Saturday, 3 July 2021

అజరామర సూక్తి – 292 अजरामर सूक्ति – 292 Eternal Quote – 292

 అజరామర సూక్తి  292

अजरामर सूक्ति  292

Eternal Quote  292

 https://cherukuramamohan.blogspot.com/2021/07/292-292-eternal-quote-292.html

यदि सत्सङ्गनिरतः भविष्यसि भविष्यसि ।

तथा सज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि ॥ - हितोपदेशमित्रलाभ

యది సత్సంగ నిరతః భవిష్యసి భవిష్యసి l

తథా సజ్జన గోష్టీషు పతిష్యసి పతిష్యసి ll

సత్సంగము ‘సకలార్థ సాధకము’ అనగా అది,   ప్రాపంచిక మరియు అతీంద్రియ ఆనందాలను ఇస్తుంది. ఒక మనిషి ఈ జీవితంలో అసంతృప్తిగా ఉంటే, కనీసం కొంతకాలం అతను తన ప్రాపంచిక దుఃఖాలను ఉన్నతమైన పురుషుల సహవాసంలో మరచిపోతాడు. మరియు వారల బోధనలు ఎల్లప్పుడూ ఆనందాన్ని మరియు శాంతిని ఇస్తాయి. 
భర్తృహరి సత్సాంగత్యమును గూర్చి ఈ క్రింది విధముగా తెలియజేయుచున్నాడు.
జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి ।
చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం
సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్‌ ॥
సత్య సూక్తి ఘటించు ధీ జడిమ మాన్చు 
గౌరవ మొసంగు జనులకు కలుష మడచు 
కీర్తి ప్రకటించు చిత్త  విస్ఫూర్తి జేయు 
సాదు సంగంబు సకలార్థ సాధనంబు 
మంచివారితో స్నేహము బుద్ధి మాంద్యమును పోగొటును, సత్య వాక్యములనె పలుక జేయును, పాపములను పోగొట్టును, మనస్సును బాగు చేయును, కీర్తిని వ్యాపింప జేయును వేయేల అది చేయ జాలని మంచి యే లోకములోనూ లేదు. అందుకని మంచి వారితోనే స్నేహము చేయవలెనని నీతి.
సత్సాంగత్యము వలన ‘క్షమా’ గుణము అలవడుతుంది. ‘క్షమ’ అంటే మనము తెలుగునా వాడే క్షమించుట కాదు. క్షమ అంటే సహనము (Tolerance) అని అర్థము. ఈ గుణము ఎంత అభివృద్ధి చెందితే మనిషి అంట ఉన్నత స్థితికి ఎదుగుచున్నాడని అర్థము.
 
క్షమాగుణము అన్ని రకాల చెడు లక్షణాలను నాశనం చేస్తుంది మరియు మనసుకు శాంతిని మరియు సంతృప్తిని ఇస్తుంది. సత్సంగము ద్వారా ఇలాంటి అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. 
దుష్టునికి ఎంత దూరముగా ఉంటే అంతమంచిది.
అకరుణత్వమకారణ విగ్రహః
పరధనే పరయోషితి చ స్పృహా ।
సుజన బంధుజనేష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనామ్‌ ॥
కారణములేని కలహంబు కరుణలేమి
పరవధూ పరధనవాంఛ బంధు సాధు
జనములం దసహిష్ణుత్వమనగ జగతి
బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు
 నిర్దయ, అకారణ కలహము, పరధన పర స్త్రీవ్యామోహము  సుజన బంధుజన దూషణము,
ఇవి దుష్టచిత్తుల లక్షణములు.
స్నేహితుల ఎంపికను చేతన చర్యగా అభివర్ణిస్తూ, హిందీ విమర్శకుడు 
రామ్‌చంద్ర శుక్లాగారు  ఇలా తెలిపినారు - 
"మనకన్నా ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న స్నేహితులను వెతకాలి. సుగ్రీవుడు రామచంద్రుని  
పట్టుకున్నట్లే మనము వారిని పట్టుకోవాలి. స్నేహితులు అన్నవారు, గౌరవప్రదంగా 
మరియు హృదయపూర్వకంగా, మృదువుగా మరియు కష్టపడి పనిచేసేవారిగా, 
మర్యాదపూర్వకంగా మరియు నిజాయితీగా ఉండవలెను. తద్వారా మనము 
వారి సాంగత్యమున ఏవిధముగానూ మోసపోమని విశ్వసించగలము.
పైశ్లోకపు కవిత్వము లోని అందమంతా  చివరి పదాల పునరుక్తి లోనే ఉంది.  
మొదటి 'భవిష్యసి' సత్సంగమున ఉన్నట్లు సూచిస్తుంది. రెండవది మీరు కూడా 
ఆవిధముగానే కాలాంతరములో ఔతారు అవుతారు అని తెలుపుతూ ఉంది. 
అదేవిధముగా మొదటి ‘పతిష్యసి’ అన్నది  మంచి సంస్థ నుండి వేరు కావడం తెలుపుతూ 
ఉంది. దానిని వదలి దుర్మార్గుల సహవాసానికి మరలితే, మీరు లేవలేనంతగా పడిపోతారు 
అని తెలుపుతూవుంది. 

यदि सत्सङ्गनिरतः भविष्यसि भविष्यसि ।

तथा सज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि ॥ - हितोपदेशमित्रलाभ

सत्संग से लौकिक और पारलौकिक दोनों प्रकार के सुख प्राप्त होते हैंयदि कोई मनुष्य इस जीवन में दुखी रहता है तो 

कम से कम कुछ समय के लिए श्रेष्ठ पुरुषों की संगति में वह अपने सांसारिक दुखों का विस्मरण कर देता हैl  

महापुरुषों के उपदेश सदैव सुख शांति प्रदान करते हैंदुख के समय मनुष्य जिनका स्मरण करके धीरज प्राप्त करता 

हैl  सत्संग में लीन रहने वाले मनुष्य को दुखों का भय नहीं रहता है  वह अपने दिल समझता हैजिससे दुखों का कोई 

कारण ही शेष नहीं रह जातासत्संग के प्रभाव से धैर्य लाभ होता है जिससे मन में क्षमा की शक्ति स्वयं ही  जाती है

क्षमा सभी प्रकार के दुर्गुणों का विनाश कर देती है और मन को शांति  संतोष प्रदान करती हैl इसी प्रकार के अन्य 

अनेक लाभ सत्संग द्वारा प्राप्त होते हैं l संगति का प्रभाव मन पर अनिवार्य रूप से पड़ता है अतः सत्संग में रहने वाला 

मनुष्य सदाचारी होता हैहमें भी सदस्य सज्जन पुरुषों की संगति करनी चाहिए और दुर्जन मनुष्य उसे दूर रहना 

चाहिएदर्जनों के संग रहकर उत्कृष्ट गुणों वाला मनुष्य भी विनाश की ओर चला जाता हैl

हिंदी के आलोचक रामचंद्र शुक्ल मित्रों के चुनाव को सचेत कर्म बताते हुए लिखते हैं कि - "हमें ऐसे ही मित्रों की खोज 

में रहना चाहिए जिनमें हमसे अधिक आत्मबल हो। हमें उनका पल्ला उसी तरह पकडना चाहिए जिस तरह सुग्रीव ने 

राम का पल्ला पकड़ा था। मित्र हों तो प्रतिष्ठित और शुद्ध ह्रदय के हों। मृदुल और पुरूषार्थी होंशिष्ट और सत्यनिष्ठ हों

जिससे हम अपने को उनके भरोसे पर छोड़ सकें और यह विश्वास कर सके कि उनसे किसी प्रकार का धोखा  होगा।"

पद्य की सुंदरता शब्दों के खेल में भी है। पहले चरण में पहली नजर में कविता में ‘भविष्यसि’  दोहराई जाती है l वैसा 

दुहाराई जानेसे पाठक भ्रमित होसकते हैं या गलत भी समझ सकते हैं ! उन दोनों शब्दों में विराम चिह्न शक्तिशाली है। 

दो भविष्य्यासी और दो पतियासी के बीच एक विराम (,) हैपहला भविष्यसी अच्छी संगति में होने का संकेत देता है। 

दूसरे का मतलब है कि आप होंगे (जैसा किजीवित रहें)! इसी तरह, माने उस सांगत्य से आप के नैतिकता बढ़कर आप 

सनाज में आद्र्शप्राई होंगे l  पहले पतियासी का अर्थ है अच्छी संगति से अलग हो जाना। दूसरा इंगित करता है कि आप 

गिरेंगे (नैतिकता और अस्तित्व में) , माने आप दुर्जन के सांगत्य में रहेंगे तो इतना गिरेंगे कि उठभी नहीं सकेंगे l 

 

yadi satsaganirata bhaviyasi bhaviyasi 

tathā sajjanagoṣṭhīṣu patiyasi patiyasi ॥ - hitopadeśa, mitralābha

 If (you) stay in good company, you shall remain.  Similarly, if (you) fall off from 

good company, (you) shall fall.

 One's character is immensely influenced by the company he keeps.  The more 

one stays in good company, the better he prospers.  In turn, when one's 

company or association is not up to mark, he shall fall in his character.  The 

company one keeps speaks volumes about his mettle.  Someone once said, 'tell 

me thy friends and I shall tell you thy character!'  Such is the profoundness of 

one's association.  The more one keeps good company, the more he grows.  

The more one moves away from it, the more he regresses.  One has to be 

mindful of this always.  It is not a goal to achieve one day and forget on another!  

It is a constant process towards progress.

 

The beauty of the verse is also in the play of the words.  The verse at first glance 

might seem repetitive, confusing or even wrong!  Punctuation is powerful.  There 

is a pause (,) between the two bhaviyasi-s and the two patiyasi-s!  The first 

bhaviyasi indicates being in good company.  The second one means you shall 

be (as in, survive)!  Similarly, the first patiyasi means to fall off from good 

company.  The second one indicates that you shall fall (in morality and survival)!!

 May each person be good and keep good company so the entire universe will 

be a 'company to keep!'

స్వస్తి.
******************************************************

No comments:

Post a Comment