అజరామర సూక్తి – 306
अजरामर सूक्ति – 306
Eternal Quote – 306
https://cherukuramamohan.blogspot.com/2021/07/305-305-eternal-quote-305_20.html
मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं दृश्यते ।
स्वात्यां सागरशुक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते
प्रायेणाधममध्यमोत्तमगुणाः संसर्गतो जायते ॥ - नीतिशतक – भर्तृहरि
సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే ।
అంతస్సాగర శుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయే ణాధమమధ్యమోత్తమ జుషా మేవంవిధా వృత్తయః ॥
భర్తృహరి నీతిశతకము-సుజన పధ్ధతి - 58
దీనికి ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగు సేత
నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు నా
నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్
ఒకే నీటి బిందువు కాలే ఇనుము పై బడితే ఆవిరియై పోతుంది, అదే తామర ఆకు
పైబడితే ముత్యమువలె ప్రకాశిస్తుంది, మరి ముత్యపుచిప్పలోనే బడితే ముత్యమే అయి
కూర్చుంటుంది. ఈ శ్లోకమున అధమ మధ్యమ ఉత్తమ పురుషులను పైన చెప్పిన
విధముగా పోల్పబడింది. నిజానికి ఆయా వ్యక్తుల వద్ద పనిచేయవలసి వచ్చుట కూడా
ఘటన లేక అదృష్టమే కదా! ఇందుకు కర్ణుడు చక్కని ఉదాహరణ.
ఈ సందర్భములో నాకొక వాస్తవిక సంఘటన గుర్తుకొస్తూవుంది. ఒక సారి కార్యాలయ
కార్యార్థినై నేను మా ఉన్నతాధికారి యొద్దకు పోవలసి వచ్చింది. పని ముగిసిన తరువాత
'అదృష్టము' అన్న విషయము పై మా మాటలు మరలినాయి. అప్పుడు నేను పైన తెలిపిన
భర్తృహరి సుభాషియమును తెలుపుట జరిగింది. ప్రొద్దు బుచ్చుటకు కాక మాటలు
మనఃపూర్వకముగా సాగుతున్నాయి కాబట్టి నేను పై ఉదాహరణ చెప్పినవెంటనే ఆయన
మరి ఆవిరయిన ఆనీటిచుక్క వాతావరణ ఉష్ణోగ్రతకు తిరిగీ ద్రవీభవించి, ఈ
పర్యాయము ముత్యపు చిప్పలో పడవచ్చు కదా! అన్నారు. అందుకు నేను అవకాశము
1/3 వ వంతే కదా, కావున తిరిగీ కాలే ఇనుము పైన పడే అవకాశము కూడా అంతే ఉన్నదన్నాను. ఆయన నా మాటను త్రోసిపుచ్చలేదు సరికదా మ్'మీ తర్కము భేష్ భేష్ ' అన్నారు.
ఈ ఉపపత్తిని జీవితమునకు అన్వయించుకొంటే మనము ఆహా ఓహో అని అనే
వారికంటే గొప్పవారు ఎంత మంది గుర్తింపే లేక మట్టిలో కలిసిపోయినారో!
సరస్వతీపుత్రునిగా స్వామీ దయానంద సరస్వతిచే ఆప్యాయముగా పిలువబడిన, 14
భాషలలో అసాధారణ పాండిత్యము గలిగిన, రష్యన్ కాన్సలేట్ జనరల్ –
చెన్నపట్టణమునందు అనర్గళముగా ఒకటిన్నర గంట ఉపన్యసించిన, సంగీత
నాట్యములలో అద్భుత ప్రావీణ్యము కలిగిన, మధుర గాత్రము కలిగిన, వైష్ణవుడయ్యును
శివతాండవమును ఆచంద్ర తారార్కము గావించిన , ఒకనాటి దేశాధ్యక్షుడు రాధా
కృష్ణన్ కొనియాడబడిన పుట్టపర్తి నారాయణాచార్యులవారికి దాదాపు
చేతికందబోయిన జ్ఞానపీఠ పట్టమును తన లౌకికమునుపయోగించి ఒక రెడ్డిగారు
తన్నుకుపోయినారు. దీనివల్ల జ్ఞానపీఠ పట్టమును పాండిత్యమునకు గాక పైరవీకి
అందించినట్లయినది.
ఘటన అంటే అదే కదా!
सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न श्रूयते
मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं दृश्यते ।
स्वात्यां सागरशुक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते
प्रायेणाधममध्यमोत्तमगुणाः संसर्गतो जायते ॥ - नीतिशतक – भर्तृहरि
जल की एक बूंद् जब अत्यन्त तप्त (गरम) लोहे के ऊपर पडती है तो उसका नाम भी नहीं सुनाई देता है (वह भाप बन
कर उड जाती है ) | वही बूंद जब एक कमल पुष्प के पत्ते के ऊपर पडती है तो एक सुन्दर और गोल मोती के समान
उस पर सुशोभित होती है | और यदि सागर के मध्य में किसी सीपी के अन्दर गिर जाती है तो कालान्तर में वह मोती
बन जाती है | इसी प्रकार मनुष्य भी यदि नीच व्यक्तियों के संपर्क में वे आते है तो वैसे ही अधम (नीच)और यदि
गुणवान (उत्तम)
व्यक्तियों के संपर्क में आते हैं तो वैसे ही गुणवान हो जाते हैं |
संतप्त लोहे से टकराने पर पानी की एक बूंद वाष्पित हो जाती है, जबकि कमल का पत्ता मोती की
तरह चमकता है, और सीप में मोती मोती के खोल पर बैठता है। इस श्लोक में ऊपर बताए अनुसार
औसत दर्जे के श्रेष्ठ पुरुषों की तुलना की गई है। वास्तव में, ऐसे लोगों के साथ काम करना या तो एक
घटना है या भाग्य का आघात! कर्ण इसका एक अच्छा उदाहरण है।
इस संदर्भ में मुझे एक सच्ची घटना की याद आ रही है। एक बार एक कार्यालय अधिकारी के रूप में
मुझे अपने वरिष्ठ अधिकारी के पास जाना पडा। काम हो जाने के बाद विषय 'भाग्य' पर बदला।
उस सिलसिले में मैंने ऊपर का उदाहरण दिया, जैसे ही मैं उदाहरण दिया, मेरे वरिष्ट अधिकारी ने
बोला पानी की बूंद जो वाष्पित हो जाती है, वह फिर से परिवेश के तापमान पर जलबिंदु होजाती है,
और यह विकल्प मोती के खोल में जा सकती है! मैने कहा कि मौका केवल 1/3 ही है, इसलिए वह बूँद
फिर गरम लोहे पर वापस गिरने की संभावना है। उन्होंने मेरी बात मानी और मेरे तर्क को शाबाशी
भी दी।
इसलिए चाहे हम कितना भी अक्लमंद हो विधाता के सहायताके बिना हम कुछ नहीं बनसकते l
Santaptāyasi saṃsthitasya payaso nāmāpi na śrūyate
Muktākāratayā tadeva nalinīpatrasthitaṃ dṛśyate ।
Svātyāṃ sāgaraśuktimadhyapatitaṃ sanmauktikaṃ jāyate
Prāyeṇādhamamadhyamottamaguṇāḥ saṃsargato jāyate ॥ - nītiśataka – Bhartruhari
Water drop that falls on hot iron disappears without a sign. The same water droplet, when placed
on a leaf of a lotus will shine as if it were a pearl. However, if the same water drop, falls into a pearl shell during the svātī rains, it will turn into a good pearl ! Most likely, inferior, mediocre and noble
qualities arise from the company kept. However there are several clutches that act on us enforced
by fate, due to which it is not in our hands to choose the right place. The Tulasi plant grown in the
house is revered and attracts ‘Pooja’ every day, whereas the plant of Tulasi grown in the forest gets
dried and vanishes in course of time without any significance. It is all the fate that signifies the same
thing of the same caliber.
Hence the same droplet of water experiences different aesthesis.
The droplet on a hot iron fizzes out instantly, without even a trace. Such would be the outcome of
keeping an inferior company. The same droplet, when placed on a lotus leaf, will glisten as if it
were a real pearl. Although the water only 'seems' like a pearl, at least it won't get completely
destroyed like the one on the hot iron. This is similar to keeping a mediocre company. The person
may seem valuable to the onlooker, but in reality, he is not. When the same exact droplet
descends into a pearl shell at the right time (rain during the svātī season), it will convert into a real
pearl of high quality! Although it was a drop of plain water, it attained the honor of becoming a
pearl. Such is the company of the noble.
Being in different environments reaps different end results. So does the company we keep. To grow
as noble and virtuous people, we need to keep the company of such people.
But still I trust that despite having the caliber, capacity, content compared to others who enjoy the
vicinity of great people one must have that luck to gain that level.
స్వస్తి.
No comments:
Post a Comment