Monday, 5 July 2021

అజరామర సూక్తి – 293 अजरामर सूक्ति – 293 Eternal Quote – 293

 అజరామర సూక్తి  293

अजरामर सूक्ति  293

Eternal Quote  293

अन्तःसारविहीनानाम् उपदेशो न जायते ।

मलयाचल संसर्गात् न वेणुश्चन्दनायते ॥ 10-08 - चाणक्य नीति

అన్తఃసారవిహీనానాముపదేశో న జాయతే ।

మలయాచలసంసర్గాన్న వేణుశ్చన్దనాయతే ॥ 10-08 - चाणक्य नीति

మలయాచల సంపర్కము కలిగినంత మాత్రాన అనగా మలయాచాలము శ్రీగంధ 

వృక్షములకు ప్రసిద్ధి. ఆ పర్వతములో వెదురు చేట్టు పెరిగినంత మాత్రాన అది 

ఎవిధముగానైతే చందన వృక్షము కాలేదోఅదేవిధముగా అంతఃసారము అనగా లోపల 

సరుకు లేనివానికి ఆ చేవ అనగా చేయవలెనను పట్టుదల అన్నది స్వతఃసిద్ధమే కానీ 

వేరేచట నుండీ రాదు. నేను వేరాసిన ఈ పద్యమునొక పరి పరికించండి.

పాలతోడ బొగ్గు పట్టి కడిగినచో

తరగబోదు నలుపు తగ్గు బొగ్గు

గుణవిహీను కెంత గురుతుగ నేర్పినా

ఫలము నందలేడు పనికి రాడు

జాగ్రత్తగా గమనించినామంటే సాంగత్యము వల్ల సర్వస్వము చేకూరదు. 

అంతర్గతముగా తనదగు స్వభావము వయసుతోకూడా రానట్లయితేఒక 

సత్పురుషునితో కేవలము ఏర్పరచుకొన్న సాంగత్యమువల్ల ఎటువంటి ముద్ర ఏర్పడదు. ఇక్కడ కవి ఉపయోగించే ఉదాహరణ ఏమిటంటే  శ్రీగంధ వృక్షములకు నెలవైన 

మలయాచలమున పెరిగే వెదురు చెట్టుకు, ఆ చెట్ల సముదాయములో ఉన్నంత మాత్రాన 

శ్రీగంధ భూరుహ లక్షణములు తనవిగా చేసుకోనలేదు కదా!

ఇదే విషయమును ఒకపరి మానవుల స్థాయిలో చూస్తేఒక పిల్లవాడు పండితుడి వద్దకు 

చేరి అతని ఉపన్యాసమును విన్నంత మాత్రమున ఆభాషణను ఆకళింపు చేసుకోనలేడు 

కదా! కారణమేమిటంటే ఆ బాలకునికి పండితుని భావనలను గ్రహించగలిగే  పరిపక్వత 

లేదు. ఆ బాలుడు ప్రయత్నించినాఅవి ఫలించవు. అదేవిధముగామానసిక నీతి వర్తన 

లేని వారికి సలహా ఇవ్వడంలో అర్థం లేదు. శారీరక ఎదుగుదల తప్పక ఆధ్యాత్మిక 

మరియు మానసిక ఎదుగుదలకు భిన్నంగా ఉంటుంది. ఇతరులు ఇచ్చిన జ్ఞానాన్ని 

స్వీకరించడానికి సంసిద్ధత లేని వ్యక్తికి బోధించే ప్రయత్నము వ్యర్థము.

మన మానసిక వనరులను పరిరక్షించుకొంటూ. మన శక్తిని ఎంత వరకు, ఎందుకు 

ఖర్చు చేయాలో తెలుసుకొన్న తరువాతనే విషయగ్రహనకు ముందడుగు వేయాలి. 

అంతేకానీ శక్తికి మించిన పనులను చేపట్టవద్దు.

अन्तःसारविहीनानाम् उपदेशो न जायते ।

मलयाचल संसर्गात् न वेणुश्चन्दनायते ॥ - चाणक्य नीति

जो आंतरिक पदार्थ से रहित हैं उन्हें सलाह देने का कोई मतलब नहीं है। मलाया पर्वत की संगति में बांस नहीं बनता चंदन!

कई बारसंगति ही सब कुछ नहीं होती है। यदि एक आंतरिक प्रकृति पहले से मौजूद नहीं हैतो 

सांगत्य जो रखती है वह उसके व्यक्तित्व में सेंध नहीं लगाएगी। कवि उदाहरण का उपयोग करता 

है - सिर्फ इसलिए कि मलय पर्वत पर बांस का एक अंकुर उगनेसे (जिसमें चंदन के पेड़ों की प्रचुर 

आबादी होती है)यह इसे चंदन के गुणों को प्राप्त नहीं करसकता है!

यदि अधिक तुच्छ स्तर पर देखा जाए तो सिर्फ इसलिए कि एक बच्चा एक शोध विद्वान की संगति 

रखता हैवह अपने व्याख्यान के एक शब्द को नहीं समझ पाएगा। विद्वान जिन अवधारणाओं के 

बारे में बात कर रहे हैंउन्हें समझने के लिए बच्चे में एक निश्चित परिपक्वता का अभाव है। वह 

कितनी भी कोशिश कर लेउसकी मेहनत बेकार जाएगी। इसी तरहउन लोगों को सलाह देने 

का कोई मतलब नहीं है जो आंतरिक लोकाचार से रहित हैं। शारीरिक रूप से बढ़ना निश्चित रूप 

से आध्यात्मिक और भावनात्मक रूप से बढ़ने से अलग है। यदि दूसरों के द्वारा दिए गए ज्ञान को 

ग्रहण करने की पूर्व तत्परता न होतो ऐसे व्यक्ति को सिखाने का प्रयास व्यर्थ है।

अपने संसाधनों का संरक्षण करें। जानिए कब अपनी ऊर्जा किस परकितना और क्यों खर्च करनी 

है। ऐसी जगह निवेश न करें जहां मामले का सार समझ में न आए।

antasāravihīnānām upadeśo na jāyate 

malayācala sasargāt na veuścandanāyate ॥ - cāṇakya nīti

No point advising those who are devoid of inner substance. Bamboo does not 

become sandalwood in the company of the Malaya Mountain!

Many times, company isn't everything. If an intrinsic nature is not already there, 

the company one keeps won't put a dent in his persona. The example the poet 

uses is - just because a shoot of bamboo grows on the Malaya mountain (which 

bears an abundant population of sandal trees), it doesn't qualify it to acquire the 

qualities of sandalwood!

If seen on a more trivial level, just because a child keeps the company of a 

research scholar, he will not be able to understand a word of his lecture. The 

child lacks a certain maturity to grasp the concepts the scholar is talking about. 

No matter how hard he tries, his efforts shall go futile. Similarly, there is no point 

advising those who are devoid of inner ethos. Growing physically is certainly 

different from growing spiritually and emotionally. If that prior readiness to 

receive the knowledge given by others is missing, then the effort in teaching 

such a person is futile.

Conserve your resources. Know when to spend your energy on who, how much 

and why.  Do not invest in a place where the gist of the matter cannot be 

grasped.

స్వస్తి.

****************************************

No comments:

Post a Comment