Saturday, 3 July 2021

అజరామర సూక్తి – 291 अजरामर सूक्ति – 291 Eternal Quote – 291

 అజరామర సూక్తి  291

अजरामर सूक्ति  291

Eternal Quote  291

 https://cherukuramamohan.blogspot.com/2021/07/291-291-eternal-quote-291.html

सन्तोषः परमो लाभः सत्सङ्गः परमा गतिः ।

विचारः परमं ज्ञानं क्षमे परमं सुखम् ॥

సంతోషః పరమో లాభః సత్సంగః పరమా గతిః ।

విచారః పరమం జ్ణానం క్షమే పరమం సుఖం ॥

ఆర్జనలో ఉన్నతమైనది సంతోషంజ్ఞానుల సాంగత్యం పొందడం అన్నది ఘనమైన 

కార్య సాధనప్రశ్న లేక విచారణ అన్నది జ్ఞాన సముపార్జనకు ఉత్తమమైనది

క్షమాగుణము ఉత్తమమైన భోగము లేక ఆనందము.

ఒకరు అనేక రూపాల్లోఆకారాలలో సంపదను కూడబెట్టుకోవచ్చు. అతను మొత్తం 

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావచ్చు. అయినప్పటికీఅతను ధనవంతుడు 

కాదుకానీ ఎవరు కలిగినదానితో తృప్తి చెందుతాడో అతనే ధనవంతుడు. 

‘సంతుష్టిఃనందనం వనం’ అన్నది నీతి శాస్త్రము. ‘ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్ 

తృప్తిన్ చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే’ అన్నది బలిచక్రవర్తి చెప్పిన 

భాగవత వాక్యము. సంతృప్తి లేనివానికిలోకములోని ఆస్తుల మొత్తము వచ్చినా 

సంతోషము కలిగించదు. అందువల్లసంతృప్తి సర్వ శ్రేష్ఠ మైనది.

ప్రజలు తమ చుట్టూ ఉన్నవారిని అనుకరిస్తారు. అనుకరించడానికి తనకన్నా మంచి 

వ్యక్తిని కలిగి ఉంటేనే ఒకరు క్రమంగా తనను తాను మెరుగుపరుచుకొన గలడు. అది 

విబుధుల సహవాసంలో మాత్రమే జరుగుతుంది. ఒకరు ఆ స్థితిని సాధించినట్లయితే

తనను తాను మెరుగుపరుచుకోవడం అనేది సమయ సహరము మాత్రమే. అందువల్లనే

సాదు సంఘంబు సకలార్థ సాదకంబు’ అన్నారు పెద్దలు.

చదవడంవినడంచూడటం - ఇవన్నీ నేర్చుకునే సాధనాలు. కానీఆ నేర్చుకొన్నది ఆ 

వ్యక్తి జీవితంలో ప్రతిబింబించిప్రేరేపించబడకపోతేఅతనికి ఆ జ్ఞానం ఉండీ 

ఉపయోగము లేదు. అంటే కలిగిన జ్ఞానమును ప్రదర్శించలేక పోతే అది ఉండీ 

నిరర్థకమే! అందువల్ల ప్రతిబింబం జ్ఞానం యొక్క ఉత్తమ రూపం.

సముద్రమంత  ఆస్తులుకొండంత బ్యాంకు బ్యాలెన్స్ లేదా సొగసైన కారు  ఇలాంటి 

విషయాలు ఆనంద కారకములని కొందరు అనుకోవచ్చు. అవి అశాశ్వతమైనవి. వాని 

స్వాదీనతను కోల్పోవచ్చు. ఆస్తులు అరిగి పోవచ్చు, బ్యాంక్ లోని సంపద కరిగిపోవచ్చు. 

కారు తుప్పు పట్టవచ్చు. కానీ కలకాలమూ నిలిచేది మానసిక ప్రశాంతత. మనస్సు 

యొక్క అల్లకల్లోలమును అణచివేయగలిగినవాడే ఆనందము యొక్క అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతాడు.

ఈ శ్లోకము పురోగతిసాధనజ్ఞానము మరియు ఆనందానికి దారి చూపిస్తుంది! ప్రతి 

ఒక్కరూ సంతృప్తిజ్ఞానుల సహకారంప్రజ్ఞ ప్రతిబింబింప జేసే వైనము తెలుసుకొంటే 

 మనస్సు యొక్క ప్రశాంతతను సాధించగలడు. 

सन्तोषः परमो लाभः सत्सङ्गः परमा गतिः ।

विचारः परमं ज्ञानं शमो हि परमं सुखम् ॥

संतोष उच्चतम प्रोद्भवन हैबुद्धिमानों का संग ही सर्वोत्तम उपलब्धि है। प्रतिबिंब ज्ञान का सर्वोपरि 

रूप हैमन की शांति सुख का चरम है

व्यक्ति अनेकानेक रूपों में धन संचय कर सकता है। वह पूरी दुनिया में सबसे अमीर व्यक्ति हो 

सकता है। हालाँकिवह अमीर नहीं है जिसके पास सबसे अधिक हैलेकिन उस आदमी अमीर है जिसे 

सबसे कम चाहिएसंतोष व संत्रुप्ति के बिनाकोई भी संपत्ति उसे खुश नहीं रखसकती। इसलिए

संतोष का उपार्जन उच्चतम क्रम का उपार्जन है

लोग उन लोगों का अनुकरण करते हैं जो उनके आसपास हैं। कोई खुद को तभी बेहतर बना सकता 

है, जब उसके पास अनुकरण करने के लिए खुद से बेहतर कोई हो। यह केवल अच्छे और बुद्धिमानों 

की संगति में ही हो सकता है। अगर कोई उस तरह का साहचर्य को प्राप्त कर लेता हैतो खुद को 

बेहतर बनाना केवल समय की बात है। इसलिएअच्छी परिषद् प्राप्त करना अद्वितीय है

पढनासुननादेखना - ये सब सीखने के साधन हैं। लेकिनजब तक यह प्रतिबिंबित  हो और किसी 

के जीवन में शामिल  होउसे उस ज्ञान का अधिकार नहीं है। इसलिए प्रतिबिंब ज्ञान का सबसे अच्छा 

रूप है

कुछ लोग कह सकते हैं कि खुशी कई चीजों में मिल सकती है - बड़ी संपत्तिमोटा बैंक बैलेंस या एक 

शानदार कार। वे क्षणभंगुर हैं। संपत्ति खो सकती हैबैंक बैलेंस घट सकता हैकार में जंग लग सकती 

है। जो सदा रहता है वह है मन की शांति। यदि कोई मन की गडगडाहट को शांत करने में सफल हो 

गया हैतो उसने खुशी की पराकाष्ठा पाई है

यह श्लोक प्रगतिउपलब्धिज्ञान और आनंद का अग्रदूत होसभी को संतोषबुद्धिमानों की संगति

चिंतन करने का समय और मन की शांति मिले

 

santoa paramo lābha satsaga paramā gati 

vicāra parama jñāna śamo hi parama sukham 

Contentment is the highest accrual; company of the wise is the best attainment.  Reflection is the 

paramount form of knowledge; quietude of the mind is the zenith of happiness.

One may accumulate wealth in many forms and shapes.  He may be the richest person in the 

entire world.  However, he is NOT rich who has the most, but who needs the least!  Without the 

factor of contentment, no amount of possessions will make him happy.  Hence, the accrual of 

contentment is the accrual of the highest order.

People tend to emulate those that are around them.  One can progressively better himself only if 

he has someone better than himself to emulate.  That can happen only in the company of the good and wise.  If one attained that company, bettering himself is only a matter of time.  Hence, attaining good company is unparalleled.

Reading, listening, watching - all these are means of learning.  But, unless it is reflected upon and 

inculcated into one's life, he does not have the authority of that knowledge.  Hence reflection is 

the best form of knowledge.

 Some may say that happiness can be found in many things - having big possessions, a fat bank balance or a sleek car.  Those are ephemeral.  Possessions can be lost, bank balance can dwindle and a car can get rusty.  What lasts forever is the tranquility of the mind.  If one has succeeded at silencing the mind's chatter, he has found the zenith of happiness.

 May this verse be a harbinger of progress, achievement, knowledge and enjoyment!  May everyone attain contentment, company of the wise, time to reflect and the serenity of the mind.

 స్వస్తి.

****************************************

No comments:

Post a Comment