Friday, 6 March 2020

గరికెపాటి వారికి నచ్చిన నా పద్యము 'ఇది వారిని గురించే'


గరికెపాటి వారికి నచ్చిన నా పద్యము 
'ఇది వారిని గురించే'

కవి నారసింహుండు కాడు కానేకాడు
సరళ భావతతి విశారదుండు
పాండితీ నరసింహ భాతి కానేకాడు
వాగ్దేవి యొసగిన వరసుతుండు
ధారణా నరసింహ ధమని కానేకాడు
ఆద్యుండు వాల్మీకి యనుజుడతడు
అవధాన నరసింహు డతనుకానేకాడు
సరస పద్యగరిమ సాంద్రుడతడు

పనిని సాధింప నరసింహు పగిదితాను
వేరు మార్గాల నెన్నని విభుదుడతడు
గాలివానలకెరగాని గరికెపాటి
నారసింహావధానులు నాకు ప్రీతి

గరికెపాటివారికి 'అవధాన బ్రహ్మ రాక్షస' అన్న బిరుదు ఉందని విన్నాను. ఆయన ధారణను ప్రశంసించుతూ బహుశా వారికీ బిరుదునొసంగియుండవచ్చు. నా మనసుకైతే 'రాక్షస' అన్న శబ్దము వారి ధిషణకు సరికాదేమో అనిపించింది. పైన తెలిపినది నా అభిప్రాయము మాత్రమే! ఆబిరుదును ఇచ్చిన వారిని, ఆదరించేవారిని తప్పుపట్టుట నా ఉద్దేశ్యము కాదు. నాకు ఎరుక ఉన్నంతవరకు వారిది కల్మషము లేని మనస్తత్వము. వారి పూరణలు కవిత్వము ఎంతో మధురముగా ఉంటాయి. అయినా నాకు సరిపోనంత మాత్రాన అందరికీ సరిపోగూడదని లేదుకదా. బిరుదు వాడుతూవున్నారంటే వారికీ నచ్చినట్లేకదా.
నామనోగతమును పై పద్యములో తెలిపినాను. ఒకసారి వారితో కలిసినపుడు ఈ పద్యము వినిపించితే వారు సంతసించుటయేగాక పై పద్యములో ,గాలివానలకెరగాని గరికేపాటి' అన్న ప్రయోగము చాలాబాగుందనిచెప్పినారు.

పై పద్య వివరణ ఇది.

పై పద్యములోని సీసము లోని నాలుగు పాదములలో తేటగీతిలోని రెండు పాదములలో 'నారసింహ' అన్న పదము వస్తుంది.అందుకు నా సంజాయిషీ ఇది: నరసింహుడు భక్త సులభుడే కానీ చూపులకు భయంకరుడు. సింహము తన వేటను చీల్చి చెందాడుతుంది. అంటే ఆవేశము పరాక్రము నరసింహునికి అతిశయము .ఆయన హిరణ్యకసిపును చంపినాడుగానీ చాలా హృదయవిదారకముగా చంపినాడు. ఇక్కడ ఈ నరసింహుడు కవ్విస్తూ నవ్విస్తూ ఊరిస్తూ పూరిస్తున్నాడు . అందువల్లనే అతడు 'ధమని' కాడు అన్నాను. ధమని అంటే కౄరుడు అని నిఘంటువు.ఇక ధారణలో ఆయనను వాల్మీకితో ఎందుకు పోల్చినానంటే మొత్తము రామాయణ కథను నారద, బ్రహ్మలు చెప్పినది చెప్పినట్లుగా,పర్వతాల, రాజధానుల,రాముని అనుచరుల, రాక్షసుల, రాజుల ,ఋషుల, పేర్లతో కలిపి గుర్తు పెట్టుకొనుటకు ఎంత ధారణ ఎంత ధీశక్తి అవి కలుగుటకు ఎంత తపస్సు కావలెనో మీ ఊహకే వదలుచున్నాను. ఇక 'గాలివానలకెరగాని గరికెపాటి నారసింహావధానులు నాకు ప్రీతి' అంటే అవధానమున ఎంతటి కఠిన,కఠినతర,కఠినతమ పరిస్తితులనెడు గాలివానలోకూడా ఆయన గడ్డి మొక్క వలె వంగి తిరిగీ నిటారుగా నిలుచుతాడు తప్పించి మర్రిమాను మాదిరి విరిగి పడడు.

భావతతి =భావసమూహము, భాతి= విధము,వలె,మాదిరి, సాంద్రత = చిక్కదనము,density, పగిది=వలె
స్వస్తి.

Tuesday, 11 February 2020

ప్రేమికుల దినము (Valentine day) మనకవసరమా?

ప్రేమికుల దినము (Valentine day)
https://cherukuramamohan.blogspot.com/2020/02/valentine-day.html
ప్రేమ అన్నది ఒక అనిర్వచనీయమైన భావన. దానిని ఎక్కువగా Love అన్న ఆంగ్ల పదముతో పోల్చి అది కేవలము యువతీ యువకుల నడుమ ఏర్పడే ఆకర్షణగా భావించిన వారు అధికము. నిజానికి ప్రేమ అన్న పదమును మనము మన భారత దేశములోని సంస్కృతము లేక ఏ ప్రాంతీయ భాషలోనైనా భార్యా భర్తలు, అన్నాచెల్లెలు, అక్క తమ్ముడు, అమ్మ నాయన ల నడుమనుండే అనురాగామునకు అక్షర రూపము. పెళ్ళికాక ముందే ఏర్పడే భావనను కేవలము వాంఛ, మోహము, కోరిక, రతి, కామము గా పరిగణించవచ్చు. మన యువత ఈ విషయమును అర్థముచేసుకొనగలిగితే, ప్రేమికుల దినము (Valentine day), అన్న అనర్థము నుండి బయట పడగలుగుతారు. ఒక్క నిముసము ఆలోచించండి. Valentine day వచ్చిన తరువాత కూడా, మనదేశము లో Dating అన్న మహమ్మారి వ్యాపించిలేదు. ఇప్పుడు సాధారణ మధ్య తరగతి కుటుంబీకులలో కూడా ప్రబలుతూ వుంది.  ఈ Dating లో మిగత దాంపత్య జీవితములోని ముఖ్య అంశములతో బాటూ  శారీరిక వాంఛలు కూడా తీర్చుకొంటారని విన్నాను. మరి 6 నెలలో , సంవత్సరమో కలిసిణ తరువాత నచ్చకపోతే మరియొకరితో Dating. దీనిలో అర్థము ఉన్నదా అని ఆలోచించండి.
ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్ర తారకం ||

మానవునికి జనన మరణములు సహజములు. ఆయువు అనిత్యము. అస్థిరము. సూర్యచంద్రులున్నంతవరకు, ఆకాశంలో తారకలు ఉన్నంతవరకు  నిత్యమైనది  మానము. మానము అన్న మాటకు గౌరవము, కీర్తి. అన్న అర్థాలకన్నా స్త్రీ విషయములో స్త్రీయొక్క నడవడిక, లేక దాచుకోనవలసిన శరీరావయవములు అన్న అర్థమును తీసుకొనుట సముచితము. సాధ్వి ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టమును 'ద్రౌపది మాన సంరక్షణము' అంటారు కదా! బాల్యమున ఆడపిల్లలకు కట్టే సిగ్గు బిళ్ళను 'మానబ్బిళ్ళ' అనికూడా అంటారు. దీనివల్ల పూర్వము మానమునకు ఇంత ప్రాదాన్యమిచ్చినారు. ఇది నిజానికి స్త్రీపురుషులిరువురికీ అన్వయము. కానీ పురుషాధిక్య సమాజములో ఇది స్త్రీలకూ పరిమితమై పోయినది. నేడు స్త్రీలు కూడా దానిని ప్రతిఘటించక సామాజిక న్యాయముగా స్వీకరించినారు. అందువలననే కదా స్త్రీల విషయములో బలాత్కారము లేక Raping అన్న మాట వచ్చింది. రాబోయే కాలానికి స్త్రీలు కూడా బరితెగించి మగవాళ్ళను Rape చేస్తారేమో! నిన్న, ఒక పాశ్చాత్య దేశములో దైవ సమానమగు ఒక పాఠశాల ఉపాధ్యాయిని తన నగ్న చిత్రములను తన తరగతిలో చదివే, తనకిష్టమైన బాలురకు పంపి ఇంటికి రప్పించుకొని వ్యభిచరించిందట. నేను కంట తడి పెట్టుకొన్నాను. రేపు ఈ నీచ సాంప్రదాయము మనదేశాములోనికి అడుగుపెట్టదని గుండెమీద చేయి వేసి చెప్పగలమా! మనము పాశవికమగు జంతుసంస్కారములను అక్కున దాల్చుట లేదా! ఒక్క క్షణము ఆగండి. ఆలోచించండి. రుజుమార్గములో పయనిచి మీకు, మీ కుటుంబమునకు, సమాజమునకు ఊరికి, దేశానికి మంచిపేరు తెండి. పైగా ఈడుకు వచ్చిన చిట్టి తల్లులకు ఒక  మనవి. స్త్రీ శారీరికముగా అబల. నలుగురు మీద పడితే ప్రతిఘటించుటకు శక్తి చాలదు. ఎందుకంటే జీవితము చలన చిత్రము కాదు. కావున సభ్య సమాజములో సంచరించునపుడు ప్రత్యేక ఆకర్షణలు కల మీ దేహమును మనదేశ సాంప్రదాయమును ప్రతిబింబించే వస్త్రధారణను తిరిగీ అలవాటుచేసుకొండి. సీత వేషధారి సంస్కారవంతమగు మాటలు మాట్లాడుతుంది. తాటకి వేషమును ధరించి కోమల భావములను ప్రతిబింబించలేదుకదా!

తిరిగీ ప్రేమ విషయానికి వస్తే, ప్రేమల పేరిట నేటి సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమలు అంతకంతకూ వెర్రితలల్ని వేస్తూనే ఉన్నాయి. ఇటువంటి విషమ,విపత్కర, విపరీత  పరిస్థితుల్లో విదేశాల నుండి దిగుమతి అయిన ‘వాలెంటైన్స్ డే’ (ప్రేమికుల రోజు) అనే పండుగ సామాజికంగా మరిన్ని అవకతవకలకు అవకాశాల్ని కల్పించటమే గాక పరాయి సంస్కృతి పై మన అవగాహనా రాహిత్యాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉందేమో!
అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... ఇదొక అంటు జాడ్యపు దండుగ  పండుగ’’.  దీనికి అతిచిన్న ప్రాధాన్యత కూడా ఇవ్వ కూడదు. మన దేశపు పర్వదినముల వలె అర్థవంతము, సందర్భోచితమైనవి ఇవి కావు. ఈ క్రింది విషయమును గమనించండి.
 మిగిలినది రేపు.......
2వ భాగము
 వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థు డొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధార పోసినాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14 గా స్థిరపరచుకుని ఆ రోజున అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు చెప్పుకుంటున్నారు. వీరు చెప్పే ఈ అంశంలో నిజము నేతి బీర లోని నెయ్యి మాత్రమే! చరిత్ర పుటలను తిరగివేస్తే  అసలు విషయం బయలుపడుతుంది. వాలెంటైన్ వివరాలు కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు. 3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ వాలెంటైన్ ఒక రోము దేశ సామాన్య పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 చే వధించబడినాడు. దీనికి ఒక  కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించే వాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ వాలెంటైన్‌ ను వధించినాడు. దీన్ని బట్టి చూస్తే, 2వ వాలెంటైన్ ఒక పెళ్ళిళ్ళ బ్రోకరు అని తెలుస్తుంది. ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు కాబట్టి  ఈతని ఘనతను గూర్చి నా పరిశోధన ఫలించలేదు.
ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కడూ  అమర ప్రేమికుడు అని చెప్పుటకు అర్హత లేనివాడే! ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన లేక  చచ్చిన తేదీలు కావు.
ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్త్రీలకు ప్రాతినిధ్యము వహించే  దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో పై ఉన్న భక్తి శ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. ఫిబ్రవరి13 నుండి15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఈ విధముగా 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది. క్రమేణా ఆ జాడ్యము  మన ఆధునిక సాంప్రదాయ, సాంస్కృతిక  గురువైన అమెరికా కు ప్రాకింది. అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియ బరచు కొనుటకు  ఆ రోజున ప్రేమ కార్డులను పంచడము  మొదలు పెట్టినారు. ‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో వాలెంటైన్‌ అన్న పేరును మాత్రము  తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 14వ తేదీకీ ముడి పెట్టి పుణ్యం కట్టుకున్నారు లోకాన్ని వెర్రివాళ్ల గా తయారు చేయగల ధీమంతులు. ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14... ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించినాయి. చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించినారు.

అసలు ఇటువంటి పండుగలు ముఖ్యమగా క్రైస్తవ సాంప్రదాయమైన Greeting Cards, Cornations Exchange, News Paper Ads, Pubs, Clubs ను ఉద్ధరించుటకు తప్పించితే వేరెందుకూ కాదు.
 మిగిలినది రేపు .....
3వ భాగము
గోర్రెదాటుకు అలవాటుపడిన  మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ ముదిరి పాకాన పడుతూ వుంది. Google నుండి సేకరించిన ఈ వాస్తవాలను చదవండి.
Lupercalia was a very ancient pre-Roman pastoral festival, observed on February 13 through 15, to avert evil spirits and purify the city, releasing health and fertility. Lupercalia subsumed Februa, an earlier-origin spring cleansing ritual held on the same date, which gives the month of February (Februarius) its name. Pope Gelasius Iwho was pope from March 492 to his death in November 496suppressed the Pagan festival and Christianized it by associating it with a martyred priest Valentine of Rome who was said to have received a rosary from the Virgin Mary.
 In Roman mythology, Lupercus is a god sometimes identified with the Roman god Faunus, who is the Roman equivalent of the Greek God Pan. Lupercus is the god of shepherds. His festival, celebrated on the anniversary of the founding of his temple on February 15, was called the Lupercalia. His priests wore goatskins. The historian Justin mentions an image of "the Lycaean God, whom the Greeks call Pan and the Romans Lupercus," nude save for the girdle of goatskin, which stood in the Lupercal, the cave where Romulus and Remus were suckled by a she-wolf. There, on the Ides of February (in February the ides is the 13th), a goat and a dog were sacrificed, and salt meal cakes prepared by the Vestal Virgins were burnt.
 ప్రేమికులు అన్న పేరు వినిపిస్తూనే  ప్రతి యొక్కరూ  ‘‘లైలా మజ్ను, రోమియో జూలియట్’’ అని చెబుతారు. రోమియో జూలియట్ ల కథను నికోలస్ రో, చార్లెస్ గిల్దన్, లార్డ్ కేమ్స్ మొదలయిన వారి తీవ్ర విమర్శలకు గురియైనది. శామ్యూల్ జాన్సన్ అన్న విమర్శకుడు మాత్రము దీనిని పొగిడినాడు.  అసలు పొగిడినా తెగిడినా అసలా కథలో వాస్తవికత మృగ్యము. షేక్‌స్పియరు తన వర్ణనలతో, క్రొత్త పాత్రలతో ఆ కథకు నాటకీయతను ఆపాదించినాడు. ఇది అసలు మన సంస్కృతిని ప్రతిబింబించదు.
ఇక లైలా మజ్నుల కథ పర్షియాకు చెందినది. దానిని ఎంతో మంది చిలువలు పలువలు చేసి వ్రాసినారు. హతేఫీ అను పర్షియన్ రచయిత వ్రాసిన ప్రతిని మన దేశములో ప్రచురించి సర్ విలియం జోన్సు గారు దీనికి అత్యంతమైన ప్రాచుర్యము ప్రాధాన్యత చేకూర్చినారు.
Hatefi’s (d. 1520) version of romance of the couple became popular in Ottoman Turkey and India. Sir William Jones published Hatefi's romance in Calcutta in 1788. (Wiki)
రోమియో జూలియట్, లైలా మజ్ను లు ప్రేమకు ప్రతీకలై కూర్చొన్నారు.
మనకు పొరుగింటి పుల్లగూర రుచి కదా! అందువల్ల మన వారికి మన హిందూ ప్రేమికుల పేర్లేవీ మచ్చుకయినా తెలియవు. రాణీ సంయుక్త, పృథ్వీరాజుల పేర్లు ఎంత మందికి తెలుసునో నాకు తెలియదు. హీన స్వభావుడైన సంయుక్త తండ్రివల్ల పృథ్వీరాజు మరణము, దేశమునకు ముస్లీముల పరిపాలనము సంక్రమించినది. నిజమైన అమర ప్రేమికులు వారు. వారు తమ పవిత్ర ప్రేమను గెలిపించుకుని పెళ్ళి చేసుకుని, కాపురం చేశారు. కానీ వారిది Dating ప్రేమ కాదు. ఒకరిని గూర్చి ఒకరు తెలుసుకొని మనసులో దంపతులు కావలెనని ఏర్పరచుకొన్న ప్రేమ, రుక్మిణీ శ్రీకృష్ణుల వలె. దేశభక్తులైన వీరిద్దరూ విదేశీ దురాక్రమణదారులను ఎదిరించి వీరస్వర్గం పొందటము జరిగింది.
అసలు అంతగా ‘ప్రేమికుల రోజు’ అనే పండుగ చేసుకుని తీరాలని భావిస్తే ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా ఎన్నో ప్రేమలను విజయవంతం చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినాన్ని (శ్రీకృష్ణాష్టమిని) ‘ప్రేమికుల రోజు’గా నిర్వహించుకుంటే పుణ్యం, పురుషార్థం లభిస్తాయి. శ్రీ కృష్ణుడు తనను మనసారా ప్రేమించిన రుక్మిణిని వీరోచితంగా చేపట్టినాడు. అర్జునుణ్ణి ప్రేమించిన తన చెల్లెలు సుభద్రకు ఎదురైన అడ్డంకులను చాకచక్యంగా తొలగించి, విజయవంతంగా వివాహం జరిపించినాడు. కావున శ్రీ కృష్ణుడు ‘నిజమైన ప్రేమకు ప్రతీక!’ మనం ప్రేమికుల రోజు జరుప దలచుకుంటే ఆయన జన్మదినమైన కృష్ణాష్టమికి  మించిన మంచిరోజు ఉంటుందా!16,000 వేలమంది గోపికలు మధురభక్తి తత్పరులు కానీ జుగుప్సాకరమగు లైంగిక సంబంధము కోరినవారు కాదు.
అందుకే  బాధ్యత గలిగిన తల్లి దండ్రులు ఈ విధముగా తమ పిల్లలకు అవసరము లేని స్వతంత్రమును ఇచ్చుట సమంజసమా? అని ఒక్క సారి ఆలోచించితే మంచిది. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకొనీ లాభము ఉండదు. ఈ వయసులో తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా తమ పిల్లలతో స్నేహితము పెంచుకుంటే అంత మంచిది. అసలు అటువంటి రోజున కుటుంబము అంతా కలిసి ఒక గుడికో, గోపురానికో, గురువు దగ్గరికో వెళ్ళితే పిల్లలో వుండే అనైతిక ఆలోచనలకు అడ్డుకట్ట వేసినట్లౌతుంది.   లైంగిక పరమైన ఉత్తేజమును కలిగించే
కథలు, కవితలు వ్రాయుట, ప్రచారము చేయుట మొదలైన పనులను ప్రచార సాధనాలు నిలిపితే, నిజమునకు, దేశమున కెంతో మేలుచేసిన వారవుతారు.
ఎంతో ప్రగతిని సాధించవలసిన యువత అధికముగా గల (దాదాపు 65%) ఈ దేశమున ఈ విధమైన సాంప్రదాయమునకు దోహదము చేయుట దేశమును నిర్వీర్యము చేయుటే !
 మహనీయుడు వివేకానందుడు చెప్పిన Relationships are more important than life, but it is important for those relationships to have life in them.
అనుబంధాలు జీవితమునకు అవసరమైనవి. ఆ అనుబంధాలలో జీవము కూడా అంతే అవసరము. అసలు ఈ దివాసాలు పలు విధములగు Greeting Cards, Cornations అమ్మకములు కోట్ల రూపాయలలో జరుపుతాయి తప్ప వీనివల్ల జరిగే మంచి మృగ్యము.
ఈ మాటతో ఈ విషయాన్ని ముగిస్తున్నాను .

స్వస్తి.

Friday, 17 January 2020

మన స్వతంత్ర దినము


మన స్వతంత్ర దినము

మన భారతదేశ పాఠశాలల సాంఘీక పుస్తకములలో భారత స్వాతంత్ర్య సమరము అన్న శీర్షిక క్రింద ఎక్కువగా గాంధీ నెహ్రూల గూర్చి మాత్రమే చదువుతాము. మిగతా వారిని అంటే నేతాజీ లాంటి వారిని గూర్చి ఎక్కువగా చదువము. అసలు పేరుకు ప్రాకులాడకుండా ప్రాణముల తృణ ప్రాయముగానేంచి  దేహత్యాగములు చేసిన భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్ దేవ్, రాజగురు,ఖుదీరాం బోస్, లాంటి మహనీయుల గూర్చి అసలు వినము. మహా మేధావి అచంచల దేశభక్తుడు అయిన సుభాష్ చంద్ర బోస్ ను గూర్చి మనకు పాఠ్య పుస్తకములలో ప్రభుత్వమూ తెలిపినది, మనము తెలుసుకొన్నది కూడా చాల తక్కువ. ఈ రోజు, మనకు స్వాతంత్ర్యము వచ్చుటకు, మనకు తెలియని ప్రబలమైన కారణములు ఏమిటి అన్నది తెలుసుకొన ప్రయత్నిద్దాము. వెలుగునకు రాని వాస్తవ ఉదంతాలను కాస్త పరిశీలిద్దాము.
మనలో కొందరికైనా ‘అమోల్ పాలేకర్’ గారు హీరోగా ‘బిందియ గోస్వామి’ హీరోయిన్ గా ‘ఉత్పల్ దత్’ ఆమె తండ్రి ‘భవాని శంకర్’ గా వేసింది తప్పక మరచి ఉండరు. ఉత్పల్ దత్ గారి హాస్యము నభూతో న భవిష్యతి . మనకు తెలియని విషము ఇంకొకటి ఏమిటంటే ఆయన కమ్యునిష్టు భావాలు కలిగిన గొప్ప రచయిత. ఆయన ‘కల్లోల్’ అన్న ఒక నాటకమును వ్రాసినాడు. ఆయనను 1965 డిసెంబర్  27 న ‘ నిర్దుష్ట ఆపన్నివారక నిర్బంధ చట్టము  Preventive Detention Act క్రింద ఖైదు చేయుట జరిగింది. కారణం ఆయన తన రచనకు ‘The Royal Indian Navy Mutiny (or Naval Uprising) of 1946.’ అన్న పుస్తకమునుండి ఒక ‘అధ్యాయమును’ తన రచనకు ఆలంబనగా తీసుకొనుటే! అందుకు కారణమేమిటంటే ఆ పుస్తకము స్వతంత్ర పోరాటమునకు సంబంధించిన వాస్తవాలను ప్రకటించుటే! ఆ తరువాత ఆయనను విడిచిపెట్టుట వేరే విషయము.
ఇక అసలు విషయమునకు వస్తాము. 1946 సంవత్సరము నుండి ఆంగ్లేయులకు భారత పరిపాలన అత్యంత కంటకప్రాయమైపోయినది. కారణము మన తెరపైని నాయకులు కాదు. ఆంగ్లేయ సైన్యమున పనిజేయుచున్న మన తెర వెనుక నాయకులు. ఈ వాస్తవము మనము కని విని ఎరుగినది. ఈ మాట గమనించండి :
Said Sir Stafford Cripps, intervening in the debate on the motion to grant Indian independence in the British House of Commons in 1947 (‘The Freedom Struggle and the Dravidian Movement’ by P. Ramamurti, Orient Longman, 1987)

The Indian Army in India is not obeying the British officers. We have recruited our workers conditions if we have to rule India for a long time, we have to keep a permanent British army for a long time in a vast country of four hundred millions. We have no such army.”

1945 లో సుభాస్ చంద్రుడు మరణించినాడను  వదంతిని వ్యాపింపజేయుచున్న తరుణములో ఆయన జర్మనీ నేత హిట్లరు మరియు  జపాను నేతలతో, బ్రిటీషు వారితో పోరాడి దేశ స్వాతంత్ర్యమును సంపాదించు ప్రయత్నములు చేయుచుండినాడు. అంతలో ఆయన స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్ (Indian National Army ) కి చెందిన జనరల్ షా నవాజ్ ఖాన్(ముస్లిం), కల్నల్ ప్రేమ్ శెహగల్ (హిందూ) కల్నల్ గురుబక్ ష్ సింగ్ (సిఖ్ఖు) ఎర్రకోట డిల్లీ న్యాయస్థానములో ప్రవేశ పెట్టబడినారు. వారి పైన అభియోగము ఏమిటంటే వారు బ్రిటీషు చక్రవర్తి పై తిరుగుబాటు బావుటా ఎగరివేయుటయే!
నెహ్రూ గారు వారు మువ్వురినీ సమర్థిస్తూ, తానూ, గాంధీ, మొహమ్మదాలి జిన్నా మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ప్రభుత్వముతో ఒక రహస్యపు ఒప్పందమును కుదుర్చుకున్నారు. అది ఏమిటంటే సుభాస్ భారత దేశములో అడుగిడిన వెంటనే ఆయనను బంధించి ఆయనపై అధికారయుతమైన వ్యాజ్యము నడుపుట.
కానీ వారొకటి తలిస్తే దైవమొకటి తలచినాడు. దినదిన ప్రవర్ధమానమయి కట్టలు తెంచుకొని ప్రవహించిన జనవాహిని యొక్క  సుభాస్ పై ప్రేమ న్యాయస్థానమును, ఆ వ్యాజ్యమును అంటే సుభాస్ తో కలిపి ఆ నలుగురిపై వ్యాజ్యమును   ప్రజా బాహుళ్యము సమక్షములో జరుపవలెనన్న వత్తిడి వచ్చినది. ఈ వాస్తవాలను ఆ రోజులలో వితంతు విధానము (Wireless source) ద్వారా ప్రపంచ వ్యాప్తముగా తెలియజేయ బడేది. ఆ విషయమును విన్న, సరియగు  ఆదరణకు నోచుకోని యావత్తు భారతీయ సముద్ర సిబ్బంది తిరుగుబాటు చేసి సుభాస్ చంద్ర బోసుకు మద్దత్తు తెలిపినారు. ఈ పితూరీ 18 ఫిబ్రవరి 1946 న ప్రారంభమైనది.

 దీనికిగానూ సంకేతజ్ఞ ప్రముఖుడగు  ( Leading Signalman ) M.S. ఖాన్ ఆయనకు క్రింది తరగతి యధికారియగు నిస్తంత్రీ ప్రయోక్త (Telegraphist ) మదన్ సింగ్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవముగా ఎన్నుకొనబడుట జరిగింది.
కార్యాచరణ ఆరంభించుటయే తడవుగా ముంబాయి నౌకాశ్రయము సంపూర్ణముగా స్తంభించి పోయింది. కరాచీ, కోల్కతా, కోచ్చి, మరియు విశాఖ లో 78 నావలు స్తంభించి పోయినాయి. ఇవికాక ఇంకా 20 రేవులు 20,000 నావికా సిబ్బంది ఈ సమ్మె లో పాల్గొన్నారు.
ఈ ప్రభంజనమును తిలకించి ముంబాయి పౌరులు ఒక దినము సమ్మె జేసినారు. వైమానిక దళము మరియు రక్షక భట సిబ్బంది కూడా దేశ వ్యాప్తముగా ఇందులో పాల్గొనుట జరిగింది. బ్రిటీషు రక్షక దళ ఉన్నతాధికారులనే ధిక్కరించి ప్రబల దీక్షతో తమ తిరస్కృతి తెలిపినారు.

దేశమంతా అల్లకల్లోలము అలముకొనింది. ఆంగ్లేయుల వాహనములను నిలిపి వారితో ‘జైహింద్’ నినాదము చేయించినారు స్వాతంత్ర్య ఉద్యమకారులు. ఉద్యమము మొదలయిన రెండవ దినమునే త్రివర్ణ పతాకమును పలు ప్రాంతముల లోనే కాక నావల పైన కూడా ఎగురనీయ జొచ్చినారు. అంటే పరిస్థితి అంతగా విషమించింది రెండవ రోజుకే ! ఆందోళనకారులు తగిన ప్రణాళికల భాగముగా Gate Way Of India వద్ద మొహరించి కెనడా ఆస్ట్రేలియా నావికా దళములను కూడా మొహరింపునకు సిద్ధముగా నుండ హెచ్చరించినారు.
ఇక మూడవ రోజు Royal Air Force యొక్క ఒక వైమానిక దళ బృందము ముంబాయి నౌకాశ్రయముపై బాంబుల వర్షము కురిపించినారు. బహదూర్, చమక్ మరియు హిమాలయ అన్నHMIS (Hazardous Material Information System) లను వశ పరచుకొనుటయే గాక Royal Naval Anti-Aircraft School నుండి కూడా భారీగా బాంబులను వశ పరచుకున్నారు.
బ్రిటీషు వారుకూడా తమ సైన్యము మరియు మిత్ర దళముల సైన్యముతో హిందూస్థాన్ అన్న విధ్వంసక విమానముపై విరుచుకు పడి అనేక క్రాంతికారులను పొట్టన పెట్టుకొన్నారు.

ఇక గాంధి, నెహ్రు, జిన్నా మరియు మౌలానా ఆజాద్ గారలు గావించిన ధూర్తత ఒక సారి గమనించుదాము.
మిగతది రేపు..............
పెరిగిపోతున్న ప్రజల మద్దత్తు, నావికా వైమానిక పదాతి మరియు రక్షక భట సంఘటన, మాట విచక్షణ లేని ఐకమత్యము కలిగిన ఈ ఉద్యమము నిజమునకు దేశ విభజనకై కాంగ్రెసు నాయకులు కసరత్తు చేయు సమయములో  పురివిప్పినది. కానీ నాటి జాతీయ తెరపైన తళతళ లాడుచున్న నాయక తారకలంతా  ఈ ఉద్యమమును ఖండించిన వారే! ఉద్యమము పై నీరు జల్లిన వారే!
నావికులచే ప్రారంభింపబడిన ఉద్యమము చుక్కాని లేని నావ అయిపోయినది సరియైన నాయకుడు లేక. ఒక్క సుభాస్ చంద్రుడు మాత్రమే ఇటువంటి ఒక పరిస్థితిని ఊహించి సైన్యమును సమీకరించినాడు కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడు సమయమునకు ఈ విప్లవమునకు ఆయన దోహదము చేయలేక పోయినాడు. ఈ విప్లవము తన సైన్యమునకేర్పడిన నిస్సహాయతనుండి ఉద్భవించినదని తెలుసుకోలేని అజ్ఞాత స్థితిలో ఉండిపొయినాడు.  
ఇక గాంధి, నెహ్రు, జిన్నా మరియు ఆజాద్ గారలు కనీసము మాట వరుసకు కూడా వీరిపై సానుభూతి చూపక నిర్దాక్షిణ్యముగా అణచివేయుటయే గాక తమ స్వతంత్ర పోరాటమునకు వారి మద్దత్తు ఇసుమంత కూడా లేదని ప్రచారము చేసినారు.

దేశ విభజన, అవాంతర మత కల్లోలములు ప్రజ్వరిల్ల బోవుచున్న ఈ బడబాగ్ని పై వారుణాస్త్రము ప్రయోగించినట్లయినది. గాంధీజీ మరియు వారి అనుచర నాయక గణమంతా  తమ పట్టునుండి ప్రజా బాహుళ్యము జారిపోతారని తప్ప వారు ఈ విప్లవమును గూర్చి మనఃపూర్వకముగా ఆలోచించలేదు.
జేమ్స్ యల్ రాజ్ అన్న రచయిత తన Making and unmaking of British India. Abacus. 1997. P598 లో ఈ విధముగా వ్రాసినాడు “These people the so-called Mainstream politicians spearheaded by Gandhi were interested in only their hold of their masses, to see themselves being upstaged by a bunch of young upstarts with romantic patriotism in their eyes was unnerving. 
Show of fake “constitutional process” and “principles” was a good way to brush them aside despite all they had been able to do.

కావున దేశ స్వాతంత్రమునకు దోహదము చేసిన మూడు బలమైన కారణములు 1. సుభాస్ 2. భారత జాతీయ సైన్యము (Indian National Army) మరియు సార్వభౌమ నౌకా దళ నౌకరులగు అభ్యుదయ విప్లవకారులు నిజమైన కారణము.
అతి ముఖ్యమైన ఈ విషయమును గమనించితే అసలు విషయము మనకు బోధ పడుతుంది.
జస్టిస్ P.B.చక్రవర్తి గారు కోల్కతా హై కోర్టు చీఫ్ జస్టిస్ గా వున్నపుడు ఒకసారి బ్రిటీషు ప్రధానియైన క్లెమెంట్ అట్లీ ని బ్రిటీషు సామ్రాజ్యము భారత దేశమునకు స్వాతంత్ర్యము ప్రకటించుటకు గల కారణములు తానూ ఊహించిన విధముగానే ఉన్నాయా అని తెలుసుకోగోరి ఈ విధముగా ప్రశ్నించట జరిగింది.
1.బ్రిటీషువారు భారతదేశమును వదలుటకు వెనుక గాంధీ గారి ప్రభావము ఎంత ?
అట్లీ ఒక కృత్రిమమైన నవ్వు తో ‘ అణు మాత్రమే’ అన్నాడు.
2. 1942 లోనే అణచి వేయబడిన ‘ Quit India ‘ ఉద్యమము యొక్క ప్రభావము 1947 లో స్వాతంత్ర్యమిచ్చుటకు దోహదమైనదని చెప్పుట సమంజసమౌతుందా?
అట్లీ: ఎంత మాత్రమూ కాదు. రాను రానూ బ్రిటీషు ప్రభుతపై తగ్గుతూ వచ్చిన సైనిక విధేయత మరియు నేతాజీ కార్యకలాపములు ముఖ్య కారణములు.
1965 లోనే తమను గూర్చిన వాస్తవాలు లోకానికి తెలియనిచ్చుట ఇష్టములేక ఉత్పల్ దత్ గారిని ఖైదు చేయుట జరిగినది .
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పా వలసినది ఉంది. అసలు దేశ స్వాతంత్ర్యమునకు హిట్లరు ఎంత అధికముగా దోహదము చేసినాడు అన్నది.
Dr. Susmit Kumar, Ph.D. (Source: "Modernization of Islam and the Creation of a Multipolar World Order," Susmit Kumar, Booksurge, USA, pp 17-21, 2008) గారి పైన తెలిపిన పుస్తకమును ఒకసారి నిశితముగా చదివితే మన దేశ స్వాతంత్ర్యమునకు రెండవ ప్రపంచ యుద్ధము ఎంత ఎక్కువగా దోహదము చేసినదో మనకు తెలుస్తుంది. హిట్లరును ఒక కోణము నుండి గమనించితే అతను మానవత్వపు విలువలను మంటగలిపి ఎన్నో అత్యాచారములు చేసినది వాస్తవమే. కానీ అతనిని మరియొక కొణమునుండి కూడా గమనించ వలసియున్నది. అతను మన దేశ స్వాతంత్ర్యము కొరకు చేసిన సాయము మరువరానిది.
మిగిలినది రేపు.......

1939-45 కాలంలో జరిగిన యుద్ధాలన్నీ యెంతో వినాశాన్ని, విధ్వంసాన్ని సృష్టించినాయి. అంతటితో ఆగక ఆసియా, ఆఫ్రికా సుదూర పసిఫిక్ దీవుల్లో భీకర పోరాటాలకు ఆజ్యం పోసినాయి. ఫలితం అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి అనివార్యంగా తీసుకుపోయినాయి.  మిత్ర దేశములకు చెందిన బ్రిటను యొక్క సైనిక వ్యవస్థ మిక్కిలి బలహీనమై పోయింది. అందువల్ల తమ ఆధీనములోని దేశముల యందు ఏర్పడు కల్లోలముల నడచుట వారికి తలకు మించిన భారమైపోయింది. మార్షల్ ప్లాన్ సహాయములో కూడా వీరికి అందవలసిన పూర్తి ఆర్ధిక సహాయమునకు బదులుగా పాతిక భాగము మాత్రమే అందినది. అసలు మార్షల్ ప్లాన్ అంటే :
 The Marshall Plan (officially the European Recovery Program, ERP) was an American initiative to aid Western Europe, in which the United States gave over $12 billion (approximately $120 billion in current dollar value as of June 2016) in economic support to help rebuild Western European economies after the end of World.

దీనిని బట్టే వారి ఆర్ధిక వ్యవస్థ ఎంత దారుణముగా దెబ్బ తినిందో తెలుసుకొనవచ్చు. 1945 న రెండవ ప్రపంచ యుద్ధము ముగిసినది లగాయితూ బ్రిటనులో ఆర్ధిక సంక్షోభము ఆకాశమునంటగా
తమ వలసలను పరిపాలించుట వారికి గగన కుసుమమై పోయినది. వారి ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై అందని మ్రాని పండు అయిపోయినది. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన ఒక 5 సంవత్సరముల కాలములోనే బ్రిటను తన వలసలన్నీ వదలి స్వస్థానము చేరవలసి వచ్చినది. జోర్డాన్ ను 1946 లోనూ, పాలస్తీనాను 47 లోనూ, శ్రీలంకను 48 లోనూ, ఈజిప్టును 52 లోనూ విడిచిపెట్టింది. ఒక్క మలేషియా ను మాత్రమె 57 లో విడువటము జరిగినది. డచ్ వారిధి కూడా అదే పరిస్థితే! ఒకవేళ హిట్లరే లేక రెండవ ప్రపంచ యుద్ధమే రాకుండా వుండియుంటే పాశ్చాత్యులు కనీసము ఇంకొక 30 సంవత్సరములు మనలను పాలించుతూ వుండియుండేవారు. అసలు 1942 న, అప్పటి బ్రిటీషు ప్రధాన మంత్రి చర్చిలు  పంపిన క్రిప్సు రాయబారము US కు తమ వలస విధానము పై గల దుర్భావన తగ్గించుటకే!

ప్రముఖ బ్రిటీషు చరిత్రకారులైన P.J. Cain and A.G. Hopkins హిందూ దేశములోని బ్రిటీషు పాలనా దుస్థితిని ఈ విధముగా తెలియజేసినారు. వారి వ్రాతలు యథాతథముగానే గమనించండి:
మిగతది రేపు..............

By the end of war, there was a loss of purpose at the very center of the imperial system. The gentlemanly administrators who managed the Raj no longer had the heart to devise new moves against increasing odds, not least because after 1939 the majority of the Indian Civil Service were themselves Indian. In 1945 the new Viceroy, Wavell, commented on the “weakness and weariness of the importance of the instrument still our disposal in the shape of the British element in the Indian Civil Service. The town had been lost to opponents of the Raj; the countryside had slipped beyond control. Widespread discontent in the army was followed in 1946 by a mutiny in the navy. It was then Wavell, the unfortunate messenger, reported to London that India had become ungovernable [which finally led to the independence of India].

 [2] There is a saying that history is written by the victors of war. One of the greatest myths, first propagated by the Indian Congress Party in 1947 upon receiving the transfer of power from the British, and then by court historians, is that India received its independence as a result of Mahatma Gandhi’s non-violence movement. This is one of the supreme inaccuracies of Indian history because had there been no Hitler and no World War II, Gandhi’s movement would have slowly fizzled out because gaining full independence would have taken several more decades. By that time, Gandhi would have long been dead, and he would have gone down in history as simply one of several great Indian freedom fighters of the times, such as Bal Gangadhar Tilak, Lala Lajpat Rai, Motilal Nehru, Dada Bhai Naoroji, and C.R. Das. He would never have received the vast publicity that he did for his nonviolence movement. Political independence for India was achieved not by Mahatma Gandhi, but rather by Hitler rendering the British Empire a bankrupt entity.

 సుభాష్ చంద్ర బోసు విషయమునకు వస్తే ఆయన మేరు సమ మేధావి. బ్రిటను లో జరిగే నాటి I.C.S అంటే సివిల్ సర్వీసు పరీక్షలలో 4 వ వానిగా నిలచినాడు. ఇది సామాన్యమైన విషయము కాదు. అసలు వారి దేశము వారి పరీక్షలు కాబట్టి ఆయనకు 1,2,3, స్థానాలు తప్పించి 4వది ఇచ్చినారేమో కూడా మనకు తెలియని విషయము. ఆయన తానూ రచించిన The Indian Struggle అన్న పుస్తకములో వ్రాసినది యథాతథముగా మీకు వినిపిస్తాను. ఇది గాంధీ గారితో బోసు గారికి 1921 లో జరిగిన ప్రథమ సమావేశము.

I began to heap question upon questionThe reply to the first question satisfied meHis reply to the second question was disappointing and his reply to the third question was no betterMy reason told me clearlythat there was a deplorable lack of clarity in the plan which the Mahatma had formulated and that he himself had no clear idea of the successive stages of the campaign which would bring India to her cherished goal of freedom.

 

1938 లో కాంగ్రెసు అధ్యక్షునిగా ఏకగ్రీవముగా ఎన్నుకొనబడినాడు. 1939 లో బ్రిటీషు వారికి 6 నెలల నోటీసు ఇచ్చి సహాయ నిరాకరణోద్యమము తలపెట్ట దలచినాడు. ఈ ధ్యేయముతో సభ్యుల మద్దతు తగినంత కలదా లేదా తన ధ్యేయమునకు అని తలచి తిరిగి అధ్యక్షా పదవికి ఎన్నికలు జరుపనాలోచించినాడు. గాంధీ అంతేవాసియైన నెహ్రు అప్పటికే రెండు మార్లు బోసునకు ముందు అధ్యక్ష పదవిని అలంకరించినందువల్ల గాంధీ గారికి బోసు నచ్చనందువల్ల వారు బోసునకు ప్రతిద్వంది గా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని నిలిపినారు. నియమ నిష్ఠలకు, అధికార దక్షతకు, ఆలోచనా సరళికి, అవగాహనా కౌశాలమునకు, ఆత్మీయతా భావనకు ఆలవాలమైన బోసు అవలీలగా సీతారామయ్య గారిపై గెలిచినాడు. గాంధీ గారు దీనిని తన ఓటమిగానే భావించినట్లు బహిరంగాముగానే ప్రకటించినాడు. కానీ ఆతరువాత “My Experiments With Truth’ రచయితయైన గాంధీజీ తన వర్గమును ప్రోత్సహించుతూ ఎట్టకేలకు తుట్టతుదకు కట్టకడపటికి, చిట్టచివరకు  అంతరంగిక సమావేశములలో తన వర్గము వారు బోసును ఇడుముల బడవైచు రీతిగా ప్రవర్తింపజేసి, వారి ప్రవర్తనకు రోశి తనకు తానే బోసు పార్టీకే రాజీనామా చేయు స్థితికి తెచ్చి ఆయన తనకుతానే పార్టీ కి రాజీనామా చేసే స్థితిని కల్పించినాడు.

 

ఈ దారుణమైన చర్యకు స్పందించిన అరవిందో ఘోష్ గారు, అప్పటికి ఇంకా దైవిక మార్గమును ఎంచుకోలేదు, ఈ విధముగా అన్నారు “ కాంగ్రెసు ఒక నియంతృత్వ సంస్థ. గాంధి గారు స్టాలిన్ ను బోలిన నియంత. హిట్లరు వలె అని నేననుట లేదు. ఆయన చెప్పినదే వేదము. తన మాట చెల్లించుకొనుటకే తాను తపన పడుతాడు. అది నేరవేరుటకు అన్ని విధములా ఆయన కృషి చేస్తాడు. ఆయన ప్రతిపాదనపై అభిప్రాయభేదము ఉండే అవకాశమే లేదు. విషయమును గూర్చిన అవగాహన అంతే వాసులకు ఏర్పరచి, సభలో ప్రవేశపెట్టి, నామకార్థము దానిపై చర్చ జరిపిన అభిప్రాయమును కలిగించి చివరకు తాను చెప్పినదే సరియైనదన్న నిర్ణయమునకు రప్పింప జేస్తారు. అందుకే వీరిది స్టాలిన్ పోకడ అన్నాను.

1938 లోనే ప్రవేశ పెడదామని బోసు చెప్పిన ఆలోచనపై నీరు జల్లిన గాంధీగారు 1942 లో “Quit India’ ఉద్యమము పేరుతో అదే ఆలోచనను తెరపైకి తెచ్చినారు. గాంధీ గారి ఈ ఉద్యమము నిజామునకు ఫలవంతము కాలేదు. ప్రముఖ నాయకులనందరినీ బ్రిటీషు వారు జైలు పాలు చేయుటతో ఉద్యమము నీరుగారి పోయినది. ఈ విషయమై అప్పటి బ్రిటీషు ప్రధాని చెప్పిన మాటలను మీకు ముందే మనవి చేసుకొన్నాను.

బోసుగారి Indian National Army జపాను సైన్యముతో కలిసి భారత ఈశాన్య లేక తూర్పు ప్రాంతమున జరిపిన వీరోచిత పోరాటము సద్యోఫలితమునివ్వకున్నా బ్రిటీషు వారిని దేశము వదిలించుటకు బలీయమైన కారణమైనది. అదే The Royal Indian Navy Mutiny (or Naval Uprising) of 1946. దీనిని గూర్చి విశదముగా ముందే తెలియబరచినాను. ఇందులో ఎన్నో వేలమంది అసువులు బాసినారు. ఈ నౌకాదళ క్రాంతి బ్రిటీషు వారిని విభ్రాంతి పరచినది. సైన్యమే చేయి దాటినా తరువాత తాము చేయగలిగినది ఏమీ లేదని నిర్ణయించుకున్నారు. అసలు ఈ విప్లవములో కాంగ్రెసు కమ్యునిష్టు విద్యార్థి సంఘములు సంఘటితమై ఉద్యమమును నడుపుట తటస్థించినది. బ్రిటీషు వారికి భవిష్యత్పాలన గాఢ మేఘావృతమైన  అమావాస్య నిశి యైనది. ఇక లాభము లేదని తెలిసిపోయినది . ఇది ప్రళయాభీలమై, ఝుంఝుమారుత సమేతమై తమ ఉనికి అన్నదే లేకుండా అంతర్హితమౌతామని యాలోచించి దేశమును మనకు అప్పగించినారు కానీ తాటియాకు చప్పుళ్ళకు భయపడికాదు. దేశ స్వాతంత్ర్య కారకులు, స్వరాజ్య దాతలు మన భారతీయులగు, పేరుకు ప్రాకులాడని సిపాయిలు. కడుపు కొరకు బ్రిటీషు సైన్యమున చేరినా సుభాష్ బోసు చేత ఉత్తేజితులై ప్రాణములను తృణప్రాయముగా భావించి తాము అసువులు బాసినా దేశమునకు స్వాతంత్ర్యము తెచ్చి మన దాస్య శృంఖల వీడగొట్టి విమలాకాశ విహంగ సాదృశులను జేసినారు.

 

వీరి కృషికి మూలమైన మన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మనకందజేసిన ‘జై హింద్’ మంత్రమును బిగ్గరగా చెప్పి, మన వంతు కృషిగా నీతి నియమము, న్యాయము ధర్మమూ, దయ సహానుభూతి, ధైర్యము శౌర్యము, మానము మరియాద, వేద భూమి వైదిక ధర్మము అన్న చక్రములపై దేశము అన్న బండిని నిలిపి అందులో పయనిద్దాము. ఇక ఈ స్వాతంత్ర్య దినము నుండి అవినీతి అక్రమము లేని పరిపాలనకు దోహదము చేస్తాము. స్వార్థపరుల నైచ్యమును ఎండగడుదాము. జయహో భారత మాతా అని ఎలుగెత్తి చాటుదాము.

 జై హింద్ జై హింద్ జై హింద్

శాంతి  మంత్రములు

ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం  కర వావహై 

తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహైః

 ఓం   శాంతి   శాంతి   శాంతిః ;  

 ఓం భద్రం కర్ణేభిహి శ్రుణుయామదేవాః  భద్రంపశ్యేమాక్ష  భిర్యజత్రాః

స్తిరై రంగై స్తుష్టువాగుం   సస్థనూభిః   వ్యసేమదేవహితం యధాయుః

 స్వస్తిన  ఇంద్రో వృద్ధ శ్రవాః  స్వస్తినఃపూషావిశ్వవేదాః

స్వ స్తి నస్తార్-క్ష్యో  అరిష్టనేమిః   స్వస్తినో బృహస్పతిర్దదాతు  

ఓం   శాంతి   శాంతి   శాంతిః 

ఓం  శంనో  మిత్రః   శంవరుణః  శన్నో భవత్వర్యమా 

శంన ఇంద్రో బృహస్పతిః  శంనో విష్ణు రురుక్రమః 

నమో బ్రహ్మణే నమస్తే వాయో  త్వమేవ  ప్రత్యక్షం  బ్రహ్మాసి 

త్వమేవ ప్రత్యక్షం  బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి 

సత్యం వదిష్యామి  తన్మామవతు  తద్వాక్తార మవతు 

అవతుమాం  అవతువక్తారం

 ఓం  శాంతి   శాంతి   శాంతిః  
 ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితామనోమే వాచిప్రతిష్ఠితం  
ఆవిర వీర్మ ఏ దివేదస్యమ ఆనీస్త  శ్రుతం మేమా ప్రహాసీః
 అనేనాది తేనేహోరాత్రాన్ సంధదామి  ఋతం వదిష్యామి  
 సత్యం వదిష్యామి తన్మామవతు  తద్వాక్తారమవతు 
 అవతుమాం  అవతువక్తారం 
 ఓం   శాంతి   శాంతి   శాంతిః  
 ఓం త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టివర్ధనం 
 ఉర్వారుక మివబంధ నాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ 
 ఓం   శాంతి   శాంతి   శాంతిః  
ఓం పూర్ణమదః పూర్ణమిదం  పూర్ణాత్  పూర్ణము దత్చ్యతే 
 పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
 ఓం   శాంతి   శాంతి   శాంతిః 
 ఓం సర్వేపిః సుఖినః సన్తు సర్వేసంతు నిరామయాః 
 సర్వేభద్రాణి  పశ్యంతు మాకశ్చిత్ దుఖః  భాగ్భవేత్ 
 ఓం   శాంతి   శాంతి   శాంతిః 

స్వస్తి.

.