Sunday, 18 July 2021

అజరామర సూక్తి – 305 अजरामर सूक्ति – 305 Eternal quote - 305

 అజరామర సూక్తి  305

अजरामर सूक्ति – 305

Eternal quote - 305

https://cherukuramamohan.blogspot.com/2021/07/304-343-eternal-quote-304.html

दुर्लभं त्रयमेवैतत् दैवानुग्रहहेतुकम्  ।

मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ - विवेकचूडामणि – आदिशंकराचार्य

దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం l

మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషసంశ్రయః ll

ఈ లోకంలో దుర్లభమైనవిఅందరికి దొరకనివికేవలం దైవానుగ్రహం వల్లన లభించేవి 

మూడు - మనుష్య జన్మమోక్ష జ్ఞానముపరతత్వము గ్రహించినవారి స్నేహము.

1. ఈ జీవితము అన్నది నల్లేరుపై నడిచే బండి లాంటిదని చాలామంది తలపోయుట 

కద్దు. నిజానికి అడిఒక అవాస్తవము. మనము గ్రహించవలసిన ఒక ముఖ్యమైన 

విషయము ఏమిటంటేమానవునిగా పుట్టుట అన్నది ఆ పరమాత్ముని అరుదైన 

ఆశీర్వాదము. కోటానుకోట్ల  జీవజాలములోకొద్దిమందికి మాత్రమే మనుషులుగా 

జన్మించే అవకాశమును భగవంతుడు  కలిగిస్తాడు. ఇది మనకు అనగా మావునికి 

పరమాత్ముడొసంగిన ఒక వరముగా భావించి  దానిని ఎంతో జాగరూకతతో 

వాడుకొనవలసియుంటుంది.

2. మానవులుగా మనము జన్మించినాకూడాజన్మించిన ప్రతియొక్కరికీ మోక్ష ప్రాప్తిపై 

ఆలోచన ఉండదు. మోక్షము అనగా ఐహిక బంధ విముక్తి. ఆ బంధములనుండి 

కలిగెడు బాధల నుండి విముక్తి. ఒక చిన్న ఉదాహరణ తెలుపుతాను. మనము దారిలో పోతూవున్నపుడు ఒక రాయి తగులుతుంది. ఆ నొప్పికి అసంకల్పితముగానే అబ్బా అంటాము. కానీ అటుపిమ్మట దానివాలనే కలిగే బాధను భరించుట ఒక్కొక్కరి బాధా గ్రహణశక్తిపై ఆధారపడియుంటుంది. అంటే సహ్గన శక్తి మనిషి మనిషికీ మారుతూ వుంటుంది. అట్టి బాధల నుండి విముక్తి పొందవలెనను బలీయమైన కోరిక చేత మాత్రమే తగిన ధ్యానతత్పరుడగువాడు ధ్యేయమును సాధించగలుగుతాడు. మనలో ఎంతో తక్కువమందికి మాత్రమే అట్టి అకుంఠిత దీక్ష ఉంటుంది.

3. మోక్ష కామితము ఉండినాకూడా, దాత వలసినది మహాసముద్రమని ఎరింగి తగిన 

సాంగత్యమును సంపాదించుట, సంపాదించిన పిదప ఆసాంతము అట్టి వారి 

ఉపదేశమును ఆదేశముగా భావించి సాధించుట ఎంతో అవసరము. వారే నిజమైన 

గురువులు. వారి అనుభవం నుండి నేర్చుకోవడం ద్వారా మాత్రమేమనము మోక్షస్థితిని 

ఆ స్థితిని సాధించగలము. గురువనుగ్రహము లేని శ్రమ సూది లేకుండా చిరిగిన బట్టను 

కుట్టుట వంటిది.

పై మూడు విధములగు దైవానుగ్రహములను పొందినవారు, నిజముగా 

అదృష్టవంతులు. వారు ప్రతి చిన్న , అతి చిన్న  అవకాశమును ఉపయోగించుకొంటూ గుర్వనుగ్రహమునకు నిరంతరమూ గురోయౌతూ,  పరమపద సోపానమును అధిరోహించవలసియుంటుంది. ఇది జగద్గురువు శంకరులవారు జగత్తునకిచ్చిన సందేశము.

दुर्लभं त्रयमेवैतत् दैवानुग्रहहेतुकम्  ।

मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ॥ - विवेकचूडामणि  आदिशंकराचार्य

निम्न दियेगए 3 विषय आसान नहीं बल्कि बहुत कठिन हैं और केवल भगवान की कृपा से ही मानव ए 

प्राप्त करसकते हैं l वह तीन ए हैं - मानव जन्ममुक्ति की इच्छाविद्वान कुलीनों की संगति

1. इस जीवन मेंबिना कोइ तार्किकता से वैसे ही बहुत कुछ लिये जाते हैं। किसी को यह एहसास नहीं 

होता कि सिर्फ एक इंसान के रूप में जन्म लेना अपने आप में एक दुर्लभ वरदान है। करोड़ों जीवों 

(जीवित प्राणियोंकी भीड़ में से कुछ पुण्य प्राणी को ही मनुष्य जन्म लेने का अवसर भगवान् से दिया 

जाता है। इसे एक विशेषाधिकार माना जाना चाहिए और अत्यंत सम्मान के साथ इसे उपयोग किया 

जाना चाहिए

भले ही कोई मनुष्य के रूप में पैदा हुआ होसभी को मुक्ति (मोक्षपाने की इच्छा नहीं होती है। यहाँ 

उल्लिखित 'मुक्तिका अर्थ जीवन से मुक्ति नहींबल्कि दुखों से मुक्ति हैकहा जाता है कि दर्द होना 

आम बात है लेकिन दुख वैकल्पिक है। उसे सहन शक्ति कहाजाता है l सांसारिक कष्टों से मुक्त होने की 

तीव्र इच्छा से ही मुक्ति प्राप्त कीजासकती है। हम में से बहुत कम लोग इस इच्छा से प्रेरित होते हैं

मोक्ष प्राप्त करने के लिए प्रेरित होने के बावजूदहर कोई इतना भाग्यशाली नहीं है कि उसे विद्वानों 

का परिचय मिले और उनमेसे श्रेष्ट  प्रबुद्ध की निकटता मिल सके। उनके अनुभव से सीख लेकर ही 

कोई उस अवस्था को प्राप्त कर सकता है जो कोइ जीवरूप धारण करनेका कोइ अवसर न छोड़ें। 

केवल कठोर परिश्रम की मात्रा मुक्ति के लक्ष्य की ओर नहीं ले जाएगीबल्कि बुद्धिमान और प्रबुद्ध 

इच्छाशक्ति की संगति जरूर होनीचाहिए

जिन लोगों को उपरोक्त इन तीनों विषयों का, भगवान् से, आशीर्वाद प्राप्त हैवे वास्तव में भाग्यशाली 

हैंउन्हें अवसर के हर कदम उठाना चाहिए और अपने गुरु का आशीर्वाद हर खदम पर लेते रहना 

चाहिए

Durlabha trayamevaitat daivānugrahahetukam 

Manuyatva mumukutva mahāpuruasaśraya ॥ 

Vivekacūāmai  charyaAdisankara

These 3 are hard to come by and come only with God's grace - human birth, desire 

for liberation, company of the learned noble.

1.     In this life, so much is taken for granted. What one does not realize is that just being

born as a human being is a rare blessing in itself. Amongst the multitudes of billions 

of organisms (living beings), only a few are given the opportunity to be born as 

humans. It should be considered a privilege and utilized with utmost respect.

2.     Even if one is born as a human, not everyone gets the desire or drive to seek

liberation (mokSha).  'Liberation' referred here is not liberation from life, but liberation 

from suffering! 

3.     It is said that pain is common but suffering is optional.  Liberation can be achieved

only due to an intense desire to be liberated from mundane afflictions. Very few of 

us are driven by this desire which in real terms leads us to salvation.

3. In spite of being inspired to attain moksha, not everyone is lucky enough to get 

the company and the proximity of the learned and enlightened who can lead us to 

the ultimate destiny.

   Only through learning from their experience, can one attain that state.  No amount 

of toil will lead towards the goal of liberation, but the company of the wise and 

enlightened will.

Those who are blessed with all the above three boons are truly fortunate! They 

should make use of every ounce of opportunity and count their blessings along the 

way.

స్వస్తి.

No comments:

Post a Comment