Wednesday, 27 July 2022

ఒకే వస్తువే ఒకరికి మేలు ఒకరికి కీడు

 

ఒకే వస్తువే ఒకరికి మేలు ఒకరికి కీడు

ఆయుర్వేద వైద్యశాస్త్రమున తెల్పిన కొన్ని చెట్టు దినుసులు, కొందరికి మంచిని చేకూర్చితే కొందరికి చెడుగును చేకూర్చుతుంది ప్రభుత్వమూ కొన్ని ప్రజోపయోగాకరమగు కార్యక్రమములు చేపట్టితే  ప్రతిపక్షములకది మింగుడు పడదు. పూర్వము ప్రతిపక్షములు కూడా దేశ ప్రగతికి భిన్నముగా ప్రభుత్వము నడచుకొంటే తమ సుతర్కముతో వారి ఆలోచనలను నియంత్రించేవారు. నేడు ఆ స్థితి లేదు. కరడు కప్పిన స్వార్థమే కరాళ నృత్యము చేయుచున్నది. నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.

మంచిని ఎంచలేరు మది, మానక గాంతురు లేని తప్పులన్

కొంచెము కూడయున్ మదిన కోరరు దేశ ప్రయోజనమ్ములన్

ముంచగా చూచుటే తమకు ముఖ్య ప్రణాళిక యంచు ఎప్పుడున్

వంచన తప్ప దేశమును వర్ధిల జేయరు శత్రు పక్షముల్

ఇది నేటి రాజకీయ స్థితికి దర్పణముగా .భావించుకొనవచ్చును. అన్వయము పాఠకుల ఊహకు వదలి పెడుతున్నాను. నాకు వలసిన మూలమును సౌమిత్రి జటప్రోలు గారు పంపిన సందేశము నుండి గ్రహించి అందజేయుచున్నాను. వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు ఇందుమూలముగా తెలుపుకొనుచున్నాను.

ఆయుర్వేద వైద్య శాస్త్రములో, #తేనెను ఔషధంగా భావిస్తారు. నేను సేకరించినది ఈ దిగువన మీముందు ఉంచుచున్నాను.

అయితే ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే #కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది!

అంటే మనుషులకు ఔషధము అయిన తేనె కుక్కలకు విషమవుతుంది.

ఆయుర్వేద వైద్య శాస్త్రములో స్వచ్ఛమైన #దేశీయ ఆవునెయ్యిని  ఔషధ లక్షణాల సమాహారముగా పరిగణిస్తారు!

కానీ ఆశ్చర్యకర విషయమేమిటంటే, మురికిలో సంతోషంగా ఉండే #ఈగ ఎన్నటికీ స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని రుచి చూడదు!పొరపాటున, రుచి చూసిందా, అది వెంటనే అక్కడే ప్రాణాలను వదులుతుంది.

 ఆయుర్వేదములో, #మిశ్రి అంటే కండచక్కెర ఔషధంగా మరియు ఉత్తమ మిఠాయిగా కూడా పరిగణించబడుతుంది.

 అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కండ చక్కెర #గాడిదకు తినిపిస్తే, దానికది ప్రాణాంతకమౌతుంది.  

అందుకే కండచక్కెర తినుబండారములు గాడిద  ఎన్నటికీ తినదు.

 వేప చెట్టుపై గల వేప పండ్లతో అందలి విత్తనములతో అనేక వ్యాధులను నయము చేయ వచ్చును.  ఆయుర్వేదం దీనిని ఉత్తమ ఔషధముగా పరిగణించుతారు..

 అయితే వేప చెట్టు మీద నివసించే కాకి పగలయినా, రాత్రయినా వేపపళ్ళను  తింటే, దాని మరణం ఖాయం.!అంటే ఈ భూమిపై ఒకరికి మంచి అయినది వేరొకరికి చెడుగు కావచ్చును. ఈ భూమిపై ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ సందర్భములో ఒక 40 సంవత్సరముల క్రితము వ్రాసిన పాట గుర్తుకొస్తున్నది.

ఎవరు నీవారు ఎవరు పెరవారు

తెలుసుకొవాలిరా తెలిసీ మసలుకోవాలిరా

వీడన తోడౌ నీడకు కూడా

వెలుగంటేనే వెరపు కదా

చీకటిలో మతుమాయము కాదా

నీచేవయె నీ చెలువు కదా

నెత్తురు పంచుకు పుట్టిన నలతే

చెరూపు చేయగా నీకెపుడు

కోడల కోణాల పండిన మాకుల

మూలికలే నీ అండకదా

అమరుల జేసే అమృతమే మరి

రాహువు పాలిటి మిత్తి కదా

హాలాహలమే ఆభారణముగా

శివుని గళములో నిలచె కదా

స్వస్తి

Tuesday, 26 July 2022

నా మనోగతము

 

నా మనోగతము

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post_26.html

ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలించి సాటి సహజాతులకు తెలుపుట నాలాంటివానికి సామాన్యమైన పని కాదు. తెలిసినది తెలుపక పోవుట కూడా పాపమే! అసలు 'పాపము' అన్న మాటను ప్రక్కన పెట్టినా విజ్ఞానము అన్నది వీధి దీపము వంటిది. వెలిగించిన వానికి ఆ వీధితోను దీపము తోనూ పని ఉండదు. అయినా వెలిగించి తన బాధ్యత నిర్వర్తించుతాడు. ఆ వెలుతురును సాటి మనుషులు ఉపయోగించుకొంటే అతడు సంతోషించుతాడు. నిజానికి వారిద్వారా అతనికి ఏమీ ఒరగదు.

స్థూలముగా నేటి సమాజ తత్వమును నేను వ్రాసిన ఈ రెండు పద్యములలో మీ ముందుంచుచున్నాను.

ఊరక ఏది వచ్చినను ఒక్కరు కూడను లేక్కచేయరా

కారణ మేమిటన్న తమ కైనటువంటిది సొమ్ము సుంతయున్

చేరదు ఇచ్చువానికిని చింతన చేయరు అందుచేతనే

తేరగ ఏమి ఇచ్చినను తీసుకు పోవక గౌరవింతురే

విత్తమెవ్విధి తనదైన విలువ మార్చు

విద్య అటుగాక వ్యక్తికి విలువ పెంచు

నేరమిని వీడి నేర్మితో నిపుణ మతులు

నిజము నరయంగ గలరులే నిక్కముగను

 నిజానికి ఆస్యగ్రంధి లోని నా వ్రాతలకు మీ Likes కాదు కావలసినది. దానిని నిర్లక్ష్యము చేయక చదవటం కావాలి. మీరు చదివినట్లు గుర్తుగా ఒక చిన్నమాట Comment Box లో వ్రాస్తే చదివిన వ్యక్తి ఎవరు అని తెలుసుకొనే అవకాశముంటుంది.  యువత ఈ దేశము పై, ఈ దేశ చరిత్రపై, అనుపమ మేదావులగు మన పూర్వీకులపై అవగాహన పెంచుకోవలెనన్నదే నా తపన అంతా!

చదివిన పిదప 'బాగుంది' అని ఒక్కమాట వ్రాసినా అది మిగతవారి కళ్ళలో పడుతుంది. వారుకూడా చదివే అవకాశము ఏర్పడుతుంది. Comment అన్నది హనుమంతుని తోక లాంటిది . అది ఎంతయినా పెరుగుతుంది తానూ కాలకుండా శత్రువుల రాజదానికేనిప్పుపెట్టగలుగుతుంది. సంపూర్ణ విషయావగాహన కలిగినవాడే తన వాడముతో శత్రువుల అపప్రథలను ఖండించగలడు.

నేర్చినట్టివాడు నెగడు పోలిక జూడ

ధర్మ మార్గ గతుల దారి జూపు

దానినార్పజూచు దాష్టీకులను గాల్చు

రామమొహనుక్తి రమ్య సూక్తి

అందువల్ల నేర్చుకొనుట అంటే ‘జ్ఞానము’ మన సందర్భములో విషయ పరిజ్ఞానము కలిగినపుడే మన ధర్మమును తెగడే వారి నోరు, మన వాదముతో మూయించగలము.

పూనుకొనితెచ్చెదము పునర్వైభవము

పూనికన తెలుసుకొని పూర్వ వైభవము

హిమనగధృవముపై ఎగురవేసేదము

జాతీయ ధ్వజ యుక్త జయకేతనమ్ము

స్వస్తి.

Thursday, 21 July 2022

కొనకుండా నవ్వుకొనండి - Irritating Questions and Intelligent Answers తెలివయిన ప్రశ్నలు - తేలిక సమాధానాలు

 

Irritating Questions and Intelligent Answers

https://cherukuramamohan.blogspot.com/2022/07/irritating-questions-and-intelligent.html

Question : How can you drop a raw egg onto a concrete floor

Without cracking it?

Answer: Concrete floors are very hard to crack

Q: If it took 8 men 10 hours to build a wall, how long would it take,

4 men to build it.

A: No time at all as it was already built.

Q: If you had three apples and four oranges in one hand and

4 apples and 3 oranges in the other hand. What would you have ?

A: Very large hands.

Q: How can you lift elephant with one hand?

A: No need to lift as Elephants do not have hands.

Q: How can a man be without sleep for 8 days?\

A: No problem at all. He sleeps in the nights.

Q: If you throw a red stone in the blue sea, what it will become?

A: It will get wet and sink into the sea.

Q: What is always coming but never arrives?

A: Tomorrow.

What can you never eat for breakfast?

A; Dinner

Q: What happened when wheel was invented?

A: A revolution.

Q: Bay of Bengal is in which state?

A: Liquid State.

Q: What can one catch that is not thrown?

A: A cold

Q: Well now I ask you 10 easy questions

or one difficult one. Which will you choose?

A: One difficult one Sir.

Q; OK. Then tell me which comes first ‘Day’ or ‘Night”

A: Day Sir.

Q: How?

A: I don’t have any obligation to answer as you promised me to ask only one question which is over.

I conclude this interview with a thought provoking message,

'Don’t ever be angry with your friends, for, at the last moment of our life we remember not the words of our enemies but the silence of our Friends.

కొనకుండా నవ్వుకొనండి.

తెలివయిన ప్రశ్నలు - తేలిక  సమాధానాలు

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?

 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు

2.మనము ఎంత ప్రయత్నించి  చదువలేక పోయినా భద్రంగా  దాచుకునేది ఏది?

  డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్.

3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?

  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే, డ్రైవర్ చేతిలో బస్సెక్కిన అందరి ప్రాణాలు ఉంటాయి.

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?

 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు.

5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?

మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి.

6.పొలాలు అభివృద్ధి తోబాటూ ఏమవుతాయి?

 ప్లాట్లు అవుతాయి.

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?

 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే 'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేషంట్ చెప్పినప్పుడు.

 

SORRY “ అనే పదము చాలా చిత్రంగా  ఉంటుంది...

మనము చెబితే మన వాళ్ళు దగ్గరౌతారు.

అదే  డాక్టర్  చెబితే మనవాళ్ళు మనకు దూరమౌతారు.

 ప్రపంచంలో రెండు అతి ప్రమాదకరమైన మారణాయుధాలు!

1. భార్య కన్నీరు

2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .

కానీ ఆ మెతుకు. ... బిర్యానీయా.సద్దికూడా అనేది భార్య నిర్ణయిస్తుంది.

ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు  వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే generate అయ్యే Data  Transmission Speed.  అందుకోవడం చాల కష్టం.

 

 

 

 

 

 

 

 


Wednesday, 6 July 2022

నేటి బ్రాహ్మణ యువత పోకడ

 

నేటి బ్రాహ్మణ యువత పోకడ

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post.html

నేటి బ్రాహ్మణ యువత పోకడను గూర్చి వ్రాసిన ఈ పద్యమును ఒకసారి చదివి మీ బాధను తెలియబరచేది. తల్లిదండ్రులకు పెంచే తీరుబాటులేదు. పిల్లలకు వినే అలవాటూ లేదు. దిశా నిర్దేశము చేసే నాటి పండితులు నేడు లేరు. సినిమాలు, క్లబ్బులు, పబ్బులు, internet, restaurants, ఆడమగ తేడాలేని friendships, junk food, ఒకటేమిటి బలహీనమైన మనసును ప్రతియోక్కటీ తనవైపు లాగెదే. బ్రాహ్మణుడు రుజువర్తన కలిగినవాడయితే సాటి మనుషులకు, సమాజానికీ చెప్పగలుగుతాడు.

నాకు తెలుసు. వెంటనే 'ఆఁ ఈ కాలము చెబితే ఎవరు వింటారండీ' అన్న మాట వస్తుంది. మనము చెప్పకుండానే 'ఎవరు వింటారు అంటే ఎవరు వింటారు. 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ' ఆరంభింపరు నీచమానవులు...'అన్న నానుడులు మీకు తెలిసినవే కదా!

ఒకరి గుర్తింపు మనకు అవసరములేదు. ఆత్మ తృప్తి ఒకటి కలిగితే ఆరోగ్యముగా ఉండవచ్చును.

ఈ వాస్తవమును నీళ్ళు నిండిన కళ్ళతో మీ ముందుంచుచున్నాను.

ఉపనైన కార్యమ్ములొనరించుటయెగాని

జంధ్యముల్ గూటమ్ము జతను గూడె

భుజము పై జంధ్యంపు ప్రోవులుండినగూడ

సంధ్య వార్చుట మలి సంధ్య జేరె

మంత్రముల్ గొణుగుట మాత్రముండినగూడ

మనసంత మగువలే మసలుచుండె

తర్పణంబులకెల్ల తర్పణము గావించి

తనదైన సుఖముకై తపన బడియెఁ

        రెంటికింజెడు రేవడ రీతి గాను

        నడచుచుండగ బ్రాహ్మణ నవత యువత

         నలువ తలలకు నెనరుతో నయముగాను

         అమృతాంజన మునుబూని యలదె వాణి

 

ఉపనయనమయ్యీ జంధ్యములను గూటాలకు తగిలించినారు. ఒకవేళ అది వున్నా సంధ్యచేయుట మరచినారు. అది చేస్తూవున్నా మనసు మాత్రము మగువలపైనే తిరుగుతూ వుంటుంది. ఇక పితృ తర్పనముల విషయమునకు వస్తే తర్పణాలకే తర్పణము వదలినారు. అంటే అట్లాంటిది ఒకటి ఉందని కూడా మరచిపోయినారు.

ఈ విధముగా వుండే బ్రాహ్మణ యువతను చూసి బ్రహ్మదేవునికి తల నొస్తూవుంటే సరస్వతీ దేవి

తప్పు ఎవరిది అంటే

నరవరా నీచే నాచే

వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్

ధర చేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

ఏనాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మా పని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగంభట్టూ

ఈ రెండు పద్యముల భావమే సమాధానము.

ఒక జాడ్యానికి పల్లెటూరు, పట్టణము అన్న తేడా ఉండదు. అది అంటుకొన్నదంటే వదిలించే మార్గము తప్ప అన్యదా ఆలోచించి ప్రయోజనము లేదు. కారణాలేవయినా దానిని రూపు మాపే ప్రయత్నమూ ఇపుడు చేయవలసినది.

ఇక Time లేదు అన్నది తర్కమునకు నిలువదు. మనము దానిని అనుసరించవలసిందే. అది మనలను అనుసరించదు. మనకు పురీష శౌచములకు, ఇష్టపడితే దంత దావనమునకు, స్నానమునకు, తప్పనిసరిగా భోజనమునకు, సినిమాలు షికార్లు అన్నింటికీ Time వుంటుంది. సంధ్యావందనమునకు మాత్రము ఉండదు. Sonti Ganesh చెప్పినట్లు ముంద్ఫ్హు పర్షేచనము, (ఆపోశనము - పూర్వ ఉత్తర) చేయుట తో మొదలు పెట్టవచ్చును. కనీసము అర్ఘ్యము వదలి గాయత్రీ మంత్రమును ఉపాసించవచ్చును. సూర్యని కిరణము భూమిని చేరుటకు 8ని.20 సె. పడుతుంది. మరి గాయత్రీ మాత వెలుగు మనపై ఎంతకాలము పడుతుందో గమనించండి. అసలు వెలుగు పడాలంటే మాతను అనుష్టించి ప్రసన్నము చేసుకొంటేనే కదా! మంత్రజపము ఒక నిర్ణీత ప్రదేశమునకు ప్రయాణము వంటిది. మనము ఎంత దూరము నడుస్తామో ఆ దూరము మొదటినుండి తిరిగీ నడుబ్వనవసరము ఉండదని ఆర్యవాక్కు'శ్రేయాంసి బహు విఘ్నాని' అంటారు మరి దానిని త్రోసి రాజని 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ను ఆశ్రయించవలసి వస్తుంది.

స్వస్తి.

 

 


Sunday, 15 May 2022

విద్యార్థ సాధన – ఆరోగ్యము

 

విద్యార్థ సాధన ఆరోగ్యము 

https://cherukuramamohan.blogspot.com/2022/05/blog-post_15.html

ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వబుద్ధినా l 

పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణవత్ ॥

ఒక పదార్థాన్ని నాలుగు పాదాలుగా విభజించుట ఆనవాయితీ. చేతులు కలుపుకొంటే మనిషికి కూడా జంతువులవలె నాలుగు పాదాలే!  పాదం అంటే పావు భాగమని లేక పాతిక భాగమని లేక కాల్ భాగమని లేక నాల్గవ వంతని, లేక 25% అని  అర్థము. ఇపుడు పై శ్లోకము ఏమి తెలియజేయుచున్నదో చూద్దాము. విద్యార్థి లేక జ్ఞానార్థి  విద్యనూ జ్ఙానాన్ని, ఆచార్యుల నుండి పాతిక భాగము,  తన విచక్షణ విశ్లేషణలతో పాతిక భాగము, సహ విద్యార్థుల నుండి పాతిక భాగము సంపాదిస్తాడు. మిగిలిన నాలుగవ భాగము కాలము గడిచే కొద్దీ, జీవితాంతం వఱకు సంపాదిస్తూనే వుంటాడు. వాస్తవమేమిటంటే విద్యకు జ్ఞానానికి అంతు లేదు.  విద్య జ్ఞానము అని వేరువేరుగా చెబుతూ వచ్చినాను కారణము ఏమిటంటే ఆ రెండూ ఒకటి కాదు. గణితములో  

(a + b) 2 = a2 + 2ab + b2 అన్న సూత్రమును నేర్చుకొని ఆ ఫలితము సాధించుట విద్య. అదే  

14 x 14 యొక్క విలువను సాధించుటకు (10+4) 2 గా వేసుకొని 102+2x10x2+42 గా వ్రాసుకొని 156 అన్న ఫలితమును రాబట్టుట జ్ఞానము. ఎందుచేతనంటే కొందరు 14x14 వేసి హెచ్చించి ఫలితము పొందుతారు. అదే 1004 అయితే హేచించుట ఆలస్యమౌతుంది. తప్పుకూడా పోవచ్చు. కావున జ్ఞానము యొక్క ఆవశ్యకత ఇక్కడ ఏర్పడుతుంది.

ఈ ప్రపంచములో అందరమూ , జీవితాంతమూ విద్యార్థులమే. విద్య, ఒక ఊట చెలమ. నీరు తోడేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. పరిపూర్ణత, వయోభేదము అన్నది విద్యకు వర్తించదు. సురేశ్వరాచార్యులుగా జగద్గురు ఆది శంకరులవారి శిష్యుడగు మండన మిశ్రుడు వయసులో శంకరులకన్నా చాలా పెద్దవారు. నేర్చుకోనవలసినాద్ ఉన్నపుడు పెద్దవారైనా చిన్నవారికి శిష్యరికము చేయవలసినదే!

గురుకులములలో కుల, మత, వర్గ, ప్రాంత విచక్షణా రహితముగా, విద్యార్థులంతా అక్కడే వుండి, గురువుకు సేవ చేస్తూ, తమ తమ వర్ణమునకు సంబంధించిన విద్యలను నేర్చుకొనేవారు. దీనితో వారికి పాతిక విద్య పట్టుబడేది.  రెండవ భాగము విద్యార్థి తనకున్న మేధోనిధిని ఉపయ్తోగించి నేర్చుకునేవాడు. మూడవ భాగము సహ సహపాఠకులతో, చర్చల ద్వారా గానీ, సంప్రదింపులా ద్వారాగానీ మంచి చెడులనరసి  జ్ఞానాభివృద్ధి గావించుకునేవారు. చివరి భాగం, పెరిగే కొద్దీ, తనచుట్టూ ఉన్న సమాజమును చూసి, ఆలోచనా పూర్వకముగా, అనుభవపూర్వకముగా అనుభూతి పూర్వకముగా ఆజన్మాంతమూ నేర్చుకుంటూనే వుంటాడు.

విద్యను, ఆచరణలో పెట్టుటే విజ్ఞానము. విజ్ఞానానికి సాధన అన్నది పట్టుకొమ్మ. దానితోనే జ్ఞానమును సాధ్యము చేసుకోవాలి. తను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పించడం వల్ల, విద్య వృద్ధి చెందుతుంది.

న చోరహార్యం, న చ రాజహార్యం,

న భ్రాతృభాజ్యమ్, న చ భారకారిl

వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం

విద్యాధనం సర్వధన ప్రధానమ్ll

దొంగలు దోచలేనిది, రాజులు స్వంతము చేసుకోలేనిది, అన్నదమ్ములతో పంచుకోలేనిది, ఎన్నతటి ఎంత సంపాదించినా భారము కానిది, ఖర్చుపెట్టే కొలదీ కలిసి వచ్చేది విద్య. ఇది నిరంతర ధారావర్దితమగు అమృతోపమానము.

ఈ విషయమై ప్ర్ద్దలు ఇంకా ఈ విధముగా తెలియజేసినారు.

శనైః పన్థాః శనైః కన్థా శనైః పర్వత లంఘనమ్ ।

శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనైః శనైః ।।

మెల్లగా అనగా అతిగా నడచి అలసట తెచ్చుకోకుండా,  నడవగా నడవగా గమ్యమును చేరుకొనవచ్చు, అది ఎంత దూరమైనదైనా కానీ. రోజూ కొద్ది కొద్దిగా కుడితే బొంత కొన్ని రోజులకు పూర్తి అవుతుంది. అంతా ఒకే రోజులో కుట్టలేము కదా! గమ్యమును చేరుటకు వెళ్ళే దారిలో ఏదయినా కొండ వస్తే  మెల్లిమెల్లిగా ఎక్కి దాటాలి గానీ తొందరపడితే పిక్కలు పట్టుకుపోయి మనము నడువలేక చతికిలబదడవలసి వస్తుంది. అదేవిధముగా చదువులో కూడా  కొద్దికొద్దిగా నేర్చుకుంటూ విద్యను సంపాదించవలసి వస్తుంది, ధనము విషయములో కూడా అంతే! ధర్మ మార్గమున సంపాదించే వాడు తన ఖర్చు పోగా కొద్దిగా మిగిలినది కూడబెట్టుకొంటూ పొతే లేనిరోజు కూడుబెడుతుంది. శనైర్విద్యా శనైర్విత్తం. అంటే విద్యా ధనములు సంపాదనా పూర్వకముగా రావలేనబనుకొనేవారికి సహనము కాలాఆసరము. మనలో అందరము కాళీదాసులము,నిస్సంతు వీలునామాకు అర్హులము కాలేము.

అందుచేత పెద్దలు  ఈ అయిదింటియందు తొందర పనికి రాదు అని శాసించినారు. ఏదయితే శాసించుతుందో అది శాస్త్రము. అది అజరామరము. దేశకాలపరిస్థితులు ఏవయినా ఈ శాస్త్రవచనములు మారవు. ఈవిషయములోనూ అతి అన్నది పనికిరాదు అని నిర్ద్వంద్వముగా తెలియజేసినారు.

అతిదానాద్ధతః కర్ణస్త్వతిలోభాత్ సుయోధనః ।

అతికామద్దశగ్రీవస్త్వతి సర్వత్ర వర్జయేత్ ॥ "

అతిదానము చేత కర్ణుడు, ఆయన తన సహజ కవచాకుండలములను కూడా దానముచేయుతయే గాక యుద్ధములో అవకాశము వచ్చినా అర్జునుని తప్ప తక్కిన ఉలుగురినీ చంపనని వాగ్దానము చేసి తన ప్రాణము మీదికే తెచ్చుకొన్నాడు. లోభము చేత, అనగా ధర్మరాజు శ్రీకృష్ణునిద్వారా ఐదు ఊర్లనివ్వమని కబురంపినా ససేమిరా అని లోభము చూపి ప్రాణాలు పొగొట్టుకొన్నాడు. అతి కాముకుడై ముందు వెనుక ఆలోచించకుండా సీతను చెరబట్టి రావణుడు అసువుల బాసినాడు.  

     మరొకమాట తెలుసుకొనేఅవకాశము వచ్చినపుడు చిన్న విషయమునైనా విద్యగా భావించి క్షణక్షణము నేర్చుకోవాలి. మన తాత్సారము వల్ల ఆ క్షణము గడిచితే ఆవిద్య మన చేయి జారినట్లే! చిన్న మొత్తమనుకోకుండా పైసా పైసా జమచేయాలి. ఆశ్చర్యకరముగా అదే పెద్ద నిధియై మనల కాపాడుతుంది. చీమ ఆహారాన్ని ముందుజాగ్రత్తగా వాన కాలములో బయటికి పోలేదు కాబట్టి అందుకు తగిన్విధముగా ఆహారు నిలువ చేసుకొంటుంది. అందుకే పెద్దలు ఈవిధముగా చెప్పినారు.

క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్l

క్షనత్యాగే కుతో విద్యా కనత్యాగే కుతో ధనమ్ ll

వీటన్నింటికీ ఆరోగ్యము మూలము. దానిని గూర్చి కూడా పెద్దలు ముందే చెప్పినారు.

వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥

వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యము. స్వామి వివేకానందుల వారు మన ఆర్ష ధర్మాలని గురించి, హిందూ మత గొప్ప తనాన్ని గురించి ఎంతో గొప్పగా మొత్తం ప్రపంచానికి తెలియ చెప్పి, దానికంటే ముందుగా, ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతను గుర్తించమని నోల్లి చెప్పేవారు.

పురుష స్త్రీ బాల వృద్ధులు అన్న అనే భేదం లేకుండా, తమ శరీర దార్ఢ్యమునకు తగిన విధముగా,   అందరూ వ్యాయామము తప్పక చేయవలసిన అవసరాన్ని ఈశ్లోకము తెలియ చేస్తోంది.

స్వాస్థ్యము సర్వవిధ సంపదకూ మూలము. వెల కోట్ల రూపాయలు సంపాదించి రక్త పీడనము, మధుమేహము కలిగియుంటే మహానిధులకు కాపోఅలావుండే కాలసర్పములుగా బ్రతుకవలసి వస్తుంది. చదువు విషయముననియితే మనసును మగము చేయలేక నిస్పృహతో నిస్సారమైన జీవితము గడపవలిసి యుంటుంది. ధనము లేకున్నా ఒక వ్యక్తి విద్వాంసుడైతే సర్వత్రా పూజింపబడుతాడు. అందుకే పెద్దలు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నారు.

 

ఆరోగ్యం రెండు రకాలు. శారీరక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యము.  మనిషి శరీరానికి ప్రతినిత్యము క్రమ శిక్షణతో కూడిన వ్యాయామము అత్యంత ఆవశ్యకము. నిత్య వ్యాయామము వలన శరీరము అరోగ్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది.  మనసుకు నిశ్చల ధ్యానములాంటి ప్రక్రియల ద్వారా మానసిక ఆరోగ్యము చేకూరుతుంది. తద్వారా బుధ్ధి కుశలత పెరుగుతుంది. దీర్ఘ ఆయుర్దాయం చేకూరుతుంది. శరీర అవయవాలకి తగినంత  తగినవిధముగా వ్యాయామము చేయించు సాధనములు ఉపకరణములు ఎన్నోవచ్చినాయి. అవి కొను శక్తి లేకుంటే బస్కీలు దండేలు ఉండనే ఉన్నాయి. వీనిచే స్వాస్త్యత దార్ధ్యము చేకూరుతాయి. అవి వుంటే ఏపని చేయుటకైనా వలసినంత ఉత్సాహము ఉద్వేగము వద్దన్నా వస్తాయి. నిరాశా నిస్పృహలను దరి జేరనీయవు.

ఇటువంటి నేపధ్యములో, ప్రకృతి సిద్ధమైన వనరులతో పెరిగిన ఆహార పదార్థాలను తినడం, కల్తీలకు, బయటి తిండ్లకు దూరముగా ఉండటము, ప్రతి నిత్యమూ బాగా చెమట పట్టేవరకూ, వ్యాయామము, నడక తప్పనిసరి

చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణలో మంచి విలువలు, సాంప్రదాయాలతో జీవితం గడపడం వలన మానసిక ఆరోగ్యానికి తద్వారా బుద్ధి కుశలతకి దోహదపడుతుంది.

ఆరోగ్యమే మహా భాగ్యము. మంచి శారీరక ఆరోగ్యము వలన, చక్కటి మానసిక ఆరోగ్యము వలన  బుధ్ధి కుశలత పెరిగి మంచి ఆలోచనలు కలిగి అవి అన్నియునూ కార్య దీక్షకి, కార్య సాఫల్యతకీ దోహదం చేస్తాయి. మనిషికి ఉండే చక్కటి శారీరక మానసిక అరోగ్యములు సర్వార్థలను సాధించగలిగే సాధనం.

అప్పుడటు విద్యకుగానీ ఇటు దానానికి గానీ కొదువ ఉండదు.

స్వస్తి.

 

 

Friday, 13 May 2022

 

వార్తా పత్రికల సాక్షిగా

ఒకటి కడిగిన ముత్యం

ఒకటి కడగని ముత్యం

ఒకటి ఆణిముత్యం

ఒకటి అసలైన ముత్యం

ఒకటి ఆలిచిప్ప ముత్యం

ఒకటి అరుదైన ముత్యం

మొత్తానికి ఏదోఒక ముత్యం

నీతీ నిజాయితీ పత్యం

ఈ ముత్యా లనునిత్యం

చూస్తున్నామిది సత్యం

కొర్ట్ల కరిగెను  కొన్నిముత్యాలు

కోరకుండా జీత భత్యాలు

జీవితము తమ ప్రజలకేనని

వారి సంపద రక్షకులమని

మభ్య పెట్టిన మహా రాజుల

 మూటలను గొనిమాయమాటల

మభ్యపెట్టెడు న్యాయ వాదుల

నేతిబీరల వాదనమ్ములు

వాస్తవమ్ముల మరుగు పరచగ

తెలిసి కూడా తెలియ నట్లుగ

చూసికూడా చూడనట్లుగ

కళ్ళు మూసీ మూయనట్లుగ

కోర్టు లిచ్చెను తీరుపు

దేశాన కలుగదు మారుపు

మంచి సమయం మించ దొరకదు

మాయువులకిది మార్గదర్శం

అక్రమమ్ముల విక్రమార్కులు

వక్ర మార్గపు చండమార్కులు

కోర్టు వారిని ఆశ్రయించిన

కోరు ఫలితము వచ్చితీరును

చెరుకు రామ మోహన్ రావు

ఇది కొడవంటి సుబ్గారహ్రిమణ్యం గారి మాట. మాట,


ఇది వారు అంకరించిన నా మాట.



Gowri Shankar

మీమాటలు ముత్యాల సరాలు.మాటలు మంత్రాలు.చక్కటి రచన ధన్యోస్మి.
Sadanandeeswaraiah Vallamkondu
కోరకుండానే అనేక ఆణిముత్యాలు పంచారు. ధన్యవాదాలు.
2
  • Like

Murali Thotapalle Venkata

Chala bahu chakkaga neti samaja vyavasta gurinchi Chepperu.
Umapathi Bisilahalli
' SAMAAJAM. YEE ROJULA CHITRANNI ANDHANGAA NIROOPINCHINA , MEE AKSHARALA RANGULA-RAATNAM KI NAA JOHAARLU. GURUGAROO.
Sastry Vemuri
Namaskaram Sir, I can write in Telugu . But not learnt in posts . You have said right Sir, that only courts are Sharanyam. But courts are giving not categorical judgements ,in recent case about fatwas that they have upheld law of the land but one can obey fatwa , individual choice but law of the land is absolute and even if one wants to follow will not have laws protection . Now the chance
is to govts who do not legislate for fear of loosing vote banks .
Citizen for fear of reprisals as some loop exist dare not approach court and fear of litigation .
Our democracy is deteriorating into feudalism . We should change the system into American presidential form which neutralises group interests into one interest of popular vote in president. Governor. Mayor and police chief and judiciary which are strong institutional forces and checks and balances . One may think of emergence of conservatism if what? will not set the clock back and sell national interest nor undermine the March of progress nor surrender national strength. It can not revive facism. It is not so in absolute systems like even in communist regimes and military or faith directed governance of authoritarianism.
One may wonder how to achieve , simple popular vote will do it. Our constitution permits. The basic feature is federalism, checks and balances and elections and independent judiciary. Forms of democracy is not the basic feature as the basic features are of democratic governance. One may quote present American condition , it is not going to undermine the strength of system. In our case like any where when security is threatened nation emerges as one but in regular governance what govt can achieve is not happening because of myriad views welcome but are not gelling into one force of action that will push nation ahead. Since we have democracy it is still not weak as said rightly because of courts but here also aberration are visible lately.