Saturday, 24 July 2021

అజరామర సూక్తి – 311 अजरामर सूक्ति - 311 Eternal Quote – 311

 అజరామర సూక్తి  311

अजरामर सूक्ति - 31 

Eternal Quote  311

https://cherukuramamohan.blogspot.com/2021/07/311-311-eternal-quote-311.html

 अकृत्वा पौरुषं या श्रीः विकासिन्यपि किं तया ।

जरद्गवोऽपि चाश्नाति दैवादुपगतं तृणम् ॥ - सुभाषितरत्नभाण्डागार

అకృత్వా పౌరుషం యా శ్రీః వికాసిన్యపికిం తయాl

జరద్గవోపి చాశ్రాతి దైవాదుపగతం తృణం ll

అప్రయత్నముగా లేక అదృష్టవశమున సంపద సిద్ధించుట అన్నది, ఒకముదుసలి ఎద్దుకు అప్రయత్నముగా లభించే మేత వంటిది.

       అదృష్టము మాత్రమే ఒకరి సంపద యొక్క హేతువు కాకూడదు! సంపద అన్నది ప్రయత్నము లేకుండా వృద్ధి చెందుతుంటేదానిని గురించి గొప్పగా తలచుకొనవలసినది, తెలుసుకొనవలసినది,ఏమీ లేదు. వారసత్వముగా వచ్చిన సంపద వల్ల గానీ లేదా ‘భాగ్య యోగము’ (Lottery) వలనగానీ కష్టమే లేకుండా సంపాదించిన సంపద వ్యక్తికి ఎటువంటి గౌరవమూ ఆపాదింపజేయదు. కష్టపడకుండా సంపాదన కలుగుటచే, వ్యక్తికి ఆ సంపద యొక్క విలువ తెలిసే అవకాశము కొరవడుతుంది. అట్టితరి, అతడు తన హృదయాన్ని స్వకీయ హితమునకు గానీ, సమాజ శ్రేయస్సుకు గానీ ఉపయోగించలేడు.  

‘ఇహము పరము లేని మగడు ఇంటి నిండ, రుచి పచి లేని కూర చట్టినిండ’ అన్న చందమే ఆధనము.

వళ్ళు వంచి తాను పనిచేయబోవక

సంక్రమించి నట్టి సంపదలను

అజగరమ్ము ఓలె అలయక కాపున్న

ఏమి వచ్చు తనకు ఏమి తెచ్చు

ఒక ముదుసలి ఎద్దు అనుకోకుండా లభ్యమైన గడ్డిని మేస్తుంది. ఆ మేత సంపాదించుటలో ఎద్దు చేసిన ప్రయత్నమేమియు లేదు. కష్టపడుటకు ఇష్టపడని వాడు నష్టము లేని ముదనష్టపు సంపాదన కోరుకొనుటయే గాక దానిని వితరణగా ఖర్చు కూడా పెట్టక పాము వలె, తాననుభవించలేక, పరులను అనుభవించ నీక, కాపు కాచుతూ జీవితమును గడిపివేస్తాడు.

కష్టపడినిజాయితీగాశ్రద్ధగా పనిచేసేవాడు మాత్రమే తన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోసము పాటుబడి, ప్రజలచే ప్రశంసించబడతాడు.

ఈ వాస్తవమును గుర్తుంచుకొని నడుచుకొంటే ఆవ్యక్తి పరమాత్ముని అనుగ్రహమునకు పాత్రుడౌతాడు.

अकृत्वा पौरुषं या श्रीः विकासिन्यपि किं तया ।

जरद्गवोऽपि चाश्नाति दैवादुपगतं तृणम् ॥ - सुभाषितरत्नभाण्डागार

क्या होगा अगर किसी का धन उसके प्रयास के बिना खिल रहा हैयहाँ तक कि एक बूढा बैल भी 

संयोग से उपलब्ध होनेवाली घास को चर सकता है!

किसी के धन की समृद्धि के पीछे भाग्य ही एकमात्र प्रेरक शक्ति नहीं होनी चाहिएयदि उसका धन 

बिना प्रयास के फल-फूल रहा हैतो इसमें कोई बड़ी बात नहीं है। हो सकता है कि उसे प्रचुर मात्रा में 

विरासत में मिला हो या उसका कोई  लाटरी खुली हो। लेकिन अगर वह कडी मेहनत नहीं कर रहा है

अपने और समाज की भलाई के लिए अपना दिल और आत्मा समर्पित नहीं कर रहा हैतो उस समृद्धि 

का कोई फायदा नहीं है!

कवि कहता हैएक बूढा बैल भी उस घास को चरेगा जो संयोग से 'उपलब्धहो जाती है। उस भोजन 

को 'कमाईकरने में बैल के प्रयास के लिए कोई तालियाँ नहीं बजतेयही बात किसी ऐसे व्यक्ति के 

लिए भी लागू होती है जो अपनी संपत्ति को बढाने के लिए कोई प्रयास नहीं करता है

केवल वही जो कडी मेहनत करता है और साथ ही ईमानदारी और लगन से काम करता हैउसकी 

समृद्धि के लिए प्रशंसा की जाती है। किसी की संपत्ति और धन उसके प्रयासों से ही समृद्ध होना चाहिए 

 कि केवल भाग्य या संयोग से!

aktvā paurua yā śrīḥ vikāsinyapi ki tayā 

jaradgavo'pi cāśnāti daivādupagata tṛṇam  subhāṣitaratnabhāṇḍāgāra

What if one's wealth is blossoming without his effort? Even an old bull can 

graze the grass that becomes available by chance!

Luck shouldn't be the sole driving force behind the prosperity of one's wealth! 

If his wealth is flourishing without effort, there is nothing great about it. He 

might have inherited abundantly or his investments might be reaping 

tremendous benefits. But if he is not putting in hard work, dedicating his heart 

and soul towards the betterment of himself and society, that prosperity is to 

no great avail!.

The poet says, even an old bull will graze the grass that becomes 'available' by chance. No applause required for the bull's effort in 'earning' that meal! Same holds true for someone who put in no effort towards thriving his assets or flourishing his property.

Only he who strives hard as well as works honestly and diligently gets to be 

lauded for his prosperity. One's assets and wealth should prosper only due to 

his efforts and not just due to mere luck or chance!

స్వస్తి.

No comments:

Post a Comment