అజరామర సూక్తి – 289
अजरामर सूक्ति – 289
Eternal Quote – 289
https://cherukuramamohan.blogspot.com/2021/07/289-289-eternal-quote-289.html
सरसिजमानुविद्धम शैवालेनापि रम्यं
मलिनामपि हिमांशोरलक्ष्म लक्ष्मीम् तनोति
इयमधिकमनोज्ञा वल्कलेनापि तन्वी
किमिव हि मधुराणां मंडनं नक्रुतिनाम्
సరసిజమనువిద్ధం శైవలేనాపిరమ్యం
మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి
ఇయమధికమనోజ్ఞావల్కలేనాపి తన్వీ
కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం
అందానికి ఏ ఆభరణమైనా అలకారమే
కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతల నాటకంలో,వేటకోసం అడవిలోకొచ్చిన దుష్యంతుడు మునివాటికలో వున్న శకుంతలను చూసి ఇలా అనుకుంటాడుట.
కమలం నాచులో పుట్టినా రమ్యంగానే ఉంటుంది.చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే.అసలు సహజ సౌందర్యమే ఉండాలి గాని,ఎలాంటి బట్టకట్టినా బాగానే ఉంటుంది. ఈమె నారచీర కట్టినా బాగానే ఉంటుంది.మధురమైన ఆకృతిగల శరీరానికి అలంకారం కానిదేది?(ఏ వస్తువు(నగ/చీర) తొడిగినా అది అందంగానే తోస్తుంది.
దుష్యంతుడి ద్వారా కాళిదాసులోని లాక్షణికుడిచ్చిన తీర్పు కవితా కన్యకు కూడా వర్తిస్తుంది. ఈ శ్లోకములో అందమగు స్త్రీ అయిన శకుంతల రూప వర్ణనము. ఇందులోని అలంకారము /స్వభావోక్తి’ అయితే ఎన్నుకొన్న ఛందోవృత్తము ‘మాలిని’ ఒకశ్లోకమును ఇంత పటిష్ఠముగా వ్రాయుట కాళిదాసు వంటి మహాకవులకే చెల్లుతుంది. నాదు స్త్రీకి శరీర సౌందర్యముతో బాటూ ఆత్మా సౌందర్యము షీలా సౌందర్యము ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా మొదటిది తప్ప మిగత రెండూ మృగ్యము.
అయితే కవిత్వం లవలేశమైనా లేని నాబోటి వాళ్ళు,ఛందస్సు,అలంకారాలు వాడి,కృత్రిమంగానైనా కవిత్వానికి కొంత గాంభీర్యం,అందం తీసుకురావటానికి తంటాలుపడతారు.
అలంకారాలు స్థూలంగా రెండు రకాలు.శబ్దలంకారాలు,అర్థాలంకారాలు అని.శబ్దాల ధ్వనితో ఒక రకమైన గారడీ చెయ్యటమే శబ్దాలంకారమంటే.
కవిత్వపు భావంలో(అర్థంలో) కొన్ని మనోజ్ఞమైన పోకడలు చూపెట్టడం అర్థాలంకారం.అంటే మామూలుగా మనకి ఒక కవితలోని భావం గొప్పగా అనిపించిందంటే, అందులో యెవో అర్థాలంకారాలుండచ్చు.కాబట్టి సహజంగానే శబ్దాలంకారాలకన్న అర్థాలంకారాలు వేయటం గొప్ప కవిత్వమనిపించుకుంటుంది.
అందుకే పై శ్లోకములోని చివరి వాక్యము సంస్కృతములో సామమెతయై కూర్చుంది.
सरसिजमानुविद्धम शैवालेनापि रम्यं
मलिनामपि हिमांशोरलक्ष्म लक्ष्मीम् तनोति
इयमधिकमनोज्ञा वल्कलेनापि तन्वी
किमिव हि मधुराणां मंडनं नक्रुतिनाम्
(आश्रम के रहन-सहन के अनुरूप वल्कलधारिणी शकुंतला को देखकर दुष्यंत–) जैसे सिवार में
लिपटा होने पर भी कमल सुंदर लगता है, चंद्रमा का धब्बा मलिन होते हुए भी उसकी शोभा
बढ़ाता है, यह छरहरे बदनवाली (शकुंतला) वल्कल-वस्त्र में और भी आकर्षक लग रही है. शरीर
सुंदर हो तो कौन-सा आभरण अच्छा नहीं लगता ! (श्लोक की अंतिम पंक्ति इतनी लोकप्रिय हुई
कि संस्कृत की एक कहावत बन गई है) l
शकुन्तला द्वारा अनासूयासे वल्कल वस्त्र को शिथिल करनेका अनुरोध करनेपर दुश्यन्त कहता है
कि यद्यपि वल्कल्वास्त्र इसके सौंदर्य के अनुरूप नहीं है फिर भी यह इसकी सुन्दरता को बढ़ा ही
रहा है l शैवाल (काई) से अच्छादित हुआ भी कमल मनोहर लगता है l काला कलंक भी चान्द्रमान
शोभाको बढाता है l यह सुकुमार कृशांगी(बहुत नाजुक तन वाली) माने शकुंतला वल्कल वस्त्रों
सभी अतिसुन्दर लग रही है क्यों कि सुन्दर वस्तुओं केलिए कौनसी वस्तु अलंकार नहीं होती l
अर्थात अगर स्वयं सिद्ध सुन्दरता ही है तो किसीभी चीज़ उस सौन्दर्यको दुगुना करती है l
यह श्लोक मालिनी के बारेमे यानी स्त्री के सौन्दर्य के बारेमे कालीदास्जी बोल रहे हैं l उसीलिए वे
शाकुंतलाके सौंदर्य के बारेमे लिखने केलिए मालिनी वृत्त ही चुन लिया है l ऐसे महत्व कालिदास
जैसे महान कवियों में ही होता है l
श्लोक का सारांश यह है कि जो सुन्दर आकृति युक्ता हैं उन के लिए तो कोइ भी वास्तु अलंकार
बनजाती है अर्थात वे जोभी चीज़ पहन्लें उनका सौंदर्य वृद्धि ही होता है जैसे शकुतला नैसर्गिक
रूप से अनुपम सौन्दर्यशालिनी है तो वल्कल पहनने से भी उसके सौंदर्य को दुगुना कर रहा है l
Sarasijamanuvid'dhaṁ śaivalēnāpiramyaṁ
malinamapi himānśōrlakṣma lakṣmīṁ tanōti
iyamadhikamanōjñāvalkalēnāpi tanvī
kimiva hi madhurāṇāṁ maṇḍanaṁ nākr̥tīnāṁ
Which is not an adornment for a beautiful form? (Anything can add to the beauty
if one has a beautiful form)
(Dushyanta looking at Valkaldharini (Lady who wore Cloth made from the thread derived from tree trunk and bark) Sakuntala, according to the living conditions of the ashram, is so beautiful. like a lotus looks beautiful even when it is wrapped in strings of thin water creepers, the spot of the moon enhances its beauty even though it is dirty, this slender body (Sakuntala) in Valkal-cloth and looking attractive too. If the body is beautiful, which adornment does not look good! (The last line of the verse became so popular that it has become a Sanskrit proverb).
Kalidasji is speaking about Malini, that is, about a lady and her beauty. That is why he has chosen Malini Vritta in Sanskrit Meter, to write about the beauty of Sakuntala. Such importance of choosing meter is found only in great poets like Kalidas.
The summary of the verse is that for those who have a beautiful figure, then any Vastu or thing used for make-up becomes an ornament, that is, whatever they wear, their beauty only increases, like Sakuntala is naturally unique beauty, so even wearing a vulkal, doubles its beauty.
స్వస్తి.
No comments:
Post a Comment