Saturday, 17 July 2021

అజరామర సూక్తి – 304 अजरामर सूक्ति – 304 Eternal Quote – 304

 అజరామర సూక్తి – 304

अजरामर सूक्ति – 304

Eternal Quote – 304

यस्मिन् देशे  सम्मानो  प्रीतिर्न  बन्धवाः ।

  विद्यागमः कश्चिन्न तत्र नैक दिनं वसेत् ॥ - हितोपदेशमित्रलाभ

https://cherukuramamohan.blogspot.com/2021/07/305-305-eternal-quote-305.html

యస్మిన్ దేశే న సమ్మానో న ప్రీతిర్నచ బాంధవాః l

న చ విద్యాగమః కశ్చిత్ తత్ర నైక దినం వసేత్ ll  హితోపదేశము మిత్రలాభము

గౌరవము నివ్వతెలియని

పరికింపగ ప్రేమలేని పరిజనచయమున్  

గురి గూర్చలేని గురువును

మరి కలిగిన ఊరనుంట మానుము రామా!

పైశ్లోకమునకు అర్థము పద్యరూపములో మీముందు ఉంచినాను. అర్థము 

సులభగ్రాహ్యము. అసలు పై శ్లోకమునకు మూలము ఆర్య చాణక్యులవారి ఈ క్రింది 

శ్లోకము.

యస్మిన్‌ దేశే న సమ్మానో సవృత్తి ర్న చ బాంధవాః |

 న చ విద్యా--గమః కశ్చిత్‌ తం దేశం పరిపర్జయేత్‌ || 8

 ఏ ప్రదేశములో ఆదరాభిమానములుండవోజీవనము జరుగదో, బాంధవులుండరో,

ఏదైన విద్యాప్రాప్తి గలుగదోఅట్టి ప్రదేశమును విడిచిపెట్టవలెను.

మరి దానిని వదిలితే ఎటువంటి ఊరిలో ఉండవలేనో ఈ దిగువ శ్లోకములో 

చెప్పుచున్నారు.

ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః |

 పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివసం వసేత్‌ || 9

 ధని విప్ర ధర్మరాజులు

గన జీవము గల్గునదియు గాంచగ వెజ్జున్

మనుచున్న ఊరనుండుము

మనకుండిన విడుము దాని మంగళ రామా!

 ధనవంతుడువేదజ్ఞుడైన బ్రాహ్మణుడుధార్మికుడున్యాయ శీలుడైన రాజు

వ్యవసాయమున కుపయోగించు నదియుఐదవ వాడైన వైద్యుడునను న్టి అయిదు 

లేనిచోట నొక్కరోజైనను నుండరాదు.

ఇక్కడ దొరికిన అవకాశమును అంది పుచ్చుకొని, ముఖ్యముగా శ్రోత్రియము అన్న 

శబ్దమునకు కాస్త వివరణ నిస్తాను. ధనికః = ఆవశ్యకమైనపుడు ఋణమిచ్చు 

ధనికుడుండవలెనుశ్రోత్రియః = జనులకు ఉపదేశము చేసి సన్మార్గమున నడుపుటకు 

వేదజ్ఞుడైన బ్రాహ్మణుడుండవలెను. బోధాయన గృహ్యసూత్రములలో శ్రోత్రియ శబ్దమున 

కిచ్చిన నిర్వచనము - బ్రాహ్మణేన బ్రాహ్మణ్యా ముత్పన్నః ప్రాగుపవయనా జ్ఞాతః ఇత్యభి 

ధీయతేః - బ్రాహ్మణుని వలన బ్రాహ్మణియందు పుట్టినవాడు ఉపనయనమునకు 

పూర్వము 'జాతు'డు అనబడును. 'ఉపనీత మాత్రో వ్రతానుచారీ వేదానాం కించి దదీత్య 

బ్రాహ్మణఃబ్రహ్మచర్యాది వ్రతముల పాలించువాడునుయజ్ఞోపవీతము 

ధరించినవాడును కొంత వేదపఠనముచేసిన వాడును బ్రాహ్మణు డనబడును - 

'ఏకాంశాఖా సుధీత్య శ్రోత్రియఃవేదములోని యొక శాఖను అధ్యయనము చేసినవాడు 

శ్రోత్రియు డనబడునుమరియు దానకమలాకరములో-

 ఏకాం శాఖాం సకల్పాం వా షడ్భిరంగై రధీత్య చ |

 షట్కర్మ నిరతో విప్రః శ్రోత్రియో వాసు ధర్మనిత్‌ ||

 కల్పము లేక షడంగములతో గూడిన వేదము యొక్క యొక శాఖను అధ్యయనము 

చేసి - చదువుటచదివించుటయజ్ఞము చేయుటయజ్ఞము చేయించుట

దానమిచ్చుటదానము పుచ్చుకొనుట యను షట్కర్మలయందు ఆసక్తికలిగి నిర్వహించు 

ధర్మము తెలిసిన వాడైన బ్రాహ్మణుడు శ్రోత్రియుడగును. రాజు - న్యాయము

రక్షణ కొఱకు ధార్మికుడైన రాజు ఆవశ్యకమగును. నదీ  స్నానము, త్రాగునీటి 

కొరకు,పొలము తడుపుటకు అభివృద్ధి పొందుటకు నదులుండవలెను. వైద్యుడు - 

రోగములు సంభవించినపుడు రోగనివృత్తిచేయుటకు వైద్యుడుండవలెను. పై సూక్తులు 

ముఖ్యముగా ఊర్లలో నివసించేవారికి మరియు నగరములలోని వాడలలో 

నివసించువారికి ఎంతో ఉపయుక్తము.ఈ విధముగా మహనీయులు అరటిపండు వలిచి 

నోటబెట్టినట్లు చెప్పినారు. అనుసరించితే బాగుపడుతాము.

यस्मिन् देशे  सम्मानो   वृत्तिर्न   बान्धवाः  |

  विद्यागमोSप्यस्त्ति  वासस्तत्र  कारयेत्  || - चाणक्य नीति

जिस देश में रहने पर वहां  सम्मान प्राप्त  हो ,न् कोई आजीविका (नौकरी व्यापार आदि ) की सुविधा 

हो, जहां अपने कोई भाई बन्धु नहीं रहते होंऔर जहां  विद्या प्राप्त करने  की भी कोई सुविधा  हो 

ऐसे स्थानों में कभी भी  निवास नहीं करना चाहिये |

हमें ऐसे स्थान पर ही निवास करना चाहिएजो एक साधारण दिनचर्या के अनुकूल हो और जहां वे 

सभी सुख सुविधाएं मौजूद होंएक साधारण व्यक्ति को जीवन जीने हेतु प्रेरित करें | और इसकेलिए 

कोनसा देश उपयुक्त होता है, इसके बारेमें आचार्य चाणक्य निम्न लिखित श्लोक में इस तरह बताराहे हैं l

धनिकः श्रोत्रियो राजा नदी वैद्यस्तु पञ्चमः।

पञ्च यत्र न विद्यन्ते न तत्र दिवसे वसेत्।।

 जहाँ कोई धनी रहता हो वेदपाठी विद्वान रहता हो जहाँ कोई धर्मात्मा राजा अथवा सरकार हो 

जहाँ कोई नदी हो जी से पीने केलिए, नहाने के लिए, खेतों को पानी सींचने केलिए,और जहाँ कोई 

वैद्य हो वैसे, इन पाँच स्थानों पर रहना चाहिए।

 जिस स्थान को हम घर कहते हैंउसमें केवल भौतिक सुख-सुविधाओं से बढ़कर कुछ होना चाहिए। कोई एक महलनुमा इमारत में रह सकता हैसबसे नरम बिस्तर पर सो सकता हैसोने की थाली से खा सकता है और फिर भी खुश नहीं रह सकता। घर में खुशियों की मौजूदगी के लिए एक-दूसरे के लिए सम्मान और प्यार होना जरूरी है। आस-पास अपनों का भी होना जरूरी है। (परिवार सिर्फ खून से जुडा होना नहीं है। यह सभी रिश्तेदार ही हैं जिन्हें कोई अपने दिल के करीब मानता है

हम कहीं भी होंहमें हर दिन सीखने और बढ़ने की जरूरत है। यदि व्यक्तिगत रूप से सीखने और बढ़ने का कोई रास्ता नहीं हैतो ऐसा स्थान रहने केलिए उपयुक्त नहीं होगा

यहां सीखी जाने वाली सीख यह हैअगर ऊर्ध्व लिखित चीजें उपलब्ध नहीं हैं तो घर से भागें नहींबल्कि परिस्थितियों को बेहतर बनाने की दिशा में काम करेंयह सुनिश्चित करने के लिए एक अनुस्मारक है कि एक घर एक खुशहाल जगह है जहां हर कोई एक-दूसरे का सम्मान करता हैप्यार करता हैसमझता है और एक-दूसरे को व्यक्तियों के रूप में विकसित होने देता है

बढना और सभी को फलने-फूलने देना ही खुशी की कुंजी है!

Yasmin deśe na sammāno na prītirna ca bandhavāḥ 

na ca vidyāgama kaścinna tatra divasa vaset ॥ - hitopadeśa, mitralābha

One should never stay in a Country or a place where no respect is given to him, there 

are no means of livelihood like a job, profession etc,  no relatives and friends live there 

and no facilities for studying and acquiring knowledge are available.

The place we call home should have something more than just material comforts. One 

can live in a palatial building, sleep on the softest bed, eat from a golden plate and 

still not be happy. For happiness to be present in a home, there needs to be respect and love for one another. There also needs to be dear ones around. (Family doesn't necessarily mean related by blood. It is all the kin who one considers close to their heart.)

Wherever we are, we need to learn and grow each and every day. If there is no 

avenue for learning and growing as individuals, then such a place will not be suitable 

as a home, either. The poet advises: do not live in such a place even for a single day.

The lesson to be learnt here is: don't run away from home if these things are not 

available, rather work towards making conditions better! It is a reminder to make sure 

that a home is a happy place where everyone respects, loves, understands and allows 

each other to grow as individuals.

Growing and allowing everyone to flourish is the key to happiness!

స్వస్తి.

No comments:

Post a Comment