Friday, 2 July 2021

అజరామర సూక్తి – 290 अजरामर सूक्ति – 290 Eternal Quote – 290

 అజరామర సూక్తి  290

अजरामर सूक्ति  290

Eternal Quote  290

 https://cherukuramamohan.blogspot.com/2021/07/290-290-eternal-quote-290.html

यस्तु सञ्चरते देशान् यस्तु सेवेत पण्डितान् ।

तस्य विस्तरिता बुद्धिः तैलबिन्दुरिवाम्भसि ॥ समयोचितपद्यमालिका

యస్తు సంచరతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ l

తస్య విస్తారితా బుద్ధిః తైల బిందు రివాంభసి ll

ఎవరు దేశాలు తిరుగుతారోఎవరు పండితులను సేవిస్తారోవారి బుద్ధి నీటిలో పడిన 

నూనె బిందువులా విస్తరిస్తుంది!

ఒక చిన్న నూనె చుక్క ఒక కొలనిలో వేసినామంటే అది రాను రానూ కొలనంతా 

విస్తరిస్తుంది. కొలనును ప్రపంచముతో పోలిస్తే నూనె బిందువు మానవ మేధస్సు. 

కొలనులో ఆ నూనె చుక్క పడుతూనే ఆ మేధస్సనే ఒక్క నీటిచుక్క ఎంతగా 

విస్తరిస్తుందో చూడండి.

భారతదేశమంతా తిరిగి అటువింటి విస్తృతమైన పరిజ్ఞానమును సంపాదించి ఈ 

శ్లోకమునకు సార్థకత చేకూర్చినవారు శ్రీయుతులు తిరుమల రామచంద్రగారు. వారికి 

పాదాభివందనములు.

వారు తిరిగిన దేశాలు ప్రాంతాలు సాధించిన జ్ఞాన సంపద  ఇంత అంత అని 

చెప్పనలవికాదు. అసలు ఆయన తెలుగువాడు అగుటయే మన అదృష్టము. 

బహుభాషావేత్తరచయితఅనువాదకుడుపండితుడు శ్రీయుతులు తిరుమల 

రామచంద్ర గారు. హంపీ నుంచి హరప్పా దాక అన్నది వారి ఆత్మకథ. ఆత్మకథా 

సాహిత్యంలోనే కాక తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైన రచనగా పేరొందింది.

హంపీ నుంచి హరప్పా దాక మహాపండితులుమనస్వి తిరుమల రామచంద్ర జీవితంలో 

25 శాతం కాలానికి అక్షర రూపం. రామచంద్ర పుట్టి పెరిగిన హంపీ ప్రాంతం నుంచి 

నవయువకునిగా ఆయన షుమారు 30 వయస్సులో హరప్పా శిథిలాల ప్రాంతాన్ని 

దర్శించడం వరకూ ఈ ఆత్మకథ సాగుతుంది. సంస్కృతి పట్ల అపరిమితమైన ప్రేమ

సంస్కృతి సమగ్ర స్వరూపాన్ని దర్శించేందుకు ఆయన చేసిన అన్వేషణభిన్న అనుభవాల్లో 

పొందిన జీవిత సారం వంటివి ఈ ఆత్మకథలో రామచంద్ర అందించినారు.

ఆయన దేశాటనే ఆయనను సర్వజ్ఞుని చేసింది. ఆయనకు నేను వ్రాసిన ఈ క్రింది పద్యము 

అక్షరాన్వయము.

భానుడు క్రుంగియున్ విపుల భాస్వర రేఖలు వంచబోక తా

మానక వెల్గులన్ పరచు, మాన్యులు గూడను నట్టులే సదా

జ్ఞానము లోకమంతటికి కానుకజేయుచు విశ్వమేధకున్

పానము పోతురా పరమ పావన మూర్తుల భావనల్ గనన్

కావున జ్ఞానసాధనకు విస్తృత పర్యటన ఎంతో ముఖ్యము. అందులో ఎందఱో 

పండితులను కలిసి వారికి శుశ్రూష చేయుట ద్వారా ఎంతనో జ్ఞానార్జన 

చేయగలుగుతాము.

ఈ కోవకు చెందినా మరియొక అద్భుతమైన వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్ గారు. బహుభాషాప్రవీణుడు, బహుశాస్త్ర కోవిదుడు, నిరంతర పర్యాటకుడు.  తన 11వ ఏట ఒక ఫకీరు పాడిన గేయాన్ని విని, తన మొత్తం జీవితాన్ని ఒక కొత్తదారిలో నడిపానని ఆయన తన ఆత్మకథలో రాసుకున్నాడు.

దునియాకి సైర్‌ కర్‌ కాఫిర్‌

జిందగానీ ఫిర్‌ కహాు

జిందగీ గర్‌ కుచ్‌ రహీతో

నౌజవానీ ఫిర్‌ కహు

 (ప్రపంచ పర్యటన చేయరా, మూర్ఖుడా, జీవితం ఒకేసారి లభిస్తుంది. ఆ జీవితంలో, యవ్వనం అతి చిన్నది)

ఆ గేయం విన్నతరువాత తన రెండు కాళ్లూ ఎప్పుడూ ఒకచోట నిలుపలేదంటాడు ఆయన. కాశీ విద్యాపీఠ్‌లో సంస్కృతం నేర్చుకున్నాడు. ఆర్యసమాజంలో చేరి హిందూమత వ్యాప్తికి కొన్నాళ్లు కృషి చేశాడు. ఈయన్ వ్రాసిన 'గంగా సే ఓల్గా తక్' ప్రతియోక్కరూ చదితీరవలసిన పుస్తకము. ఈ మహానుభావుడు జీవతమంతా పర్యాటనలోనే గడిపినాడు.

గొప్పవారి మనస్సు తుది దశలో కూడా తన గొప్పదనాన్ని కోల్పోదు. ఉన్నతంగానే 

ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా అతని కిరణాలు వాలిపోవు. పైకి 

ప్రసరిస్తాయి.

यस्तु सञ्चरते देशान् यस्तु सेवेत पण्डितान् ।

तस्य विस्तरिता बुद्धिः तैलबिन्दुरिवाम्भसि ॥ समयोचितपद्यमालिका

भिन्न देशों में यात्रा करने वाले और विद्वानों के साथ संबंध रखने वाले व्यक्ति की बुद्धि 

उसी तरह बढती हैजैसे तेल की एक बूंद पानी में फैलती है

देशाटन के बारेमें कई महान लोग अपने काव्योंमें जोर दीl वे बोले कि निश्चित रूप से  

पर्यटन् पृथिवीं सर्वांगुणान्वेषणतत्परः (पंचतंत्र)

जो गुणों की खोज में अग्रसर हैंवे सम्पूर्ण पृथ्वी का भ्रमण करते हैं

हदये सुखसम्पत्तिः पदे पर्यटनं फलम्। (सर्व सिद्धांत संग्रह)

इंसान के हृदय में सुख तथा पैरों में पर्यटन संपत्ती होता है

यस्मिन्प्रचीर्णे  पुनश्चरन्ति वै श्रेष्ठो गच्छत यत्र कामः। (महाभारतअश्वमेध पर्व -२३)

जो व्यक्ति उनके समक्ष आने वाले हर प्रकार के मार्ग पर चलने के लिए तत्पर 

हैंवे श्रेष्ठ होते हैं तथा उनको अभीष्ट प्राप्त होता है

 चरन् वै मधु विन्दतिचरन् स्वादुमुदुम्बरम्

सूर्यस्य पश्य श्रेमाणंयो  तन्द्रयते चरन्।l (ऐतरेय ब्राम्हण .१५)

जो व्यक्ति सदा श्रमशील एवं गतिशील हैंवही सदा मधुपान (शहदअमृत / परिश्रम का सुफलकरते हैं। 

कर्मयोगी को सदा श्रेष्ठ कर्म का श्रेष्ठ परिणाम मिलता है। सूर्य की कर्मठता तथा सृजन शीलता देखिएक्षण 

भर भी जो दूसरों के कल्याण के लिये अपने श्रम से विमुख नहीं है

 yastu sañcarate deśān yastu seveta paṇḍitā

tasya vistaritā buddhi tailabindurivāmbhasi ॥ - samayocitapadyamālikā

 He who travels the world; he who serves the erudite - his acumen shall 

expand, just as a drop of oil on water!

 

It is said that the world is a book and those who do not travel, read only one 

page! Travelling exposes a person to many varieties of cultures and many 

different perspectives as well.  Life is a journey in itself.  Travel gives a unique 

character of experience to one's knowledge.  He who resists travel holds off 

his own personal growth.

He who is in the company of the learned is always posed with an opportunity 

to learn.  Just by sheer proximity to the scholars, he gets a chance to see 

how they think.  Even the subtlest action of the wise teaches a thing or two. 

When interwoven into daily life, acquiring of wisdom never ceases and 

progress never freezes.

 The very apt example given in the verse is of a drop of oil on water.  A tiny 

drop of oil placed on water just keeps spreading (till it reaches the edge of 

the water itself). Such would be the vastness of the wisdom of a person who 

has these two attributes - traveling and keeping company with the learned.  

These two aspects broaden one's horizon and deepen his understanding of 

the world.

The following are some sloka padas or Shloka from various texts which 

confirm the importance of tour and travel.

Paryaan prithvim sarvam gunaanveshana tatparah  (panchatantra)

Those who wish to seek virtues travel the entire world.

Hridaye sukhasampatthih pade paryatanam phalam l

(Sarva Siddhaantha sangraham)

They have happiness in their hearts and traveling in their feet are the real 

wealth 

Yasmin pracheerne cha puna charanthi; savai shreshto gacchata 

yatra kaamaH l

 Those who walk on what has come forth are indeed great and get what they 

desire.

Charan vai madhuvindati, charan swaadumudumbaram l

Sooryasya pashya shremaanam, yo na tandrayate charan ll  

Those who are always hardworking and dynamic, they always drink honey (honey/nectar/success of hard work). A karma yogi always gets the best results of elevated actions. See the hard work and creativity of Surya, who does not deviate from his labor for the welfare of others even for a moment.

 This is what ultimately a person who dedicates himself for travel for acquiring

knowledge. He ultimately becomes a treasure of nectar which he serves to

people of devotion and dedication.

Read, travel and learn with the learned!

స్వస్తి.

No comments:

Post a Comment