अजरामर सूक्ति – 295
Eternal Quote – 295
अनवस्थितकार्यस्य न जने न वने सुखम् ।
जने दहति संसर्गः वने सङ्गविवर्जनम् ॥ 13-16 - चाणक्य नीति
అనవస్థితకార్యస్య న జనే న వనే సుఖమ్ ।
జనో దహతి సంసర్గాద్వనం సఙ్గవివర్జనాత్ ॥ 13-16 – చాణక్య నీతి
పరిపక్వత లేని మరియు క్రమ శిక్షణ లేని వారికి, ప్రజల మధ్యనున్నా లేదా అడవిలో
ఉన్నా చిత్త శాంతి కరువే! ఒక సారి నేను వ్రాసిన ఈ పద్యమును చూడండి.
మరిగియున్న కాఫీ కరిగిన ఐస్క్రీము
ఉడికి ఉడకనట్టి ఉప్మ మరియు
ఉప్పు నీటి గ్లాసు ఉండిన ఏతీరు
ఆకలైన వాని ఆర్తి దీరు
ఇక్కడ కాఫీ ని కాఫీ గా తీసుకోక చిత్తవృత్తిగా తీసుకొండి. వేడి అనగా ఆవేశము
అధికమైన ఆలోచనలు అనర్థ హేతువులు, ఉడికీ ఉడకని ఉప్మా అంటే అసంపూర్ణమైన
ఆలోచనా విధానము ఎందుకూ కొరగాదు. సక్రమమైన దారి చూపలేని వ్యక్తి చెంత
ఉండీ ఉపయోగములేదు. అట్టి వాడు ఉప్పునీటితో సమానమే!! అట్టి పరిస్థితిలో ఒకవ్యక్తి స్థిమిత మైన ఆలోచన లేక అభిప్రాయమును ఏర్పరచుకోలేడు. తానూ స్వతంత్రముగా ఆలోచన చేసి తన లోపములు సవరించుకొని తగిన మార్గమును వెదుకుకొనగలిగితే స్థిర చిత్తుడై ధ్యేయము కలిగిన వాడై సంఘములో నైనా వనములో నయినా తన లక్ష్యమును సాధించగలడు.
కేవలము ప్రజల మధ్య ఉంటూ తిని తిరుగుటచే అసలు లక్ష్యమే ఏర్పడదు. తగిన
దిశానిర్దేశకుడు ఎంతో అవసరము. ఒకవేళ అట్టి మట్టి బుర్రతో అడవి చేరినా
మనసంతా గొడవే!
బంధువుల మధ్య ఇంద్రభవనములో లేదా స్వయంగా అరణ్యములో నివసించవచ్చు.
మనస్సు క్రమబద్ధీకరించబడకపోతే, అతను ఎక్కడ నివసిస్తున్నాడో లేదా ఎవరితో
నివసిస్తున్నాడో అన్నది ఏమాత్రమూ ఉపయోగపడదు. ప్రజల మధ్య నివసించేటప్పుడు,
వారి సాంగత్యము, వారిలో సచ్ఛీలము, సాదువర్తనము లేకుంటే, అతనికి కష్టాలను
తెస్తుంది. అతను ధనవంతుడై నలుగురితో ఉంటే అయస్కాంతమయి అందరినీ
ఆకర్షించుతాడు. అది అతనికి ఇబ్బందులను కొనితెచ్చేదే కానీ ఆత్మశాంతినివ్వదు.
అతను అన్నింటినీ వదులుకుని, వనములకు పారిపోతే, సాంగత్య లేమి అతనికి
దుఃఖాన్ని తెస్తుంది. అతను ఎక్కడా శాంతితో ఉండ లేడు!
అటువంటి దుస్థితిని నివారించవలెనంటే తనకొక ధ్యేయము, అందుకు తగిన స్వంత
ఆలోచనలు, వనరులు, పరిసరాలు మరియు నిర్దుష్ట కార్యాచరణ పథకము
ఏర్పరచుకొనుట అత్యవసరము. విద్యుత్తు ను బుద్ధితో పోలిస్తే అది ఎంతో
ప్రయోజనకరము, సక్రమమైనరీతిలో విద్యుత్ గ్రాహకములగు దీపములు, పంఖాలు, శీత
కరండములు (FRIDGE), వాతానుకూలములు (Air Conditioners) మొదలగునవి
నిష్ప్రయోజనముగా ఉపయోగించితే, ఉత్పాదకతకు అర్థమే లేకుండా పోతుంది.
అతిశయముగా ఉపయోగించుట, అజాగ్రత్త, నిర్లక్ష్యములవలన విద్యుత్ ఘాతమునకు
కూడా గురికావలసి రావచ్చును. అదే విధముగా మన చిత్తము కూడా సవ్యమగు రీతిలో
ఉపయోగించక పక్కదారులు తొక్కితే అది ప్రాణాంతకము కూడా కావచ్చును.
జీవితంలో వ్యవస్థీకృత ప్రభావం అటువంటిది. అందుకే వేదము ‘ఆనో భద్రాః క్రతవో
యంతు విశ్వతః’ అని ఆదేశించింది. అంటే దశ దిశల నుండి సద్భావనా తరంగములు
మాచుట్టూ ప్రసరించుగాక అని ఆదేశించుతూ ఉంది. ఇది ఒక వ్యక్తిని ఉన్నత
శిఖరమునకు చేర్చుటకు ఎంతగానో దోహదపడుతుంది. జీవితమును
సంతృప్తికరముగా సాగించుటకు కూడా సాయపడుతుంది.
వ్యవస్థీకృతమగు మనస్సు, అందు సదాలోచనలు కలిగియుండుట ఎంతో అవసరము.
अनवस्थितकार्यस्य न जने न वने सुखम् ।
जने दहति संसर्गः वने सङ्गविवर्जनम् ॥ 13-16 - चाणक्य नीति
अशांत/अव्यवस्थित लोगों के लिए न तो लोगों के बीच कोई आराम है और न ही जंगल में। लोगों के बीच, संघ सतर्क करता है; जंगल में, इसकी कमी!
दोस्तों और रिश्तेदारों के बीच एक महलनुमा बंगले में रहनेसे वह ऐश आराम, सुख चैन नहीं
देसकती. वह तो केवल क्षणिक होताहै l वह सुख अव्यय नहीं है l जंगल में अकेले रह सकते हैं। लेकिन अगर मन व्यवस्थित नहीं है, तो यह कोई मायने नहीं रखता कि वह कहाँ रहता है या किसके साथ रहता है। लोगों के बीच रहते हुए, उनकी साहचर्य उन्हें दुख ही देती है। क्यों कि उनके मनोगत भावनाएं सुस्थिर नहीं है l उसे हृदय से कोइ विशिष्ट दिशा निर्देशन कुछ करनेकेलिए नहीं मिलरहा है l लोगों के साथ होने पर वह चुंबकीय रूप से परेशानी को आकर्षित करता है। अगर वह सब कुछ छोड़ देता है और किसी आदमी की भूमि पर भाग जाता है, तो उसकी सांगत की कमी उसे दुःख देती है। उसे कहीं चैन नहीं है!
इस तरह की दुर्दशा से बचने के लिए अपने स्वयं के विचारों, परिवेश और कार्यक्रम को व्यवस्थित करना हमेशा एक शानदार तरीका है। बिजली वास्तव में सिर्फ संगठित बिजली है! अगर यह हर जगह बेतरतीब ढंग से प्रहार करता रहता है, तो यह उत्पादक नहीं हो सकता। जब इसे बिजली के रूप में व्यवस्थित किया जाता है, तो इसमें कई काम करने की क्षमता होती है। अगर बिजली से टीक तरह से बर्ताव नहीं करते हैं तो वह प्राण घाथुक बी होसकता है l ऐसा ही किसी के जीवन में संगठित होने का प्रभाव होता है। यह किसी को ऊंचाइयों तक पहुंचने में मदद कर सकता है और उसे जीवन में भी संतुष्ट रख सकता है।
एक संगठित दिमाग/विचार होना महत्वपूर्ण है!
anavasthitakāryasya na jane na vane sukham ।
jane dahati saṃsargaḥ vane saṅgavivarjanam ॥ 13-16 - cāṇakya nīti
For the unsettled/disorderly, there is no solace amidst people nor in the forest. Amidst
people, association cauterizes; in the forest, the lack of it!
One can live in a palatial bungalow amidst kith and kin, or by himself in the wilderness
of the forest. But if the mind is not organized, it is immaterial where he lives or with
whom he lives. When living amidst people, their company brings him misery. He
magnetically attracts trouble when with people. If he gives up everything and runs away
to a no man's land, then the lack of it (the company) brings him sorrow. He is not at
peace anywhere!
Organizing one's own thoughts, surroundings and schedules is always a great way to
avoid such a plight. Electricity is really just organized lightning! If it just keeps striking
everywhere randomly, it cannot be productive. When it is organized as electricity, it has
the potential to do many things. Similar is the effect of being organized in one's life. It
can help one reach heights and keep him contented in life as well.
Having an organized mind/thoughts is key!
స్వస్తి.
No comments:
Post a Comment