Saturday 5 December 2020

కొనకుండా నవ్వుకొనండి- స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం

 

కొనకుండా నవ్వుకొనండి- స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణం

https://cherukuramamohan.blogspot.com/2020/12/blog-post.html

ఒక స్త్రీ ఒక పురుషుడు తమ తమ వాహనాలను, పెద్దగా సంచారములేని రోడ్డుపై, వ్యతిరేక దిశలో 

నడుపుకొంటూ వస్తున్నారు. అతడు చాలా rash గా వస్తున్నాడు.  ఏమైందో ఏమో పెద్ద accident 

జరిగి పోయింది. రెండు కార్లు ఎందుకూ పనికిరాకుండా పోయినాయి. స్త్రీ వెంటనే స్పందించి " 

ఇంత  accident జరిగినా కార్లకు తప్ప మనకేమీ హాని జరుగలే"దన్నది అతనితో. అందంగా వున్న 

యాఅతివ ఆమాట అంటూనే ఆలోచనే లేకుండా "అవునవును మనము చాలా 

అదృష్టవంతుల"మన్నాడు అతను. ఆమె వెంటనే "మీరెంతో సరళ హృదయులు" అని 

ప్రశంసించింది. అతను కూడా స్పందించి "మీకన్నానా" అన్నాడు. ఒక నిముసం మాట్లాడుకొన్న 

తరువాత ఆమె అతనితో " ఇంత accident జరిగినా చూడండి నాకిష్టమైన విస్కీ బాటిలు మాత్రం 

పగలలేదు. బహుశా అది కూడా మన సహవాసాన్ని కోరుకొంటూవుందేమో" అన్నది. అతను కూడా 

ఉత్సాహంగా "అవును" అని తల వూపినాడు. వెంటనే ఆమె "ఈ సందర్భాన్ని ఇక్కడే 

చిరస్మరణీయమ్ ఎందుకు చేసుకోకూడదు" అని అన్నది. అతనూ ఉత్సాహంతో "అవును' అన్నాడు. 

ఆమె మూత తీసి విస్కీ సీసా అతని చేతికిచ్చింది. అతను ఆనందంగా ముప్పాతిక సీసా ముగించి ఆమె చేతికిచ్చినాడు. ఆమె సీసాకు మూతపెట్టి తిరిగి అతని చేతికే ఇచ్చింది. "మీరు పుచ్చుకోరా" అన్నాడతడు.

ఆవిడ నింపాదిగా "నాకు వద్దు నేనిప్పుడు పోలీసులకోరకు wait చేస్తున్నాను"అన్నది.

మీకర్థమై పోయివుంటుంది, మరి ఆలస్యమెందుకు నవ్వండి.

No comments:

Post a Comment