Wednesday 27 August 2014

ఏకదంతా హే భగవంతా

రేపటి వినాయక చవితి సందర్భంగా వినాయకునికి అంకితము చేసిన ఈ పాటను చదివి బాణీ కట్టుకోగాలిగితే కట్టుకొని పాడుకోండి.

ఏకదంతా హే భగవంతా 

ఏక దంతా హే భగవంతా
ఆలకించుమా మొర కాసింత 
బాపగా నా వేదనా 
హేమవతీ నందనా 

కన్నూ మిన్నూ కానక నేను 
చేసిన తప్పులు చేయగా బోను
దాసరి దోసము దండముతోసరి
దయగని దరి జూపవా 
బాపగ నా వేదనా 
హేమవతీ నందనా  ||ఏకదంతా||

కలిమాయలతో  కలబడినాను 
కడకేమౌనో  కానగలేను 
కలుగజేసుకొని కావుము దేవా
కరుణాభయ కారకా
బాపగ నా వేదనా 
హేమవతీ నందనా  ||ఏకదంతా||

కావరముండెను కన్నులనిండా
కరగిపోయినది కనబడకుండా 
కలువనౌచు నీ కరమున నుండ
కరిముఖ కలిగించుమా 
బాపగా నా వేదనా 
హేమవతీ నందనా  ||ఏకదంతా||

No comments:

Post a Comment