అజరామర సూక్తి – 316
अजरामर सूक्ति – 316
Eternal Quote – 316
https://cherukuramamohan.blogspot.com/2021/07/316-316-eternal-quote-316.html
अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।
देहान्ते तव सायुज्यं देहि मे पार्वतीपते ॥
అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనమ్ l
దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే ll
ఓ పార్వతీ పతీ! దైన్యంలేని జీవితాన్ని, అనాయాస మరణాన్ని, ప్రసాదించి ఆపై
నీ సాయుజ్యాన్ని అనుగ్రహించు’’ అని వేడుకొంటాడు త్రికరణ శుద్ధిగల్గిన భక్తుడు.
ఓ కపటి ‘కామిత ఫల వ్రతము’ చేసి దేవునితో ‘‘పడిపోవుటకు సిద్ధముగా ఉన్న ఈ
పూర్వీకుల ఇంటిని అమ్మగా వచ్చిన ధనమంతా హుండీలో వేస్తా’’ నని తన కోరికను
విన్నవించుచుకొన్నాడు. దేవుని అనుగ్రహముతో అతడి కోరిక సిద్ధించింది. అయితే ఆ
కపట భక్తుడు ఇంటి విలువను ఒక రూపాయిగానూ తాను పెంచుకున్న పిల్లి ధరను
యాభై లక్షలుగా నిర్ణయించి, రెంటినీ కలిపి అమ్ముతానని బేరం పెట్టినాడు. దేవుని
దయతో ఇల్లు అమ్ముడు పోయింది. ఇల్లు అమ్ముడుపోయయిన తరువాత, ఇంటిలో
ఉన్న హుండీలో ఒక రూపాయిని వేస్తూ ఇంటిని అమ్మిన ఈ డబ్బంతా, అంటే అతను ఈ
డబ్బంతా అన్నది ఆ రూపాయకు పెట్టుకొన్న పేరు,దేవుని స్వంతం అంటూ వేసినాడు.
ఇటువంటి వారు ‘వినా దైన్యేన జీవనం’ అన్న మాటకు అనుకూలముగా తానూ అమ్మిన
డబ్బును గూర్చి తలచినాడుకానీ అట్టివానికి భగవంతుడు ‘అనాయాసేన మరణం’
ఇవ్వదని ఊహించుకోలేక పోయినాడు. అందకే ‘కాళ్ళముందు చూపు చూచుకోవద్దు’
అంటారు పెద్దలు
మనసు బురుద నింపి మరి దైవమును వేడు
ధూర్తజనుల కున్న దుమ్ముదులుప
తగిన చెంప పెట్టు తప్పక తానిచ్చు
పళ్ళు రాలిపోవ పరమ శివుడు
ఖరము గుర్రమేనాడు కాలేదని తెలియడా
కాకి కోకి లగుటన్నది కలవార్తని తలవడా
కపట పూజనములు చేయ గళరకంఠు డెరుగడా
తగిన కర్మ ఫలమునిచ్చి దండన విధియించడా!
అంతులేని ఆశలతో, కోరరాని కోర్కెలతో, సూక్ష్మములో మోక్షమొసగు సులభమైన
పూజలతో, ఆదేవుని మభ్యపెట్టుటధికమైన ప్రయాసే! అది కేవలము పాము సగము
నోటకరచిన కప్ప ఎదుట కనిపించే పురుగును మింగే ప్రయత్నము చేసిన విధముగా
వుంటుంది.
అందుకే గీతాచార్యుడు సత్కర్మాచరణ యూధమునకు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 2 - 47।। అని చెప్పినాడు.
శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ
ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు
మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. అట్టి వానికి
మరణానంతరము భగత్ సాయుజ్యము దొరుకుతుంది.
अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।
देहान्ते तव सायुज्यं देहि मे पार्वतीपते ॥
हे परमेश्वर ! मुझे सहजतासे मृत्यु , दैन्य रहीत जीवन और देहांतके पश्चात आपसे सायुज्य (अथवा एकरूपता )
देनेकी कृपा करें !
'सहजतासे मृत्यु' की सुंदर व्याख्या महामृत्युजंय मंत्रमके द्वितीय पंक्थी में मिलती है”
“उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||"
पकी हुई ककडी, खरबुजा या पके फल जैसे अपनी डंठल से- टहनी से अपने आप अलग होते है वैसे
मनुष्य का नैसर्गिक आयुर्मान शतक पुर्ण, माने अपने पूरा इस जीवन का कर्मा बंधन छूटनेके बाद,
पहले नही , अवधीपुर्व - समय के पुर्व ही अपघात, रोग या आपत्ती से अचानक यातनामय मरण ना दे
प्रभु !
विना दैन्येन का आशय भी गहरा है | दीनता में कई बाते अभिप्रेत है | केवल दारिद्र्य ही नही | जैसे मैं किसीका सहारा लेकर लाचार बनकर अपना जीवन यापन ना करूँ | वृद्धावस्थामें खाना-पिना, चलना -फिरना चरितार्थ के लिए दीन ना बनुँ | अतिंम क्षण तक स्वतंत्रता से जी सकु ऐसा आशीर्वाद मुझे देना !
सायुज्य परमेश्वर से एकरूपता पुर्णरूपेण समा जाना है | यही हर भक्त की मुक्ती की आकांक्षा रहती है | 'हिंदीखोज़' शब्दकोष में मिला इसका विवरण देखीये :
सायुज्य. किसी में मिलकर उसके साथ एक होने की अवस्था या भाव। इस प्रकार पूरी तरह से मिलना कि दोनों में कोई अंतर या भेद न रह जाय। पूर्ण मिलन। २. पाँच प्रकार की मुक्तियों में से एक प्रकार की मुक्ति ...
anāyāsena maraṇaṃ vinā dainyena jīvanam ।
dehānte tava sāyujyaṃ dehi me pārvatīpate ॥
Death without exertion, life without affliction, your proximity (attainment of your abode) upon leaving the body - grant me these, O husband of Pārvati!
Upon being asked 'what do you want?’ there may be a plethora of wishes one wants to ask for. A big house, a bigger bank balance, plentiful youth, good children, lots of friends, good health and the list can be endless!
But, the author of this verse has very simple, yet profound and eternal wishes to ask for!
No matter how many riches one is showered with if he is enduring a painful existence in his body, who would not want to be liberated from that pain?! The best ambiences and the greatest food will prove repulsive for someone who is suffering from pain of any kind - it could be physical pain, being on life support, etc., or a mental affliction as well. Everyone wants to live a fruitful and satisfying life and pass away peacefully without much effort, exertion or toil. This is certainly something to pray for!
While living, there can be multitudes of scarcities - there are places where there is not enough drinking water, enough food to eat or a shelter to sleep under. Such scenarios are not pleasant and one would want to be released from the affliction of any kind of poverty. This is surely something to pray for so that goals can be pursued without strife.
Throughout our lives, we are taught to engage in good deeds so that we are liberated from the bondage of birth and death. Attaining this is the final goal for everyone. If one is granted the abode of the Lord Himself, a merger with the Lord of Pārvati and being one with Paramashiva Himself, what more would one ever want?!!
Think about it... Aren't these the aspects one should contemplate upon and ask for?!
స్వస్తి.
No comments:
Post a Comment