Monday 26 November 2018

మేడం-ఆంటీ-అంకుల్


మేడం-ఆంటీ-అంకుల్
https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post_26.html
‘Baba Black sheep.....’ అన్న Rhyme మనకు సుపరిచితమే! ఇందులో Sheep ఏమని జవాబు చెబుతుందంటే ‘One for my Master one for my DAME..’
‘My Dame’ రానురానూ Madam అయినది. అది గొర్రె కాబట్టి My Dame (Madam) అంటే చెల్లినది. నాస్త్రీ, నా ఆడది, అన్న అర్థములో వచ్చే ఈ పదము తప్ప మన సంస్కృతిలో మన భాషలో వేరు పదములేదా! అసలు Dame అన్నది French శబ్దము వాళ్ళు ఇంటి యజమానియగు స్త్రీని Dame అంటారు.
మరి ఈ మాటకు ప్రత్యామ్నాయము లేదా అంటే ఉంది. అదే  అమ్మ . అమ్మ అన్నది అత్యుత్తమమైన పదము. పదము అన్న మాటకు రెండు అర్థములు. ఒకటి ‘అర్థమును కూర్చెడి అక్షరముల కలయిక.’ వేరొక అర్థము ‘ఉన్నత స్థానము’. నకోక అర్థము 'పాదము'. మరి అమ్మ అన్న పదము’ పలికి అమ్మ’ పాదము’ పట్టితే అదియే స్వర్గ పదము’ .
అమ్మ అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ , దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ, ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.

అమ్మ, తల్లి, మాత,జనని, అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము. సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే  అమ్మ అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని  matter, మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత గా చేప్పుకునే  గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter   మొదలగునవి. మాత అన్న శబ్దము ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము . దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే   మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
ఇక  Madam అన్న పదము యొక్క మూలమును తెలుసుకొందాము. ఫ్రెంచ్ భాషనుండి లాటి, తద్వారా ఆగ్లమునకు వచ్చింది ఈ Madam అన్న పదము వచ్చింది. ఈ క్రింద Google నుండి ‘Madam’ యొక్క పుట్టుకకు సంబంధించి గ్రహించిన విషయమును మీ ముందుంచుచున్నాను.
‘Madam /ˈmædəm/, or, as French, madame /ˈmædəm/ or /məˈdɑːm/,[1] is a polite form of address for women, often contracted to ma'am /ˈmæm/ in American English and /ˈmɑːm/ in British English. The abbreviation is "Mme" or "Mme" or "Mdm" and the plural is Mesdames (abbreviated "Mmes" or "Mmes" or "Mdms"). The term was borrowed from the French Madame (French pronunciation: [maˈdam]), which means "my lady". (Courtesy: Google)’
కావున “Madam” కన్నా ‘అమ్మ’ అని పిలుచుట చేత స్త్రీలను అత్యున్నతముగా గౌరవించిన వారలమగుచున్నాము అన్నది నిర్వివాదాంశము.
ఇక ‘ఆంటీ అంకుల్’ అన్న పదములకు అర్థములేమిటి అన్నది ఆలోచించుతాము.
మళ్ళీ కలుద్దాము.......


ఇక ఆంటీ అంకుల్ ను గురించి
వెస్టు కల్చరెపుడు వేడి కాఫీ యాయె
వారి రీతి నీతి పాలు చీని
అందుచేత ఆంటి అంకులు మనకొచ్చె
మామ అత్త పిన్ని మాయామాయె
 నిరంతరమూ సువాసన వెదజల్లే శ్రీగంధపు వృక్షమును మొదలంట నరికి కొని తెచ్చుకొని గంధపు అగరుబత్తీ వెలిగించినట్లు వుంది మన వరుస. పాశ్చాత్య సంస్కృతి అగరుబత్త్హీ వంటిది. భారతీయ సంస్కృతియగు చందన సాలము నేటిది కాదు తరతరములనుండి వస్తూ వున్నది. ఆ మరులుగొల్పు మంచి గాలిని మనము పీల్చుచూ మనము మన వారసులు ఆరోగ్యముగా హాయిగా ఉండవలెనని ఏర్పాటు  చేసినారుచేసినారు మన పూర్వులు. అచెట్టును నిర్దాక్షిణ్యముగా నేటి తరము కొట్టివేస్తూ వుంటే బరువెక్కిన మనసుతో ఎవరయినా బాధ వెలిబుచ్చితే నీకెందుకు నాయిష్టం అంటున్నారు. ఈ విధముగా ఆలోచనలు వెర్రితలలు వేస్తూ పోతే స్వంత ఇంటికి న్నిప్పుపెట్టుకొని ‘నాయిష్టం నాయిల్లు’ అంటారేమో!
పాశ్చాత్య సంస్కృతిని గూర్చి ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నము చేయుటకు నేను తెలియజేయుచున్నది ఒకసారి, మనసు పెట్టిచదవండి.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మ లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు, ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. మొదటిసారిగా హిలరీ క్లింటన్ నిలచినా ఓడిపొయినది.

ఇంచుమించు13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ పాశ్చాత్య జాతికి పెళ్లి అన్నది తెలియదు. నేటికి కూడా, అది ఆడామగ సంబంధము. అదే మన సాంప్రదాయములో  రెండు కుటుంబాల అనుబంధము. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే, రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు  అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ  ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్న ఆ పాశ్చాత్యదంపతులు అదృష్ట వశాన రెండు  మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే  వ్రాసుకొంటారు అట్లు కాకుంటే వడంబడిక చేసుకొంటారు. అది లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె  పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. అదే విధముగా అతని పిల్లలు, తమ తండ్రి క్రొత్తగా పెళ్ళిచేసుకొన్న యువతిని ‘ఆంటీ’ అంటారు. మరి అటువంటి సంబోధనలు చెడ్డవి కాదా! ఒకపరి ఆలోచించండి. చైనా, జపాను, మలేషియా,నేపాల్, భూటాన్ ఇత్యాది అనేక దేశములు తమ తమ సంస్కృతిని సజావుగా కాపాడుకొంటూ వస్తూవున్నాయి. ఒకనాటి మన దేశములో భాగమయిన పాకిస్తాన్ తమ మతము తమ సంస్కృతికి అడ్డువస్తాయని హైందవ సంస్కృ తినేకాక హిందువులనే పొట్టన పెట్టుకొంది. వారివలె దుర్మార్గమునకు పాలుపడండి, అని నేను చెప్పుటలేదు. నేను కేవలము మన ఆచారవ్యవహారములు ఎంతో సనాతనమైనవి. ద్రష్టలయిన మహాఋషి  మునులు మనకు ఏర్పరచిన మానవ సంబంధముల బాటలో నడుద్దాము అని మాత్రమె చెబుతున్నాను.
పాశ్చాత్యులు ఈ విధముగా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day, Father’s day (mothers' day, Father’s day ని గూర్చి విస్తృతముగా ఇదివరలో వ్రాసినాను.) రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ నాన్నను వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది.
అందుకే Uncle, Aunt అన్న పదములకు శబ్ద కోశము లో చిన్నాన్న లేక మామ అన్న అర్థమును, పిన్ని లేక అత్త అన్న అర్థములను చూస్తాము. మనకున్నన్ని వావి వరుసలు వారికి లేవు. అందుకే వారు 'పిండికీ పిడుక్కూ ఒకే మంత్రము'ను వాడుతారు. దయవుంచి ఆ విధముగా సంబోధించి మన తలిదండ్రులకు అవమానమును కోరి తేవద్దు. పైపెచ్చు కొత్తవారిని సంబోధించునపుడు ఏమండి, పెద్దవాలయితే గురువు గారు, అయ్యా, అమ్మా, అంతగా ఆంగ్లమే కావాలన్నా 'సార్' అని వాడితే మన వాసి తగ్గేది ఏమీ లేదు.
 క్రొత్తవాళ్ళతో ఎంతో అనుబంధమున్నట్లు బంధుత్వమును అంటగట్టి పిలుచుట మన సాంప్రదాయము కాదు అని తెలియజేస్తూ నా ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్నాను.

స్వస్తి.

1 comment:

  1. Very clearly explained sir. We are moving away from all our sampradaya. Let the needy go through and correct themselves at least now.

    ReplyDelete