https://cherukuramamohan.blogspot.com/2021/07/303-303-eternal-quote-303.html
वित्तं बन्धुर्वयः कर्म विद्या भवति पञ्चमी ।
एतानि मान्यस्थानानि गरीयो यद्यदुत्तरम् ॥ - मनुस्मृति
విత్తం బందుర్వయః కర్మ విద్యా భవతి పంచమీ l
ఏతాని మాన్య స్థానాని గరీయో యద్యదుత్తరం ll
సంపద, దగ్గరి బంధువులు, ఒక వ్యక్తి వయస్సు, అర్ధవంతమైన కార్యాచరణ మరియు జ్ఞానం ఈ 5 సమాజంలో ఒక వ్యక్తికి గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చే అంశములు ఇవి కలిగినవారు పూజనీయులు.
ఈ ఐదుగుగుణములలో జ్ఞానం ఉత్తమమైనది. నిజమే! కానీ దాని అర్థము తక్కిన నాలుగు గుణములు కలిగిన వారిని అగౌరవపరచుట కాదు.
1. ప్రపంచము ధనార్జనకు పెద్దపీట వేస్తుంది, అందుచే అది సంపాదనా మార్గమునకు ప్రాధాన్యతనివ్వదు. అందువలన, ధనవంతులు గౌరవించబడతారు. ఒకసారి ఈ విషయమును గమనించండి. ఈ శ్లోకము శ్రీరాముని ఉద్దేశించుతూ చెప్పబడినది. ఇది రామాయణములో ఉందా లేదా అన్న వివాదములోనికి పోకుండా ఇందలి అర్థమును పరిశీలించుదాము.
ధన మార్జాయ కాకుత్స
ధన మూల మిదం జగత్l
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్యచll
ధనం లేనివాడు చచ్చిన వానితో సమానం. అందుకే ప్రపంచ గమనానికి మూలమైన ధనం ఆడ మగ తేడా లేకుండా సంపాదించుకోవాలి. అట్లని ఆడవారు ఉద్యోగములకు పోయి సంపాదించవలెనని కాదు. ఇంటిపట్టున ఉంటూ పొదుపు చేసి కూడా మిగిల్చవచ్చును. చిన్న కుతీరపరిశ్రమతో కూడా సంపాదిన్చావచ్చును. ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక స్వాతంత్ర్యం మనిషికి కొండంత అండ. మాతృమూర్తులు మాతృత్వాన్ని ఎన్నో కోణాలనుండి ప్రదర్శించి మన పిల్లలకు పాత కొత్తల మేలు కలయికగా వారి జీవితాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. .
2. మంచి బంధువును కలిగి ఉండటం మరింత గౌరవాన్ని తెస్తుంది - వారికి
ఎక్కువ డబ్బు లేకపోయినా. పంచతంత్రములో ఈ విధముగా చెప్పబడినది.
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రిపు సంకటే l
రాజద్వారే స్మశా నేచ యాస్తి ష్టతి స బాంధవః ll
శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు, వ్యసనములకు బానిస అయినపుడు కూడా అతనిని అనుసరించి దారి మరల్చుటకు, కష్టములు చుట్టుముట్టినప్పుడు శత్రువుల పలు విధముల కష్టపెట్టునపుడు ,అధికారుల సమక్షమునంద తోడుగా ఉండి మాటలలో పొరబాట్లు దొరలకుండా చూసుకొనుటకు,, మరణాది దుఃఖము తటస్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే నిజమైన బంధువుడు.
3. ఒక వ్యక్తికి డబ్బు ఉందా లేదా అతడు తోడు నీడగా ఉండే బంధువా కాదా అనేదానికంటే ఎదుటి వ్యక్తి వయసులో పెద్దవాడయితే సదా సర్వదా గౌరవనీయుడే! భీష్మద్రోనాదులు కౌరవ పక్షమున ఉన్నా, పాండవులచే గౌరవింపబడినారు.
4. నడవడిక గౌరవప్రదంగా ఉంటే, అతని ఆర్థిక స్థితి, అతని బంధువు లేదా అతని వయస్సు తో సంబంధము లేకుండా గౌరవించవలెను. సురేశ్వరాచార్యులవారు ఆదిశంకరులకన్నా 25 సంవత్సరముల పైచిలుకు పెద్దవారాయి కూడా శంకరులవారి శిష్యులైనారు.
5. సంపద, బంధువులు, వయస్సు లేదా పని అన్నీ లేకున్నా, ఒకవ్యక్తి తన జ్ఞానము మరియు పాండిత్యము చేత గౌరవించబడుతాడు.
అందువల్ల, విద్య (జ్ఞానం) అనేది ఒక నిజమైన అలంకారం, ఇది అత్యంత విలువైన స్వాధీనంగా భావించబడుతుంది.
वित्तं बन्धुर्वयः कर्म विद्या भवति पञ्चमी ।
एतानि मान्यस्थानानि गरीयो यद्यदुत्तरम् ॥ - मनु स्मृति (2\136)
धन संपत्ति, सगे संबन्धी , आयु , किये हुए सत्कर्म , और विद्या , ये पांच स्थान (साधन ) ही मनुष्य को
प्रतिष्ठा (सम्मान) दिलाने के साधन हैं | ये क्रमशः एक दूसरे से श्रेष्ठ हैं ,अर्थात धन की तुलना में
संबन्धी, संबन्धी की तुलना में मनुष्य की आयु और अन्ततः विद्वत्ता ही सर्वश्रेष्ठ है |
1. दुनिया का तरीका पैसे को महत्व देना है, चाहे कमाने की तरीखा सही हो या गलत। बदले में, जिस
व्यक्ति के पास धन होता है वह मूल्यवान होता है। इसलिए धनवानों का सम्मान किया जाता है।
2. लेकिन फिर, अच्छे परिजन होने से और भी सम्मान मिलता है - भले ही उनके पास ज्यादा पैसा न
हो।
उत्सवे व्यसने चैव दुर्भिक्षे राष्ट्रविप्लवे
राजव्दारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः || पंचतंत्र
बन्धु कौन है ? " उत्सव के समय ,बुरे समय में ,दुर्भिक्ष अर्थात अकाल पड़ने के समय में ,राष्ट्र में उपद्रव
होने के समय में ,राजदरबार में ,श्मशान में जो साथ रहता है ,वही बन्धु है ,वही भाई हैऔर वही मित्र है l " |
3. किसी के पास पैसा हो या न हो, सम्मानजनक परिजन हों या न हों, व्यक्ति को उसकी उम्र का
सम्मान दिया जाता है। बड़ों का हमेशा सम्मान किया जाना चाहिए ।
4. यदि किसी के कार्य सम्मानजनक हैं, तो न तो उसकी आर्थिक स्थिति, उसके परिजन और न ही
उसकी उम्र तस्वीर में आएगी। उनके काम या कार्यों के लिए उनका सम्मान किया जाएगा।
5. हालांकि, सभी का सबसे सम्मानित मूल्य एक अच्छी शिक्षा है। एक सुशिक्षित व्यक्ति का बहुत
सम्मान होता है और उसकी अन्य संपत्ति अस्पष्ट हो जाती है। उसकी संपत्ति, रिश्तेदार, उम्र या काम
सभी अप्रचलित हो जाते हैं और वह केवल अपने ज्ञान और शिक्षा के लिए सम्मानित होता है।
इसलिए, विद्या (ज्ञान) एक सच्चा श्रंगार है जो सबसे बेशक कीमती संपत्ति है।
vittaṃ bandhurvayaḥ karma vidyā bhavati pañcamī ।
etāni mānyasthānāni garīyo yadyaduttaram ॥ - manusmṛti
Wealth, close relatives, age of a person, meaningful activity and knowledge,
these 5 are the factors that bestow respect and honorable position to a person
in the society and these factors are respectively more and more venerable.
(Knowledge being the best among all five.)
1. The way of the world is to value money, no matter if it is right or wrong. In turn,
the person who possesses the money is valued. Therefore, the wealthy are
respected.
2. But then, having good kin brings even more respect - even if they don't have
much money.
3. Whether one has the money or not, whether one has respectable kin or not, a
person is given respect for his age. Elders are always respected, no matter what.
4. If one's actions are respectable, then neither his financial status, his kin nor his age
will come into the picture. He will be respected for his work or actions.
5. However, the most respected value of all is a good education. A well-educated
person is highly respected and his other possessions become obscure. His wealth,
relatives, age or work all become obsolete and he is esteemed for his knowledge
and education alone.
Hence, vidyā (knowledge) is the one true adornment that upholds as the most
prized possession.
స్వస్తి.
No comments:
Post a Comment