును. ఎవడు ఆత్మను మరియొక విధముగా ఎరుగునో అట్టి అజ్ఞాని ఇతర రాజుకు లోబడియుండును. నాశముకల లోకములను పొందును. లోకము లన్నిటియందును తన ఇస్టప్రకారము సంచరించుటకు అతనికి సాధ్యపడదు.
ఈ ప్రకారము ఆత్మను తెలిసికోనినవాడు మృత్యువును చూడదు; రోగమును పొందడు; దుఃఖము నొందడు. సమస్తమును ఆత్మగా చూచును. సమస్తమును సర్వవిధములుగా అగుచున్నాడు. సృష్టికి పూర్వము ఆ ఆత్మయే (బ్రహ్మయే) యున్నది. తరువాత అదియే మూడై, ఐదై, ఏడై, తొమ్మిదై, అనేకమైనది.
మొట్టమొదట ఆహారమును శుద్దముగా చూడవలెను. దానిచే అంతఃకరణ శుద్ధి కలుగును. దానిచే స్మరణ శక్తి కలుగును. దానిచే అజ్ఞాన గ్రంధు లన్నియు విచ్చినములై పోవును. అతని దోషములు తోలిగిపోవును. అని భగవంతుడు సానత్కుమారుడు నారదునికి తెలిపెను.
ఈ దేహమునకు ముసలితనము కలిగినను బ్రహ్మమునకు (ఆత్మకు) అట్టి ముసలితనము కలుగదు. దేహమునకు దెబ్బ తగిలినను బ్రహ్మమునకు తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది. దేహము సత్యము కాదు. బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించియున్నవి. ఈ ఆత్మ (బ్రహ్మము) పాపరహితమైనది. దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పిక లేవు.అది సత్యకామమై (అది తలంచిన ప్రకారం జరుగును). సత్యసంకల్పమై యున్నది. ఇట్టి ఆత్మను తెలిసికొనవలయును. దానిని తెలిసికోనినచో ఈ లోకమున రాజుయొక్క ఆజ్ఞానవర్తులై అనుసరించువారు ఏ యే ఫలమును, ఏ యే ప్రదేశములలో కోరుదురో, దానినే పొండుడురుకాని సమస్తమును పొందనట్లు, సమస్తమును స్వేచ్చగా పొందలేరు.
ఈ ఆత్మ హృదయమునందే కలదు. ఈ ప్రకారము తెలిసికోనినవాడు ప్రతిదినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఈ ప్రకారమెరిగినవాడు సంప్రసాదుడనబడును. అట్టి వాడు (బ్రహ్మానుగ్రహము నొందినవాడు) దేహాత్మ భావాది అజ్ఞానమునుండి తొలగి పరజ్యోతి స్వరూపమును(ఆత్మను) ఆశ్రయించి దానితో ఐక్యమొందుచున్నాడు. కనుక జీవునకు అత్మయనెడి పేరు ఏర్పడినది(జీవాత్మ అని). ఆ ఆత్మ అమృతమై, అభయమై, బ్రహ్మమై యున్నది. ఆ బ్రహ్మమునకు సత్యమని పేరు.
ఈ ఆత్మ సేతువు (గత్తు౦ వంటిది. సర్వమును భరించుచున్నది. ఈ ఆత్మ కాలపరిచ్చేదము లేనిది. దానికి ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్క్రుతములు లేవు. కావున ఆత్మయందు సమస్త పాపములు నసించిపోవుచున్నవి. అత్మలోకము పాపసంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ ప్రకారముగా ఉపాసించువారు స్వర్గమును (ఆత్మపదమును) పొందుచున్నాడు.
ఈ ఆత్మను తెలిసికోనినచో అంధుడు (అజ్ఞానము కలవాడు) అంధత్వము లేనివాడగును. శరీరమున్నపుడే అజ్ఞాని జ్ఞానియగును. శరీర మున్నపుడు, తచ్చరీరకార్యములచే దుఃఖమొందినవాడు సుఖమొందును. సంకటము నొందినవాడు సంకటము లేనివాడగును. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలగుచున్నది. అతడు ఎల్లప్పుడు (జ్ఞాన) ప్రకాశముకలవాడై ఆత్మైక్యము నొందును.
యజ్ఞమనునది బ్రహ్మచర్యమే. జ్ఞానియగువాడు బ్రహ్మచర్యము వలన యజ్ఞఫలమును పొందుచున్నాడు. బ్రహ్మచర్యముచే మనుజుడు ఆత్మను పొందుచున్నాడు.
హృదయమునందు నూటఒక్క నాడులు కలవు. వానిలో ఒక్కనాడి (సుషుమ్న) మూర్ధమునకు పోవుచున్నది. దానిద్వారా జ్ఞాని ఊర్ధ్వమునకేగి అమ్రుతత్వమును పొందుచున్నాడు. ఇతర నాడులు అడ్డముగా అంతటా వెల్లుచున్నవి.
ఆత్మ పాపరహితమైనది. వార్ధక్యము లేనిది, మరణము లేనిది, శోకము లేనిది, ఆకలిదప్పికలు లేనిది. అది సత్యకామమును, సత్యసంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను బాగుగ వెదకి తెలిసికోనవలెను. అట్లు తెలిసికోనినవాడు సమస్తలోకములను, సమస్త అభిలాషలను పొండుచున్నాడని ప్రజాపతి చెప్పెను.


సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమనీ వారి ప్రతిష్ఠకు సత్యమే కారణమనీ, వారి శక్తికి మూలం సత్యమేననీ ఛాందోగ్యోపనిషత్తు ప్రవచిస్తోంది. అరుణ రుషి తన పుత్రుడైన శ్వేతకేతువుతో అష్ట సిద్ధుల్లో మొదటిదైన 'అణిమ'యే యావత్ప్రపంచానికి 'ఆత్మ' అనీ అదే సత్యమనీ, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజమనీ చెబుతాడు. 

'సాధనఅనే పదం తరచుగా వాడుతుంటారు.  సాధన అంటే?
శిల్పి యొక్క సాధనలో బండరాయి నుండి భగవంతుని రూపం బహిర్గతమవుతుంది.  అలానే ఆత్మజ్ఞాన ప్రాప్తికై తగురీతిన మనసును సంస్కరించుకొనేందుకు అవలంభించే విధానమే సాధన.  

'తస్మాత్ శాస్త్రం ప్రమాణంతేశాస్త్రం ద్వారానే జ్ఞానం లభిస్తుంది.  అయితే ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఎలా పొందాలిఒకసాధారణమైన పుస్తకం చదివినట్లుగా శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందలేము.  దాన్ని బోధపరచే తత్త్వవేత్త ద్వారానే శాస్త్ర జ్ఞానాన్ని పొందగలము.  "ఆత్మావారేద్రష్టవ్యః  శ్రోతవ్యః మన్తవ్యః నిదిధ్యాసితవ్యః" ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడు శ్రవణమనననిదిధ్యాసనలతో మాత్రమే పొందగలడని ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తుంది. 

శ్రవణం అంటే?
గురుముఖతః సాధకుడు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి.  గురువు తను పరంపరగా పొందిన శాస్త్రానికి తన సాధనలో పొందిన అనుభవాలను మేళవించి శృతియుక్తిఅనుభవములతో బోధిస్తాడు. అట్టి వాక్యాలను శ్రద్ధతో గ్రహించడాన్నే శ్రవణం అంటారు. 

మననం అంటే?
గురువు ద్వారా గ్రహించిన విషయాన్ని ఏకాంత ప్రదేశంలో ఆశీనుడై మనసులో ధారణ చేస్తూఆ విషయాల పట్ల విచారణ చేయడమే మననం.  మననం చేయడం వల్ల జ్ఞానము ధృడ పడుతుంది. 

నిదిధ్యాసన అంటే?
మనన సమయంలో కలిగే సంశయాలను గురువు ద్వారా నివృత్తి పొందిన వ్యక్తిలో తత్త్వం పట్ల సరైన అవగాహననిష్ఠ కలుగుతుంది. అట్టి సాధననే నిదిధ్యాసన అంటారు.

సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలి? 
కామక్రోధాలుఈర్ష్యాసూయలురాగద్వేషాలుమదమాత్సర్యాలుదంభందర్పంఅహంకారంమమకారం ఇవన్నీ సాధకుని బలహీన పరచే కోణాలు.  కనుక సాధకుడు పూజజపముధ్యానమనే అనుష్ఠానములతో అంతఃకరణ శుద్ధి పొందిక్రమేపీ వీటి నుండి బయటపడగలడు.  

మోక్షం పొందేందుకు పూజలుజపాలుస్తోత్ర పారాయణలు అవసరమా?
అది పొరపాటు.  ఇవన్నీ భక్తీ యొక్క అంగాలు.  పాలను పోసే ముందు పాత్రను ఎలా శుద్ధి చేస్తామో అలానే పరమపవిత్రమైన జ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడి హృదయ క్షేత్రము కూడా శుద్ధి పొందాలి.   అందుకే'మోక్షసాధన సామగ్ర్యాం భక్తి రేవగరీయసీమోక్షసాధనకు అంతఃకరణ శుద్ధి అవసరము.  అట్టి అంతఃకరణ శుద్ధికి భక్తి అనే మార్గాన్ని సూచించారు.  కాబట్టి భక్తుడు కానిదే జ్ఞాని కాలేడు.  జ్ఞానార్జనకు భక్తి మొదటి మెట్టు.  ఈ మెట్టునే ఎక్కలేని వాడు మోక్షపదానికి అర్హుడు కాలేడు.  కాబట్టి సాధకుడు పూజజపముస్తొత్రపారాయణల వంటి సత్కర్మలను ఆచరించి భక్తి అనే సోపానంతో అంతఃకరణ శుద్ధిని పొందగలడు.

భక్తి అంటే ఏమిటి?
నుదుట విభూతి రేఖలుబొట్టు ధరించి ఉదయంసాయంత్రం పూజలు చేయడంప్రతిరోజూ గుడికి వెళ్ళడం వంటివి భక్తికి బాహ్యాంగాలు మాత్రమే.  భక్తి అనే మహత్తరమైన భావాన్ని వీటి వరకే పరిమితం చేయకూడదు.  రౌడీలు,గూండాలుఖూనీ చేసే వారు కూడా బొట్టు పెట్టుకుంటారు.   పూజలు చేస్తారు.  గుళ్ళుగోపురాల చుట్టూ తిరుగుతారు.  కనుక భక్తిని కేవలం ఈ బాహ్యకర్మలకే పరిమితం చేసి సంకుచితభావన తో చూడకూడదు.  భక్తునిలో చిత్తశుద్ధిని కలిగించి క్రమేపీ అతనిని పరిపక్వస్థితికి చేర్చేదే భక్తి. అట్టి చిత్తశుద్ధి కలిగిన సాధకుడు ధ్యానం ద్వారా అంతర్ముఖతను పొంది నిజస్వరూపమైన ఆత్మతత్త్వమందు నిశ్చల స్థితిని పొందగలడు.

ధ్యానంలో మనసు నిలకడగా ఉండడం లేదు.  ఎందువల్ల?
మనసు అలజడిఉద్వేగాలకు లోనై రకరకాల విన్యాసాలు చేస్తుంది.   విన్యాసాలకువికారాలకు మన ఆహార విహారాలే కారణమౌతున్నాయి.  కనుక సాధకుడు తన ఆహార విహారాల్నిచుట్టూ ఉండే పరిసరాలను తన సాధనకు సానుకూలమైనట్లుగా మార్చుకోవాలి.   అంతే కాని సాధనకు విరుద్ధమైన మార్గాలలో పయనిస్తూ మనసు నిలవడం లేదని ఫిర్యాదు చేయడం సముచితం కాదు.

మరి ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు యోగాసనాలుప్రాణాయామం వంటివి సహకరిస్తాయా?
ప్రాణాయామంయోగాసనాల వల్ల శరీరంలోని నాడులు శుద్ధమై చక్కటి దేహధారుఢ్యం లభిస్తుంది.   అయితే మనసు ఏకాగ్రతను పొందాలంటే అంతరంగిక సాధనను అలవాటు చేసుకోవాలి.  తిరిగే ఫ్యానుని ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగాపరుగులు తీసే మనసుని నియంత్రించేందుకు కూడా మార్గముంది.