Tuesday 8 December 2020

పెద్దల మాట

 

పెద్దల మాట

ధర్మార్థం బ్రహ్మణే దానం యశోర్థం నటనర్తకే

భృత్యేషు భరణార్థంవై భయార్థంచైవ రాజసు

 

గోభీర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః

అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ

 

వేదమూల మిదం బ్రాహ్మ్యం

భార్యామూల మిదం గృహం

కృషిమూల మిదం ధాన్యం

ధనమూల మిదం జగత్

అచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్ఛి

విద్య అంతా అయిపోయిన తరువాత గురువుకు సంతృప్తికరమైన గురుదక్శిన్క ఇచ్చుట అతంత ఆవశ్యకము. ఆతరువా వివాము సంతాన ప్రాప్తి మొదలగునవి.

అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం l

అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః ll

మంత్రము బీజాక్షరములను కలిగియుంటుంది. అక్షరమును పలికే తీరులో పలికితే బీజాక్షరమౌతుంది. కావున మంత్రము కాని అక్షరము లేదు. అట్లే ఔషధము కాని మొక్కలేదు. యోగ్యత లేని వ్యక్తిని చూడము. ఎటొచ్చీ ఆయా విషయములను మనసుపెట్టి పరిశీలించ వలసియుంటుంది.

No comments:

Post a Comment