మన స్వతంత్ర దినము
మన భారతదేశ పాఠశాలల సాంఘీక పుస్తకములలో భారత స్వాతంత్ర్య
సమరము అన్న శీర్షిక క్రింద ఎక్కువగా గాంధీ నెహ్రూల గూర్చి మాత్రమే చదువుతాము.
మిగతా వారిని అంటే నేతాజీ లాంటి వారిని గూర్చి ఎక్కువగా చదువము. అసలు పేరుకు
ప్రాకులాడకుండా ప్రాణముల తృణ ప్రాయముగానేంచి దేహత్యాగములు చేసిన భగత్ సింగ్ , చంద్రశేఖర్
ఆజాద్, సుఖ్ దేవ్, రాజగురు,ఖుదీరాం బోస్, లాంటి మహనీయుల గూర్చి అసలు వినము. మహా మేధావి అచంచల
దేశభక్తుడు అయిన సుభాష్ చంద్ర బోస్ ను గూర్చి మనకు పాఠ్య పుస్తకములలో ప్రభుత్వమూ
తెలిపినది, మనము తెలుసుకొన్నది కూడా చాల తక్కువ. ఈ రోజు, మనకు స్వాతంత్ర్యము
వచ్చుటకు, మనకు తెలియని ప్రబలమైన కారణములు ఏమిటి అన్నది తెలుసుకొన ప్రయత్నిద్దాము.
వెలుగునకు రాని వాస్తవ ఉదంతాలను కాస్త పరిశీలిద్దాము.
మనలో కొందరికైనా ‘అమోల్ పాలేకర్’ గారు హీరోగా ‘బిందియ
గోస్వామి’ హీరోయిన్ గా ‘ఉత్పల్ దత్’ ఆమె తండ్రి ‘భవాని శంకర్’ గా వేసింది తప్పక
మరచి ఉండరు. ఉత్పల్ దత్ గారి హాస్యము నభూతో న భవిష్యతి . మనకు తెలియని విషము
ఇంకొకటి ఏమిటంటే ఆయన కమ్యునిష్టు భావాలు కలిగిన గొప్ప రచయిత. ఆయన ‘కల్లోల్’ అన్న
ఒక నాటకమును వ్రాసినాడు. ఆయనను 1965 డిసెంబర్
27 న ‘ నిర్దుష్ట ఆపన్నివారక నిర్బంధ చట్టము Preventive
Detention Act క్రింద ఖైదు చేయుట
జరిగింది. కారణం ఆయన తన రచనకు ‘The Royal Indian Navy Mutiny (or
Naval Uprising) of 1946.’ అన్న
పుస్తకమునుండి ఒక ‘అధ్యాయమును’ తన రచనకు ఆలంబనగా తీసుకొనుటే! అందుకు కారణమేమిటంటే
ఆ పుస్తకము స్వతంత్ర పోరాటమునకు సంబంధించిన వాస్తవాలను ప్రకటించుటే! ఆ తరువాత
ఆయనను విడిచిపెట్టుట వేరే విషయము.
ఇక అసలు విషయమునకు వస్తాము.
1946 సంవత్సరము నుండి ఆంగ్లేయులకు భారత పరిపాలన అత్యంత కంటకప్రాయమైపోయినది. కారణము
మన తెరపైని నాయకులు కాదు. ఆంగ్లేయ సైన్యమున పనిజేయుచున్న మన తెర వెనుక నాయకులు. ఈ
వాస్తవము మనము కని విని ఎరుగినది. ఈ మాట గమనించండి :
Said Sir Stafford Cripps, intervening in the debate on the
motion to grant Indian independence in the British House of Commons in 1947 (‘The Freedom Struggle and
the Dravidian Movement’ by P. Ramamurti, Orient Longman, 1987)
…The Indian Army in India is
not obeying the British officers. We have recruited our workers conditions if
we have to rule India for a long time, we have to keep a permanent British army
for a long time in a vast country of four hundred millions. We have no such army….”
1945 లో సుభాస్ చంద్రుడు
మరణించినాడను వదంతిని వ్యాపింపజేయుచున్న
తరుణములో ఆయన జర్మనీ నేత హిట్లరు మరియు
జపాను నేతలతో, బ్రిటీషు వారితో పోరాడి దేశ స్వాతంత్ర్యమును సంపాదించు
ప్రయత్నములు చేయుచుండినాడు. అంతలో ఆయన స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్ (Indian
National Army ) కి చెందిన
జనరల్ షా నవాజ్ ఖాన్(ముస్లిం), కల్నల్ ప్రేమ్ శెహగల్ (హిందూ) కల్నల్ గురుబక్ ష్ సింగ్ (సిఖ్ఖు) ఎర్రకోట డిల్లీ న్యాయస్థానములో ప్రవేశ పెట్టబడినారు. వారి పైన
అభియోగము ఏమిటంటే వారు బ్రిటీషు చక్రవర్తి పై తిరుగుబాటు బావుటా ఎగరివేయుటయే!
నెహ్రూ గారు వారు మువ్వురినీ సమర్థిస్తూ, తానూ, గాంధీ,
మొహమ్మదాలి జిన్నా మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ప్రభుత్వముతో ఒక రహస్యపు
ఒప్పందమును కుదుర్చుకున్నారు. అది ఏమిటంటే సుభాస్ భారత దేశములో అడుగిడిన వెంటనే
ఆయనను బంధించి ఆయనపై అధికారయుతమైన వ్యాజ్యము నడుపుట.
కానీ వారొకటి తలిస్తే దైవమొకటి తలచినాడు. దినదిన
ప్రవర్ధమానమయి కట్టలు తెంచుకొని ప్రవహించిన జనవాహిని యొక్క సుభాస్ పై ప్రేమ న్యాయస్థానమును, ఆ వ్యాజ్యమును
అంటే సుభాస్ తో కలిపి ఆ నలుగురిపై వ్యాజ్యమును
ప్రజా బాహుళ్యము సమక్షములో
జరుపవలెనన్న వత్తిడి వచ్చినది. ఈ వాస్తవాలను ఆ రోజులలో వితంతు విధానము (Wireless
source) ద్వారా ప్రపంచ వ్యాప్తముగా తెలియజేయ బడేది. ఆ విషయమును విన్న, సరియగు ఆదరణకు నోచుకోని యావత్తు భారతీయ సముద్ర
సిబ్బంది తిరుగుబాటు చేసి సుభాస్ చంద్ర బోసుకు మద్దత్తు తెలిపినారు. ఈ పితూరీ 18
ఫిబ్రవరి 1946 న ప్రారంభమైనది.
దీనికిగానూ సంకేతజ్ఞ
ప్రముఖుడగు ( Leading
Signalman ) M.S. ఖాన్ ఆయనకు క్రింది తరగతి యధికారియగు నిస్తంత్రీ
ప్రయోక్త (Telegraphist ) మదన్ సింగ్
అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవముగా ఎన్నుకొనబడుట జరిగింది.
కార్యాచరణ ఆరంభించుటయే తడవుగా
ముంబాయి నౌకాశ్రయము సంపూర్ణముగా స్తంభించి పోయింది. కరాచీ, కోల్కతా, కోచ్చి, మరియు
విశాఖ లో 78 నావలు స్తంభించి పోయినాయి. ఇవికాక ఇంకా 20 రేవులు 20,000 నావికా సిబ్బంది ఈ సమ్మె లో
పాల్గొన్నారు.
ఈ ప్రభంజనమును తిలకించి ముంబాయి
పౌరులు ఒక దినము సమ్మె జేసినారు. వైమానిక దళము మరియు రక్షక భట సిబ్బంది కూడా దేశ
వ్యాప్తముగా ఇందులో పాల్గొనుట జరిగింది. బ్రిటీషు రక్షక దళ ఉన్నతాధికారులనే
ధిక్కరించి ప్రబల దీక్షతో తమ తిరస్కృతి తెలిపినారు.
దేశమంతా అల్లకల్లోలము
అలముకొనింది. ఆంగ్లేయుల వాహనములను నిలిపి వారితో ‘జైహింద్’ నినాదము చేయించినారు
స్వాతంత్ర్య ఉద్యమకారులు. ఉద్యమము మొదలయిన రెండవ దినమునే త్రివర్ణ పతాకమును పలు
ప్రాంతముల లోనే కాక నావల పైన కూడా ఎగురనీయ జొచ్చినారు. అంటే పరిస్థితి అంతగా
విషమించింది రెండవ రోజుకే ! ఆందోళనకారులు తగిన ప్రణాళికల భాగముగా Gate Way Of India వద్ద మొహరించి కెనడా
ఆస్ట్రేలియా నావికా దళములను కూడా మొహరింపునకు సిద్ధముగా నుండ హెచ్చరించినారు.
ఇక మూడవ రోజు Royal Air
Force యొక్క ఒక వైమానిక దళ బృందము ముంబాయి
నౌకాశ్రయముపై బాంబుల వర్షము కురిపించినారు. బహదూర్, చమక్ మరియు హిమాలయ అన్నHMIS (Hazardous Material Information System) లను వశ పరచుకొనుటయే గాక Royal Naval Anti-Aircraft
School నుండి కూడా భారీగా బాంబులను
వశ పరచుకున్నారు.
బ్రిటీషు వారుకూడా తమ సైన్యము
మరియు మిత్ర దళముల సైన్యముతో హిందూస్థాన్ అన్న విధ్వంసక విమానముపై విరుచుకు పడి
అనేక క్రాంతికారులను పొట్టన పెట్టుకొన్నారు.
ఇక గాంధి, నెహ్రు, జిన్నా
మరియు మౌలానా ఆజాద్ గారలు గావించిన ధూర్తత ఒక సారి గమనించుదాము.
మిగతది రేపు..............
పెరిగిపోతున్న ప్రజల
మద్దత్తు, నావికా వైమానిక పదాతి మరియు రక్షక భట సంఘటన, మాట విచక్షణ లేని ఐకమత్యము
కలిగిన ఈ ఉద్యమము నిజమునకు దేశ విభజనకై కాంగ్రెసు నాయకులు కసరత్తు చేయు
సమయములో పురివిప్పినది. కానీ నాటి జాతీయ
తెరపైన తళతళ లాడుచున్న నాయక తారకలంతా ఈ
ఉద్యమమును ఖండించిన వారే! ఉద్యమము పై నీరు జల్లిన వారే!
నావికులచే ప్రారంభింపబడిన
ఉద్యమము చుక్కాని లేని నావ అయిపోయినది సరియైన నాయకుడు లేక. ఒక్క సుభాస్ చంద్రుడు
మాత్రమే ఇటువంటి ఒక పరిస్థితిని ఊహించి సైన్యమును సమీకరించినాడు కానీ అనుకూల
పరిస్థితులు ఏర్పడు సమయమునకు ఈ విప్లవమునకు ఆయన దోహదము చేయలేక పోయినాడు. ఈ విప్లవము
తన సైన్యమునకేర్పడిన నిస్సహాయతనుండి ఉద్భవించినదని తెలుసుకోలేని అజ్ఞాత స్థితిలో
ఉండిపొయినాడు.
ఇక గాంధి, నెహ్రు, జిన్నా
మరియు ఆజాద్ గారలు కనీసము మాట వరుసకు కూడా వీరిపై సానుభూతి చూపక నిర్దాక్షిణ్యముగా
అణచివేయుటయే గాక తమ స్వతంత్ర పోరాటమునకు వారి మద్దత్తు ఇసుమంత కూడా లేదని ప్రచారము
చేసినారు.
దేశ విభజన, అవాంతర మత
కల్లోలములు ప్రజ్వరిల్ల బోవుచున్న ఈ బడబాగ్ని పై వారుణాస్త్రము
ప్రయోగించినట్లయినది. గాంధీజీ మరియు వారి అనుచర నాయక గణమంతా తమ పట్టునుండి ప్రజా బాహుళ్యము జారిపోతారని
తప్ప వారు ఈ విప్లవమును గూర్చి మనఃపూర్వకముగా ఆలోచించలేదు.
జేమ్స్ యల్ రాజ్ అన్న రచయిత
తన Making and unmaking of British India. Abacus. 1997. P598 లో ఈ విధముగా వ్రాసినాడు “These
people – the so-called Mainstream
politicians spearheaded by Gandhi were interested in only their hold of their masses, to see themselves being upstaged by a bunch
of young upstarts with romantic patriotism in their eyes was unnerving.”
Show of fake “constitutional process” and “principles” was a
good way to brush them aside despite all they had been able to do.
కావున దేశ స్వాతంత్రమునకు
దోహదము చేసిన మూడు బలమైన కారణములు 1. సుభాస్ 2. భారత జాతీయ సైన్యము (Indian
National Army) మరియు సార్వభౌమ నౌకా దళ
నౌకరులగు అభ్యుదయ విప్లవకారులు నిజమైన కారణము.
అతి ముఖ్యమైన ఈ విషయమును
గమనించితే అసలు విషయము మనకు బోధ పడుతుంది.
జస్టిస్ P.B.చక్రవర్తి గారు కోల్కతా
హై కోర్టు చీఫ్ జస్టిస్ గా వున్నపుడు ఒకసారి బ్రిటీషు ప్రధానియైన క్లెమెంట్ అట్లీ
ని బ్రిటీషు సామ్రాజ్యము భారత దేశమునకు స్వాతంత్ర్యము ప్రకటించుటకు గల కారణములు
తానూ ఊహించిన విధముగానే ఉన్నాయా అని తెలుసుకోగోరి ఈ విధముగా ప్రశ్నించట జరిగింది.
1.బ్రిటీషువారు భారతదేశమును
వదలుటకు వెనుక గాంధీ గారి ప్రభావము ఎంత ?
అట్లీ ఒక కృత్రిమమైన నవ్వు తో
‘ అణు మాత్రమే’ అన్నాడు.
2. 1942 లోనే అణచి వేయబడిన ‘ Quit
India ‘ ఉద్యమము యొక్క ప్రభావము 1947 లో స్వాతంత్ర్యమిచ్చుటకు
దోహదమైనదని చెప్పుట సమంజసమౌతుందా?
అట్లీ: ఎంత మాత్రమూ కాదు. రాను రానూ బ్రిటీషు ప్రభుతపై
తగ్గుతూ వచ్చిన సైనిక విధేయత మరియు నేతాజీ కార్యకలాపములు ముఖ్య కారణములు.
1965 లోనే తమను గూర్చిన వాస్తవాలు లోకానికి తెలియనిచ్చుట
ఇష్టములేక ఉత్పల్ దత్ గారిని ఖైదు చేయుట జరిగినది .
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పా వలసినది ఉంది. అసలు దేశ
స్వాతంత్ర్యమునకు హిట్లరు ఎంత అధికముగా దోహదము చేసినాడు అన్నది.
Dr.
Susmit Kumar, Ph.D. (Source: "Modernization of Islam and the Creation of a Multipolar
World Order," Susmit Kumar, Booksurge, USA, pp 17-21, 2008) గారి పైన తెలిపిన పుస్తకమును ఒకసారి
నిశితముగా చదివితే మన దేశ స్వాతంత్ర్యమునకు రెండవ ప్రపంచ యుద్ధము ఎంత ఎక్కువగా
దోహదము చేసినదో మనకు తెలుస్తుంది. హిట్లరును ఒక కోణము నుండి గమనించితే అతను
మానవత్వపు విలువలను మంటగలిపి ఎన్నో అత్యాచారములు చేసినది వాస్తవమే. కానీ అతనిని
మరియొక కొణమునుండి కూడా గమనించ వలసియున్నది. అతను మన దేశ స్వాతంత్ర్యము కొరకు చేసిన సాయము మరువరానిది.
మిగిలినది రేపు.......
1939-45 కాలంలో
జరిగిన యుద్ధాలన్నీ యెంతో వినాశాన్ని, విధ్వంసాన్ని సృష్టించినాయి. అంతటితో ఆగక ఆసియా, ఆఫ్రికా సుదూర పసిఫిక్ దీవుల్లో భీకర పోరాటాలకు ఆజ్యం
పోసినాయి. ఫలితం అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి అనివార్యంగా తీసుకుపోయినాయి. మిత్ర దేశములకు చెందిన బ్రిటను యొక్క సైనిక
వ్యవస్థ మిక్కిలి బలహీనమై పోయింది. అందువల్ల తమ ఆధీనములోని దేశముల యందు ఏర్పడు
కల్లోలముల నడచుట వారికి తలకు మించిన భారమైపోయింది. మార్షల్ ప్లాన్ సహాయములో కూడా
వీరికి అందవలసిన పూర్తి ఆర్ధిక సహాయమునకు బదులుగా పాతిక భాగము మాత్రమే అందినది.
అసలు మార్షల్ ప్లాన్ అంటే :
The Marshall
Plan (officially the European
Recovery Program, ERP) was an American initiative to aid Western Europe, in
which the United States gave over $12 billion (approximately $120 billion in
current dollar value as of June 2016) in economic support to help rebuild
Western European economies after the end of World.
దీనిని బట్టే వారి ఆర్ధిక
వ్యవస్థ ఎంత దారుణముగా దెబ్బ తినిందో తెలుసుకొనవచ్చు. 1945 న రెండవ ప్రపంచ యుద్ధము
ముగిసినది లగాయితూ బ్రిటనులో ఆర్ధిక సంక్షోభము ఆకాశమునంటగా
తమ వలసలను పరిపాలించుట
వారికి గగన కుసుమమై పోయినది. వారి ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై అందని మ్రాని పండు
అయిపోయినది. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన ఒక 5 సంవత్సరముల కాలములోనే బ్రిటను తన
వలసలన్నీ వదలి స్వస్థానము చేరవలసి వచ్చినది. జోర్డాన్ ను 1946 లోనూ, పాలస్తీనాను
47 లోనూ, శ్రీలంకను 48 లోనూ, ఈజిప్టును 52 లోనూ విడిచిపెట్టింది. ఒక్క మలేషియా ను
మాత్రమె 57 లో విడువటము జరిగినది. డచ్ వారిధి కూడా అదే పరిస్థితే! ఒకవేళ హిట్లరే
లేక రెండవ ప్రపంచ యుద్ధమే రాకుండా వుండియుంటే పాశ్చాత్యులు కనీసము ఇంకొక 30
సంవత్సరములు మనలను పాలించుతూ వుండియుండేవారు. అసలు 1942 న, అప్పటి బ్రిటీషు ప్రధాన
మంత్రి చర్చిలు పంపిన క్రిప్సు రాయబారము US
కు తమ వలస విధానము పై గల దుర్భావన తగ్గించుటకే!
ప్రముఖ బ్రిటీషు
చరిత్రకారులైన P.J. Cain and A.G. Hopkins హిందూ
దేశములోని బ్రిటీషు పాలనా దుస్థితిని ఈ విధముగా తెలియజేసినారు. వారి వ్రాతలు
యథాతథముగానే గమనించండి:
మిగతది రేపు..............
By the end of war, there was a loss of purpose at the very
center of the imperial system. The gentlemanly administrators who managed the
Raj no longer had the heart to devise new moves against increasing odds, not
least because after 1939 the majority of the Indian Civil Service were
themselves Indian. In 1945 the new Viceroy, Wavell, commented on the “weakness
and weariness of the importance of the instrument still our disposal in the shape
of the British element in the Indian Civil Service. The town had been lost to
opponents of the Raj; the countryside had slipped beyond control. Widespread
discontent in the army was followed in 1946 by a mutiny in the navy. It was
then Wavell, the unfortunate messenger, reported to London that India had
become ungovernable [which finally led to the independence of India].
[2] There is a saying
that history is written by the victors of war. One of the greatest myths, first
propagated by the Indian Congress Party in 1947 upon receiving the transfer of
power from the British, and then by court historians, is that India received
its independence as a result of Mahatma Gandhi’s non-violence movement. This is
one of the supreme inaccuracies of Indian history because had there been no
Hitler and no World War II, Gandhi’s movement would have slowly fizzled out
because gaining full independence would have taken several more decades. By
that time, Gandhi would have long been dead, and he would have gone down in history
as simply one of several great Indian freedom fighters of the times, such as
Bal Gangadhar Tilak, Lala Lajpat Rai, Motilal Nehru, Dada Bhai Naoroji, and
C.R. Das. He would never have received the vast publicity that he did for his
nonviolence movement. Political independence for India was achieved not by
Mahatma Gandhi, but rather by Hitler rendering the British Empire a bankrupt
entity.
సుభాష్ చంద్ర బోసు
విషయమునకు వస్తే ఆయన మేరు సమ మేధావి. బ్రిటను లో జరిగే నాటి I.C.S అంటే సివిల్
సర్వీసు పరీక్షలలో 4 వ వానిగా నిలచినాడు. ఇది సామాన్యమైన విషయము కాదు. అసలు వారి
దేశము వారి పరీక్షలు కాబట్టి ఆయనకు 1,2,3, స్థానాలు తప్పించి 4వది ఇచ్చినారేమో
కూడా మనకు తెలియని విషయము. ఆయన తానూ రచించిన The
Indian Struggle అన్న పుస్తకములో
వ్రాసినది యథాతథముగా మీకు వినిపిస్తాను. ఇది గాంధీ గారితో బోసు గారికి 1921 లో
జరిగిన ప్రథమ సమావేశము.
I began to heap question upon question…The reply to the first question satisfied
me…His reply to the second
question was disappointing and his reply to the third question was no better…My reason told me clearly…that there was a deplorable lack of clarity
in the plan which the Mahatma had formulated and that he himself had no clear
idea of the successive stages of the campaign which would bring India to her
cherished goal of freedom.
1938 లో కాంగ్రెసు అధ్యక్షునిగా
ఏకగ్రీవముగా ఎన్నుకొనబడినాడు. 1939 లో బ్రిటీషు వారికి 6 నెలల నోటీసు ఇచ్చి సహాయ
నిరాకరణోద్యమము తలపెట్ట దలచినాడు. ఈ ధ్యేయముతో సభ్యుల మద్దతు తగినంత కలదా లేదా తన
ధ్యేయమునకు అని తలచి తిరిగి అధ్యక్షా పదవికి ఎన్నికలు జరుపనాలోచించినాడు. గాంధీ
అంతేవాసియైన నెహ్రు అప్పటికే రెండు మార్లు బోసునకు ముందు అధ్యక్ష పదవిని
అలంకరించినందువల్ల గాంధీ గారికి బోసు నచ్చనందువల్ల వారు బోసునకు ప్రతిద్వంది గా
భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని నిలిపినారు. నియమ నిష్ఠలకు, అధికార దక్షతకు,
ఆలోచనా సరళికి, అవగాహనా కౌశాలమునకు, ఆత్మీయతా భావనకు ఆలవాలమైన బోసు అవలీలగా
సీతారామయ్య గారిపై గెలిచినాడు. గాంధీ గారు దీనిని తన ఓటమిగానే భావించినట్లు
బహిరంగాముగానే ప్రకటించినాడు. కానీ ఆతరువాత “My Experiments With Truth’ రచయితయైన గాంధీజీ
తన వర్గమును ప్రోత్సహించుతూ ఎట్టకేలకు తుట్టతుదకు కట్టకడపటికి, చిట్టచివరకు అంతరంగిక సమావేశములలో తన వర్గము వారు బోసును
ఇడుముల బడవైచు రీతిగా ప్రవర్తింపజేసి, వారి ప్రవర్తనకు రోశి తనకు తానే బోసు
పార్టీకే రాజీనామా చేయు స్థితికి తెచ్చి ఆయన తనకుతానే పార్టీ కి రాజీనామా చేసే
స్థితిని కల్పించినాడు.
ఈ దారుణమైన చర్యకు
స్పందించిన అరవిందో ఘోష్ గారు, అప్పటికి ఇంకా దైవిక మార్గమును ఎంచుకోలేదు, ఈ
విధముగా అన్నారు “ కాంగ్రెసు ఒక నియంతృత్వ సంస్థ. గాంధి గారు స్టాలిన్ ను బోలిన
నియంత. హిట్లరు వలె అని నేననుట లేదు. ఆయన చెప్పినదే వేదము. తన మాట
చెల్లించుకొనుటకే తాను తపన పడుతాడు. అది నేరవేరుటకు అన్ని విధములా ఆయన కృషి
చేస్తాడు. ఆయన ప్రతిపాదనపై అభిప్రాయభేదము ఉండే అవకాశమే లేదు. విషయమును గూర్చిన
అవగాహన అంతే వాసులకు ఏర్పరచి, సభలో ప్రవేశపెట్టి, నామకార్థము దానిపై చర్చ జరిపిన
అభిప్రాయమును కలిగించి చివరకు తాను చెప్పినదే సరియైనదన్న నిర్ణయమునకు రప్పింప
జేస్తారు. అందుకే వీరిది స్టాలిన్ పోకడ అన్నాను.
1938 లోనే ప్రవేశ పెడదామని
బోసు చెప్పిన ఆలోచనపై నీరు జల్లిన గాంధీగారు 1942 లో “Quit India’ ఉద్యమము పేరుతో
అదే ఆలోచనను తెరపైకి తెచ్చినారు. గాంధీ గారి ఈ ఉద్యమము నిజామునకు ఫలవంతము కాలేదు.
ప్రముఖ నాయకులనందరినీ బ్రిటీషు వారు జైలు పాలు చేయుటతో ఉద్యమము నీరుగారి పోయినది.
ఈ విషయమై అప్పటి బ్రిటీషు ప్రధాని చెప్పిన మాటలను మీకు ముందే మనవి చేసుకొన్నాను.
బోసుగారి Indian
National Army జపాను సైన్యముతో
కలిసి భారత ఈశాన్య లేక తూర్పు ప్రాంతమున జరిపిన వీరోచిత పోరాటము
సద్యోఫలితమునివ్వకున్నా బ్రిటీషు వారిని దేశము వదిలించుటకు బలీయమైన కారణమైనది. అదే
The Royal
Indian Navy Mutiny (or Naval Uprising) of 1946. దీనిని గూర్చి విశదముగా ముందే తెలియబరచినాను. ఇందులో ఎన్నో
వేలమంది అసువులు బాసినారు. ఈ నౌకాదళ క్రాంతి బ్రిటీషు వారిని విభ్రాంతి పరచినది.
సైన్యమే చేయి దాటినా తరువాత తాము చేయగలిగినది ఏమీ లేదని నిర్ణయించుకున్నారు. అసలు
ఈ విప్లవములో కాంగ్రెసు కమ్యునిష్టు విద్యార్థి సంఘములు సంఘటితమై ఉద్యమమును నడుపుట
తటస్థించినది. బ్రిటీషు వారికి భవిష్యత్పాలన గాఢ మేఘావృతమైన అమావాస్య నిశి యైనది. ఇక లాభము లేదని
తెలిసిపోయినది . ఇది ప్రళయాభీలమై, ఝుంఝుమారుత సమేతమై తమ ఉనికి అన్నదే లేకుండా
అంతర్హితమౌతామని యాలోచించి దేశమును మనకు అప్పగించినారు కానీ తాటియాకు చప్పుళ్ళకు
భయపడికాదు. దేశ స్వాతంత్ర్య కారకులు, స్వరాజ్య దాతలు మన భారతీయులగు, పేరుకు
ప్రాకులాడని సిపాయిలు. కడుపు కొరకు బ్రిటీషు సైన్యమున చేరినా సుభాష్ బోసు చేత
ఉత్తేజితులై ప్రాణములను తృణప్రాయముగా భావించి తాము అసువులు బాసినా దేశమునకు
స్వాతంత్ర్యము తెచ్చి మన దాస్య శృంఖల వీడగొట్టి విమలాకాశ విహంగ సాదృశులను
జేసినారు.
వీరి కృషికి మూలమైన మన నేతాజీ
సుభాష్ చంద్ర బోస్ మనకందజేసిన ‘జై హింద్’ మంత్రమును బిగ్గరగా చెప్పి, మన వంతు
కృషిగా నీతి నియమము, న్యాయము ధర్మమూ, దయ సహానుభూతి, ధైర్యము శౌర్యము, మానము
మరియాద, వేద భూమి వైదిక ధర్మము అన్న చక్రములపై దేశము అన్న బండిని నిలిపి అందులో పయనిద్దాము.
ఇక ఈ స్వాతంత్ర్య దినము నుండి అవినీతి అక్రమము లేని పరిపాలనకు దోహదము చేస్తాము.
స్వార్థపరుల నైచ్యమును ఎండగడుదాము. జయహో భారత మాతా అని ఎలుగెత్తి చాటుదాము.
జై హింద్ జై హింద్ జై హింద్
శాంతి మంత్రములు
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కర వావహై
తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహైః
ఓం శాంతి శాంతి శాంతిః ;
ఓం భద్రం కర్ణేభిహి శ్రుణుయామదేవాః భద్రంపశ్యేమాక్ష భిర్యజత్రాః
స్తిరై రంగై స్తుష్టువాగుం సస్థనూభిః వ్యసేమదేవహితం యధాయుః
స్వస్తిన ఇంద్రో
వృద్ధ శ్రవాః స్వస్తినఃపూషావిశ్వవేదాః
స్వ స్తి నస్తార్-క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శంనో మిత్రః శంవరుణః శన్నో భవత్వర్యమా
శంన ఇంద్రో బృహస్పతిః శంనో విష్ణు రురుక్రమః
నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి
సత్యం వదిష్యామి తన్మామవతు తద్వాక్తార మవతు
అవతుమాం అవతువక్తారం
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితామనోమే వాచిప్రతిష్ఠితం
ఆవిర వీర్మ ఏ దివేదస్యమ
ఆనీస్త శ్రుతం మేమా ప్రహాసీః
అనేనాది తేనేహోరాత్రాన్ సంధదామి ఋతం వదిష్యామి
సత్యం వదిష్యామి తన్మామవతు తద్వాక్తారమవతు
అవతుమాం అవతువక్తారం
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధ నాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దత్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం సర్వేపిః సుఖినః సన్తు సర్వేసంతు నిరామయాః
సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఖః భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతిః
స్వస్తి.
.
No comments:
Post a Comment