Wednesday 28 March 2018

యువతకు మనవి.


యువతకు మనవి.          (చెరుకు రామ మోహన్ రావు)
మనవి,మన్నింప దగినవి, మరువలేనివి,మరువకూడనివి,మనశ్శాంతి కూర్చేవి ఈ విధంగా మనము తప్పకుండా తలపోస్తాము . కానీ ఈ అభిప్రాయాలు ఏర్పరచుకొనుటకు ఏ వ్యాసమునైనా ఒకసారి చదివితే మీకే అవగతమౌతుంది. పై విభాగములలో,దేనికైనా ,మీరు చదివిన వ్యాసము చెందేటుగా వుంటే మీ అనుభూతి తెలుపండి. అట్లు చేయుటకూడా నా దృష్టిలో రచయిత కొరకు గాదు, సాటి పాఠకుల కోసం. అది చూసి ఇంకా కొందరు చదువవచ్చు. ముఖ్యంగా మన సంస్కృతి , మన భాష, తపోధనులైన మన మునుల గూర్చిన విషయాలు చదివినప్పుడు అవి ఇంకా పదిమందికి పంచండి. ప్రవచనములలో లోకమాన్యత పొందిన ఎందరో మహనీయుల ప్రవచనముల   వినివుంటారు. వారి పై ఎంతో ఆరాధనా భావమును పెంచుకొని వుంటారు. మరి అంతటి గొప్పవారు చెప్పిన విషయాలను ఎంతవరకు గ్రహించి పాటించుచున్నాము అన్నది సమస్య. చెప్పునపుడు, ఎంత వినవలెనని వున్నా మనసు తప్పుదారి పట్టవచ్చునేమోగానీ వ్రాసినది చదివేటపుడు ఆ వీలు లేదు . ఎందుకంటే ఎక్కడైనా మనసు ఒకవేళ చెదిరినా,తిరిగీ ఆ భాగము చదివే అవకాశము వుంటుంది . విన్నది నచ్చవచ్చు గానీ, నచ్చినదంతా చెప్పలేము. వినే వ్యక్తీ కూడా దొరకవలె . రచన ఐతే వీలు దొరికినపుడే చదవ వచ్చు. బాగుంది అని ఒక మాట వ్రాస్తే పదిమందికీ చదివే అవకాశమును ఇచ్చినవారవుతారు.అందువల్ల నేను కోరేదేమిటంటే మంచి వ్యాసము ఎవరు వ్రాసినవైనా నచ్చితే చదివి, బాగుంది నలుగురూ చదవవలసినది అని నాలుగు మాటలు వ్రాయండి. బాగున్న వ్యాసాలు పదిమందికి పంచండి. ఇది దయవుంచి నా వ్రాతలకు 'ప్రకటనగా' భావించవద్దు. ఈ గ్రంధముఖి కుడ్యముపైఎందరో పండితులు,అనుభవజ్ఞులు,విద్వాంసులు, ఎన్నో మంచి విషయాలు , తమ వయసును కష్టాన్ని లెెక్క చేయకుండా మంచిని పంచవలెనను ఒకే ధ్యేయముతో వ్రాస్తున్నారు. మీరు చదివి ,పంచి, సహకరించి అటువంటి వ్యక్తులను ఉత్తేజపరచితే తమ గ్లానిని కూడా మరచి ఇంకా మంచి విషయాలు చెబుతారు .
నన్ను తప్పుగా తలవరన్న ఆశతో వ్రాసినాను . మీ విజ్ఞతకిదే నా నమస్కారము.


No comments:

Post a Comment